• facebook
  • whatsapp
  • telegram

ఫ్రెంచి విప్లవం

విచ్ఛిన్న గొలుసు.. స్వేచ్ఛకు చిహ్నం!

అదో ప్రజాయుద్ధం. ప్రపంచ చరిత్రను కీలక మలుపు తిప్పిన మహోన్నత ఘట్టం. రాచరికం, భూస్వామ్య వ్యవస్థలపై  ప్రజాస్వామ్య భావనలు పోరాడి, విజయం సాధించిన అద్భుతమైన సందర్భం. ఆ ఉద్యమం రాచరికాన్ని పడగొట్టింది. లౌకికవాదానికి ప్రాణం పోసింది. జాతీయవాద వ్యాప్తికి దోహదపడింది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాత్ర సూత్రాలతో కూడిన లోతైన సామాజిక, సాంస్కృతిక, రాజకీయ పరిణామాలకు ప్రేరణగా నిలిచింది. పాలన, పౌరసత్వం, మానవ హక్కులు లాంటి ఆధునిక ఆలోచనలకు పునాదిగా మారింది. అదే ఫ్రెంచి విప్లవం. ప్రపంచ వ్యాప్తంగా ప్రతిధ్వనించిన ఆ ప్రజాచైతన్యం పర్యవసానాలను, సంబంధిత సంఘటనలను, నేతల వివరాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి.   

1. బోర్బన్‌ రాజవంశానికి చెందిన 16వ లూయి ఎప్పుడు రాజు అయ్యాడు?

1) 1772   2) 1773   3) 1774  4) 1775


2. కిందివాటిలో సరికానిది? 

ఎ) 16వ లూయి రాజయ్యే సమయానికి అతడి వయస్సు 20 సంవత్సరాలు.

బి) ఆస్ట్రియా రాకుమారి మేరి ఆంటోనెట్‌ను వివాహం చేసుకున్నాడు.

సి) 16వ లూయి రాజు అయ్యేనాటికి ఫ్రాన్స్‌ ఖజానా నిండుగా ఉంది.

డి) సుదీర్ఘ యుద్ధాల కారణంగా ఫ్రాన్స్‌ ఆర్థిక వనరులు తరిగిపోయాయి.

1) ఎ, బి        2) సి, డి   

3) సి మాత్రమే     4) డి మాత్రమే


3. ఫ్రాన్స్‌ దేశానికి ప్రధాన శుత్రువు?

1) అమెరికా  2) రష్యా  3) బ్రిటన్‌  4) ఆస్ట్రియా


4. ఫ్రాన్స్‌ దేశానికి రుణాలు ఇచ్చిన రుణదాతలు వాటిపై ఎంత శాతం వడ్డీని వసూలు చేశారు?

1) 12%   2) 10%  3) 8%   4) 13%


5. ఏ శతాబ్దంలో ఫ్రెంచి సమాజాన్ని 3 ఎస్టేట్‌లుగా విభజించారు?

1) 16వ   2) 17వ  3) 18వ   4) 19వ 


6. కిందివాటిలో ఫ్రాన్స్‌లోని ఎస్టేట్‌లు, అందులోని ప్రజలకు సంబంధించి సరైంది?

1) మొదటి ఎస్టేట్‌ - మతాధికారులు

2) రెండో ఎస్టేట్‌ - కులీనులు

3) మూడో ఎస్టేట్‌ - రైతులు, వ్యాపారులు, న్యాయవాదులు     

4) పైవన్నీ


7. ఫ్రెంచి సమాజంలో ఏ వర్గం పుట్టుకతో కొన్ని ప్రత్యేకమైన అధికారాలు పొందేది?

1) మొదటి ఎస్టేట్‌       2) రెండో ఎస్టేట్‌  

3) 1, 2       4) మూడో ఎస్టేట్‌


8. కిందివాటిలో సరైనవి?

ఎ) చర్చి రైతాంగం నుంచి ‘టైథ్‌’ అనే పన్ను వసూలు చేసేది.

బి) 3వ ఎస్టేట్‌లో ప్రజలందరూ పన్ను చెల్లించాలి.

సి) 3వ ఎస్టేట్‌లో ప్రజలందరూ ‘టెయిల్లే’ అనే ప్రత్యక్ష పన్ను చెల్లించాలి.

డి) ప్రభుత్వ నిర్వహణకు అయ్యే ఖర్చును 3వ ఎస్టేట్‌ భరించాలి.

1) బి, సి, డి      2)  ఎ, బి, సి, డి 

3)  ఎ, బి, డి     4)  బి, సి


9. ఫ్రాన్స్‌ కరెన్సీ (ద్రవ్య కొలమానం)?

1) డాలర్‌     2) రూపాయి 

3) లివర్‌     4) ఫ్రాన్స్‌ రూపాయి


10. నెపోలియన్‌ తనని చక్రవర్తిగా ఎప్పుడు ప్రకటించుకున్నాడు?

1) 1802  2) 1803  3) 1804  4) 1805


11. జీవనోపాధికి సంబంధించిన ప్రాథమిక అంశాలు అంతరించిపోవడాన్ని ఏమంటారు?

1) ద్రవ్యోల్బణం      2) జీవనాధార సంక్షోభం  

3) డిమాండ్‌      3) కరవు


12. మధ్య తరగతి అనే సామాజిక వర్గం ఫ్రాన్స్‌లో ఏ శతాబ్దంలో ఏర్పడింది?

1) 17వ   2) 18వ  3) 19వ   4) 20వ  


13. వ్యక్తి ప్రతిభను బట్టి అతడి హోదా నిర్ణయించాలని వాదించిన తత్వవేత్త/తత్వవేత్తలు?

1) జాన్‌లాక్‌      2) జాన్‌ జాక్వెస్‌ రూసో   

3) 1, 2       4) కార్ల్‌ మార్క్స్‌


14. ‘రాచరికం దైవదత్తం’ అనే సిద్ధాంతం గురించి వివరించినవారు?

1) జాన్‌లాక్‌      2) రూసో  

3) మాంటెస్క్యూ     4) పైఅందరూ


15. ‘ది స్పిరిట్‌ ఆఫ్‌ ది లాస్‌’ అనే గ్రంథం రచించినవారు?

1) జాన్‌లాక్‌      2) రూసో   

3) మాంటెస్క్యూ       4) అబ్రహాం లింకన్‌


16. అధికార విభజన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది?

1) జాన్‌లాక్‌      2) రూసో  

3) మాంటెస్క్యూ       4) అబ్రహాం లింకన్‌


17. 1793లో జార్జి డాంటన్‌ తన స్నేహితుడికి రాసిన లేఖలో అంశాలు గుర్తించండి.

ఎ) డాంటన్‌ ప్లేసిన్‌లోని రెసిడెన్షియల్‌ కళాశాలలో చదివారు.

బి) ప్యారిస్‌లోని న్యాయస్థానంలో ఉద్యోగం పొందడం కష్టం.

సి) నా దగ్గర ‘సౌ’లు లేకపోవడంతో నేను ఆఫీసు కూడా కొనలేను.

డి) మన ప్రతిభ ఏ రంగానికి ఉపయోగపడని విద్యను ఈ వ్యవస్థ అందించింది.

1) ఎ, బి, సి        2) ఎ, బి, సి, డి   

3) ఎ, సి, డి     4) బి, సి, డి


18. 1787 నుంచి 1789 మధ్య ఫ్రాన్స్‌ నుంచి ప్రయాణించిన ఆంగ్లేయుడు?

1) ఆర్దర్‌ యంగ్‌      2) ఆర్దర్‌ కాటన్‌  

3) డేనియల్‌ ఒర్మ్‌     4) పై అందరూ


19. ఫ్రాన్స్‌లో ఎస్టేట్‌ జనరల్‌ చివరి సమావేశం ఎప్పుడు జరిగింది?

