• facebook
  • whatsapp
  • telegram

ఆంగ్లేయుల అరాచకాలపై సైనికుల సమరం!

సిపాయిల తిరుగుబాటు


 

బ్రిటిష్‌ వలసపాలన, సామ్రాజ్యవాదంపై భారతదేశంలో జరిగిన తొలి విప్లవోద్యమంగా సిపాయిల తిరుగుబాటు చరిత్రలో నిలిచిపోయింది. ఆంగ్లేయులపై మనవాళ్లలో ఉన్న వ్యతిరేకతను మొదటిసారిగా ప్రపంచానికి చాటిన ఘటన అది. తిరుగుబాటుదారులతో ప్రజలు, స్వదేశీ రాజులు, జమీందారులు జత కలిశారు. ఆశయ సాధనలో విఫలమైనప్పటికీ, వలస పాలనా విధానాలపై తీవ్రమైన తిరస్కరణను ప్రదర్శించి, జనంలో జాతీయభావాల వ్యాప్తికి దోహదపడింది. ఈ పోరాటం మొదటి నుంచి ముగింపు వరకు జరిగిన పరిణామాలు, అందులోని కీలకమైన వ్యక్తుల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. ఈ పోరాటం దేశంలో రాజకీయంగా, పాలనాపరంగా తెచ్చిన మార్పులు, తదనంతరం జాతీయోద్యమానికి ఇచ్చిన స్ఫూర్తిని అర్థం చేసుకోవాలి.

1. సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైన ప్రాంతం?

1) బారక్‌పుర్‌  2) ఢిల్లీ  3) మీరట్‌  4) అంబాల


2. సిపాయిల తిరుగుబాటును ‘మొదటి స్వతంత్ర సంగ్రామం’ అన్న జాతీయ నాయకుడు?

1) వి.డి.సావర్కర్‌       2) బాలకృష్ణ చాపేకర్‌   

3) బాలగంగాధర్‌ తిలక్‌     4) బిపిన్‌ చంద్రపాల్‌


3. సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైన సంవత్సరం?

1) 1857, మార్చి       2) 1857, మే   

3) 1857, జూన్‌       4) 1857, జనవరి


4. 1857 ప్రజా తిరుగుబాటు సమయంలో ‘భారతదేశ చక్రవర్తి’గా ఎవరిని ప్రకటించారు?

1) షుజా-ఉద్‌-దౌలా       2) నానాసాహెబ్‌   

3) బహదూర్‌షా జాఫర్‌     4) తాంతియా తోపే


5. సిపాయిల తిరుగుబాటుకు తక్షణ కారణం?

1) బహదూర్‌షా జాఫర్‌ను చిట్టచివరి మొఘల్‌ చక్రవర్తిగా ప్రకటించడం.

2) సిపాయిలకు జీతాలు పెంచకపోవడం.

3) స్వదేశీ రాజ్యాలను ఆక్రమించడం.

4) ఆవు, పంది కొవ్వు పూసిన తూటాలను తీసుకురావడం.


6. మీరట్‌ తరువాత సిపాయిల తిరుగుబాటు ఏ ప్రాంతానికి విస్తరించింది?

1) ఢిల్లీ  2) లక్నో  3) ఝాన్సీ  4) కాన్పూర్‌


7. ఢిల్లీలో సిపాయిల తిరుగుబాటును అణచివేసిన బ్రిటిష్‌ అధికారి?

1) కాంప్‌బెల్‌ 2) హడ్సన్‌ 3) లారెన్స్‌ 4) జాన్సన్‌


8. కాన్పుర్‌లో సిపాయిల తిరుగుబాటు నాయకుడు?

1) తాంతియా తోపే       2) నానాసాహెబ్‌   

3) మౌల్వీ అహ్మదుల్లా       4) కున్వర్‌ సింగ్‌


9. కిందివారిలో ఎవరు సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్నారు?

1) రైతులు       2) జమీందార్లు   

3) రాజులు       4) పైవారంతా


10. తుర్రేబాజ్‌ ఖాన్‌ ఏ ప్రాంతంలో సిపాయిలకు నాయకత్వం వహించాడు?

