• facebook
  • whatsapp
  • telegram

ఉపాధ్యాయ సాధికారత

నిబద్ధతతో కూడిన సమర్థ బోధన!



మనిషి ఉన్నతి, సమాజ పురోగతి, దేశప్రగతిలో విద్య కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ప్రజల, ప్రభుత్వాల ప్రాధాన్య అంశాల్లో చదువు ముందువరుసలో ఉంటుంది. విద్యావ్యవస్థకు పునాది లాంటి పాఠశాల విద్యను మెరుగుపరిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం కృషి చేస్తుంటాయి. వివిధ విధానాల ద్వారా ప్రాథమిక స్థాయిలో బోధనా శైలిని నిర్దేశిస్తుంటాయి. ఉపాధ్యాయు శక్తి సామర్థ్యాలను బలోపేతం చేయడానికి చర్యలు చేపడుతున్నాయి. విద్యాదృక్ఫథాలు అధ్యయనంలో భాగంగా కృత్యాధార బోధనకు ఇస్తున్న ప్రాధాన్యం, ఉపాధ్యాయ సాధికారత ఆవశ్యకత, క్రమానుగతంగా విద్యావ్యవస్థలో వచ్చిన గుణాత్మక మార్పులు, సంబంధిత కార్యక్రమాలు, వాటి లక్ష్యాలను తెలుసుకోవాలి.


1. బడి మానేసిన విద్యార్థుల సంఖ్యను 5% కంటే తగ్గించాలని నిర్ణయించిన కార్యక్రమం ఏది?

1) OBB 2) SSA

3) APPEP 4) DPEP


2. వ్యక్తి శక్తి, సామర్థ్యాలను బలోపేతం చేయడాన్ని ఏమని పేర్కొనవచ్చు?

1) అభివృద్ధి      2) సాధికారత  

3) ప్రేరణ       4) శిక్షణ


3.     సర్వశిక్ష అభియాన్‌లో బాలబాలికల వయో పరిమితి .... ఏళ్లు.

1) 5 - 8      2) 6 - 14  

3) 6 - 18      4) 3 - 12 


4.     ఉపాధ్యాయ సాధికారత ఏ స్థాయులను ప్రభావితం చేస్తుందని విద్యావేత్తల అభిప్రాయం?

1) ఉపాధ్యాయుడి స్థాయి     2) ప్రభుత్వ స్థాయి  

3) పాఠశాల స్థాయి       4) 1, 2


5. ఆంధ్రప్రదేశ్‌ ప్రాథమిక విద్యాపథకం ఆశయాలు?

1) ప్రాథమిక విద్యలో నాణ్యత పెంచడం

2) అభివృద్ధి పరిచిన నమూనాల్లో పాఠశాల భవనాల నిర్మాణాలు చేపట్టడం

3) ఉపాధ్యాయ బోధనా సామర్థ్యాల మెరుగుదల, సార్వత్రిక నమోదు, సార్వత్రిక నిలుపుదల

4) పైవన్నీ


6.     ఉపాధ్యాయ సాధికారత పెంపునకు సర్వశిక్ష అభియాన్‌లో తోడ్పడిన కార్యక్రమం?    

1) ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బోధించేందుకు ఏర్పాటు.

2) విద్యాబోధనకు అవసరమైన సదుపాయాల కల్పన.

3) పరిశోధన మూల్యాంకనానికి అవకాశం.    4) పైవన్నీ


7.     సమర్థులైన, నిబద్ధత ఉన్న ఉపాధ్యాయులుగా తయారుచేసే వ్యక్తిని ఏం సాధించాడని పేర్కొనవచ్చు?

1) ఉపాధ్యాయ పర్యవేక్షణ       2) సాధికారత   

3) ఉపాధ్యాయ మార్పు         4) రూప చిత్రం


8.     కిందివాటిలో సరికానిది.

1) సాధికారత అనే భావన సార్వత్రికమైంది.

2) సాధికారతకు పాఠశాలకు మధ్య సంబంధం ఉంది.

3) ఉపాధ్యాయ సాధికారతను విద్యాప్రణాళిక, మౌలిక లక్ష్యం ప్రభావితం చేస్తాయి.

4) ఉపాధ్యాయ సాధికారతకు, వారి అంతస్తులకు మధ్య సంబంధం ఉంది.


9.     గుడ్‌మెన్‌ అభిప్రాయం ప్రకారం సాధికారత ఉన్న ఉపాధ్యాయుడు?

1) విషయ విశ్లేషణ కలిగి ఉంటాడు.

2) సృజనాత్మక పద్ధతులను ఉపయోగిస్తాడు.

3) వనరులను ఉపయోగిస్తాడు.    4) పైవన్నీ


10. సాధికారతను అనుసరించి కిందివాటిలో సరైంది గుర్తించండి.    

1) విద్యార్థుల్లో ఆలోచనలు పెంచడం.    2) స్వీయ పరిస్థితులపై పూర్తి నియంత్రణ.

3) తన సామర్ధ్యాన్ని సమాజానికి తెలియజేయడం.    4) తన అర్హతలు పెంచుకోవడం.


11. కిందివాటిలో ఉపాధ్యాయ సాధికారతను నిర్ణయించే అంశం కానిది.

1) బోధనా పద్ధతి    2) సహోపాధ్యాయుల అలవాట్లు

3) బోధనోపకరణాల వినియోగం   4) ప్రత్యామ్నాయ వ్యూహాల ఎంపిక


12. APPEP పథకానికి ఆర్థిక సాయం చేసిన ODA ఏ దేశానికి చెందిన సంస్థ?

1) అమెరికా      2) జపాన్‌  

3) రష్యా      4) బ్రిటన్‌


13. దివ్యాంగులకు పాఠశాలలో ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని సూచించిన విద్యా పథకం ఏది?

1) SSA           2) APPEP

3) DPEP        4) BOBB


14. కిందివాటిలో DPEP ద్వారా కల్పించనిది?

1) ఉచిత పుస్తకాలు       2) ఆవాసంలో పాఠశాల

3) బాలకార్మికులను బడిలో చేర్పించడం   4) మధ్యాహ్న భోజనం అందించడం


15. కిందివాటిలో APPEP సూత్రం కానిది.    

1) అభ్యసనా కృత్యాలు కల్పించడం    2) అనుభవం ద్వారా అభ్యసనాన్ని నేర్పకపోవడం

3) వైద్యక భేదాలను గుర్తించడం   4) స్థానిక వనరులను వినియోగించడం


16. OBB పథకంలో Operation అనే పదం దేన్ని సూచిస్తుంది?

1) అవసరం      2) అత్యవసరం   

3) వనరులు       4) కార్యక్రమం


17. DPEP పథకంలో భాగంగా 3R's లలో సాధించాల్సిన లక్ష్యం శాతం?

1) 25%  2) 30%  3) 35%  4) 40%


18. ‘సర్వశిక్ష అభియాన్‌’ అనే పద ప్రయోగం వాజ్‌పేయీ ఏ రోజున ఉపయోగించారు?

1) 26 జనవరి, 2000         2) 15 జనవరి, 2000   

3) 15 ఆగస్టు, 2000          4) 15 ఆగస్టు, 2009


19. SSAలో భాగంగా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేసే మరొక కేంద్ర కార్యక్రమం?

1) పఢ్‌నా - బఢ్‌నా           2) పడే భారత్‌ - బడే భారత్‌   

3) పఢ్‌నా - సీక్‌ నా        4) ఏదీకాదు 


20. వనరుల పరంగా ఉపాధ్యాయుల సాధికారతను పెంపొందించిన పథకం ఏది?

1) OBB        2) APPEP

3) DPEP      4) SSA


21. DPEP కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు?

1) 1993  2) 1994  3) 1995  4) 1996


22. ఆంధ్రప్రదేశ్‌ ప్రాథమిక విద్యాపథకంలో ఉపాధ్యాయ సాధికారత పెంపునకు సంబంధించిన అంశం కానిది ఏది?

1) విద్యార్థుల సార్వత్రిక నమోదు       2) ఉపాధ్యాయ కేంద్రాల ఏర్పాటు

3) ఉపాధ్యాయ బోధన గ్రాంటు       4) ఉపాధ్యాయుల జీతభత్యాల పెంపు


23. సర్వశిక్ష అభియాన్‌ లక్ష్యాల ప్రకారం ఏ సంవత్సరం నాటికి పిల్లలందరూ ఐదు సంవత్సరాల ప్రాథమిక విద్యను పూర్తిచేయాలి?

1) 2007      2) 2010  

3) 2012      4) 2015


24. జాతీయ విద్యావిధానం - 1986 సిఫార్సుల ప్రకారం ఏర్పాటు చేసిన ఏ కార్యక్రమం వనరుల పరంగా ఉపాధ్యాయుల సాధికారత పెంచింది?

1) APPEP       2) OBB

3) DPEP        4) SSA


25. కిందివాటిలో ఉపాధ్యాయ సాధికారతలో తోడ్పడని అంశం?

1) విద్యార్థుల ప్రజ్ఞ       2) బోధనా పరికరాలు   

3) గ్రంథాలయం           4) విద్యార్థుల తల్లిదండ్రులు


26. ఉపాధ్యాయుడు సాధికారతను కలిగి బోధించాలనుకున్నప్పటికీ, సహోపాధ్యాయుల సహకారం లేకపోవడంతో సాధికారత వైకల్యం ఏర్పడిన అతడి  సాధికారత లోపస్థాయి?

1) బోధనా స్థాయి       2) పాఠశాల స్థాయి   

3) విద్యార్థి స్థాయి       4) ఉపాధ్యాయ స్థాయి


27. కిందివాటిలో SSA లక్ష్యాలు.

1) 2010 నాటికి సార్వత్రిక నిలుపుదల సాధించడం

2) గుణాత్మకతతో కూడిన ప్రాథమిక విద్యపై దృష్టి సారించడం

3) 2010 నాటికి పిల్లలందరూ ప్రాథమిక విద్య పూర్తి చేసుకోవాలి    4) పైవన్నీ


28. కిందివాటిలో ఉపాధ్యాయ సాధికారతను ప్రభావితం చేయని అంశం?

1) ఉపాధ్యాయుడిని లక్షణాలు             2) వేతనాలు   

3) విద్యాప్రణాళిక           4) వృత్తిపూర్వక శిక్షణ


29. ఉపాధ్యాయ సాధికారతను ఎన్ని అంశాలు ప్రభావితం చేస్తాయని విద్యావేత్తలు గుర్తించాలి?

1) 2      2) 3      3) 1      4) 4


30. ఏ సంవత్సరం నుంచి నల్లబల్ల పథకాన్ని ప్రాథమికోన్నత స్థాయికి విస్తరించి అమలు చేస్తున్నారు?

1) 1994      2) 1992   

3) 1993       4) 1991


31. సర్వశిక్ష అభియాన్‌ నినాదం ఏమిటి? 

1) అందరూ చదవాలి అందరూ ఎదగాలి.    2) పిల్లలు బడికి పెద్దలు పనికి.

3) విద్యయే విజయం.   4) అందరూ చదవాలి అందరూ బడికి పోవాలి.


32. ప్రస్తుతం పాఠశాలలో పిల్లల ఆరోగ్యంపై అమలు చేస్తున్న కార్యక్రమం ఏది?

1) ఆరోగ్యశ్రీ           2) రాజీవ్‌ ఆరోగ్యశ్రీ   

3) బాల వికాస్‌       4) జవహర్‌ బాల ఆరోగ్య రక్ష


33. ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల ఆరోగ్య పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు?

1) 1995      2) 1996  

3) 1997      4) 1998


34. APPEP పథకం ఎప్పుడు DPEPలో విలీనమైంది?

1) 1995  2) 1994  3) 1996  4) 1997


35. దేశవ్యాప్తంగా ప్రాథమిక విద్యను అందుబాటులోకి తేవడానికి తీసుకొచ్చిన విద్యాపథకం?

1) DPEP             2) APPEP

3) OBB               4) SSA


36. DPEP కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.

1) 6-11 ఏళ్ల పిల్లలందరినీ బడిలో చేర్పించడం.

2) గ్రామ విద్యా కమిటీల ద్వారా సూక్ష్మ ప్రణాళిక నిర్మాణం.

3) బాలికల విద్యపై శ్రద్ధ వహించడం.     4) పైవన్నీ


37. జవహర్‌ రోజ్‌గార్‌ యోజన పథకం ఏ పథకానికి సహాయకారిగా నిలిచింది?

1) DPEP 2) APPEP

3) SSA 4) OBB


38. కిందివాటిలో ఏది సూక్ష్మస్థాయి విద్యా ప్రణాళిక?

1) DPEP 2) OBB

3) APPEP 4) SSA


39. నేషనల్‌ ఎలిమెంటరీ లెవెల్‌ ఎడ్యుకేషన్‌ మిషన్‌ను ఏ పథకం అమలు కోసం స్థాపించారు?

1) RMSA 2) DPEP

3) SSA 4) APPEP


40. SSA నూతన లక్ష్యాల్లో భాగంగా ప్రాథమిక విద్యాస్థాయిలో బాలబాలికల మధ్య వివక్షను, సామాజిక వర్గ వ్యత్యాసాలను ఏ సంవత్సరం నాటికి తొలగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు?

1) 2013      2) 2017  

3) 2015      4) 2014



సమాధానాలు

1-4; 2-2; 3-2; 4-4; 5-4; 6-4; 7-2; 8-4; 9-4; 10-2; 11-2; 12-4; 13-3; 14-4; 15-2; 16-2; 17-4; 18-3; 19-2; 20-1; 21-2; 22-4; 23-1; 24-2; 25-4; 26-2; 27-4; 28-2; 29-4; 30-2; 31-1; 32-4; 33-4; 34-3; 35-1; 36-4; 37-4; 38-1; 39-3; 40-3.


రచయిత: కోటపాటి హరిబాబు 
 

Posted Date : 19-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