1) 1614  2) 1615  3) 1616  4) 1617


20. వాటర్లూ యుద్ధం జరిగిన సంవత్సరం?

1) 1814  2) 1813  3) 1815  4) 1816


21. కిందివాటిలో సరైన వాక్యాలు?

ఎ) 1789, మే 5న 16వ లూయి ఎస్టేట్‌ జనరల్‌ను సమావేశపరిచారు.

బి) సమావేశం కోసం వర్సయిల్స్‌ మందిరం సిద్ధం చేశారు.

సి) ఒకటి, రెండు ఎస్టేట్స్‌లలో 3 వందల చొప్పున ప్రతినిధులు హాజరయ్యారు.

డి) మూడో ఎస్టేట్‌ నుంచి 600 మంది ప్రతినిధులు హాజరయ్యారు.

1) ఎ, బి, సి      2) ఎ, బి, సి, డి

3) బి, సి, డి    4) బి, సి


22. ఎస్టేట్‌ జనరల్‌లోని సభ్యులందరికీ ఒక్కొక్కరికి ఒక ఓటు ఉండాలని ఏ గ్రంథంలో ఉంది?

1) స్పిరిట్‌ ఆఫ్‌ ది లాస్‌      2) ది సోషల్‌ కాంట్రాక్ట్‌  

3) 1, 2      4) దాస్‌ క్యాపిటల్‌


23.    1789, జూన్‌ 20న టెన్నిస్‌ కోర్టు మైదానంలో ప్రతిజ్ఞ చేశారు. దీనికి నాయకత్వం వహించినవారు?

1) మీరాబ్యూ       2) అబ్బేసియస్‌  

3) 1, 2       4) 16వ లూయి


24. మూడో ఎస్టేట్‌ అంటే ఏమిటో వివరిస్తూ కరపత్రం ప్రచురించింది?

1) అబ్బేసియస్‌      2) మీరాబ్యూ   

3) డాంటన్‌      4) పై అందరూ


25. కిందివాటిని జతపరచండి.

1) 1789 ఎ) 3వ ఏస్టేట్‌ జాతీయ అసెంబ్లీగా ఏర్పాటు
2) 1791 బి) ఫ్రాన్స్‌ రాజ్యాంగం రూపొందించడం
3) 1792 సి) ఫ్రాన్స్‌లో జాకోబిన్‌ ప్రభుత్వం ఏర్పాటు
4) 1804 డి) నెపోలియన్‌ చక్రవర్తిగా ప్రకటన

1) 1-ఎ, 2-బి, 3-సి 4-డి      2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ   

3) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి   4) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి


26. ఫ్రాన్స్‌ ఆందోళనకారులు ‘బాస్టిలో’ కారాగారంపై ఎప్పుడు దాడి చేశారు?

1) 1789, జులై 14       2) 1787, జులై 15   

3) 1879, జూన్‌ 16       4) 1793, జులై 14


27. ‘టెన్నిస్‌ కోర్టు ప్రతిజ్ఞ’ను చిత్రించింది?

1) జాక్వెస్‌ లూయిడేవిడ్‌      2) డానియల్‌ ఒర్మ్‌  

3)  జేమ్స్‌ ప్రిన్సివ్‌       4)  ఆర్‌జీ పొల్లార్డ్‌


28. 1789, ఆగస్టు 4న ఫ్రాన్స్‌లో జరిగిన సంస్కరణల్లో సరైనవి గుర్తించండి.

ఎ) వెట్టిచాకిరి, ఫ్యూడల్‌ వ్యవస్థ రద్దు చేశారు.

బి) మతాధికారులు ప్రత్యేక హోదాను వదులుకున్నారు.

సి) దశమ భాగం రద్దు చేశారు.

డి) చర్చి ఆధీనంలోని భూములను జప్తు చేశారు.

