• facebook
  • whatsapp
  • telegram

అస్సాం అడవుల్లో కీటకాహార మొక్కలు!

వృక్ష స్వరూప శాస్త్రం

జీవశాస్త్రాల్లో వృక్షశాస్త్రం ఒక ప్రధాన విభాగం. స్వయంపోషకాలైన మొక్కలు ఎక్కువ శాతం జీవరాశులకు అవసరమైన ప్రాణవాయువును, ఆహారాన్ని అందిస్తున్నాయి. మొక్కల బాహ్య, అంతర్గత నిర్మాణం గురించి తెలుసుకుంటేనే వాటి లక్షణాలు, ఉపయోగాలను పూర్తిస్థాయిలో అర్థం చేసుకోవచ్చు. స్వరూప స్వభావాల ఆధారంగా మొక్కల వర్గీకరణపై పరీక్షార్థులకు ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి. రకరకాల మొక్కలు పెరిగే తీరు, ఆహార నిల్వ పద్ధతులు, పునరుత్పత్తి విధానాలను తెలుసుకోవడంతో పాటు ఏ భాగం ఏ విధి నిర్వర్తిస్తుంది, ఏవిధమైన ప్రయోజనాలను ఇస్తుందనే అంశాలపై అవగాహన పెంచుకోవాలి.

1.    విత్తనం అంకురించినప్పుడు గురుత్వానువర్తనానికి అనుకూలంగా పెరిగే మొక్కలోని ఏకైక భాగం?

1) వేరు  2) కాండం  3) ప్రకాండం  4) కణుపు


2.     ‘ఆన్‌ ది కాజెస్‌ ఆఫ్‌ ప్లాంట్స్‌’ గ్రంథకర్త?

1) అరిస్టాటిల్‌      2) ప్లేటో  

3) థియోఫ్రాస్టస్‌      4) లిన్నేయస్‌


3.     వేరు వ్యవస్థలోని ఏ భాగాలు నీరు, ఖనిజ లవణాలను శోషించే పాత్ర పోషిస్తాయి?

1) ప్రధాన వేరు      2) పార్శ్వ వేర్లు  

3) మూలకేశాలు      4) పైవన్నీ


4.     కిందివాటిలో సత్యవాక్యాన్ని గుర్తించండి.

1) క్యారెట్‌లో తల్లి వేరు వ్యవస్థ నిల్వ చేసే వేరుగా మారుతుంది.

2) ఆస్పరాగస్‌లో పీచు వేరు వ్యవస్థ నిల్వ చేసే వేరుగా మారుతుంది.

3) రైజోఫోరా, అవిసీనియాలో వేరు వ్యవస్థ శ్వాస వేరుగా మారుతుంది.

4) పైవన్నీ


5.     ఒక కాండంలో కణుపులు 99 ఉంటే కణుపు మధ్యమాలు ఎన్ని ఉంటాయి?

1) 98    2) 99    3) 100   4) 102


6.     కిందివాటిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి.

1) మాంగ్రూవ్‌ మొక్కల్లో వేరు నిటారుగా పెరుగుతుంది. 

2) వేరు తొడుగు పై భాగంలో విభజన జరిగే మండలం ఉంటుంది.

3) ఊతవేర్లు కణుపు వద్ద ఏర్పడతాయి.

4) బంగాళాదుంప రూపాంతరం చెందిన వేరు.


7.     కిందివాటిలో తల్లి వేరు వ్యవస్థకు ఉదాహరణ?

1) ఆవాలు  2) వరి  3) గోధుమ  4) రాగి


8.     బుడిపెలు ఉన్న వేర్లలో ఏ బ్యాక్టీరియా ఉంటుంది?

1) బ్యాక్టీరియం పుటిడె      2) అజటోబాక్టర్‌  

3) రైజోబియం      4) సూడోమోనాస్‌


9.     వెలామిన్‌ వేర్ల నుంచి లభించే వానిల్లిన్‌ వేటి తయారీలో ఉపయోగిస్తారు?

