• facebook
  • whatsapp
  • telegram

సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

చెరువు నీటి కోసం అంబేడ్కర్‌ ‘దండియాత్ర’!


భారతీయ హిందూ సమాజంలో మూఢాచారాలు, లింగ, కుల వివక్షలు మధ్యయుగంలో మొదలై ఆధునిక యుగానికి వారసత్వంగా వచ్చాయి. తరతరాలుగా సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఈ జాఢ్యాలపై ఎందరో మేధావులు, సంస్కరణవాదులు అలుపెరుగని పోరాటాలు చేశారు. మతాన్ని సంస్కరించి ప్రాచీన వేద సంస్కృతి వైభవాన్ని పునరుద్ధరించేందుకు కొందరు నడుం బిగిస్తే; అమానవీయ వర్ణ వ్యవస్థ, అంటరానితనాన్ని రూపుమాపి సమాజాన్ని మార్చేందుకు అభ్యుదయవాదులు ఉద్యమించారు. అలాంటి లక్ష్యాలతో జరిగిన సాంఘిక, మత సంస్కరణోద్యమాలు ప్రజల దృక్ఫథాన్ని ప్రభావితం చేశాయి. మార్పు కోసం ప్రయత్నించిన ఆ సమాజాలు, సంస్థలు, వాటిని నడిపించిన సంఘసంస్కర్తల గురించి పరీక్షార్థులు తెలుసుకోవాలి. ఈ నేపథ్యంలో రామకృష్ణ పరమహంస నుంచి అంబేడ్కర్‌ వరకు సాగిన పరిణామాలు, వారి సిద్ధాంతాలు, నినాదాలు, రచనలు, ప్రసిద్ధ వ్యాఖ్యలను గుర్తుంచుకోవాలి.


1. బ్రహ్మసమాజ్‌కు సంబంధించి కిందివాటిలో సరికానిది?

1) బ్రహ్మసమాజ్‌ ఏకేశ్వర తత్వాన్ని అనుసరిస్తుంది.

2) ఈ సంస్థ బహుదేవతారాధనను ఖండించింది.

3) మతంలో హేతువాద భావాలకు స్థానం ఉండాలని భావించింది.

4) వేదాల ఆధిక్యతను అంగీకరించింది.


2. ‘‘ఒకే కొమ్మకు ఉన్న ఆకులన్నీ ఒకే విధంగా లేకపోవచ్చు, కానీ అన్ని ఆకుల్లోని రసం ఒక్కటేగా’’ అని గాంధీజీతో అన్న సంఘసంస్కర్త ఎవరు?

1) నారాయణ గురు     2) మహత్మా జ్యోతిరావ్‌ ఫులే 

3) డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌     4) దేవేంద్రనాథ్‌ ఠాకుర్‌


3. దివ్యజ్ఞాన సమాజ్‌ లక్ష్యం కానిది ఏది?

1) విశ్వమావన సోదర భావాన్ని పెంపొందించడం

2) హిందూతత్వ ఆధిక్యతను అంగీకరించడం

3) అన్నిధర్మాలు, తత్వాలకు ఐరోపా పుట్టినిల్లు అని చెప్పడం

4) మానవుడిలో అంతర్గత శక్తులను పరిశోధించడం


4. ‘అనుష్టాన్‌’ అనే పేరుతో కరపత్రాలు ప్రచురించిన సంఘసంస్కర్త ఎవరు?

1) రాజా రామ్మోహన్‌ రాయ్‌ 2) దేవేంద్రనాథ్‌ ఠాకుర్‌ 

3) జ్యోతిరావ్‌ ఫులే     4) హెన్రీ డిరాజియో


5. ‘మానవసేవే మాధవ సేవ’ అనే భావాన్ని వ్యక్తీకరించిన వ్యక్తి ఎవరు?

1) ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌     2) రామకృష్ణ పరమహంస 

3) స్వామి వివేకానంద     4) దయానంద సరస్వతి


6.  కిందివాటిలో అంబేడ్కర్‌ నిర్వహించిన దేవాలయ ప్రవేశ ఉద్యమాన్ని గుర్తించండి.

1) అమరావతి ఉద్యమం     2) పుణె ఉద్యమం 

3) నాసిక్‌ ఉద్యమం     4) పైవన్నీ


7. కింది సంఘసంస్కర్తల్లో ఎవరు సామాజిక సంస్కరణ తప్ప మత సంస్కరణ చేయలేదు?

1) నారాయణ గురు     2) డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ 

3) రాజా రామ్మోహన్‌ రాయ్‌ 4) ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌


8. ‘‘మన మతం మన వంటింట్లోనిది’’ అని అన్నది?

1) స్వామి వివేకానంద     2) స్వామి దయానంద సరస్వతి         

3) ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌     4) రాజా రామ్మోహన్‌ రాయ్‌


9.   రామకృష్ణ పరమహంసకు దేనిపై చిన్నప్పటి నుంచి ఆసక్తి ఎక్కువగా ఉండేది?

1) అంక గణితం     2) వేదాంతం 

3) శిల్పకళ     4) రాజనీతి


10. స్వామి వివేకానంద హాజరైన చికాగో సమావేశం జరిగిన సంవత్సరం?

1) 1852  2) 1893  3) 1895   4) 1902


11. కిందివాటిలో ఒకటి రామకృష్ణుడి బోధన కాదు-

1) మానవ సేవే మాధవ సేవ

2) అన్ని మతాల లక్ష్యం భగవత్‌ సాక్షాత్కారం

3) సర్వమత సామరస్య సమానత్వం

4) మానవులకు అత్యంత అవసరమైంది దయ


12. భారత్‌లో దివ్యజ్ఞాన సమాజం పేరు ప్రఖ్యాతులు పొందడానికి కారణం?

1) భారతీయులకు దివ్యజ్ఞానంపై ఎప్పటి నుంచో నమ్మకం ఉండటం

2) కర్మ, పునర్జన్మలను ఈ సమాజం నమ్మడం

3) ఆధ్యాత్మికతకు భారతదేశం పుట్టినిల్లు కావడం

4) పైవన్నీ


13. కిందివాటిలో ‘ప్రతిజ్ఞ ఉద్యమం’ ముఖ్యమైన లక్ష్యం ఏమిటి?

1) దేవుడు ఒక్కడే అని బోధించడం

2) బాల్య వివాహాలను అరికట్టడం

3) వితంతువులకు శిరోఖండనాన్ని నిరోధించడం

4) అన్ని మతాల అంతిమ లక్ష్యం మోక్షం అని చెప్పడం


14. కలకత్తా విద్యాలయంలో రమాబాయి సరస్వతికి వేదాలను బహూకరించిన బ్రహ్మసమాజ్‌ నాయకుడు?

1) రాజా రామ్మోహన్‌ రాయ్‌     2) కేశవ చంద్రసేన్‌ 

3) రాజ్‌నారాయణ్‌ బోస్‌     4) దేవేంద్రనాథ్‌ ఠాకుర్‌


15. ‘యువ బెంగాల్‌ ఉద్యమం’ నాయకుడు ఎవరు?

1) హెన్రీ డిరాజియో         2) ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌ 

3) కేశవ చంద్రసేన్‌     4) సురేంద్రనాథ్‌ బెనర్జీ


16. ‘అస్పృశ్యాంచి కైఫియత్‌’ అనే కరపత్రాన్ని ప్రచురించిన వ్యక్తి ఎవరు?

1) మహాత్మా జ్యోతిరావ్‌ ఫులే     2) ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌ 

3) కందుకూరి వీరేశలింగం     4) డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌


17. పండిత రమాబాయి సరస్వతి ‘ది హైకాస్ట్‌ హిందూ ఉమెన్‌’ అనే గ్రంథాన్ని ఎవరికి అంకితమిచ్చారు?

1) కాదంబిని గంగోలి     2) ఆనందీబాయి జోషి 

3) సావిత్రీ బాయి ఫులే     4) పై అందరికీ


18. ఏ భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశంలో సంఘ సంస్కరణల కోసం ‘జాతీయ సామాజిక సభ’ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు?

1) 1885 - బొంబాయి     2) 1887 - మద్రాస్‌ 

3) 1916 - లఖ్‌నవూ     4) 1907 - సూరత్‌


19. మహారాష్ట్ర సంఘ సంస్కరణల పితామహుడు అని ఎవరిని పిలుస్తారు?

1) గోపాలకృష్ణ గోఖలే     2) మహాత్మా జ్యోతిరావ్‌ ఫులే 

3) రఘునాథరావు     4) మహాగోవింద రనడే


20. కిందివాటిలో గోపాల్‌ హరి దేశ్‌ముఖ్‌కు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి.

1) ఈయనను లోక హితవాది అని పిలుస్తారు.

2) స్వదేశీ భావాలకు ఆద్యుడుగా చెప్పొచ్చు.

3) 1877లో దిల్లీ దర్బార్‌కు ఖాదీ వస్త్రాలను ధరించి వెళ్లాడు.

4) బెంగాల్‌ సంస్కరణల పితామహుడిగా ప్రసిద్ధి చెందాడు.


21. ప్రార్థనా సమాజ్‌కు సంబంధించి కింది అంశాలను పరిశీలించి, సరైన వాటిని గుర్తించండి.

ఎ) ప్రార్థనా సమాజ్‌ ఒక నాస్తిక సమాజం

బి) బ్రహ్మసమాజ్‌ ప్రభావంతో ఈ సంస్థ ఏర్పడింది

సి) ఇది హేతుబద్ధ ఆరాధనను ప్రోత్సహించింది

డి) ఈ సంస్థను మహారాష్ట్ట్ర్ర కేంద్రంగా స్థాపించారు

1) పై వాక్యాల్లో ఏదైనా ఒకటి మాత్రమే         2) పై వాక్యాల్లో ఏవైనా రెండు మాత్రమే

3) పై వాక్యాల్లో ఏవైనా మూడు మాత్రమే      4) పై వాక్యాలన్నీ సరైనవే


22. ‘గులాంగిరి’ గ్రంథాన్ని రచించింది?

1) మహాత్మా జ్యోతిరావ్‌ ఫులే       2) డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌

3) రామస్వామి నాయకర్‌       4) సాహు మహారాజ్‌


23. ‘సత్యసోధక్‌ సమాజ్‌’ అనే సంస్థను స్థాపించిన సంవత్సరం?

1) 1870   2) 1873   3) 1875   4) 1860


24. కిందివాటిలో సరైన దాన్ని గుర్తించండి.

1) భారత్‌లో మొదటి బాలికల పాఠశాలను 1848లో స్థాపించారు

2) భారత్‌లో మొదటి మహిళా కళాశాలను 1849లో స్థాపించారు

3) భారత్‌లో మొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని 1916లో స్థాపించారు

4) పైవన్నీ


25. అనిబిసెంట్‌ దత్త కుమారుడిగా పేరొందిన ప్రముఖుడు?

1) గోపాలకృష్ణయ్య       2) ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌  

3) హెన్రీ డిరాజియో    4) జిడ్డు కృష్ణమూర్తి


26. దయానంద సరస్వతి నిర్వహించిన ‘శుద్ధి ఉద్యమం’ లక్ష్యం ఏమిటి?

1) హిందూ మతాన్ని ప్రోత్సహించడం

2) మతం మారిన హిందువులను తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడం

3) పాశ్చాత్య భావాల వైపు హిందూ మతాన్ని తీసుకురావడం

4) విగ్రహారాధనను ప్రోత్సహించడం


27. అంబేడ్కర్‌ నడిపిన ఉద్యమాల్లో దేన్ని ‘దండియాత్ర’తో పోలుస్తారు?

