• facebook
  • whatsapp
  • telegram

మృత్తికలు/నేలలు

తమను తామే దున్నుకునే నేలలు!


 


శిలలు, ఖనిజాల క్రమక్షయంతో భూమిపై పొరగా ఏర్పడినవే నేలలు లేదా మృత్తికలు. వీటిలోనే చెట్లు పెరుగుతాయి. పంటలు పండుతాయి. భూఉపరితల స్వభావం, వాతావరణ పరిస్థితులకు తగినట్లుగా నేలలు ఒక్కోచోట ఒక్కో విధంగా ఉంటాయి. నదీ ప్రవాహాలతో కొట్టుకొచ్చిన మెత్తని రేణువులతో కూడిన ఒండ్రు నేలలు దేశంలో అధికంగా ఉన్నాయి. ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రాంతాలవారీగా నేలలు, స్వభావం, వాటిలో ఉన్న, లోపించిన  మూలకాలు, పండే పంటల గురించి పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. దేశ వ్యాప్తంగా ఉన్న మృత్తికల పరిశోధన కేంద్రాల గురించి కూడా తెలుసుకోవాలి.


1. భారతదేశంలో అధికంగా విస్తరించిన నేలలు ఏవి? 

1) ఎర్ర నేలలు     2) నల్లరేగడి నేలలు 

3) ఒండ్రు నేలలు     4) లాటరైట్‌ నేలలు


2.     నేలలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?

1) లిథాలజీ     2) పెడాలజీ 

3) లిమ్నాలజీ     4) పోటమాలజీ


3.     ప్రపంచ మృత్తికల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?

1) జనవరి 5     2) ఫిబ్రవరి 5 

3) డిసెంబరు 5      4) నవంబరు 5 


4.     భారతదేశపు ధాన్యాగారాలుగా ఏ నేలలను పిలుస్తారు? 

1) ఒండ్రు నేలలు     2) నల్లరేగడి నేలలు 

3) ఎర్ర నేలలు     4) లాటరైట్‌ నేలలు 


5.     పత్తి పంటకు అనుకూలమైన నేలలు ఏవి?

1) ఎర్ర నేలలు     2) ఒండ్రు నేలలు 

3) నల్లరేగడి నేలలు     4) లాటరైట్‌ నేలలు


6.     Soil అనే ఆంగ్ల భాషా పదం SOLUM అనే పదం నుంచి వచ్చింది. SOLUM అనేది ఏ భాషా పదం?

1) గ్రీకు  2) ఫ్రెంచ్‌  3) అరబిక్‌  4) లాటిన్‌ 


7.     నల్లరేగడి నేలలు అధికంగా ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి?

1) తమిళనాడు     2) మహారాష్ట్ర 

3) కర్ణాటక     4) మధ్యప్రదేశ్‌ 


8.     ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సాయిల్‌ సైన్స్‌’ ఎక్కడ ఉంది? 

1) పట్నా 2) హైదరాబాద్‌ 3) భోపాల్‌ 4) ఢిల్లీ


9.     ఒక సెంటీమీటరు మందం ఉండే నేల ఏర్పడటానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందని భూగోళ శాస్త్రవేత్తల అంచనా?

1) 100 నుంచి 500 ఏళ్లు     2) 300 నుంచి 700 ఏళ్లు

3) 100 నుంచి 400 ఏళ్లు   4) 100 నుంచి 1000 ఏళ్లు 


10. ‘సాయిల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా’ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 

1) 1949  2) 1954  3) 1956  4) 1970 


11.     కిందివాటిలో తమను తాము దున్నుకునే నేలలు ఏవి?

1) ఒండ్రు నేలలు     2) నల్లరేగడి నేలలు 

3) ఎర్ర నేలలు     4) లాటరైట్‌ నేలలు


12. నల్లరేగడి నేలల పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది? 

1) భోపాల్‌ - మధ్యప్రదేశ్‌     2) చెన్నై - తమిళనాడు 

3) బళ్లారి - కర్ణాటక      4) కోల్‌కతా - పశ్చిమ బెంగాల్‌ 


13. గ్రానైట్‌ శిలలు రూపాంతరం చెందడం వల్ల ఏర్పడిన నేలలు గుర్తించండి.

1) ఎర్ర నేలలు     2) నల్లరేగడి నేలలు 

3) ఒండ్రు నేలలు     4) లాటరైట్‌ నేలలు 


14. కింది ఏ నేలలను చల్క నేలలు, దుబ్బ నేలలు అని కూడా అంటారు? 

1) ఎర్ర నేలలు     2) ఒండ్రు నేలలు 

3) నల్లరేగడి నేలలు     4) లాటరైట్‌ నేలలు


15. ఒండ్రు నేలల్లో లోపించి ఉన్న మూలకం ఏమిటి? 

1) పొటాషియం     2) క్యాల్షియం 

3) నత్రజని     4) హ్యూమస్‌ 


16. బసాల్ట్‌ శిలలు రూపాంతరం చెందడం వల్ల ఏర్పడిన నేలలు ఏవి?

