• facebook
  • whatsapp
  • telegram

నదీ వ్యవస్థ 

పళ్లెం ఆకారంలో మహానది మైదానం!


భారతదేశం ప్రాచీనకాలం నుంచి వందలాది నదులతో అలరారుతోంది. హిమాలయ నదులు, ద్వీపకల్ప నదులు దేశాన్ని సస్య శ్యామలం చేస్తూ సుభిక్షంగా ఉంచుతున్నాయి. నాగరికత, దేశ అభివృద్ధిలో నదులు కీలకంగా నిలిచాయి. ప్రధాన నగరాలు, పుణ్యక్షేత్రాలు, తొలితరం పరిశ్రమలు తదితరాలన్నీ నదుల చెంతనే వెలిశాయి. దేశానికి జీవనాడులుగా భావించే ఈ నదీ వ్యవస్థ నైసర్గిక స్వరూపంపై పోటీ పరీక్షార్థులకు సమగ్ర అవగాహన ఉండాలి. పెద్ద నదులు, ఉపనదులు, వాటి జన్మస్థానాలు, ప్రవాహ మార్గాలు, ప్రవహించే రాష్ట్రాలు, ఏర్పరిచే మైదానాలు, వాటి ఒడ్డున ఉన్న నగరాలు, చారిత్రక ప్రాంతాల గురించి తెలుసుకోవాలి. 

1.    నదుల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు?

1) లిమ్నాలజీ    2) పొటమాలజీ    

3) పెడాలజీ    4) లిథాలజీ


2.     సింధు నది ఉపనదుల్లో పెద్దది ఏది?

1) చినాబ్‌       2) రావి   

3) సట్లెజ్‌       4) జీలం


3.     కిందివాటిలో ఏ నదిపై ఊలర్‌ సరస్సు ఉంది?

1) సింధు     2) జీలం   

3) చినాబ్‌       4) రావి


4.     సింధు ఉపనదుల్లో అతి పొడవైన నది?

1) జీలం      2) చినాబ్‌   

3) రావి       4) సట్లెజ్‌


5.     గంగా నదిని బంగ్లాదేశ్‌లో ఏమని పిలుస్తారు?

1) పద్మ      2) జమున  

3) మేఘన      4) బరాఖి


6.     సింధు నది భారతదేశంలో ఎన్ని కిలోమీటర్లు ప్రవహిస్తుంది?

1) 1054 కి.మీ.     2) 725 కి.మీ 

3) 1114 కి.మీ.     4) 1400 కి.మీ.


7.     కిషన్‌ గంగా నది దేనికి ఉపనది?

1) చినాబ్‌      2) సట్లెజ్‌   

3) జీలం       4) రావి


8.     సింధు నది ఉపనదుల్లో భారతదేశంలో మాత్రమే ప్రవహించే నది?

1) జీలం       2) చినాబ్‌  

3) రావి      4) బియాస్‌


9.     కిందివాటిలో గంగా నది కుడి వైపు ఉపనది కానిది? 

1) యమున      2) సోన్‌   

3) పున్‌పున్‌       4) కోసి


10. గంగా నది ఉపనదుల్లో పొడవైంది?

1) ఘాఘ్రా         2) గండక్‌   

3) కోసి      4) యమున


11. ఏ రాష్ట్రంలో గంగానది అధిక దూరం ప్రవహిస్తుంది?

1) బిహార్‌     2) పశ్చిమ బెంగాల్‌ 

3) ఉత్తర్‌ప్రదేశ్‌     4) ఉత్తరాఖండ్‌


12. కింది ఏ నది ఒడ్డున అయోధ్య ఉంది?

1) సరయు      2) గోమతి  

3) ఘాఘ్రా     4) యమున


13. శ్రీనగర్‌ పట్టణం ఏ నది ఒడ్డున ఉంది?

1) చినాబ్‌       2) జీలం   

3) రావి      4) బియాస్‌


14. కిందివాటిలో జిమ్‌ కార్బెట్‌ జాతీయ పార్కు మీదుగా ప్రవహించే నది?    

1) ఘాఘ్రా     2) కోసి  

3) రాంగంగా      4) యమున


15. యమునా నది పొడవు సరాసరి ఎన్ని కిలోమీటర్లు?

1) 1276 కి.మీ.     2) 1376 కి.మీ. 

3) 1450 కి.మీ.     4) 725 కి.మీ.


16. కిందివాటిలో భిన్నమైన నదిని గుర్తించండి.

1) గంగా నది     2) సింధు నది 

3) గోదావరి నది     4) బ్రహ్మపుత్ర నది


17. కిందివాటిలో బిహార్‌ దుఖఃదాయని అని ఏ నదిని పిలుస్తారు?

1) కోసి      2) గండక్‌  

3) ఘాఘ్రా       4) యమున


18. గంగా నది పరీవాహక ప్రాంతం అత్యధికంగా ఏ రాష్ట్రంలో ఉంటుంది?

1) బిహార్‌     2) ఉత్తర్‌ప్రదేశ్‌ 

3) పశ్చిమ బెంగాల్‌     4) ఉత్తరాఖండ్‌


19. కిందివాటిలో గంగా నది ఎడమవైపు నది కానిది గుర్తించండి.

1) గండక్‌       2) కోసి   

3) ఘాఘ్రా       4) యమున


20. బ్రహ్మపుత్ర నది సరాసరి ఎన్ని కిలోమీటర్లు ప్రవహిస్తుంది?

1) 2400 కి.మీ.     2) 2900 కి.మీ. 

3) 2100 కి.మీ.     4) 2500 కి.మీ.


21. కింది ఏ నది ఒడ్డున లఖ్‌నవూ నగరం ఉంది?

1) సరయు      2) ఘాఘ్రా   

3) గోమతి     4) రాంగంగా


22. బ్రహ్మపుత్ర నదిని బంగ్లాదేశ్‌లో ఏమని పిలుస్తారు?

1) పద్మ      2) జమున  

3) భాగీరథి      4) జాహ్నవి


23. బ్రహ్మపుత్ర నదిని టిబెట్‌లో ఏమని పిలుస్తారు?

1) సియాంగ్‌      2) సాంగ్‌ పో 

3) దిహంగ్‌     4) బుర్లాంగ్‌


24. బ్రహ్మపుత్ర నదికి ఎడమవైపు ఉన్న నది-

1) సంకోష్‌     2) లోహిత్‌ 

3) కామెంగ్‌     4) మానస్‌


25. కిందివాటిలో ఎరుపు నది అని దేన్ని పిలుస్తారు?

1) గంగ      2) గండక్‌ 

3) బ్రహ్మపుత్ర      4) యమున 


26. కింది ఏ నదిని ‘బెంగాల్‌ దుఃఖదాయని’ అని పిలుస్తారు?

1) హుగ్లీ    2) దామోదర్‌ 

3) గండక్‌     4) సోన్‌


27. అలకనంద, పిండార్‌ నదులు ఏ ప్రాంతం వద్ద కలుస్తాయి?

1) విష్ణు ప్రయాగ     2) రుద్ర ప్రయాగ 

3) కర్ణ ప్రయాగ     4) దేవ ప్రయాగ


28. కిందివాటిలో నారాయణి నది అని దేన్ని పిలుస్తారు?

1) కోసి       2) ఘాఘ్రా   

3) యమున      4) గండక్‌


29. జాతీయ జలమార్గం-1 ఏ నదిపై ఉంది?

1) గోదావరి     2) బ్రహ్మపుత్ర 

3) మహానది     4) గంగ


30. కిందివాటిలో కర్కటరేఖను రెండుసార్లు ఖండించే నది?

1) సబర్మతి     2) చంబల్‌ 

3) మహానది     4) సోన్‌


31. కిందివాటిలో భిన్నమైన నదిని గుర్తించండి.

1) గోదావరి      2) కృష్ణా  

3) కావేరి      4) నర్మద


32. అలియబెట్‌ అనే దీవి ఏ నది వల్ల ఏర్పడింది?

1) నర్మద      2) తపతి  

3) గోదావరి      4) కృష్ణా


33. కింది ఏ జలపాతాన్ని ‘క్లౌడ్‌ ఆఫ్‌ మిస్ట్‌’ అంటారు?

1) ధువన్‌ ధార     2) సహస్ర ధార 

3) కపిల ధార     4) జోగ్‌


34. ‘ఉజ్జయిని’ ఏ నది ఒడ్డున ఉంది?

1) యమున      2) చంబల్‌  

3) క్షిప్ర      4) బెట్వా


35. ‘పంచనదుల రాష్ట్రం’ అంటే ఏది?

1) జమ్ము-కశ్మీర్‌     2) ఉత్తర్‌ప్రదేశ్‌ 

3) పంజాబ్‌     4) ఉత్తరాఖండ్‌


36. కిందివాటిలో పూర్వవర్తిత నది కానిది?

1) సింధు     2) సట్లెజ్‌ 

3) బ్రహ్మపుత్ర     4) చంబల్‌


37. ఏ నదిని ‘ఇండియన్‌ రైన్‌’ అని పిలుస్తారు? 

1) గంగ     2) కృష్ణా  

3) గోదావరి      4) సింధు


38. కిందివాటిలో గోదావరి నది ఎడమ వైపు ఉన్న ఉపనది కానిది? 

1) మంజీరా    2) వార్దా  

3) ఇంద్రావతి     4) శబరి


39. కిందివాటిలో కావేరి ఉపనదుల్లో పొడవైన నది?

1) భవాని     2) కబిని 

3) ఆర్కావతి     4) హేమావతి


40. కిందివాటిలో పినాకిని నది అంటే?

1) కృష్ణా      2) గోదావరి 

3) పెన్నా     4) కావేరి


41. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం ఏ నది ఒడ్డున ఉంది?

1) పాపాగ్ని         2) చిత్రావతి      

3) స్వర్ణముఖి       4) పాలర్‌


42. కింది ఏ నది పళ్లెపు ఆకారం ఉండే మైదానాన్ని కలిగి ఉంటుంది?

1) గోదావరి      2) మహానది   

3) కృష్ణా          4) పెన్నా


43. ‘సూరత్‌’ ఏ నది ఒడ్డున ఉంది?

1) నర్మద      2) మహి   

3) సబర్మతి      4) తపతి


44. రూర్కెలా ఇనుము - ఉక్కు కర్మాగారం ఏ నది ఒడ్డున ఉంది?

1) సువర్ణరేఖ          2) బ్రాహ్మణి      

3) మహానది          4) సోన్‌


45. కిందివాటిలో మత్స్యకుండల నది అంటే?

1) నాగావళి           2) వంశధార        

3) మాచ్‌ఖండ్‌           4) బ్రాహ్మణి


46 ‘మధురై’ ఏ నది ఒడ్డున ఉంది?

1) పాలర్‌  2) కావేరి  3) వైగై  4) పెరియార్‌


47. ‘దుర్గాపుర్‌’ ఏ నది ఒడ్డున ఉంది?

1) బ్రాహ్మణి       2) దామోదర్‌  

3) సువర్ణరేఖ      4) హుగ్లీ


48. తిరుచిరాపల్లి ఏ నది ఒడ్డున ఉంది?

1) కావేరి      2) వైగై  

3) భవాని      4) ఆర్కావతి 


49. కిందివాటిలో ద్వీపకల్ప జీవనది అంటే?

1) గోదావరి  2) కృష్ణా    3) పెన్నా 4) కావేరి


50. భారతదేశం ద్వారా ప్రవహించే నదుల్లో పొడవైంది?

1) సింధు  2) సట్లెజ్‌  3) బ్రహ్మపుత్ర 4) గంగ


51. గంగానది అతి తక్కువ దూరం ఏ రాష్ట్రంలో ప్రవహిస్తుంది? 

1) ఉత్తరాఖండ్‌     2) బిహార్‌ 

3) పశ్చిమ బెంగాల్‌     4) ఉత్తర్‌ప్రదేశ్‌ 


52. సింధునది ఉపనదుల్లో భిన్నమైంది- 

1) ష్యాక్‌      2) గిల్గిత్‌  

3) ఖుర్రం      4) కిషన్‌ గంగా 


53. జబల్‌పుర్‌ ఏ నది ఒడ్డున ఉంది? 

1) తపతి  2) నర్మద   3) మహి  4) సబర్మతి 


54. ఏ నదిని ‘మీనాంబరం’ నది అని కూడా పిలుస్తారు? 

1) కావేరి   2) కృష్ణా   3) మంజీరా  4) దిండి 


55. ఏ నదీ జలాలను భారతదేశంలో అత్యధికంగా వినియోగిస్తున్నారు? 

1) గంగ   2) గోదావరి  3) కావేరి  4) కృష్ణా 


56. ‘కవుల నది’ అని ఏ నదిని పిలుస్తారు? 

1) గంగ  2) గోదావరి  3) కృష్ణా  4) మహానది 


57. ‘వితస్థ నది’ అని ఏ నదికి పేరు?  

1) చినాబ్‌   2) జీలం  3) రావి  4) బియాస్‌ 


58. ఏ నదిని అర్గీకియా నది అని వ్యవహరిస్తారు? 

1) జీలం  2) యమున 3) సట్లెజ్‌  4) బియాస్‌ 


59. ‘లుథియానా’ ఏ నది తీరాన ఉంది? 

1) రావి  2) చినాబ్‌  3) సట్లెజ్‌  4) బియాస్‌


60. ‘సాంచి’ ఏ నది తీరాన ఉంది? 

1) చంబల్‌      2) బెట్వా 

3) కెన్‌      4) సోన్‌  


సమాధానాలు


1-2; 2-1; 3-2; 4-4; 5-1; 6-3; 7-3; 8-4; 9-4; 10-4; 11-3; 12-1; 13-2; 14-3; 15-2; 16-3; 17-1; 18-2; 19-4; 20-2; 21-3; 22-2; 23-2; 24-2; 25-3; 26-2; 27-3; 28-4; 29-4; 30-3; 31-4; 32-1; 33-1; 34-3; 35-3; 36-4; 37-3; 38-1; 39-2; 40-3; 41-3; 42-2; 43-4; 44-2; 45-3; 46-3; 47-2; 48-1; 49-4; 50-3; 51-1; 52-4;   53-2; 54-4; 55-3; 56-2; 57-2; 58-4; 59-3; 60-2.


రచయిత: బండ్ల శ్రీధర్‌

Posted Date : 12-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