1) హైదరాబాద్‌  2) ఢిల్లీ  3) కడప  4) బరేలి


11. 1857 తిరుగుబాటుతో ఎవరి పాలన ముగిసింది?

1) ఈస్ట్‌ ఇండియా కంపెనీ   2) బ్రిటిష్‌   

3) స్వదేశీ రాజ్యాలు          4) ఏదీకాదు


12. మంగళ్‌ పాండే ఏ ప్రాంతంలో బ్రిటిష్‌ అధికారిని కాల్చి చంపాడు?

1) కలకత్తా       2) బారక్‌పుర్‌   

3) సంబల్‌పుర్‌       4) బొంబాయి


13. తాంతియా తోపే అసలు పేరు?

1) మౌల్వీ అహ్మదుల్లా       2) నానాసాహెబ్‌   

3) రామచంద్ర పాండురంగ       4) మొదటి బాజీరావ్‌


14. చివరి మొఘల్‌ చక్రవర్తి ఎవరు?

1) జహందర్‌ షా    2) మొదటి బహదూర్‌ షా   

3) ఫరూక్‌ సియర్‌     4) రెండో బహదూర్‌ షా


15. నానాసాహెబ్‌ ఎవరి దత్త కుమారుడు?

1) మొదటి బాజీరావ్‌       2) దామోదర్‌ రావ్‌   

3) గంగాధర్‌ రావ్‌       4) రెండో బాజీరావ్‌


16. రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన గవర్నర్‌ జనరల్‌?

1) వెల్లస్లీ 2) డల్హౌసీ 3) కానింగ్‌ 4) వెల్లింగ్‌టన్‌


17. భారతదేశంలో బ్రిటిష్‌ ప్రభుత్వ పాలన ఎప్పుడు ప్రారంభమైంది?

1) 1858  2) 1857  3) 1856  4) 1854


18. బేగం హజ్రత్‌ మహల్‌ ఏ ప్రాంతానికి రాణి?

1) అవధ్‌  2) దిల్లీ   3) ఝాన్సీ   4) మీరట్‌


19. రెండో బహదూర్‌ షాను సిపాయిల తిరుగుబాటు అనంతరం ఏ జైలుకి పంపారు?    

1) కలకత్తా       2) అండమాన్‌   

3) రంగూన్‌       4) మద్రాస్‌


20. కిందివారిలో నానాసాహెబ్‌ అనుచరుడు?

1) తాంతియా తోపే       2) మౌల్వీ అహ్మదుల్లా  

3) కున్వర్‌ సింగ్‌       4) తుర్రేబాజ్‌ ఖాన్‌


21. కిందివారిలో సిపాయిల తిరుగుబాటులో పాల్గొనని వ్యక్తిని గుర్తించండి.

1) నానాసాహెబ్‌       2) రెండో బాజీరావ్‌   

3) తాంతియా తోపే       4) కున్వర్‌ సింగ్‌


22. సిపాయిల తిరుగుబాటు అనంతరం జరిగిన ముఖ్య పరిణామం?

1) ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలన రద్దు    2) వైస్రాయ్‌ నియామకం

3) భారత రాజ్య వ్యవహారాల కార్యదర్శి అనే పదవిని సృష్టించడం    4) పైవన్నీ


23. లక్నోలో సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు?

1) లక్ష్మీబాయి       2) హజరత్‌ మహల్‌   

3) అవంతీ బాయి       4) పైవారంతా


24. కిందివాటిలో సిపాయిల తిరుగుబాటు జరిగిన ప్రాంతం, ఆ ప్రాంత నాయకుడికి సంబంధించి సరికానిదాన్ని గుర్తించండి.

1) ఫైజాబాద్‌ - మౌల్వీ అహ్మదుల్లా    2) బరేలి - భక్త్‌ ఖాన్‌

3) హైదరాబాద్‌ - తుర్రేబాజ్‌ ఖాన్‌ 4) కాన్పూర్‌ - తాంతియా తోపే


25. సిపాయిల తిరుగుబాటు సమయంలో బ్రిటిష్‌ గవర్నర్‌ జనరల్‌ ఎవరు?

1) డల్హౌసీ       2) కానింగ్‌   

3) విలియం బెంటిక్‌       4) లిట్టన్‌


26. సిపాయిల తిరుగుబాటు సమయంలో అరెస్టయి చివరిగా ఉరిశిక్షకు గురైన వ్యక్తి?

1) తాంతియా తోపే       2) కున్వర్‌ సింగ్‌   

3) తుర్రేబాజ్‌ ఖాన్‌       4) నానాసాహెబ్‌


27. సిపాయిల తిరుగుబాటు ఉద్ధృతంగా మారడానికి ప్రధాన కారకుడు ఎవరు?

1) నానాసాహెబ్‌       2) భక్త్‌ ఖాన్‌   

3) బహదూర్‌ షా       4) లక్ష్మీబాయి


28. 1857 సిపాయిల తిరుగుబాటు మొదలైన రోజు?

1) ఆదివారం       2) సోమవారం   

3) మంగళవారం       4) బుధవారం


29. సిపాయిల తిరుగుబాటును ఝాన్సీ ప్రాంతంలో అణచివేసిన బ్రిటిష్‌ అధికారి?

1) కాంప్‌బెల్‌       2) టేలర్‌   

3) లారెన్స్‌       4) జనరల్‌ నీల్‌


30. భారతదేశానికి మొదటి వైస్రాయ్‌ ఎవరు?

1) లార్డ్‌ కానింగ్‌       2) లార్డ్‌ వెల్లింగ్‌టన్‌   

3) లార్డ్‌ మౌంట్‌బాటన్‌     4) లార్డ్‌ రిప్పన్‌


31. ‘దుష్పరిపాలన’ అనే కారణంతో ఆక్రమణకు గురైన భారత రాజ్యం?    

1) ఝాన్సీ 2) నాగ్‌పుర్‌     3) అవధ్‌  4) మైసూర్‌


32. రెండో బహదూర్‌ షా భార్య ఎవరు?

1) జీనత్‌ మహల్‌       2) హజ్రత్‌ మహల్‌   

3) రోహియా షెకావత్‌       4) ఎవరూ కాదు


33. సిపాయిల తిరుగుబాటును ప్రజా తిరుగుబాటు అనడానికి కారణం?

1) భారతీయ రాజులు, రాణులు పాల్గొనడం.

2) సిపాయిలు ప్రధాన పాత్ర పోషించడం.

3) సిపాయిల తిరుగుబాటులో భారతీయులు విజయం సాధించడం.

4) సిపాయిల తిరుగుబాటులో భారతీయులు ఐక్యంగా పోరాడటం.


34. భారతదేశానికి మొదటి ‘సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌’ ఎవరు?

1) కానింగ్‌       2) చార్లెస్‌ ఉడ్‌   

3) స్టాన్లీ       4) విలియం


35. బిహార్‌లో సిపాయిలకు నాయకత్వం వహించిన వారు?

1) కున్వర్‌ సింగ్‌       2) నానాసాహెబ్‌   

3) తాంతియా తోపే       4) భక్త్‌ ఖాన్‌


36. తాంతియా తోపేను ఏ సంవత్సరంలో ఉరి తీశారు?

1) 1857  2) 1858  3) 1859  4) 1860


37. సిపాయిల తిరుగుబాటులో ప్రభు వర్గం పాల్గొనేందుకు ప్రధాన కారణం?

1) భూమిశిస్తు విధానాలు       2) సామాజిక సంస్కరణలు

3) రాజ్య సంక్రమణ సిద్ధాంతం       4) సైన్య సహకార పద్ధతి


38. బ్రిటిష్‌ ప్రభుత్వం నియమించిన ‘సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌’ ఏ హోదాను కలిగి ఉంటాడు?

1) గవర్నర్‌ జనరల్‌ హోదా  2) వైస్రాయ్‌ హోదా   

3) కేబినెట్‌ హోదా         4) రాజు/రాణి హోదా


39. కిందివారిలో గొప్ప గెరిల్లా యుద్ధవీరుడు ఎవరు?