1) నల్లరేగడి నేలలు     2) ఎర్ర నేలలు 

3) ఒండ్రు నేలలు     4) లాటరైట్‌ నేలలు 


17. కిందివాటిలో ‘అరిజోనా నేలలు’ అని వేటిని పిలుస్తారు?

1) ఎర్ర నేలలు     2) ఒండ్రు నేలలు 

3) నల్లరేగడి నేలలు     4) లాటరైట్‌ నేలలు 


18. ‘ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌’  ఏ ప్రాంతంలో ఉంది?

1) కోల్‌కతా     2) న్యూఢిల్లీ 

3) చెన్నై     3) హైదరాబాద్‌


19. కింది ఏ నేలలను కేరళలో ‘కరి నేలలు’ అంటారు?

1) పీఠ్‌ నేలలు     2) లాటరైట్‌ నేలలు 

3) ఎర్ర నేలలు     4) ఎడారి నేలలు 


20. ఎడారి నేలల పరిశోధన కేంద్రం ఏ ప్రాంతంలో ఉంది?

1) చండీగఢ్‌     2) జోధ్‌పుర్‌ 

3) వడోదర     4) జబల్‌పుర్‌ 


21. ఎర్ర నేలలు ఏ పంటకు అనుకూలమైనవి?

1) పప్పు దినుసులు     2) వేరుశనగ 

3) నూనెగింజలు     4) పైవన్నీ 


22. కింది ఏ నేలలను ఉసర్‌ నేలలు లేదా కల్లార్‌ నేలలు అని పిలుస్తారు?

1) లాటరైట్‌ నేలలు         2) ఆమ్ల లేదా క్షార నేలలు 

3) ఎడారి నేలలు     4) ఎర్ర నేలలు 


23. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? 

1) జనవరి 2        2) ఫిబ్రవరి 2   

3) మార్చి 4        4) డిసెంబరు 4 


24. యమునా అవనాళిక పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది? 

1) కాన్పుర్‌   2) కోట   3) ఆగ్రా   4) ఢిల్లీ 


25. ‘ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌’ ఎప్పుడు ఏర్పడింది?

1) 1948  2) 1939  3) 1911  4) 1929 


26. ‘హిమాలయ నేలల పరిశోధన కేంద్రం’ ఏ ప్రాంతంలో ఉంది? 

1) అలహాబాద్‌     2) దేహ్రాదూన్‌ 

3) శ్రీనగర్‌     4) సిమ్లా


27. కింది ఏ నేలలను ‘చెస్ట్‌నట్స్‌’ నేలలు అని కూడా అంటారు?

1) ఎర్ర నేలలు     2) ఒండ్రు నేలలు 

3) నల్లరేగడి నేలలు     4) లాటరైట్‌ నేలలు 


28. సాధారణంగా మృత్తిక pH విలువ ఎంత ఉంటుంది? 

1) 6.5 - 7.5      2) 4.5 - 6.5 

3) 5.0 - 6.0     4) 5.5 - 6.5 


29. కిందివాటిలో స్థానబద్ధ మృత్తికలను గుర్తించండి. 

1) నల్లరేగడి నేలలు     2) ఒండ్రు నేలలు 

3) ఎడారి నేలలు     4) ఏదీకాదు 


30. కిందివాటిలో స్థానబద్ధ మృత్తికలు కానివి గుర్తించండి. 

1) నల్లరేగడి నేలలు     2) ఎర్ర నేలలు 

3) లాటరైట్‌ నేలలు     4) ఒండ్రు నేలలు 


31. కిందివాటిలో సంచార మృత్తికలు గుర్తించండి.

1) నల్లరేగడి నేలలు     2) ఎర్ర నేలలు 

3) ఒండ్రు నేలలు     4) లాటరైట్‌ నేలలు 


32. ‘కేంద్ర అటవీ నేలల పరిశోధన కేంద్రం’ ఎక్కడ ఉంది? 

1) చండీగఢ్‌     2) ఉదక మండలం 

3) దేహ్రాదూన్‌     4) చెన్నై 


33. కిందివాటిలో ‘బ్లాక్‌ కాటన్‌ సాయిల్‌’ అని దేన్ని పిలుస్తారు?

1) ఒండ్రు నేలలు     2) ఎర్ర నేలలు 

3) లాటరైట్‌ నేలలు     4) నల్లరేగడి నేలలు 


34. నదికి దూరంగా ఏర్పడే పురాతన ఒండ్రు నేలలను ఏమని పిలుస్తారు?

1) బాబర్‌  2) టెరాయి  3) భంగర్‌  4) ఖాదర్‌ 


35. భంగర్‌ నేలలో సున్నపురాయి పొర ఉండే నేలలను ఏమని పిలుస్తారు?

1) టెరాయి  2) ఖాదర్‌   3) కంకర్‌  4) రోహి 


36. లాటరైట్‌ నేలలు ఏర్పడటంలో ఇమిడి ఉన్న భూస్వరూప ప్రక్రియ ఏమిటి? 

