• facebook
  • whatsapp
  • telegram

ఒకే కులం.. ఒకే మతం.. ఒకే దేవుడు! 

సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

సమాజంలో కుల, మత వ్యవస్థలు శతాబ్దాలుగా వేళ్లూనుకున్న దేశం మనది. పురుషాధిక్యత, వర్ణ వ్యవస్థ, ఛాందసవాదం, మూఢనమ్మకాలు, సామాజిక అసమానతలు, స్త్రీల అణచివేత లాంటి సాంఘిక దురాచారాలు ఎప్పటి నుంచో పాతుకుపోయాయి. ఇలాంటి స్థితిలో 18, 19 శతాబ్దాల్లో పాశ్చాత్య దేశాల్లో మొదలైన ఉదారవాద, హేతువాద, మానవతా ఉద్యమాలు మన దేశాన్నీ తాకాయి. బ్రిటిష్‌ వలస పాలన, ఆంగ్ల విద్యావ్యాప్తి ఇందుకు దోహదం చేశాయి. ఈ పరిణామం భారత సమాజంలోని సాంఘిక, మత వ్యవస్థల్లోని లోపాల గురించి భారతీయులను పునరాలోచింపజేసింది. సంస్కరణోద్యమాలకు బాటలు వేసింది. ఆధునిక కాలంలో భారతీయుల జీవన విధానాన్ని, సమాజ గమనాన్ని మార్చిన ఈ ఉద్యమాల గురించి అభ్యర్థులు తెలుసుకోవాలి. సంస్కరణల క్రమంలో జరిగిన సంఘర్షణ, ప్రముఖ సంఘ సంస్కర్తలు, వారి కృషి గురించి తెలుసుకోవాలి.


1.    ప్రాచ్య పండితులు అంటే?

1) యూరోపియన్‌ సంస్కృతితో ప్రభావితమైనవారు

2) ఆసియా దేశాల సంస్కృతితో ప్రభావితమైనవారు

3) ఆసియా, యూరప్‌ సంస్కృతి ఒకే యుగానికి చెందినవని అభిప్రాయపడినవారు

4) ప్రాచీన యుగానికి చెందిన భారత మేధావులు


2.     యూరోపియన్లు భారతదేశంలో అచ్చు యంత్రాన్ని ప్రవేశపెట్టడం ద్వారా వచ్చిన ప్రధాన మార్పు?

1) వార్తాపత్రికలు అధికంగా అందుబాటులోకి రావడం

2) అనేక భారతీయ భాషల్లో పుస్తకాలు ప్రచురించడం

3) చాలా తక్కువ ధరలకు గ్రంథాలు లభించడం    4) పైవన్నీ


3.     బ్రహ్మసమాజ్‌ ముఖ్య సిద్ధాంతం?

1) దేవుడు ఒక్కడే        2) విగ్రహ ఆరాధన

3) బలులు ఇవ్వడం       4) పూజారుల ద్వారా మతవ్యాప్తి


4. కిందివారిలో బహుభాషా కోవిదుడు?

1) కందుకూరి వీరేశలింగం      2) దేవేంద్రనాథ్‌ ఠాగూర్‌

3) రాజారామ్మోహన్‌ రాయ్‌  4) డి.కె.కార్వే


5. దక్షిణ భారతదేశంలో తొలి వితంతు పునర్వివాహం జరిపించిన సంఘ సంస్కర్త?

1) కందుకూరి వీరేశలింగం  2) రఘుపతి వేంకటరత్నం నాయుడు

3) ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌         4) మహాత్మా జ్యోతిబా ఫులే


6.  ‘వేదాలకు మరలండి’ అనే నినాదాన్నిచ్చిన వ్యక్తి?

1) స్వామి వివేకానంద           2) స్వామి దయానంద సరస్వతి

3) రాజారామ్మోహన్‌ రాయ్‌       4) కందుకూరి వీరేశలింగం 


7. బ్రహ్మసమాజ్‌ను స్థాపించిన సంవత్సరం-

1) 1828  2) 1830  3) 1833  4) 1820


8. దయానంద్‌ ఆంగ్లో వేదిక్‌ (DAV) అనే విద్యాసంస్థ ఏ ప్రాంతంలో స్థాపించారు?

1) పంజాబ్‌       2) మహారాష్ట్ర    

3) ఆంధ్రప్రదేశ్‌        4) బిహార్‌


9. ముస్లిం సంఘసంస్కర్త సర్‌ సయ్యద్‌ అహ్మద్‌ ఖాన్‌ భావాల్లో సరికాని దాన్ని గుర్తించండి.

1) ముస్లింలకు ఆధునిక విద్యను అందించడం    2) మహిళా విద్యను ప్రోత్సహించడం

3) ఆంగ్లేయులతో స్నేహంగా మెలగడం  4) పరదా సంస్కృతిని పదిలపరచడం


10. ఏ భారతీయ సంస్కర్త కృషి వల్ల ‘సతీసహగమన నిషేధ చట్టం’ చేశారు?