1) తాంతియా తోపే       2) తుర్రేబాజ్‌ ఖాన్‌       

3) మౌల్వీ అహ్మదుల్లా       4) మాన్‌ సింగ్‌


40. కిందివాటిలో సరికాని దానిని గుర్తించండి.

1) సిపాయిల్లో అసంతృప్తి ఈ తిరుగుబాటుకు కారణం.

2) రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రభువులకు అసంతృప్తిని కలిగించింది.

3) సామాజిక సంస్కరణలు ఈ తిరుగుబాటుకు మరొక కారణం.

4) ప్రాంతీయ భాషా పత్రికలను నిషేధించడం కూడా ఈ తిరుగుబాటుకు కారణం.


41. బ్రిటిషర్లు అవధ్‌ను ఆక్రమించిన సంవత్సరం?

1) 1860  2) 1850  3) 1856  4) 1857


42. రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా ఆక్రమించిన మొదటి ప్రాంతం?

1) సతారా 2) జైత్‌పూర్‌  3) ఝాన్సీ 4) నాగ్‌పూర్‌


43. ‘భారత ప్రథమ స్వతంత్ర సంగ్రామం’ అనే గ్రంథాన్ని రాసినవారు?

1) భగత్‌ సింగ్‌     2) సావర్కర్‌ 

3) బిపిన్‌ చంద్రపాల్‌     4) సుఖ్‌దేవ్‌


44. మంగళ్‌ పాండే కాల్చి చంపిన బ్రిటిష్‌ అధికారి?

1) హడ్సల్‌     2) కాంప్‌బెల్‌ 

3) బాగ్‌     4) లారెన్స్‌


45. బ్రిటిష్‌ ప్రభుత్వం ఈస్ట్‌ ఇండియా కంపెనీ పరిపాలన రద్దు చేసినట్లు ప్రకటించిన సంవత్సరం?

1) 1857  2) 1858  3) 1859  4) 1860


46. బ్రిటిష్‌ పాలనను అంతం చేసి, ఎవరి పాలనను తిరిగి తేవాలని సిపాయిలు నినాదాలు చేశారు?

1) పీష్వా      2) మొఘల్‌  

3) అవధ్‌      4) నిజాం


47. సిపాయిల తిరుగుబాటు సమయంలో నానాసాహెబ్‌ ఏ ప్రాంతానికి పారిపోయారు?

1) బర్మా  2) నేపాల్‌  3) అఫ్గాన్‌  4) పర్షియా


48. తుర్రేబాజ్‌ ఖాన్‌ ఎవరి మద్దతుతో తిరుగుబాటు చేశాడు?

1) మౌల్వీ అహ్మదుల్లా     2) సాలార్‌జంగ్‌ 

3) అల్లాఉద్దీన్‌     4) హసన్‌ గంగూ


49. దిల్లీ ప్రాంతానికి సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు వ్యాపించింది?

1) 1857, మే 10     2) 1857, మే 11

3) 1857, జూన్‌ 10     4) 1858, మే 5


50. బేగం హజ్రత్‌ మహల్‌ కుమారుడి పేరు?

1) వాజిద్‌ అలీషా        2) షుజా-ఉద్‌-దౌలా 

3) బర్జిస్‌ ఖాద్రి   4) దులీప్‌ సింగ్‌


 


సమాధానాలు


1-3; 2-1; 3-2; 4-3; 5-4; 6-1; 7-2; 8-2; 9-4; 10-1; 11-1; 12-2; 13-3; 14-4; 15-4; 16-2; 17-1; 18-1; 19-3; 20-1; 21-2; 22-4; 23-2; 24-4; 25-2; 26-1; 27-3; 28-1; 29-1; 30-1; 31-3; 32-1; 33-4; 34-3; 35-1; 36-3; 37-3; 38-3; 39-1; 40-4; 41-3; 42-1; 43-2; 44-3; 45-2; 46-2; 47-2; 48-3; 49-2; 50-3.


రచయిత: కాకులూరు వెంకటేశ్వర్లు 

Posted Date : 13-12-2023

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు