• facebook
  • whatsapp
  • telegram

ఉపాధ్యాయ ప్రేరణ - సాధికారత

మాదిరి ప్ర‌శ్న‌లు

1. కిందివాటిలో DPEP లక్ష్యాల్లో సరికానిది?
1) పాఠశాల మానివేసే విద్యార్థుల సంఖ్య 5% కంటే తగ్గించడం.
2) స్త్రీ విద్యను ప్రోత్సహించడం.
3) 6 - 11 ఏళ్ల బాల బాలికలందరికీ పాఠశాలల్లో ప్రవేశం కల్పించడం.
4) 3 R'S లో విద్యార్థుల ప్రమాణాలను 40% అధికం చేయడం.
జ: 2(స్త్రీ విద్యను ప్రోత్సహించడం.)


2. సర్వశిక్షా అభియాన్‌ నినాదం?
జ: అందరూ చదవాలి అందరూ ఎదగాలి!

 

3. LEP (Learning Enhancement Programme) ద్వారా బాలికల విద్య కోసం ఏయే కార్యక్రమాలను ప్రవేశపెట్టారు?
జ: NPEGEL, KGBV

4. కిందివాటిలో NCERT కి అనుబంధ సంస్థ కానిది?
1) RIE         2) CIET       3) SIET          4) NIE
జ: 3(SIET)

 

5. EFLU (English and Foreign Languages University) యొక్క పురాతన నామం?
జ: CIEFL

 

6. డిగ్రీ, పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ లాంటి కోర్సులను అనేక భాషల్లో అందించేది?
జ: EFLU

 

7. కిందివాటిని జతపరచండి.
i) NCERT                             A) 1958
ii) SCERT                            B) 2003
iii) SSA                               C) 1967
iv) EFLU                              D) 1961

జ: i-D, ii-C, iii-B, iv-A

 

8. కిందివాటిలో SCERT విధి కానిది?
1) రాష్ట్రస్థాయి విద్యాపాఠ్య ప్రణాళికను రూపొందించడం.
2) ఉపాధ్యాయ విద్యాసంస్థలను పర్యవేక్షించడం.
3) రాష్ట్రస్థాయిలో సైన్స్‌ ఎగ్జిబిషన్లను నిర్వహించడం.
4) పాఠ్యపుస్తకాలను, పత్రికలను ప్రచురించడం.
జ: 4(పాఠ్యపుస్తకాలను, పత్రికలను ప్రచురించడం.)

 

9. ఉపాధ్యాయ ప్రేరణను ప్రభావితం చేసే బహిర్గత కారకాల్లో లేనిది?
1) ఉపాధ్యాయుడి శారీరక ఆరోగ్యం బాగుండాలి
2) నిర్ణీత వ్యవధిలో పదోన్నతి
3) గుర్తింపుకు ప్రతిఫలంగా అవార్డులు
4) ఉద్యోగ భద్రత
జ: 1(ఉపాధ్యాయుడి శారీరక ఆరోగ్యం బాగుండాలి)

 

10. మండల స్థాయిలో ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణా కార్యక్రమాలు, సదస్సులు, సమావేశాలకు కేంద్రంగా ఉండేది.
జ: MRC

 

11. పాఠశాల రికార్డుల ఆవశ్యకతలో ముఖ్యమైన అంశం కానిది?
1) పాఠశాల సంస్థాగత కార్యక్రమాలను మదింపు చేయడం.
2) ఆర్థిక అవసరాల బడ్జెట్‌ వివరణలను తయారు చేయడం.
3) గృహం, సముదాయంతో సహకార, నిర్మాణాత్మకమైన సంబంధాలను నెలకొల్పడం.
4) ఉపాధ్యాయులకు జీతభత్యాలు, సెలవులు ఇవ్వడం.
జ: 4(ఉపాధ్యాయులకు జీతభత్యాలు, సెలవులు ఇవ్వడం.)

 

12. ఉన్నతాధికారులు పాఠశాలను సందర్శిచినప్పుడు వారు తమ సలహాలను ఏ రిజిస్టర్‌లో పొందుపరచాలి?
జ: లాగ్‌బుక్‌

 

13. పాఠశాల చరాస్థులను సూచించే రిజిస్టర్‌?
జ: స్టాక్‌ రిజిస్టర్‌

 

14. ఉపాధ్యాయుడు ఉద్యోగంలో చేరిన తేది, పుట్టిన తేది, విద్యార్హతలు, జీతం, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, బదిలీలు లాంటి అంశాలను పొందుపరిచే రిజిస్టర్‌?
జ: సర్వీస్‌ బుక్‌

 

15. కన్సిన్జెంట్‌ రిజిస్టర్‌ అంటే?
జ: పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చిన్న చిన్న వస్తువుల కొనుగోళ్ల విషయాలు రాసే రిజిస్టర్‌

 

16. కిందివాటిని జతపరచండి.
i) అందరికీ విద్య అనే లక్ష్యాన్ని సాధించడానికి నియత, అనియత పద్ధతుల్లో       
A) NCERT
   పలు విద్యా కార్యక్రమాల అమలుకు సహకరించేది             
ii) వయోజన విద్యావ్యాప్తికి కృషిచేస్తున్న సంస్థలన్నింటికీ శిక్షణ ఇచ్చేది            
B) SIET                                                                        
iii) పాఠ్యపుస్తకాలు, పత్రికలను ప్రచురించేది                                 
C) DIET                                                               
iv) జిల్లా విద్యామండలికి అవసరమైన సలహాలు అందించేది                  
D) SRC                                                                             

జ: i-B , ii-D, iii-A, iv-C

17. SSAకి 9వ పంచవర్ష ప్రణాళికలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించిన నిధుల శాతం వరుసగా
జ: 85 : 15

 

18. జతపరచండి.
 i) మన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు               
A) NCTE
   కృషి చేస్తున్న సంస్థ                                                                                   
ii) జాతీయస్థాయిలో ఉపాధ్యాయ విద్యాకార్యక్రమాలను       
B) EFLU
సమన్వయం చేసేది                                                                       
iii) సాంకేతిక విద్యను విస్తరించి బోధనా పరికరాలను        
C) CCRT
సిద్ధం చేసేది                                                                            
iv) ఆంగ్లం, విదేశీ భాషలకు సంబంధించి పలు               
D) CIET  
కార్యక్రమాలను  రూపొందించి ఉపాధ్యాయులకు అందించేది                               

జ: i-C, ii-A, iii-D, iv-B
 

19. కిందివాటిలో DIET ల విధి కానిది?
1) ప్రాథమిక విద్యాస్థాయిలో వృత్తిపూర్వక, వృత్యతర శిక్షణను నిర్వహించడం.
2) జిల్లా విద్యామండలికి అవసరమైన సలహాలు ఇవ్వడం.
3) జిల్లాస్థాయిలో పదో తరగతి మినహా మిగిలిన తరగతులన్నింటికీ ప్రశ్నపత్రాలు రూపొందించడం.
4) మధ్యాహ్న భోజన నిర్వహణ.
జ: 4(మధ్యాహ్న భోజన నిర్వహణ.)

Posted Date : 30-08-2023

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్కూల్ అసిస్టెంట్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు