• facebook
  • whatsapp
  • telegram

ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల వృత్తిపరమైన అభివృద్ధి

*  మద్రాసులో 1885లో మొదటి ఉపాధ్యాయ వృత్తి సంఘం ఏర్పడింది. దీని ప్రభావంతో 1908లో దక్షిణ భారత ఉపాధ్యాయుల సంఘం (SITU - South Indian Teachers Union) ఏర్పడింది.
*  ''ఉపాధ్యాయుల వృత్తి సంఘాల సమర్థతను కాపాడటంలో, వారి గౌరవాన్ని పెంపొందించడంలో, వృత్తిపరమైన దుష్ప్రవర్తనను అరికట్టడంలో ఉపాధ్యాయ సంఘాలు ప్రముఖ పాత్ర నిర్వహించాలి'' అని నూతన జాతీయ విద్యావిధానం - 1986 పేర్కొంది.
*  ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసమే కాకుండా, ఉపాధ్యాయ వృత్తి ప్రయోజనాలకు, నూతన విద్యా కార్యక్రమాలను అమల్లో పెట్టడానికి వృత్తి సంఘాలు ఎంతైనా అవసరం.
*  1980లో బీహార్, ఒరిస్సాలో కింది స్థాయి విద్యాధికారుల వృత్తి సంఘాలు ఏర్పడ్డాయి.
*  1914లో మహారాష్ట్రలో రాష్ట్ర ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం ఏర్పడింది.
*  1920లో బెంగాల్ ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం ఏర్పడింది.
*  1947లో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్ర ఉపాధ్యాయ సమాఖ్య 1957లో ఆంధ్రరాష్ట్ర ప్రాథమిక ఉపాధ్యాయ సమాఖ్యగా మార్పుచెందింది.
*  1957 తర్వాత పంచాయతీరాజ్ సంఘం (PRTU) ఏర్పడింది.
*  ఈ సంఘం ప్రోగెసివ్ రికగ్నిషన్ టీచర్స్ యూనియన్‌గా మారింది.
*  ఏపీటీఎఫ్, ఏపీయూటీఎఫ్, ఏపీఎస్‌టీయూ, ఏపీడీటీఎఫ్, ఏపీటీఆర్‌టీయూ, ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌టీయూ లాంటి మరెన్నో సంఘాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయుల సంక్షేమానికి తోడ్పడుతున్నాయి.
*  మనదేశంలో, రాష్ట్రంలో బ్లాక్/మండల స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు అనేక వృత్తిపరమైన ఉపాధ్యాయ సంస్థలు పనిచేస్తున్నాయి.
*  ఇవి ప్రధానంగా ఉపాధ్యాయ వర్గానికి చెందిన హక్కుల సాధనే ధ్యేయంగా కృషి చేస్తున్నా అప్పుడప్పుడు కింది కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటాయి.
1) వృత్యంతర శిక్షణ కార్యక్రమాల నిర్వహణ
2) ఉపాధ్యాయుల ఎంపిక పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడం
3) విద్యా విషయాలపై సెమినార్లు, కార్యగోష్టులు (Work shops), ప్రదర్శనలు (Exhibitions), చర్చలు నిర్వహించడం.
*  ఉపాధ్యాయ సంఘాలు సమాజానికి పాఠశాలకు మధ్య వారధిలా పని చేయాలి.
*  దాని కోసం ఈ సంఘాలు కింది అంశాలకు సంబంధించి తమ పరిధిలో ఇతోధిక కృషి చేయాల్సి ఉంది.
1) వివిధ స్థాయుల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయ సంఘాలు వాటి పరిధిలోని పాఠశాలల అభివృద్ధికి ప్రణాళికలు తయారుచేసి, విద్యాకమిటీలు - సమాజం సహకారంతో అమలు చేయాలి.
2) పాఠశాలలు సక్రమంగా పనిచేసేలా, సమయపాలన పాటించేలా ఉపాధ్యాయ సంఘాలు కృషి చేయాలి. అప్పుడే పాఠశాలలకు సమాజ సహకారం ఉంటుంది.
3) ఉపాధ్యాయుల ఆదర్శవంతమైన నైతిక ప్రవర్తనకు ఉపాధ్యాయ సంఘాలు బాధ్యత వహించాలి. తద్వారా విద్యార్థుల్లో విలువలు పెంపొందించి, భావిసమాజ నిర్మాణానికి దోహదపడాలి.
4) ఉపాధ్యాయ సంఘాలు వృత్యంతర శిక్షణా తరగతులు నిర్వహించడంలో సమాజంలోని వివిధ వర్గాల నిపుణుల సేవలు వినియోగించుకుని, నూతన పోకడలను ఉపాధ్యాయులకు అందజేయాలి.
5) కొత్త సిలబస్ అమల్లోకి వచ్చినపుడు ఉపాధ్యాయులకు పునఃశ్చరణ తరగతులు నిర్వహించాలి.
6) విద్యా ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక, పాఠ్యపుస్తకాల తయారీలో ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వాలి.
7) అక్షరాస్యత, వయోజన విద్య, నిరంతర విద్య కార్యక్రమాల నిర్వహణకు సహకరించాలి.
8) ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల అమలులో తోడ్పడాలి.
9) జన్మభూమి, నీరు-మీరు, పచ్చదనం-పరిశుభ్రత, సామాజిక అడవుల పెంపకం, జనాభా లెక్కల సేకరణ, పల్స్‌పోలియో, ఓటర్ల నమోదు, సమాజ సేవాకార్యక్రమాల్లో ఉపాధ్యాయులు విరివిగా, స్వచ్ఛందంగా పాల్గొనేలా ఉపాధ్యాయ సంఘాలు ప్రోత్సహించి, పాఠశాలను సమాజానికి దగ్గరయ్యేలా చేయాలి.
10) ఉపాధ్యాయ సంఘాలు సమాజంలోని దాతలను, వితరణశీలురను గుర్తించి, వారిని ప్రోత్సహించి, పాఠశాలలకు కావాల్సిన వనరులు అందేలా కృషి చేయాలి.

Posted Date : 30-08-2023

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్కూల్ అసిస్టెంట్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు