• facebook
  • whatsapp
  • telegram

ప్రత్యుత్పత్తి - పునరుత్పాదక వ్యవస్థ

వానపాము ఆడజీవా.. మగజీవా..!


సృష్టిలోని జీవజాతులు తమ తరాలను కొనసాగించేందుకు ఉన్న సహజ ప్రక్రియే ప్రత్యుత్పత్తి. జంతు వర్గంలో ఎక్కువ శాతం లైంగిక విధానంలో, నిమ్నస్థాయి జీవులు, మొక్కల్లో అలైంగిక విధానంలో ప్రత్యుత్పత్తి జరుగుతుంది. అండ పిండ బ్రహ్మాండంగా పేర్కొనే ఈ పునరుత్పాదకత జాతుల వారీగా  వేటికదే ప్రత్యేకం. జీవరాశులకు సంబంధించిన లైంగిక పరిజ్ఞానం, అలైంగిక విధానాల్లోని రకాలు, వివిధ జంతువుల్లో గర్భావధి కాలం, మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, లైంగిక వ్యాధుల గురించి పరీక్షార్థులు తెలుసుకోవాలి. స్త్రీ, పురుషుల్లో  ప్రత్యుత్పత్తి వ్యవస్థల నిర్మాణం, గర్భంలో ఫలదీకరణం నుంచి ప్రసవం వరకు వివిధ దశలు, శిశువు శరీరంలో వచ్చే మార్పులపై అవగాహన పెంచుకోవాలి.


1.    కింది వాటిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి.

1) జీవులు తమ తర్వాత తరాలను కొనసాగించేందుకు ప్రత్యుత్పత్తి ఉపయోగపడుతుంది.

2) పారమీషియం అనుకూల పరిస్థితిలో ద్విదా    విచ్ఛిత్తిని జరుపుతుంది.

3) సంయోగ బీజాల కలయిక లేకుండా జరిగే ప్రత్యుత్పత్తిని అలైంగికోత్పత్తి అంటారు.

4) అనిషేక జననం అనేది ఒక లైంగికోత్పత్తి.


2.     ఏక రూపకత, సౌష్ఠవయుతంగా ఉండే ప్రత్యుత్పత్తి విధానం?

1) విచ్ఛిత్తి       2) కోరకీభవనం 

3) ముక్కలవడం     4) పునరుత్పత్తి


3.     శిలీంధ్రాలు, శైవలాల్లో సాధారణ  ప్రత్యుత్పత్తి?

1) విచ్ఛిత్తి      2) కోరకీభవనం  

3) ముక్కలవడం     4) పునరుత్పత్తి


4.     ఫెర్న్‌ మొక్కల పత్రాల అడుగు భాగంలో ఉండే బూడిద రంగు మచ్చలను ఏమంటారు?

1) సొరై      2) హైపే  

3) సిద్ధబీజాలు      4) 1, 2


5.     కిందివాటిలో బాహ్య ఫలదీకరణం జరిపే జీవులు-

1) చేపలు      2) ఉభయచరాలు  

3) పక్షులు      4) 1, 2


6.     కింది వాటిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి.

1) కప్ప అంతర ఫలదీకరణం జరుపుతుంది.  2) కప్ప అండాన్ని స్పాన్‌ అంటారు.

3) కప్ప శుక్రకణాన్ని మిల్ట్‌ అంటారు.    4) కప్ప లార్వాని టాడ్‌పోల్‌ అంటారు.


7.     9వ తరగతి చదువుతున్న కుమార్‌ను జీవశాస్త్ర ఉపాధ్యాయుడు ‘‘నువ్వు గమనించిన వానపాము ఆడజీవా? మగజీవా?’’ అని ప్రశ్నించాడు. అయితే విద్యార్థి సమాధానం ఏమిటి?

1) స్త్రీ జీవి       2) పురుష జీవి  

3) ఉభయ లైంగిక జీవి     4) ఏదీకాదు


8.     కింది వాటిలో శిశోత్పాదక సరీసృపం ఏది?

1) తేలు      2) రక్తపింజర 

3) సీ‡లెంటరేటా      4) పైవన్నీ


9. టెస్టోస్టిరాన్‌ అనే హార్మోన్‌ తయారయ్యే ప్రాంతం?

1) పీయూష గ్రంథి       2) అడ్రినల్‌ గ్రంథి  

3) ముష్కాలు      4) స్త్రీ బీజ కోశం


10. కింది వాటిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి.

1) ముష్కాలు శరీర ఉష్ణోగ్రత కంటే 2 °C - 2.5°C తక్కువ ఉష్ణోగ్రత వద్ద మాత్రమే   పరిణతి చెంది ఉంటాయి.

2) ముష్కంలో మెలి తిరిగిన భాగాన్ని శుక్రోత్పాదక నాళికలు అంటారు.

3) సమవిభజన ద్వారా మిలియన్ల సంఖ్యలో శుక్రోత్పాదక నాళికల్లో శుక్రకణాలు తయారవుతాయి.

4) శుక్రకణాలు నిల్వ ఉండే భాగం ఎపిడిడిమిస్‌.


11. కింది వాటిలో పిండాన్ని ఆవరించి ఉండే బాహ్యత్వచం ఏది?

1) పరాయువు      2) ఉల్బం 

3) అళిందం      4) జరాయువు


12. గర్భాధారణ జరిగిన ఎన్ని వారాలకు జరాయువు ఏర్పడుతుంది?

1) 18    2) 8     3) 12      4) 9 


13. ముష్కాన్ని ఆవరించి ఉండే తంతుయుత కణజాల కవచం-

1) ట్యూనికా ఆల్బుజీనియా    2) ట్యూనికా గ్రనేటా 

3) ట్యూనికా వెజైనాలిస్‌     4) స్పెర్మటా ఆల్బుజీనియా


14. ముష్కాలు ముష్కగోణుల్లోకి జారకుండా ఉండే స్థితి?

1) గైనకోమాస్టియా     2) గైనకోమాస్టిజం 

3) క్రిప్టోర్కిడిజం      4) 1, 2


15. శుక్రకణాల జీవిత కాలం?

1) ఒక రోజు    2) 3 రోజులు 

3) 2 రోజులు     4) ఒక వారం


16. స్త్రీలలో రుతుచక్రం ప్రారంభమవడాన్ని ఏమంటారు?

1) మెనోపాజ్‌     2) రుతువిరతి  

3) మోనార్క్‌      4) 1, 3


17. పిండోత్పత్తి శాస్త్ర పితామహుడు ఎవరు?

1) అరిస్టాటిల్‌      2) వాన్‌బేర్‌ 

3) స్ట్రాస్‌ బర్గర్‌     4) పంచానన్‌ మహర్షి 


18. గుడ్ల తిత్తిలో ఫలదీకరణ జరిపే జీవి..

1) బొద్దింక      2) ఈగ  

3) వానపాము      4) చేపలు 


19. సరోగసీ నియంత్రణ చట్టం ప్రారంభించిన సంవత్సరం?

1) 2021       2) 2022  

3) 2018      4) 2019


20. శిశువులో పాలదంతాల ఉత్పత్తి ఏ వయసులో జరుగుతుంది?

1) 16వ వారం     2) 19వ వారం  

3) 22వ వారం     4) 17వ వారం


21. అమ్నియో సెంటిసిస్‌ను ఎవరు కనుక్కున్నారు?

1) రిచర్డ్‌ డెడ్‌రిక్‌     2) వాన్‌బేర్‌ 

3) స్ట్రాస్‌ బర్గర్‌    4) బెర్నార్డ్‌


22. కిందివాటిని జతపరచండి.

1) పిండోత్పత్తి శాస్త్రపిత  ఎ) వాన్‌ బేర్‌
2) మానవ పిండోత్పత్తి శాస్త్రపిత బి) అరిస్టాటిల్‌
3) మొక్కల పిండోత్పత్తి శాస్త్రపిత సి) అరిస్టాటిల్‌
4) భారత మొక్కల పిండోత్పత్తి శాస్త్రపిత  డి) స్ట్రాస్‌ బర్గర్‌ 

1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి 2) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి  

3) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి 4) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి


23. కింది కవలల్లో రూపరీత్యా, లైంగికంగా ఒకే విధంగా ఉండే కవలలు..

1) సమరూప కవలలు     2) అసమరూప కవలు 

3) సియామీ      4) 1, 3


24. సియామీ కవలలను కనుక్కున్న సంవత్సరం?

1) 1815      2) 1911  

3) 1811      4) 1511 


25. కిందివాటిలో లైంగిక వ్యాధులు..

1) గనేరియా      2) సిఫిలిస్‌  

3) హెర్పిస్‌      4) పైవన్నీ


26. కిందివాటిలో సత్య వాక్యాన్ని గుర్తించండి.

ఎ) లింగ నిర్ధారణలో ముఖ్య పాత్ర వహించే క్రోమోజోమ్‌ y మగవారిలో ఉంటుంది.

బి) గర్భాశయాన్ని తొలగించే ప్రక్రియ - హిస్టరెక్టమీ.

సి) శిశువులో 22వ వారం నుంచి జ్ఞానాంగాల అభివృద్ధి జరుగుతుంది.

డి) రసాయనాలను ఉపయోగించి పురుషుల్లో ప్రత్యుత్పత్తి అవయవాలను నిర్వీర్యం చేయడాన్ని కెమికల్‌ క్యాస్ట్రేషన్‌ అంటారు.

1) ఎ, సి      2) ఎ, బి, సి  

3) ఎ, బి, సి, డి      4) బి, డి 


27. శిశువు జన్మించేందుకు తోడ్పడే హర్మోన్‌?

1) ఆక్సిటోసిన్‌     2) రిలాక్సిన్‌ 

3) ప్రొజెస్టిరాన్‌     4) 1, 2


28. కిందివాటిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి.

1) ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ పౌరుష గ్రంథులకు వస్తుంది.

2) ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ ముష్కాలకు సంబంధించింది.

3) 3 నెలల పిండాన్ని భ్రూణం అంటారు.

4) 1978లో వివాహ వయసు చట్టం చేశారు.


29. జతపరచండి.

  జంతువులు   గర్భావధి కాలం
   1) ఏనుగు    ఎ) 40 రోజులు 
   2) గాడిద    బి) 80 రోజులు
   3) అప్పోజం    సి) 400 రోజులు
   4) జిరాఫీ    డి) 365 రోజులు
   5) కంగారూ    ఇ) 600 రోజులు
   6) ఉడత     ఎఫ్) 12 రోజులు

1) 1-ఇ, 2-డి, 3-ఎఫ్, 4-సి, 5-బి, 6-ఎ

2) 1-ఇ, 2-డి, 3-ఎఫ్, 4-సి, 5-ఎ, 6-బి 

3) 1-ఇ, 2-ఎఫ్, 3-డి, 4-సి, 5-బి, 6-ఎ

4) 1-ఇ, 2-డి, 3-ఎఫ్, 4-ఎ, 5-బి, 6-సి


30. క్షీరదం అయినప్పటికీ గుడ్లు పెట్టే జీవి?

1) ఎఖిడ్నా      2) డక్‌ బిల్డ్‌ ప్లాటిపస్‌ 

3) కంగారూ      4) 1, 2


31. కిందివాటిలో ముర్రుపాలలోని ప్రొటీన్‌?

1) కొలస్ట్రీమ్‌     2) ప్రొలాక్టిన్‌ 

3) రిలాక్సిన్‌     4) 1, 2


32. జతపరచండి.

 1) టైగాన్‌  ఎ) ఆడపులి + మగ సింహం
 2) లైగర్‌  బి) మగ గాడిద + ఆడ గుర్రం
 3)  కోల్ట్‌  సి) ఆడ సింహం + మగ పులి
 4) మ్యూల్‌  డి) మగ గుర్రం + ఆడ గాడిద

1) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి    2) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి

3) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ      4) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ


33. కిందివాటిలో భిన్నమైన దాన్ని గుర్తించండి.

1) వేసెక్టమీ-ఫాలోపియన్‌ నాళాలు కత్తిరించడం.

2) గర్భద్వారంలో అమర్చే సాధనం-కాపర్‌ టీ లూప్‌.

3) స్పెర్మిసైడ్స్‌ - శుక్రకణాలను నాశనం చేయడం.

4) కాంట్రాసెప్షన్‌ - గర్భం రాకుండా ముందు జాగ్రత్త తీసుకోవడం.


34. కిందివాటిలో బ్యాక్టీరియా వల్ల సంభవించే లైంగిక వ్యాధిని గుర్తించండి.

1) హెర్పిస్‌     2) సిఫిలిస్‌ 

3) హెచ్‌ఐవీ     4) ట్రైకోమోనియాసిస్‌


35. ఫలదీకరణ జరిగిన ఎన్నో రోజు ప్రతిస్థాపన ప్రారంభమవుతుంది?

1) 12వ  2) 14వ   3) 6వ   4) 3వ 


36. కింది వాటిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి.

1) గర్భధారణ జరిగిన ఒక నెలకు గుండె ఏర్పడుతుంది.

2) రెండో నెల చివర్లో పిండంలో కాళ్లు, చేతులు  ఏర్పడతాయి.

3) 24 వారాల చివరన కనురెప్పలు, వెంట్రుకలు ఏర్పడతాయి.

4) 12 వారాలకు కేవలం హృదయం మాత్రమే  ఏర్పడుతుంది.


37. మానవుడిలో ఫలదీకరణ జరిగే ప్రదేశం?

1) కలశిక      2) కాలంచిక  

3) గర్భాశయం      4) 1, 2


38. కిందివాటిలో పిండంలో ఏర్పడిన వ్యర్థాలు, వాయువుల రవాణాలో తోడ్పడేది?

1) ఉల్బం      2) ఆలిందం 

3) పరాయువు     4) జరాయువు


39. ఫలదీకరణ అనంతరం hCG ఎన్ని రోజుల  వ్యవధిలో చేస్తారు?

1) 30  2) 15  3) 11 4) 18 


40. నవజాత శిశువు అధ్యయనాన్ని ఏమంటారు?

1) నియోనేటాలజీ     2) ధెరటాలజీ     

3) మమ్మాలజీ       4) 1, 3




సమాధానాలు


1-4; 2-1; 3-3; 4-1; 5-4; 6-1; 7-3; 8-4; 9-3; 10-3; 11-1; 12-3; 13-1; 14-3; 15-2; 16-3; 17-1; 18-3; 19-1; 20-2; 21-1; 22-2; 23-1; 24-3; 25-4; 26-3; 27-4; 28-2; 29-1; 30-4; 31-1; 32-1; 33-1; 34-2;   35-3; 36-4; 37-1; 38-2; 39-3; 40-1.

రచయిత: వట్టిగౌనళ్ల పద్మనాభం 

Posted Date : 03-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