• facebook
  • whatsapp
  • telegram

భౌతికశాస్త్రం

రుణ ధన తటస్థ ఆవేశితాలు మీసాన్లు!

ప్రాథమిక శాస్త్రీయ విభాగాల్లో భౌతిక శాస్త్రం కీలకమైంది. ఇది సూక్ష్మ పదార్థాల నుంచి అనంత విశ్వం వరకు అన్నింటి ప్రవర్తనలను తెలియజేస్తుంది. వస్తువులపై స్థలం, కాలం, ఒత్తిడి ప్రభావాలను విశ్లేషిస్తుంది. లోహాలు, కాంతి, ధ్వని, గాలి, ఉష్ణోగ్రత ధర్మాలను నిర్వచిస్తూ ఆటోమొబైల్స్, విద్యుత్తు, ఎలక్ట్రానిక్స్‌ తదితర పరిశ్రమల ఉనికికి ఉపకరిస్తోంది. కెమెరాల నుంచి క్రయోజనిక్‌ యంత్రాల వరకు ఎన్నో రకాల పరికరాల పనితీరును వివరించే భౌతిక శాస్త్రంలోని మౌలిక సూత్రాలపై పరీక్షార్థులకు తగిన పరిజ్ఞానం ఉండాలి. ధ్వని నియమాలు, కాంతి ధర్మాలు, ఖగోళ ప్రమాణాలపై అవగాహన పెంచుకోవాలి.

మాదిరి ప్రశ్నలు


1.    ఎరుపు - ఆకుపచ్చ బంతులను ఆకుపచ్చ కాంతితో చూస్తే అవి ఏ రంగులో కనిపిస్తాయి?

1) ఎరుపు     2) ఆకుపచ్చ - ఆకుపచ్చ 

3) నలుపు - ఆకుపచ్చ     4) నలుపు - ఎరుపు


2.     నిర్జల ఘటంలో వాడే విద్యుత్తు విశ్లేష్య పదార్థం?

1) సల్ఫ్యూరిక్‌ ఆమ్లం       2) అమ్మోనియం క్లోరైడ్‌

3) మాంగనీస్‌ డయాక్సైడ్‌    4) జింక్‌


3.     ఆటోమొబైల్స్‌లో హైడ్రాలిక్‌ బ్రేకులు ఏ నియమం ఆధారంగా పనిచేస్తాయి?

1) ఆర్కిమెడిస్‌ సూత్రం     2) బెర్నౌలీ సిద్ధాంతం

3) పాస్కల్‌ నియమం     4) బాయిల్‌ నియమం


4.     డాప్లర్‌ ప్రభావం కిందివాటిలో దేనికి వర్తిస్తుంది?

1) ధ్వని తరంగాలకు       2) కాంతి తరంగాలకు

3) కాంతి, ధ్వని తరంగాలకు        4) గామా కిరణాలకు


5.     సాధారణ ట్యూబ్‌లైట్‌ కలిగి ఉండే పదార్థం?

1) తక్కువ పీడనం వద్ద ఆర్గాన్‌    2) మెర్క్యూరిక్‌ ఆక్సైడ్, నియాన్‌ 

3) తక్కువ పీడనం వద్ద పాదరస భాష్పం  4) సోడియం భాష్పం


6.     స్టెతస్కోపులో శబ్దం పెద్దగా వినిపించడానికి కారణం?

1) అనునాదం      2) వ్యతికరణం

3) శబ్ద పరావర్తనం  4) తరంగాల అధ్యారోపణం


7.     ఒక ఎరుపు రంగు అద్దం నుంచి ఒక పుస్తకం అట్టను చూస్తే అది ఎరుపుగా కనిపిస్తే వాస్తవానికి ఆ పుస్తకం అట్ట రంగు?

1) తెలుపు 2) ఎరుపు 3) ఎరుపు/తెలుపు 4) ఆకుపచ్చ 


8.     విద్యుదయస్కాంత తయారీకి ఉపయోగించే పదార్థం?    

1) మెత్తని ఇనుము 2) రాగి    3) ఉక్కు 4) నిక్రోమ్‌


9.     దృశాతంతువు (ఆప్టికల్‌ ఫైబర్‌) పనిచేయడానికి కారణమైన కాంతి ధర్మం?

1) వక్రీభవనం     2) సంపూర్ణాంతర పరావర్తనం 

3) కాంతి వ్యతికరణం     4) పరిక్షేపణం


10. నీటి త్రిక బిందువు ఉష్ణోగ్రతను గుర్తించండి.

1) 273.16 ఫారన్‌హీట్‌     2) 373.16 కెల్విన్‌ 

3) 273.16 సెల్సియస్‌     4) 273.16 కెల్విన్‌ 


11. ధ్వని తీవ్రత కిందివాటిలో దేనిపై ఆధారపడుతుంది?

1) పౌనఃపున్యం     2) కంపన పరిమితి 

3) తరంగ దైర్ఘ్యం      4) ఆవర్తన కాలం


12. ఎల్లోకేక్‌ పేరుతో స్మగ్లింగ్‌ చేసేది?

1) బంగారం     2) కొకైన్‌ 

3) హెరాయిన్‌     4) యురేనియం ఆక్సైడ్‌


13. స్ప్రింగ్‌ త్రాసు కిందివాటిలో ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది?

1) అవగాడ్రో నియమం      2) బాయిల్‌ నియమం

3) హుక్‌ నియమం      4) పాస్కల్‌ నియమం 


14. కార్పెట్‌ను శుభ్రం చేసే సమయంలో కర్రతో కార్పెట్‌ను కొట్టడంలో ఏ నియమం ఇమిడి ఉంది?

1) ద్రవ్యనిత్యత్వ నియమం  2) న్యూటన్‌ మొదటి గమన నియమం

3) శక్తి నిత్యత్వ నియమం     4) పాస్కల్‌ నియమం


15. అంతరిక్ష యాత్రికుడికి అంతరిక్షం ఏ రంగులో కనిపిస్తుంది?

1) నలుపు  2) తెలుపు  3) ఎరుపు  4) నీలం


16. కెమెరాలోని ఏ భాగం కన్ను రెటీనాను పోలి ఉంటుంది?

1) ఫిల్మ్‌   2) ఫ్లాష్‌   3) షటర్‌   4) కటకం


17. స్పిన్‌బౌలర్‌ కిందివాటిలో ఏ సూత్రాన్ని ఉపయోగిస్తాడు?

1) పాస్కల్‌ నియమం          2) ఆర్కెమెడిస్‌ నియమం

3) బాయిల్‌ నియమం      4) బెర్నౌలీ నియమం


18. రేడియోథెరపీ‡లో ఉపయోగించే కోబాల్ట్ - 60 వెలువరించే కిరణాలు?

1) బీటా కిరణాలు      2) ఎక్స్‌ - కిరణాలు  

3) గామా కిరణాలు      4) ఆల్ఫా కిరణాలు 


19. భౌతిక శాస్త్రంలో మొదటి నోబెల్‌ బహుమతి పొందిన శాస్త్రవేత్త?

1) హైగెన్స్‌     2) రూథర్‌ఫర్డ్‌ 

3) రాంట్‌జన్‌      4) న్యూటన్‌ 


20. గాలి ఉష్ణోగ్రత ఒక సెంటిగ్రేడ్‌ డిగ్రీకి పెంచితే ధ్వని వేగం ఎంత పెరుగుతుంది?

1) 60 మీ./సె.     2) 0.61 మీ./సె. 

3) 0.61 కి.మీ./సె.      4) 60. సెం.మీ./సె.


21. తరంగంపై ఒకే దశలో ఉండే రెండు వరుస బిందువుల మధ్య దూరం?

1) కంపన పరిమితి     2) పౌనఃపున్యం  

3) కాంతి తీవ్రత      4) తరంగ దైర్ఘ్యం


22. సూర్యుడి నుంచి ఉష్ణం ఏ రూపంలో భూమిని చేరుతుంది?

1) ఉష్ణ సంవహనం     2) ఉష్ణ వహనం 

3) ఉష్ణ వికిరణం      4) ఉష్ణ దక్షత


23. E = mc2 సూత్రాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త?

1) ఐన్‌స్టీన్‌      2) హెర్ట్జ్‌ 

3) న్యూటన్‌      4) మాక్స్‌ప్లాంక్‌ 


24. భూమి నుంచి ఒక వస్తువు అంతరిక్షంలోకి వెళ్లాలంటే దానికి కావాల్సిన కనీస వేగం?

1) 2.38 కి.మీ./సె.     2) 11.2 కి.మీ./సె.  

3) 11.2 మీ./సె.     4) 7.92 కి.మీ./సె.


25. శూన్యంలో స్వేచ్ఛగా కింద పడే వస్తువులు కలిగి ఉండేది?

1) సమాన వడి     2) సమాన వేగం 

3) సమాన త్వరణం     4) సమాన బలం 


26. నీటిలోని గాలి బుడగ దేనిలా కనిపిస్తుంది?

1) పుటాకార దర్పణం     2) పుటాకార కటకం  

3) పట్టకం      4) సమతల దర్పణం


27. న్యూక్లియర్‌ రియాక్టర్‌లో నియంత్రణకారిగా ఉపయోగించేది?

1) భారజలం      2) గ్రాఫైట్‌  

3) అల్యూమినియం      4) బోరాన్‌/కాడ్మియం


28. కాంతి విద్యుత్తు ఫలితానికి సరైన వివరణ ఇచ్చిన శాస్త్రవేత్త?

1) హాల్‌వాక్స్‌     2) మిల్లికాన్‌  

3) ఐన్‌స్టీన్‌      4) న్యూటన్‌


29. ఖగోళ ప్రమాణం (AU) ఏ రెండింటి మధ్య దూరానికి సమానం?

1) భూమి, సూర్యుడు     2) భూమి, చంద్రుడు  

3) భూమి, ప్లూటో      4) బృహస్పతి, భూమి 


30. బాల్‌పాయింట్‌ పెన్ను కిందివాటిలో ఏ ధర్మం ఆధారంగా పనిచేస్తుంది?

1) తలతన్యత      2) స్నిగ్ధత 

3) గురుత్వాకర్షణ      4) అభికేంద్ర బలం


31. అయస్కాంత భూమధ్య రేఖ మన దేశంలో ఏ ప్రాంతం మీదుగా వెళుతుంది?    

1) శ్రీహరికోట      2) బెంగళూరు  

3) తుంబా      4) చెన్నై


32. శీతలప్రాంతాల్లో నీటి గొట్టాలు తరచుగా పగిలిపోవడానికి కారణం?

1) నీటి అసంగత వ్యాకోచం 2) గొట్టం అసంగత వ్యాకోచం 

3) గొట్టం నాసిరకమైంది కావడం వల్ల      4) గొట్టంపై పూసే పూత వల్ల


33. నీటిలో తేలే మంచు కరిగితే నీటి మట్టంలో జరిగే మార్పు?

1) పెరుగుతుంది     2) తగ్గుతుంది 

3) మారదు      4) పెరిగి తగ్గుతుంది


34. రెండు దర్పణాలను 60 డిగ్రీల కోణంలో అమర్చి, వాటి మధ్య ఒక వస్తువును ఉంచితే ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య?

1) 3      2) 4      3) 5     4) 6


35. సమతల దర్పణం నుంచి 5 మీటర్ల దూరంలో ఉండే వ్యక్తి దర్పణం వైపు ఎంతదూరం నడిస్తే అతడి ప్రతిబింబం ఆ వ్యక్తి నుంచి 2 మీటర్ల దూరంలో ఉంటుంది?

1) ఒక మీటరు     2) 3 మీటర్లు 

3) 2 మీటర్లు     4) 4 మీటర్లు


36. సాపేక్ష సిద్ధాంతాన్ని వివరించిన శాస్త్రవేత్త?

1) రూథర్‌ఫర్డ్‌      2) ఐన్‌స్టీన్‌  

3) కెప్లర్‌     4) బోర్‌


37. క్యాండిల్‌ వత్తి ద్వారా మైనం పైకి ఎగబాకడానికి కారణమైన ధర్మం?

1) తలతన్యత     2) నీటి స్నిగ్ధత 

3) వాతావరణ పీడనం     4) కేశనాళికీయత


38. ఇనుముతో చేసిన మేకు నీటిలో మునుగుతుంది, కానీ పడవ మునగదు. దీనికి కారణాన్ని తెలిపే శాస్త్రవేత్త నియమం/సూత్రం?

1) ఆర్కిమెడిస్‌ సూత్రం      2) బెర్నౌలీ సూత్రం  

3) పాస్కల్‌ సూత్రం     4) న్యూటన్‌ నియమం


39. ఇంధ్రధనుస్సు ఏర్పడటానికి కారణమైన కాంతి ధర్మం?

1) కాంతి వక్రీభవనం      2) కాంతి విక్షేపణం  

3) సంపూర్ణాంతర పరావర్తనం      4) పైవన్నీ


40. కిందివాటిలో ప్రాథమిక రంగు కానిది?

1) తెలుపు  2) ఎరుపు  3) ఆకుపచ్చ  4) నీలం


41. ఆకాశం నీలిరంగులో కనిపించడానికి కారణమైన కాంతి ధర్మం?

1) కాంతి విక్షేపణం        2) కాంతి వ్యతికరణం 

3) కాంతి పరిక్షేపణం       4) కాంతి ధ్రువణం


42. క్రయోజనిక్‌ యంత్రాలను ఉపయోగించుకునేది?

1) రిఫ్రిజిరేటర్‌           2) జలాంతర్గామి 

3) రాకెట్‌ టెక్నాలజీ        4) సూపర్‌ కండక్టర్‌ ప్రయోగాల్లో


43. మీసాన్లు అంటే...

1) రుణావేశితాలు     2) ధనావేశితాలు     

3) తటస్థాలు     4) పైవన్నీ


44. సంపూర్ణ సూర్యగ్రహణ సమయంలో కనిపించే సూర్య భాగం?

1) క్రోమోస్ఫియర్‌     2) కరోనా 

3) ఫొటోస్ఫియర్‌     4) మిసోస్ఫియర్‌


45. రాడార్‌ పనిచేసే సూత్రాన్ని గుర్తించండి.

1) సంపూర్ణాంతర పరావర్తనం 2) వక్రీభవనం     3) పరావర్తనం      4) వివర్తనం


46. కిందివాటిలో అధిక పిచ్‌ దేనికి ఉంటుంది?

1) దోమ రొద     2) మానవ స్వరం 

3) సింహగర్జన     4) ఏనుగు ఘీంకారం


47. ధ్వనివేగం కిందివాటిలో దేనిలో గరిష్ఠంగా ఉంటుంది?

1) గాలి   2) నీరు   3) శూన్యం   4) ఉక్కు


48. అర్ధ వాహకాన్ని వేడిచేస్తే దాని నిరోధంలో కలిగే మార్పు?

1) తగ్గుతుంది       2) పెరుగుతుంది 

3) మారదు         4) ఉష్ణోగ్రతపై ఆధారపడుతుంది


49. సహజ రేడియోధార్మికతను కనుక్కున్న శాస్త్రవేత్త?

1) మేడం క్యూరీ     2) హెన్రీ బెకరల్‌  

3) అట్టోహాజ్‌     4) రూథర్‌ఫర్డ్‌



సమాధానాలు


1-3; 2-2; 3-3; 4-3; 5-3; 6-3; 7-3; 8-1; 9-2; 10-4; 11-2; 12-4; 13-3; 14-2; 15-1; 16-1; 17-4; 18-3; 19-3; 20-2; 21-4; 22-3; 23-1; 24-2; 25-3; 26-2; 27-4; 28-3; 29-1; 30-3; 31-3; 32-1; 33-3; 34-3; 35-4; 36-2; 37-4; 38-1; 39-4; 40-1; 41-3; 42-3; 43-4; 44-2; 45-3; 46-1; 47-4; 48-1; 49-2. 
 

Posted Date : 28-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