1) రాజారామ్మోహన్‌ రాయ్‌      2) ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌

3) ఆత్మారాం పాండురంగ       4) కందుకూరి వీరేశలింగం 


11. భారతదేశంలో చట్టబద్ధంగా మొదటి వితంతు పునర్వివాహం జరిగిన సంవత్సరం-

1) 1855  2) 1856   3) 1885  4) 1857


12. ‘స్త్రీ పురుష్‌ తుల్నా’ అనే పుస్తకాన్ని రచించినవారు?

1) సావిత్రీబాయి ఫులే          2) రమాబాయి సరస్వతి

3) ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌    4) తారాబాయి షిండే


13. కిందివాటిలో సావిత్రిబాయి ఫులేకు సంబంధించి సరికానిది?

1) ఈమె మహిళా హక్కుల కోసం పోరాడారు.

2) ప్లేగు రోగులకు సేవలు అందించారు.

3) దేశంలోనే మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా గుర్తింపు పొందారు.

4) గుజరాత్‌లో జన్మించారు.


14. ‘శారదా సదన్‌’ అనే సంస్థను స్థాపించిన మహిళ?

1) తారాబాయి షిండే     2) రమాబాయి సరస్వతి

3) సావిత్రిబాయి ఫులే      4) దుర్గాబాయి దేశ్‌ముఖ్‌


15. కిందివారిలో ఎవరికి ‘పండిత’ అనే బిరుదు ఉంది?

1) రమాబాయి సరస్వతి    2) తారాబాయి షిండే

3) శారదాదేవి        4) సరోజినీ నాయుడు


16. ‘సత్యశోధక్‌ సమాజ్‌’ స్థాపకుడు ఎవరు?

1) బి.ఆర్‌.అంబేడ్కర్‌       2) నారాయణ గురు

3) భాగ్యరెడ్డి వర్మ        4) జ్యోతిబా ఫులే


17. మనుషులందరికీ ‘ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు’ అనే భావనను ప్రచారం చేసింది?

1) సహదరన్‌ అయ్యప్పన్‌    2) సాహు మహరాజ్‌  

3) బి.ఆర్‌.అంబేడ్కర్‌       4) నారాయణ గురు


18. కిందివాటిలో నారాయణ గురుకు సంబంధించి సరికానిదాన్ని గుర్తించండి.

1) ఈయన కేరళ ప్రాంతానికి చెందినవారు.

2) ‘ఈషువా’ కులస్థుల కోసం పోరాడారు.

3) కులవివక్షకు వ్యతిరేకంగా పోరాడారు.

4) ఆలయాల నిర్మాణాలకు అత్యంత ప్రోత్సాహాన్ని అందించారు.


19. కిందివారిలో ‘ప్రాచ్య పండితులు’ కానివారిని గుర్తించండి.

1) మాక్స్‌ ముల్లర్‌       2) విలియం జోన్స్‌   

3) జేమ్స్‌ మిల్‌       4) పైవారంతా


20. కులవివక్షకు వ్యతిరేకంగా డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ మొదటిసారి ఎప్పుడు ఉద్యమించారు?

1) 1827   2) 1910  3) 1927  4) 1930


21. దళితులకు ప్రత్యేక నియోజక వర్గాలు, రిజర్వేషన్లు కావాలని బి.ఆర్‌.అంబేడ్కర్‌ లండన్‌లో కోరగా వ్యతిరేకించింది ఎవరు?

1) మహ్మద్‌ అలీ జిన్నా   2) మహాత్మాగాంధీ  

3) నారాయణ గురు       4) శ్రీనివాస శాస్త్రి


22. కిందివారిలో ఎవరు నిమ్నకులాల వారిని ‘హరిజనులు’ అని పిలవాలని సూచించారు?

1) సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌     2) మహాత్మాగాంధీ   

3) భాగ్యరెడ్డి వర్మ        4) బి.ఆర్‌.అంబేడ్కర్‌


23. 1906లో ‘జగన్‌ మిత్రమండలి’ అనే సంస్థను స్థాపించిన సంఘ సంస్కర్త?

1) భాగ్యరెడ్డి వర్మ           2) డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌   

3) రామస్వామి నాయకర్‌      4) నారాయణ గురు


24. 1950లో సికింద్రాబాద్‌ నగరపాలక సంస్థకు కౌన్సిలర్‌గా ఎంపికైన మహిళ?

1) ఈశ్వరీబాయి     2) టి.ఎన్‌.సదాలక్ష్మి 

3) దుర్గాబాయి దేశ్‌ముఖ్‌     4) పైవారందరూ


25. కిందివాటిలో టి.ఎన్‌.సదాలక్ష్మికి సంబంధించి సరైంది- 

1) ఈమె ఆర్యసమాజ్‌ సభ్యురాలు.

2) మంత్రిగా, డిప్యూటీ స్పీకర్‌గా సేవలందించారు.

3) దళిత ఉద్యమాల్లో ప్రధాన పాత్ర పోషించారు.    4) పైవన్నీ


26. ఈశ్వరీబాయి కింది ఏ పార్టీకి జాతీయ అధ్యక్షురాలిగా వ్యవహరించారు?