1) లీచింగ్‌     2) రిపారియన్‌ క్రమక్షయం 

3) పవన క్రమక్షయం     4) డిగ్రేడింగ్‌ 


37. మహారాష్ట్రలో ‘చోపాన్‌’ నేలలు అని వేటిని పిలుస్తారు? 

1) ఒండ్రు నేలలు     2) ఎర్ర నేలలు 

3) నల్లరేగడి నేలలు     4) లాటరైట్‌ నేలలు 


38. కిందివాటిలో వ్యవసాయానికి నిరుపయోగమైన నేలలు గుర్తించండి.

1) నల్లరేగడి నేలలు     2) పీఠ్‌ నేలలు 

3) ఎర్ర నేలలు     4) లాటరైట్‌ నేలలు 


39. కిందివాటిలో అసంపూర్ణ మృత్తికలను గుర్తించండి.

1) లాటరైట్‌ నేలలు     2) నల్లరేగడి నేలలు 

3) ఎర్ర నేలలు     4) పర్వతీయ నేలలు


40. కిందివాటిలో కేరళలోని కొట్టాయం, అలెప్పీలో విస్తరించిన నేలలు గుర్తించండి.

1) ఒండ్రు నేలలు     2) నల్లరేగడి నేలలు 

3) పీఠ్‌ నేలలు     4) లాటరైట్‌ నేలలు


41. కిందివాటిలో పోడ్జోలిక్‌ నేలలు అని వేటిని అంటారు?

1) లాటరైట్‌ నేలలు     2) పర్వతీయ నేలలు 

3) పీఠ్‌ నేలలు     4) ఎర్ర నేలలు


42. ఛత్తీస్‌గఢ్‌లో మట్‌సాయి లేదా డోర్సా నేలలు అని వేటిని పిలుస్తారు? 

1) నల్లరేగడి నేలలు     2) ఎర్ర నేలలు 

3) ఒండ్రు నేలలు     4) లాటరైట్‌ నేలలు


43. కిందివాటిలో జీవసంబంధ మృత్తికలు గుర్తించండి. 

1) లాటరైట్‌ నేలలు     2) ఎర్ర నేలలు     

3) నల్లరేగడి నేలలు     4) పర్వతీయ నేలలు


44. కిందివాటిలో తేమను త్వరగా కోల్పోయే నేలలు ఏవి?

1) లాటరైట్‌ నేలలు     2) పీఠ్‌ నేలలు 

3) ఎర్ర నేలలు     4) పర్వతీయ నేలలు


45. నల్లరేగడి నేలలను ఏ పేరుతో పిలుస్తారు? 

1) రెగర్‌   2) కరి   3) ఉసర్‌   4) చల్క


46. ఏ నేలలు కాఫీ, తేయాకు పంటకు అనుకూలం? 

1) ఎర్ర నేలలు     2) నల్లరేగడి నేలలు 

3) ఒండ్రు నేలలు     4) లాటరైట్‌ నేలలు 


47. కిందివాటిలో మృత్తికా క్రమక్షయం అధికంగా జరిగేది?

1) పట  2) వంక  3) అవనాళిక  4) ఏదీకాదు 


48. ప్రపంచ పృథ్వీ దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు? 

1) మార్చి 22       2) ఏప్రిల్‌ 22   

3) జనవరి 22       4) జూన్‌ 22 


49. కిందివాటిలో ‘జార్జ్‌ భుకనన్‌’ కనుక్కున్న నేలలు? 

1) నల్లరేగడి నేలలు       2) ఒండ్రు నేలలు 

3) ఎర్ర నేలలు          4) లాటరైట్‌ నేలలు


50. భారతదేశంలో అధికంగా కందర నేలలు ఏ నదీలోయ వెంబడి విస్తరించి ఉన్నాయి? 

1) గంగా నదీలోయ        2) చంబల్‌ నదీలోయ 

3) బ్రహ్మపుత్ర నదీలోయ     4) సింధూ నదీలోయ  


51. చెర్నోజమ్‌ నేలలు ఏ దేశంలో అధికంగా విస్తరించి ఉన్నాయి? 

1) రష్యా  2) అమెరికా  

3) జర్మనీ  4) ఇంగ్లండ్‌ 


సమాధానాలు


1-3; 2-2; 3-3; 4-1; 5-3; 6-4; 7-2; 8-3; 9-4; 10-3; 11-2; 12-3; 13-1; 14-1; 15-3; 16-1; 17-3; 18-2; 19-1; 20-2; 21-4; 22-2; 23-2; 24-3; 25-4; 26-2; 27-3; 28-1; 29-1; 30-4; 31-3; 32-2; 33-4; 34-3; 35-3; 36-1; 37-3; 38-2; 39-4; 40-3; 41-2; 42-2; 43-4; 44-3; 45-1; 46-4; 47-3; 48-2; 49-4; 50-2; 51-1.
 


రచయిత: బండ్ల శ్రీధర్‌

Posted Date : 05-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