1) మహద్‌ పట్టణం చవ్‌దార్‌ చెరువు/ నీటి ఉద్యమం

2) నాసిక్‌ దేవాలయ ప్రవేశ ఉద్యమం

3) కమ్యూనిటీ సత్యాగ్రహం         4) పైవన్నీ


28. రామకృష్ణ పరమహంసను ప్రభావితం చేసినవారు?

1) ప్రతాప్‌చంద్ర మజుందార్‌      2) భైరవ బ్రాహ్మిణి   

3) తోతాపురి         4) 2, 3


29. కింది గ్రంథాలను వాటి రచయితలతో జతపరచండి.

ఎ. త్రితీయ రత్న 1) స్వామి వివేకానంద
బి. అనిహిలేషన్‌ ఆఫ్‌ క్యాస్ట్‌ 2) జ్యోతిరావ్‌ ఫులే
సి. రాజయోగ 3) దేవేంద్రనాథ్‌ ఠాకుర్‌
డి. బ్రహ్మధర్మ 4) అంబేడ్కర్‌

1) ఎ-2, బి-4, సి-1, డి-3       2) ఎ-2, బి-3, సి-4, డి-1

3) ఎ-4, బి-2, సి-1, డి-3   4) ఎ-1, బి-2, సి-3, డి-4


30. ‘అబల బాంధవ్‌’ అనే పత్రిక ఎవరిది?

1) కేశవ చంద్రసేన్‌       2) రమాబాయి సరస్వతి  

3) ద్వారకానాథ్‌ గంగోలి      4) దోండు కేశవ్‌ కార్వే


31. ‘కాంగ్రెస్, గాంధీ అంటరానివారికి చేసిందేమిటి’ అనే గ్రంథాన్ని రచించినవారు?

1) డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌       2) జ్యోతిరావ్‌ ఫులే   

3) రామస్వామి నాయకర్‌     4) సుభాష్‌ చంద్రబోస్‌


32. ‘ఆత్మగౌరవ ఉద్యమం’ ఎప్పుడు ప్రారంభమైంది? 

1) 1925  2) 1930  3) 1942  4) 1928


33. ‘రామస్వామి నాయకర్‌’కు సంబంధించి సరికానిది?

1) ఈయనను పెరియార్‌ అని పిలుస్తారు    2) కుడి అరసు అనే వార్తాపత్రికను ప్రారంభించారు

3) జస్టిస్‌ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు    4) ఆత్మగౌరవ ఉద్యమాన్ని ప్రారంభించారు


34. మహాగోవింద రనడే ‘జాతీయ సామాజిక సంస్కరణల సమావేశం’ను ఎవరితో కలిసి ప్రారంభించారు?

1) గోపాలకృష్ణ గోఖలే       2) రఘునాథరావు   

3) శ్రీరామ్‌ వాజ్‌పేయీ       4) గోపాల్‌ గణేశ్‌ అగార్కర్‌


35. ‘‘విగ్రహారాధన ఖండన సబబు కాదు. పరమాత్మ సాక్షాత్కారం తరువాత విగ్రహారాధన అవసరం లేదు’’ అని భావించినవారు?

1) స్వామి వివేకానంద       2) రామకృష్ణ పరమహంస   

3) 1, 2       4) రాజా రామ్మోహన్‌ రాయ్‌  సమాధానాలు  


1-4; 2-1; 3-3; 4-1; 5-2; 6-4; 7-4; 8-1; 9-3; 10-2; 11-4; 12-4; 13-2; 14-2; 15-1; 16-1; 17-2; 18-2; 19-4; 20-4; 21-3; 22-1; 23-2; 24-4; 25-4; 26-2; 27-1; 28-4; 29-1; 30-3; 31-1; 32-1; 33-3; 34-2; 35-3.


రచయిత: కాకులూరు వెంకటేశ్వర్లు
 

Posted Date : 07-02-2024

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు