• facebook
  • whatsapp
  • telegram

సంధులు

నిత్యం.. వికల్పం.. అన్యకార్యం బహుళం!



రెండు పదాల కలయికే ‘సంధి’. అంటే వర్ణాలు, శబ్దాలను కలిపి పలకడంగానూ లేదా అచ్చుల మధ్య కలయిక, హల్లుల మధ్య కలయికగానూ చెప్పవచ్చు. పూర్వపద స్వరాలకు పరస్వరం ఏకాదేశమవడమే సంధి సూత్రం. తెలుగు భాష, పదాల అమరిక, వాక్యనిర్మాణం, వ్యాకరణంపై పట్టు కోసం సంస్కృత, తెలుగు సంధుల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. విడిగా ఒక్కో సంధి సూత్రంతో పాటు సంబంధిత ఉదాహరణలు, ఇచ్చిన పదంలోని సంధిని సులువుగా గుర్తించగలిగిన పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి.


1. పట్టపగలు నిద్ర ఆరోగ్యానికి మంచిది కాదు.        

  గీత గీసిన పదం ఏ సంధి?

1) ఉత్వ సంధి     2) త్రిక సంధి 

3) ఆమ్రేడిత సంధి     4) గుణ సంధి


2. ‘శ్రీమంతురాలు’ - విసంధి రూపకం?

1) శ్రీమంతు + రాలు     2) శ్రీమంత + ఆలు 

3) శ్రీమంత + రాలు     4) శ్రీమంతు + ఆలు


3. ఆ, ఈ, ఏ అనే సర్వనామాలు...

1) త్రికాలు     2) గుణాలు 

3) యణ్ణులు     4) అనునాసికాక్షరాలు


4. ‘శ్రావణాభ్రము’ ఏ సంధి?

1) అత్వ సంధి     2) గుణ సంధి 

3) సవర్ణదీర్ఘ సంధి     4) యణాదేశ సంధి


5. ‘ఘనౌషధి’ - విడదీయగా ఏర్పడే రూపం?

1) ఘన + ఔషధి     2) ఘన + ఓషధి 

3) ఘనౌ + ఔషధి     4) ఘనౌ + ఓషధి


6. విద్యావంతులే ఎక్కాలంలోనైనా కీర్తించబడతారు.  గీత గీసిన పదాన్ని విడదీయండి. 

1) ఎక్క + కాలం     2) ఎక్కా + కాలం 

3) ఎ + కాలం     4) ఏ + కాలం


7. సీతను అందరూ బుద్ధిమంతురాలు అంటారు.    గీత గీసిన పదంలోని సంధి?

1) నుగాగమ సంధి     2) టుగాగమ సంధి 

3) దుగాగమ సంధి     4) రుగాగమ సంధి


8. మధురలోని రమ్యోద్యానములు చూపరుల మనసులను ఆకట్టుకుంటాయి. 

 గీత గీసిన పదంలోని సంధి?

1) సవర్ణదీర్ఘ సంధి     2) గుణ సంధి 

3) యణాదేశ సంధి     4) వృద్ధి సంధి


9. అచ్చునకు ఆమ్రేడితం పరమైనప్పుడు వచ్చే సంధి...

1) తరచుగా వస్తుంది     2) బహుళం 

3) విభాషనం     4) నిత్యం


10. స కార త వర్గములకు శకార చ వర్గములు పరమైనప్పుడు శకార చ వర్గములు ఆదేశమవుతాయి - ఈ సూత్రం ఏ సంధికి సంబంధించింది?

1) ఆమ్రేడిత సంధి     2) అనునాసిక సంధి 

3) జశ్త్వ సంధి     4) శ్చుత్వ సంధి


11. అత్తునకు సంధి?

1) నిత్యం     2) వైకల్పికం 

3) ప్రవృత్తి     4) బహుళం


12. ‘రాఁగలదు’ - ఇందులోని సంధి ఏది?

1) నుగాగమ సంధి     2) సరళాదేశ సంధి 

3) యడాగమ సంధి     4) పుంప్వాదేశ సంధి


13. ‘ఊరూరు’ - ఏ సంధికి ఉదాహరణ?

1) అత్వ సంధి     2) ఇత్వ సంధి 

3) ఉత్వ సంధి     4) ఆమ్రేడిత సంధి


14. ఈ వీరుల ఉద్బోధార్థం - ఈ పంక్తిలో గీత గీసిన పదం ఏ సంధి?

1) సవర్ణదీర్ఘ సంధి     2) గుణ సంధి 

3) యణాదేశ సంధి     4) వృద్ధి సంధి


15. అత్తు అంటే... 

1) హ్రస్వమైన ఇకారం     2) హ్రస్వమైన ఉకారం 

3) హ్రస్వమైన అకారం     4) హ్రస్వమైన రకారం


16. ‘ఆసువోయుట’లోని సంధి?

