• facebook
  • whatsapp
  • telegram

ప్రాథమిక స్థాయిలో పిల్లలకు హోంవర్క్‌ తగదు!

భారతదేశ విద్యాచరిత్ర, స్వాతంత్య్రానంతరం విద్యా కమిటీలు, కమిషన్లు

ఆధునిక సమాజంలో మనిషికి అత్యంత అవసరమైంది, విలువైంది విద్య. సమాజ అభివృద్ధి ప్రజల విద్యావికాసాలపైనే ఆధారపడి ఉంటుంది. భారతదేశంలో ఎన్నో శతాబ్దాలుగా సంప్రదాయ,    సనాతన రీతుల్లోనే కొనసాగుతూ వచ్చిన విద్యా విధానం స్వాతంత్య్రానంతరం ప్రభుత్వాల     చొరవతో సమూల మార్పులకు గురైంది. పిల్లల్లో ఆధునిక విజ్ఞానం, శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకతలను పెంచే, ఆలోచనా పరిధిని విస్తరింపజేసే విధానాలు రూపుదిద్దుకున్నాయి. ఈ నేపథ్యంలో దేశ విద్యావిధానంలో క్రమానుగతంగా చోటు చేసుకున్న పరిణామాలు, ప్రధాన సంస్కరణలను అభ్యర్థులు తెలుసుకోవాలి. విద్యావ్యవస్థ నిర్మాణక్రమం, ప్రభుత్వాల కమిటీలు, వాటి సిఫార్సుల గురించి సమగ్ర అవగాహన పెంచుకోవాలి.

1.    కిందివాటిలో మాధ్యమిక విద్యా కమిషన్‌ సిఫారసు కానిది-

1) మాధ్యమిక విద్యా కాల పరిమితి ఏడేళ్లుగా ఉండాలి.

2) గ్రామీణ పాఠశాలలో వ్యవసాయ కోర్సులు ఏర్పాటు చేయాలి.

3) మాధ్యమిక స్థాయిలో విషయ తంత్ర ప్రశ్నలు ప్రవేశపెట్టాలి.

4) పని అనుభవాన్ని తప్పనిసరిగా బోధించాల్సిన అవసరం ఉంది.


2.     ఇంటర్‌ విద్యను రద్దు చేసి ఉన్నత పాఠశాలలో కలపాలని సూచించిన విద్యా కమిషన్‌ ఏది?

1) రాధాకృష్ణన్‌ కమిషన్‌     2) కొఠారి కమిషన్‌

3) మాధ్యమిక విద్యా కమిషన్‌    4) ఈశ్వరీభాయ్‌ పటేల్‌ కమిషన్‌


3.     పరీక్ష విధానాన్ని సంస్కరించి, దానిలో ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలను ప్రవేశపెట్టాలని సూచించిన విద్యా కమిషన్‌ ఏది?

1) సార్జెంట్‌ కమిషన్‌   2) సెకండరీ విద్యా కమిషన్‌

3) కొఠారి కమిషన్‌   4) ఈశ్వరీభాయ్‌ పటేల్‌ కమిషన్‌


4.     1947 నాటికి భారతదేశ అక్షరాస్యత రేటు ఎంత?

1) 16%  2) 17%   3) 14%  4) 15%


5.     ఎవరి ఆధ్వర్యంలో 1952లో మాధ్యమిక విద్యా కమిషన్‌ ఏర్పాటైంది?

1) కేంద్ర ప్రభుత్వం        2) NCERT    

3) CABE               4) రాష్ట్ర ప్రభుత్వం


6.     ప్రతీ పరీక్షలో ఎంత శాతం లక్ష్యాత్మక ప్రశ్నలు ప్రవేశపెట్టాలని లక్ష్మణ స్వామి మొదలియార్‌ సూచించారు?

1) 15-40%          2) 10-30%      

3) 20-35%            4) 15-35%


7.     దేశవ్యాప్తంగా మాధ్యమిక విద్యను సమన్వయం చేయడానికి కేంద్రీయ మాధ్యమిక విద్యా పరిషత్‌ను స్థాపించాలని సూచించిన విద్యా కమిషన్‌ ఏది?

1) రాధాకృష్ణన్‌ కమిషన్‌     2) కొఠారీ కమిషన్‌

3) సెకండరీ విద్యా కమిషన్‌        4) ఈశ్వరీభాయ్‌ పటేల్‌ కమిటీ


8.     ఏ కమిటీ సూచనల మేరకు 1953 నుంచి అధ్యాపకుల వేతనాలు మెరుగయ్యాయి?

1) మొదలియార్‌ కమిషన్‌  2) రాధాకృష్ణన్‌ కమిషన్‌

3) సార్జెంట్‌ కమిషన్‌        4) సాడ్లర్‌ కమిషన్‌


9. ‘విద్యా దశల్లో సాధారణ విద్య అంతర్భాగంగా పని అనుభవాన్ని ప్రవేశపెట్టాలి’ అని పేర్కొన్న విద్యా కమిషన్‌?

1) సెకండరీ విద్యా కమిషన్‌     2) కొఠారీ కమిషన్‌

3) రామ్మూర్తి కమిషన్‌         4) జనార్ధన్‌రెడ్డి కమిషన్‌


10. 1968 జాతీయ విద్యా విధానానికి ఆధారం ఏది?

1) ప్రభుత్వ ప్రణాళిక           2) సెకండరీ విద్యా కమిషన్‌

3) కొఠారీ కమిషన్‌            4) ఈశ్వరీభాయ్‌ పటేల్‌ కమిషన్‌


11. కొఠారీ కమిషన్‌కు సంబంధించి కిందివాటిలో సరైంది-

1) ఒక కిలోమీటరు దూరంలో ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయాలి.

2) విద్య అనేది వ్యక్తి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడాలి.

3) బాలికల విద్యను ప్రోత్సహించాలి.    4) పైవన్నీ


12. ‘ప్రాథమిక స్థాయిలో ట్యూషన్‌ ఫీజు విధించరాదు’ అని పేర్కొన్న విద్యా కమిషన్‌?

1) ఈశ్వరీభాయ్‌ పటేల్‌ కమిటీ          2) 1968 జాతీయ విద్యా విధానం

3) కొఠారీ కమిషన్‌                   4) మొదలియార్‌ కమిషన్‌


13. ‘‘భారతదేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది’’ అనే వాక్యంతో ఏ కమిషన్‌ తన నివేదికను ప్రారంభించింది?

1) మొదలియార్‌ కమిషన్‌     2) రాధాకృష్ణన్‌ కమిషన్‌

3) కొఠారీ కమిషన్‌    4) 1968 జాతీయ విద్యా విధానం


14. కొఠారీ కమిషన్‌ ప్రకారం మాధ్యమిక ఉపాధ్యాయుల శిక్షణ కాలం ఎంత?    

1) ఏడాది          2) రెండేళ్లు       

3) మూడేళ్లు            4) నాలుగేళ్లు


15. కొఠారి కమిషన్‌ నివేదిక తక్షణ ఫలితం-

1) 10 + 2 + 3 విద్యా విధానం     2) మాతృభాషలో బోధన

3) NSS ఏర్పాటు    4) 1968 జాతీయ విద్యా విధానం


16. మాధ్యమిక విద్యను వృత్తిపరం చేయాలని పేర్కొన్న కమిషన్‌?

1) రామ్మూర్తి కమిషన్‌  2) మాధ్యమిక విద్యా కమిషన్‌

3) కొఠారీ కమిషన్‌      4) జనార్ధన్‌ రెడ్డి కమిషన్‌


17. వృత్తి విద్యలో విద్యార్థుల నైపుణ్యాన్ని పెంచడానికి బహుళార్థ సాధక పాఠశాలలను ప్రారంభించాలని సిఫారసు చేసిన కమిషన్‌ ఏది?

1) సెకండరీ విద్యా కమిషన్‌        2) భారతీయ విద్యా కమిషన్‌

3) భావ సమైక్యత కమిటీ        4) విశ్వవిద్యాలయాల కమిషన్‌


18. భారతీయ విద్యా కమిషన్‌ అని దేనిని అంటారు?

1) రాధాకృష్ణన్‌ కమిషన్‌    2) మొదలియార్‌ కమిషన్‌

3) కొఠారీ కమిషన్‌    4) విశ్వవిద్యాలయాల కమిషన్‌


19. పాఠశాలలను ఏర్పాటు చేయాలని పేర్కొన్న విద్యా కమిషన్‌?

1) సెకండరీ విద్యా కమిషన్‌    2) ఈశ్వరీభాయ్‌ పటేల్‌ కమిషన్‌

3) జనార్ధన్‌రెడ్డి కమిషన్‌      4) కొఠారీ కమిషన్‌


20. ప్రాథమిక పాఠశాలకు సంబంధించి పటేల్‌ సిఫారసులో పొందుపరచనిది-

1) మూడు గంటల నియత విద్య చాలు  2) ఇంటి పని నిషేధించాలి

3) కృత్య పద్ధతిని ప్రవేశపెట్టాలి      4) టైం టేబుల్‌ దృఢంగా ఉండాలి


21. పదేళ్ల పాఠశాల విద్యలో ఏవి తప్పనిసరిగా ఉండాలని కొఠారీ కమిషన్‌ పేర్కొంది?

1) సైన్స్‌ - గణితం          2) గణితం - ఆంగ్లం

3) ఆంగ్లం - సైన్స్‌          4) ఏదీకాదు


22. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఎంపికచేసిన విశ్వవిద్యాలయాల్లో అభ్యసనా కేంద్రాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్న విద్యా కమిషన్‌?

1) కొఠారీ కమిషన్‌         2) రాధాకృష్ణన్‌ కమిషన్‌

3) మాధ్యమిక విద్యా కమిషన్‌       4) రామ్మూర్తి కమిషన్‌


23. మానవ శక్తి అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యను విస్తరించాలని పేర్కొన్న విద్యా కమిషన్‌?

1) ఈశ్వరీభాయ్‌ పటేల్‌ కమిటీ    2) 1968 జాతీయ విద్యా విధానం

3) కొఠారీ కమిషన్‌    4) మాల్కం ఆదిశేషయ్య కమిటీ


24. ‘‘తరగతి గది ఒక్కటే అభ్యసనానికి ఆధారం కాకూడదు’’ అని పేర్కొన్నది ఎవరు?

1) కొఠారీ కమిషన్‌      2) ఈశ్వరీభాయ్‌ పటేల్‌ కమిటీ

3) రామ్మూర్తి కమిటీ    4) 1986 జాతీయ విద్యా విధానం


25. SUPW అంటే

1) Socially useful productive works

2) Social usage productive works

3) Socially using productive works

4) Socially using preparing works


26. ‘ప్రాథమిక స్థాయిలో పిల్లలకు హోంవర్క్‌ నిషేధించాలి’ అని పేర్కొన్న కమిషన్‌ ఏది?

1) కొఠారీ కమిషన్‌    2) ఈశ్వరీభాయ్‌ పటేల్‌ కమిటీ

3) మాల్కం ఆదిశేషయ్య కమిటీ    4) ఆచార్య రామ్మూర్తి కమిటీ


27. ఈశ్వరీభాయ్‌ పటేల్‌ కమిషన్‌ సూచనల ప్రకారం పాఠ్య పుస్తకాల తయారీ బోధనోపకరాల తయారీ దేని ఆధారంగా జరగాలి?

1) NCTE 2) NCERT

3) SCERT 4) SIET


28. ఈశ్వరీభాయ్‌ పటేల్‌ కమిటీ అధ్యక్షుడైన ఈశ్వరీభాయ్‌ పటేల్‌ ఏ విశ్వవిద్యాలయానికి వైస్‌ ఛాన్సలర్‌గా పనిచేశారు?

1) మద్రాస్‌           2) ముంబయి

3) గుజరాత్‌            4) కోల్‌కతా


29. పారిశ్రామిక అభివృద్ధి కోసం ఐటీఐ, పాలీటెక్నిక్‌ శిక్షణ సంస్థలు ఏర్పాటు చేసింది?

1) కొఠారీ కమిషన్‌    2) ఈశ్వరీభాయ్‌ పటేల్‌ కమిటీ

3) 1968 జాతీయ విద్యా విధానం    4) మొదలియార్‌ కమిషన్‌


30. కరికులమ్‌ రివ్యూ కమిటీ అని దేన్ని అంటారు?

1) కొఠారీ కమిషన్‌      2) మాల్కం ఆదిశేషయ్య కమిటీ

3) ఈశ్వరీభాయ్‌ పటేల్‌ కమిటీ      4) 1968 జాతీయ విద్యా విధానం


31. ప్రతి రాష్ట్రానికి ఒక వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలని పేర్కొనదెవరు?    

1) ఈశ్వరీభాయ్‌ పటేల్‌ కమిటీ    2) మాల్కం ఆదిశేషయ్య కమిటీ

3) 1968 జాతీయ విద్యా విధానం   4) మొదలియార్‌ కమిషన్‌


32. విద్యార్థులను సరైన దారిలో పెట్టడానికి మార్గదర్శక సేవలను విద్యలో అంతర్భాగంగా ప్రవేశపెట్టాలని సూచించిన విద్యా కమిషన్‌?

1) రాధాకృష్ణన్‌ కమిషన్‌     2) ఈశ్వరీభాయ్‌ పటేల్‌ కమిటీ

3) సెకండరీ విద్యా కమిషన్‌  4) కొఠారీ కమిషన్‌


33. విద్యను నియత, అనియత రూపంలో అందించాలని సూచించిన విద్యా కమిషన్‌?

1) రామ్మూర్తి కమిషన్‌    2) ఈశ్వరీభాయ్‌ పటేల్‌ కమిటీ

3) కొఠారీ కమిషన్‌    4) జనార్ధన్‌ రెడ్డి కమిషన్‌


34. ప్రస్తుతం, భవిష్యత్తులో విద్యను ఒక పెట్టుబడిగా పరిగణించాలని పేర్కొన్నది?

1) కొఠారీ కమిషన్‌    2) జాతీయ విద్యా విధానం 1968

3) ఈశ్వరీభాయ్‌ పటేల్‌ కమిటీ    4) జాతీయ విద్యా విధానం 1986


35. కొఠారీ కమిషన్‌ తన నివేదికను కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎం.సి.చాగ్లాకు ఎప్పుడు సమర్పించింది?

1) 1966, జూన్‌ 19     2) 1966, జూన్‌ 29

3) 1966, జులై 19     4) 1966, జులై 29


36. SUPW కోసం ఈశ్వరీభాయ్‌ పటేల్‌ కమిటీ వారానికి గరిష్ఠంగా ఎన్ని గంటలు కేటాయించాలని సిఫారసు చేసింది?

1) 5      2) 6      3) 7     4) 8  


37. విద్యార్థుల వ్యక్తిగత అవసరాలను తీర్చే విధంగా పాఠ్యప్రణాళికను రూపొందించాలని పేర్కొన్నదెవరు?

1) కొఠారీ కమిషన్‌    2) జనార్ధన్‌ రెడ్డి కమిషన్‌

3) మాల్కం ఆదిశేషయ్య కమిటీ    4) ఈశ్వరీభాయ్‌ పటేల్‌ కమిటీ



సమాధానాలు


1-4; 2-3; 3-2; 4-4; 5-3; 6-1; 7-3; 8-2; 9-2; 10-3; 11-4; 12-3; 13-3; 14-1; 15-4; 16-3; 17-1; 18-3; 19-4; 20-4; 21-1; 22-1; 23-3; 24-1; 25-1; 26-2; 27-2; 28-3; 29-3; 30-3; 31-3; 32-4; 33-2; 34-4; 35-2; 36-2; 37-4. 

రచయిత: కోటపాటి హరిబాబు

Posted Date : 22-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.