1) ఇండియన్‌ లేబర్‌ పార్టీ               2) ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌

3) రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా      4) కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా


27. కిందివారిలో హైదరాబాద్‌ రాష్ట్రానికి చెందిన దళిత నాయకుడిని గుర్తించండి.

1) నారాయణ గురు   2) కందుకూరి వీరేశలింగం

3) అరిగె రామస్వామి  4) రామస్వామి నాయకర్‌


28. కిందివారిలో జోగిని, దేవదాసి, మాతంగి వ్యవస్థల మీద పోరాడిన సంస్కర్తలు?

1) భాగ్యరెడ్డి వర్మ      2) అరిగె రామస్వామి

3) కందుకూరి వీరేశలింగం  4) పైవారంతా


29. కిందివారిలో ఈశ్వరీబాయి నిర్వహించని పదవి గుర్తించండి.

1) ఇండియన్‌ కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ సోషల్‌ వెల్ఫేర్‌ కార్యదర్శి

2) ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ సభ్యురాలు

3) మహిళా శిశు సంక్షేమ విభాగం అధ్యక్షురాలు

4) భారత జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు


30. దళితులు తమను తాము ‘ఆది హిందువులు’గా పిలుచుకోవాలని సూచించినవారు?

1) భాగ్యరెడ్డి వర్మ     2) మహాత్మాగాంధీ 

3) రామస్వామి నాయకర్‌     4) నారాయణ గురు


31. డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఉన్నత చదువులు చదవడానికి సహకారం అందించినవారు?

1) బరోడా సంస్థానం      2) కొల్హాపూర్‌ సంస్థానం

3) 1, 2               4) ఎవరూకాదు


32. ‘గులాంగిరి’ గ్రంథ రచయిత?

1) జ్యోతిబా ఫులే    2) డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ 

3) నారాయణ గురు     4) కేశవ చంద్రసేన్‌


33. ఉన్నతవర్గాల మహిళల సమస్యల మీద ఇంగ్లండ్, అమెరికాల్లో ప్రసంగించిన మహిళా సంస్కర్త?

1) సావిత్రిబాయి ఫులే     2) తారాబాయి షిండే 

3) ఈశ్వరీబాయి     4) రమాబాయి సరస్వతి


34. మొదటి వితంతు పునర్వివాహాన్ని 1856లో ఏ ప్రాంతంలో నిర్వహించారు?

1) కలకత్తా  2) బొంబాయి 3) పుణె 4) మద్రాస్‌


35. కింది సంఘ సంస్కర్తలను వారి రాష్ట్రాలతో జతపరచండి.

1) జ్యోతిబా ఫులే ఎ) ఆంధ్రప్రదేశ్‌
2) రాజారామ్మోహన్‌ రాయ్‌ బి) మహారాష్ట్ర
3) భాగ్యరెడ్డి వర్మ సి) తెలంగాణ
4) కందుకూరి వీరేశలింగం డి) బెంగాల్‌

1) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ      2) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి

3) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ      4) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ


36. కిందివారిలో ‘అలీగఢ్‌ ఉద్యమం’ స్థాపకులు/ ప్రారంభకులు?

1) మౌలానా మహ్మద్‌ అలీ       2) సర్‌ సయ్యద్‌ అహ్మద్‌ఖాన్‌

3) మహ్మద్‌ ఖాసిం    4) హసన్‌ నిజామీ


37. మతం మారిన హిందువులను తిరిగి హిందూ మతంలోకి ఆహ్వానించేందుకు ‘శుద్ధి ఉద్యమం’ చేపట్టింది?

1) స్వామి వివేకానంద     2) రామకృష్ణ పరమహంస

3) స్వామి దయానంద సరస్వతి  4) పైవారందరూ


38. స్వామి వివేకానంద ‘చికాగో’ సమావేశానికి హాజరైన సంవత్సరం?

1) 1893   2) 1895  3) 1990  4) 1870


39. కిందివాటిలో సరికాని జతను గుర్తించండి.

1) సతి నిషేధ చట్టం - 1829   2) వితంతు పునర్వివాహ చట్టం - 1856    

3) శారదా చట్టం - 1928    4) భారత విశ్వవిద్యాలయ చట్టం - 1904


40. కిందివారిలో బ్రహ్మసమాజ్‌ సభ్యులు కానివారు?

1) కేశవ చంద్రసేన్‌          2) దేవేంద్రనాథ్‌ ఠాగూర్‌

3) స్వామి దయానంద సరస్వతి     4) అరిగె రామస్వామి



సమాధానాలు

1-2, 2-4; 3-1; 4-3; 5-1; 6-2; 7-1; 8-1; 9-4; 10-1; 11-2; 12-4; 13-4; 14-2; 15-1; 16-4; 17-4; 18-4; 19-3; 20-3; 21-2; 22-2; 23-1; 24-1; 25-4; 26-3; 27-3; 28-4; 29-4; 30-1; 31-3; 32-1; 33-4; 34-1; 35-1; 36-2; 37-3; 38-1; 39-3; 40-3.


రచయిత: కాకులూరు వెంకటేశ్వర్లు 

Posted Date : 06-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