1) సరళాదేశ సంధి     2) రుగాగమ సంధి 

3) గసడదవాదేశ సంధి     4) పుంప్వాదేశ సంధి


17. కోపోద్రిక్తులైన కార్యకర్తలను హింసకు తెగబడకుండా కట్టడి చేశారు. గీత గీసిన పదంలోని సంధుల క్రమం

1) సవర్ణదీర్ఘ సంధి, గుణ సంధి     2) గుణ సంధి, ఉత్వ సంధి

3) గుణ సంధి, అత్వ సంధి     4) సవర్ణదీర్ఘ సంధి, అత్వ సంధి


18. టుగాగమ సంధిలో ఆగమంగా వచ్చే వర్ణం?

1) ట్‌    2) టి    3) టు     4) టూ


19. ‘అలరుఁబోడి’ - విసంధి రూపం?

1) అలరు + బోడి     2) అలరు + పోడి

3) అలరు + పోడిమి     4) అలరు + మేను


20. ప్రథమ మీది పరుషములకు గసడదవలు బహుళమవుతాయి. ఈ సూత్రానికి సరిపడే ఉదాహరణ-

1) నిజముదెలిసి     2) కూరగాయలు

3) రారుగదా     4) టక్కుడెక్కులు


21. ‘మనకెందుకు’ విసంధి రూపాన్ని గుర్తించండి.

1) మనకు + ఎందుకు     2) మనకున్‌ + ఎందుకు

3) మనకే + ఎందుకు     4) మన + కెందుకు


22. గర్వోన్నతి వల్ల ఆత్మీయులు దూరం అవుతారు. ఓ అనే అచ్చు ఏ స్థానంలో వచ్చింది?

1) అ, ఓ    2) అ, ఒ   3) అ, ఉ  4) ఆ, ఓ


23. రసైక పదాన్ని విడదీయగా

1) రస + ఐక    2) రసై + క

3) రస + ఏక    4) రసా + ఐక


24. స్వాగతం పదాన్ని విడదీయగా

1) స్వా + ఆగతం     2) సా + ఆగతం

3) స్వాగ + అతం     4) సు + ఆగతం


25. ‘ప్రపంచమంతా’ అనే పదంలోని సంధి?

1) అత్వ సంధి     2) ఇత్వ సంధి    

3) ఉత్వ సంధి     4) సరళాదేశ సంధి


26. వృద్ధులు అంటే

1) ఐ, ఔ, అర్‌     2) ఐ, ఓ, ఆర్‌

3) ఐ, ఓ, ఏ     4) ఐ, ఔ, ఆర్‌


27. మృద్ఘటం - పదంలోని సంధి?

1) జశ్త్వ సంధి      2) శ్చుత్వ సంధి

3) శుత్వ సంధి     4) అనునాసిక సంధి


28. ఒక వ్యాకరణ కార్యం నిత్యంగా రావడం, రాకపోవడం, వికల్పంగా రావడం, అన్యకార్యం రావడాన్ని ఏమంటారు?

1) ఆమ్రేడితం     2) ఆగమం     

3) బహుళం     4) పైవన్నీ


29. పిత్రార్జితం - పదంలోని సంధి

1) సవర్ణదీర్ఘ సంధి     2) యణాదేశ సంధి

3) పరరూప సంధి     4) గుణ సంధి


30. రుగాగమ సంధి ఏ సమాసంలో జరుగుతుంది?

1) తత్పురుష సమాసం     2) రూపక సమాసం

3) బహువ్రీహి సమాసం     4) కర్మధారయ సమాసం


31. పుణ్యాంగనయు బిక్ష యిడదయ్యెఁ గటా! 

   - గీత గీసిన పదం ఏ సంధి?

1) సవర్ణదీర్ఘ సంధి     2) అత్వ సంధి

3) ఇత్వ సంధి     4) గుణ సంధి


32. ‘నట్టనడుమ’ - ఏ సంధి?

1) ఆమ్రేడిత సంధి     2) త్రిక సంధి

3) ద్విరుక్తటకార సంధి     4) టుగాగమ సంధి


33. ఆ + ఆదిమశక్తి - కలిపి రాయండి.

1) అయ్యాదిమ శక్తి     2) అ ఆదిమ శక్తి

3) అయాదిమశక్తి     4) ఆయాదిమ శక్తి


34. వినవయ్య యున్నయూరు 

గీత గీసిన పదం ఏ సంధి?

1) యణాదేశ సంధి     2) యడాగమ సంధి 

3) ఉత్వ సంధి     4) ఆమ్రేడిత సంధి


35. ఇవ్వీటి మీద నాగ్రహము తగునె - గీత గీసిన పదం ఏ సంధి?

1) ఇత్వ సంధి     2) సవర్ణదీర్ఘ సంధి 

3) త్రిక సంధి     4) యడాగమ సంధి


36. మరుత్‌ + నందనుడు సీత జాడ కనిపెట్టాడు - గీత గీసిన పదాలు ఎలా కలపాలి?

1) మరున్నందనుడు     2) మరుత్నందనుడు 

3) మరునందనుడు     4) మరినందనుడు


37. అజంతా గుహలు చూసి ఎంతో తన్మయము చెందాను - ‘తన్మయము’ను విడదీయండి.

1) తన్‌ + మయము     2) తద్‌ + మయము 

3) తత్‌ + మయము     4) త + న్మయము


38. ప్రధానమంత్రి వివిధ దేశాలు పర్యటించారు. ‘దేశాలు’ను విడదీసే విధం తెలపండి.

1) దేశ + ములు     2) దేశాల + లు 

3) దేశా + ఆలు     4) దేశము + లు


39. అనునాసిక సంధికి ఉదాహరణ-

1) జోలఁబాడిన     2) భవదాజ్ఞ 

3) రాణ్మణి     4) పుణ్యాంగన


40. నాన్న కథల పుస్తకాలు తెచ్చారు.  - గీత గీసిన పదం ఏ సంధి?

1) సవర్ణదీర్ఘ సంధి     2) లులనల సంధి 

3) అకార సంధి     4) త్రిక సంధి


41. ‘యణ్ణులు’ అని వేటిని అంటారు?

1) ఇ, ఉ, ఋ, లు       2) ఏ, ఓ, ఆర్‌ 

3) ఆ, ఈ, ఏ     4) య, వ, ర, ల


42. ప్రతిజీవికి ఒక్కో శరీరాకృతి ఉంటుంది.  - గీత గీసిన పదంలోని సంధి-

1) సవర్ణదీర్ఘ సంధి     2) గుణ సంధి 

3) వృద్ధి సంధి     4) యణాదేశ సంధి


43. చదరంగంలో ఆనంద్‌ ప్రత్యర్థి పై విజయం సాధించాడు. గీత గీసిన పదం విసంధి రూపం గుర్తించండి.

1) ప్రత్య + అర్థి     2) ప్రతి + అర్థి 

3) ప్రత్యా + అర్థి     4) ప్రతీ + అర్థి


44. ఒక్కొక్కప్పుడు ముఖ్యమైన విషయాలు జ్ఞప్తికి రావు - గీత గీసిన పదంలోని సంధి?

1) ఆమ్రేడిత సంధి     2) ఇత్వ సంధి 

3) సవర్ణదీర్ఘ సంధి     4) యణాదేశ సంధి


45. నుగాగమ సంధి ఏ సమాసంలో జరుగుతుంది?

1) ద్వంద్వ సమాసం     2) ద్విగు సమాసం 

3) బహువ్రీహి సమాసం 4) షష్టీ తత్పురుష సమాసం


46. నీదు కరుణ - ఏ సంధి?

1) సవర్ణదీర్ఘ సంధి     2) త్రిక సంధి 

3) దుగాగమ సంధి     4) టుగాగమ సంధి


47. పాపాలు - ఏ సంధి?

1) లులనల సంధి     2) నుగాగమ సంధి 

3) రుగాగమ సంధి     4) సవర్ణదీర్ఘ సంది


48. హైదరాబాద్‌లోని విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఒకటి. - గీత గీసిన పదం ఏ సంధికి ఉదాహరణ?

1) వృద్ధి సంధి     2) యణాదేశ సంధి 

3) గుణ సంధి     4) సవర్ణదీర్ఘ సంధి


49. నా జీవితాన్నంతా దేశసేవకే వినియోగించాలనుకుంటున్నాను. - గీత గీసిన పదం ఏ సంధి?

1) అత్వ సంధి     2) ఉత్వ సంధి 

3) ఇత్వ సంధి     4) సవర్ణదీర్ఘ సంధి


50. భాగ్యోదయం - ఏ సంధికి ఉదాహరణ?

1) గుణ సంధి     2) యణాదేశ సంధి 

3) వృద్ధి సంధి     4) ఉత్వ సంధి


 


సమాధానాలు

1-3, 2-2, 3-1, 4-3, 5-2, 6-4, 7-4, 8-2, 9-1, 10-4, 11-4, 12-2, 13-4, 14-1, 15-3, 16-3, 17-2, 18-1, 19-4, 20-1, 21-2, 22-3, 23-3, 24-4, 25-3, 26-4, 27-1, 28-3, 29-2, 30-4, 31-1, 32-1, 33-1, 34-2, 35-3, 36-1, 37-3, 38-4, 39-3,   40-2, 41-4, 42-1, 43-2, 44-1, 45-4, 46-3, 47-1, 48-4, 49-3, 50-1. 
 

Posted Date : 05-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