1) ఔషధాలు      2) సూప్‌లు 

3) ఐస్‌క్రీమ్‌ ఫ్లేవర్‌     4) ఆల్కహాల్‌


10. కిందివాటిలో సంపూర్ణ కాండ పరాన్నజీవి?

1) కస్క్యూట      2) సాంటాలం ఆల్బం  

3) విస్కమ్‌      4) ఒరబాంకీ 


11. సేంద్రియ వ్యవసాయం ఎక్కువ అమల్లో ఉన్న రాష్ట్రం?

1) గుజరాత్‌      2) హరియాణా 

3) అస్సాం       4) త్రిపుర


12. వాయుగత కాండం రూపాంతరానికి ఉదాహరణ?

1) నులితీగలు      2) ముళ్లు  

3) కొక్కేలు      4) పైవన్నీ


13. ఇచ్చినవాటిలో భిన్నమైన దాన్ని గుర్తించండి.

1) పత్రాభాకాండం      2) స్టోలన్లు  

3) రన్నర్లు      4) ఆఫ్‌సెట్‌లు


14. భూగర్భ కాండ రూపాంతరాల్లో భూమికి సమాంతరంగా పెరిగే నిర్మాణం?

1) కాండం      2) కొమ్ము  

3) లశునం      4) లఘులశునం


15. అతి పొడవైన పత్రం?

1) మోనోఫిల్లియా      2) విక్టోరియా రీజియా  

3) రఫియా రఫియా      4) వెల్‌ విట్చియా


16. కిందివాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి.

A) ఆవాలు - ద్విదళ - జాలాకార ఈనెల వ్యాపనం

B) గోధుమ - ఏకదళ - సమాంతర ఈనెల వ్యాపనం

C)  జొన్న - ఏకదళ - జాలాకార ఈనెల వ్యాపనం

D) మొక్కజొన్న - ఏకదళ - సమాంతర ఈనెల వ్యాపనం

1) A, B, C, D 2) A, C, D

3) A, B, D 4) A, B, C


17. పత్రోపరిస్థిత మొగ్గలున్న మొక్క? 

1) బ్రయోఫిల్లం       2) బిగ్నోనియా   

3) నెపంథిస్‌     4) డ్రాసిరా


18. రుద్రాక్షమాల లాంటి వేర్లు ఉన్న మొక్క?

1) పిస్టియా      2) డయాస్కోరియా  

3) డిస్కిడియా       4) ఐకార్నియా


19. ఉల్లిని కోసినప్పుడు కళ్లలో నీళ్లు రావడానికి కారణం?    

1) సల్ఫర్‌      2) సల్ఫేట్‌  

3) అల్లైల్‌ సల్ఫైడ్‌      4) కాల్షియం


20. ఒపెన్షియాలో కంటక సమూహాన్ని ఏమంటారు? 

1) ఏరియోట్‌       2) బార్బ్‌లు  

3) క్లాడోడ్‌      4) కొక్కేలు


21. ప్లాసీఫ్లోరాలో నులితీగగా మారే భాగం?

1) పార్శ్వ మొగ్గ     2) కాండం  

3) గ్రీవ మొగ్గ      4) కణుపు


22. పిలక మొక్కల ద్వారా ప్రత్యుత్పత్తి జరిపే మొక్క?

1) పిస్టియా  2) అరటి  3) చామంతి  4) 2, 3


23. పుష్పం అధ్యయనాన్ని ఏమంటారు?

1) అగ్రస్టాలజీ      2) ఆంథాలజీ  

3) ఆంజియాలజీ      4) ఉలాలజీ


24. ఆపిల్‌లో తినదగిన భాగం?

1) పుష్పాసనం      2) పుష్పవృంతం  

3) మధ్య ఫలకవచం      4) పెరికార్ఫ్‌


25. అంకురచ్ఛదం స్థితి?

1) ఏకస్థితికం      2) ద్వయస్థితికం  

3) త్రయస్థితికం      4) అసమస్థితికం


26. పుష్ప విన్యాసంలో కింద ఉన్న పుష్పవృంతాలు పొడవుగా, పైన ఉన్నవి చిన్నగా ఉండే విధానం?

1) స్పాడిక్స్‌      2) సామాన్య సమసిఖ  

3) సైయోస్‌      4) పానికిల్‌


27. కిందివాటిలో వాయుగతంగా పుష్పించి, భూగతంగా ఫలాలు అందించే మొక్క? 

1) అవిసె      2) కంది  

3) కాలిఫ్లవర్‌      4) వేరుశనగ


28. కిందివాటిలో అతిపెద్ద విత్తనం?

1) ఆర్కిడ్‌      2) లోడిషియా  

3) పనస      4) జీడిమామిడి


29. నీలిరంగు లేబుల్‌ ఉన్న విత్తన రకాలు?

1) ఫౌండేషన్‌ విత్తనాలు      2) బ్రీడల్‌ విత్తనాలు  

3) కేంద్రక విత్తనాలు      4) ధ్రువీకరణ విత్తనాలు


30. విత్తనాలు ఉత్పత్తి చేసే మొక్కలను ఏమంటారు?

1) జర్మటాలజీ      2) స్పెర్మాలజీ  

3) స్పెర్మటోఫైట్స్‌     4) బ్రయోఫైట్స్‌


31. అనిషేక జననాన్ని ప్రేరేపించే ఫైటో హార్మోన్‌?

1) జిబ్బరెల్లిన్‌  2) ఆక్సిన్‌  3) ఇథనాల్‌ 4) 1, 2


32. కిందివాటిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి.

1) జీవితకాలంలో ఒకేసారి పుష్పించే మొక్కలను మోనోకార్ప్‌ అంటారు.

2) ప్రతి ఏడాది పుష్పించే మొక్కలను పాలీకార్ప్‌ అంటారు.

3) అస్సాం అడవుల్లో ఎక్కువగా పెరిగేవి కీటకాహార మొక్కలు.

4) అతి చిన్న పుష్పం లెమ్నా.


33. ఒఫియోఫిలీ పరపరాగ సంపర్కం విధానాన్ని చూపే మొక్క?

1) వాలిస్‌నేరియా      2) జోస్టిరా  

3) మొగలి      4) మ్యూసా


34. వికసించని పుష్పాల్లో జరిగే పరాగ సంపర్కాన్ని ఏమంటారు?

1) క్లిస్టోగమీ      2) చాస్మోగమీ  

3) ఆర్నిథోగమీ      4) 1, 2


35. కీటకాలను ఆకర్షించేందుకు కుళ్లిన వాసన వెదజల్లే మొక్కలు?

1) స్టెర్కులియా      2) లెమ్నా  

3) సాంటాలం ఆల్బం      4) లోడిషియా


36. మొక్కలు మూలకేశాల ద్వారా నీటిని పీల్చుకునే పద్ధతిని ఏమంటారు?

1) ద్రవోద్గమం      2) ద్రవాభిసరణం 

3) విసరణ      4) సంసంజనం


37. కైరిప్టిరోఫిలిలో పరాగ సంపర్క కారకం?

1) నత్త   2) గబ్బిలం  3) పాము   4) నీరు


38. కాలిఫ్లవర్‌లో తినదగిన భాగం?

1) పుష్పవిన్యాసం      2) పుష్పవృంతం  

3) కీలాగ్రం      4) అండాశయం


39. ఒకే కణుపు నడిమి ఉన్న ఉప వాయుగత కాండ రూపాంతరానికి ఉదాహరణ? 

1) ఐకార్నియా      2) పిస్టియా  

3) హైడ్రిల్లా      4) 1, 2


40. అతిపెద్ద వేరు తొడుగు ఉన్న మొక్క?

1) డాలియా      2) ఆస్పరాగస్‌  

3) పెండానస్‌     4) ఫేసియోలస్‌


41. నీటి మొక్కల వేరు వ్యవస్థలో లోపించిన భాగాలు?    

1) వేరు ఒరలు      2) వేరు తొడుగు  

3) మూలకేశాలు      4) 1, 2


42. డాలియాలో నిల్వ ఆహార పదార్థం?

1) చక్కెర      2) ప్రొటీన్‌లు  

3) ఇన్యులిన్‌      4) ఇన్సులిన్‌


43. కిందివాటిలో ఎపిఫైట్స్‌కు ఉదాహరణ?  

1) డాలియా  2) వాండ  3) ఫైకస్‌  4) సైకస్‌


44. లవణ నేలలో పెరిగే మొక్కలను ఏమంటారు?

1) హాలోఫైట్స్‌       2) ఆగ్జాలోఫైట్స్‌  

3) లిథోఫైట్స్‌      4) హైడ్రోఫైట్స్‌ 


45. ఎపిఫైట్స్‌లో మూలకేశాల విధిని నిర్వహించేది?

1) అంటువేర్లు      2) పార్శ్వవేర్లు  

3) వెలామిన్‌ కణజాలం      4) దారువు


46. పోర్చుగీసు వారి ద్వారా పురస్థాపనం చెందిన మొక్క? 

1) బంగాళాదుంప      2) అల్లం  

3) చెరకు      4) అరటి


47. స్మైలాక్స్‌కు సంబంధించి సరైంది? 

1) ఏకదళ - సమాంతర ఈనెల వ్యాపనం

2) ద్విదళ - జాలాకార ఈనెల వ్యాపనం

3) ఏకదళ - జాలాకార ఈనెల వ్యాపనం

4) ద్విదళ - సమాంతర ఈనెల వ్యాపనం


48. హస్తాకార సంయుక్త పత్రానికి ఉదాహరణ?

1) బూరుగ 2) వేప 3) ఆల్‌స్టోనియా 4) బఠాణి


49. మంచులో పెరిగే మొక్కలను ఏమని పిలుస్తారు?

1) క్రయోఫైట్స్‌     2) లిథోఫైట్స్‌ 

3) ఆగ్జాలోఫైట్స్‌     4) హాలోఫైట్స్‌


50. కిందివాటిలో భారతదేశం నుంచి ఇతర దేశాలకు పురఃస్థాపన చేసింది?

1) టమాట   2) చెరకు  3) కాఫీ  4) పియర్‌ 


51. మొక్కలోని కణుపు వద్ద పత్రానికి, గ్రీవానికి మధ్య కోణం?.

1) అగ్ర కోణం     2) పార్శ్వ కోణం 

3) గ్రీవ కోణం     4) 1, 2


52. సెంట్రల్‌ పొటాటో రిసెర్చ్‌ సెంటర్‌ ఎక్కడ ఉంది?

1) సిమ్లా 2) నాగ్‌పుర్‌ 3) జునాగఢ్‌ 4) కులుమనాలి


53. కిందివాటిలో సుందరీకరణ మొక్క జాతికి చెందింది?

1) రైజోఫోరా  2) అవిసీనియా 

3) బ్రుగైలా   4) పైవన్నీ



సమాధానాలు


1-1; 2-3; 3-3; 4-4; 5-1; 6-4; 7-1; 8-3; 9-3; 10-1; 11-3; 12-4; 13-1; 14-2; 15-3; 16-3; 17-1; 18-3; 19-3; 20-2; 21-3; 22-4; 23-2; 24-1; 25-2; 26-2; 27-4; 28-2; 29-4; 30-3; 31-4; 32-4; 33-3; 34-1; 35-1; 36-2; 37-2; 38-1; 39-4; 40-3; 41-4; 42-3; 43-2; 44-1; 45-3; 46-1; 47-3; 48-1; 49-1; 50-2; 51-3; 52-1; 53-4.


రచయిత: వట్టిగౌనళ్ల పద్మనాభం  
 

Posted Date : 26-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