1) ఎ, బి, సి, డి      2) బి, సి, డి  

3) ఎ, బి, సి     4) ఎ, బి, డి 


29. కిందివాటిలో సరైంది?

ఎ) ఛాటో - కులీన వర్గానికి చెందిన కోట లేదా రాజప్రాసాదం

బి) మానర్‌ - ప్రభువుల భూములు, అంతఃపురం ఉన్న ప్రాంతం

1) ఎ, బి     2) ఎ మాత్రమే

3) బి మాత్రమే     4) ఏదీకాదు


30. ఫ్రాన్స్‌ రాజ్యాంగబద్ధ రాచరికంగా ఎప్పుడు మారింది?

1) 1791  2) 1792  3) 1793  4) 1794


31. 1791లో ఫ్రాన్స్‌ రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన హక్కులు గుర్తించండి.

ఎ) ఎన్నికైన జాతీయ శాసన సభకు చట్టాలు చేసే అధికారం ఉంది.

బి) 25 ఏళ్లు పైబడినవారికి, మూడు రోజుల కార్మిక వేతనానికి సమానమైన పన్ను చెల్లించేవారికి ఓటు హక్కు ఇచ్చింది.

సి) శాసనసభ సభ్యులను పౌరులు ఎన్నుకుంటారు.

డి) పన్ను చెల్లించని పురుషులు, స్త్రీలను నిష్క్రియా పౌరులుగా చేసింది.

1) బి, సి, డి      2) ఎ, సి, డి    

3) ఎ, బి, సి, డి       4) ఎ, బి, సి


32. ఫ్రాన్స్‌ రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన హక్కులు?

1) జీవించే హక్కు  2) వాక్‌ స్వాతంత్య్రపు హక్కు

3) భావ ప్రకటన, అభిప్రాయాలను వెలిబుచ్చే హక్కు     

4) పైవన్నీ


33. 1790లో మానవ హక్కుల ప్రకటన అనే చిత్రం గీసిన కళాకారుడు?

1) బల్తాజర్‌ సోల్విన్‌     2) లే బార్బియర్‌

3) కోల్మోవర్టీగ్రాంట్‌     4) న్యూహూడోల్‌స్కి


34. ఫ్రాన్స్‌ ‘మానవ హక్కుల’ ప్రకటనలోని అంశాలను గుర్తించండి.

ఎ) మానవులు స్వేచ్ఛా జీవులుగా జీవించారు, స్వేచ్ఛగా ఉంటారు

బి) స్వేచ్ఛ అంటే ఇతరులకు హాని కలిగించరాదు

సి) సమాజానికి హాని కలిగించే చర్యలు నిషేధం

డి) పరిపాలన కోసం అందరికీ పన్ను విధించడం

1) ఎ, బి, సి, డి        2) బి, సి, డి  

3) ఎ, బి, సి,      4) ఎ, సి, డి


35. విప్లవాత్మక పాత్రికేయుడు జీన్‌ పాల్‌ మారా. పత్రిక ‘లామి డూ పీపుల్‌’. లామి డూ పీపుల్‌ అంటే ఏమిటి?

1) ప్రజల రక్షకుడు      2) ప్రజల పాలకుడు 

3) ప్రజల స్నేహితుడు      4) పైవన్నీ


36. కిందివాటిని జతపరచండి.

1) పాము తన తోకను కొరికే ఉంగరం  ఎ) ఐకమత్యంకి చిహ్నం
2) కడ్డీల కట్ట  బి) స్వేచ్ఛకు చిహ్నం
3) విచ్ఛిన్న గొలుసు సి) శాశ్వతత్వంకు చిహ్నం
4) రాజదండం డి) రాజు శక్తికి చిహ్నం

 1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి 2) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి

3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ  4) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి


సమాధానాలు

 1-3; 2-3; 3-3; 4-2; 5-3; 6-4; 7-3; 8-2; 9-3; 10-3; 11-2; 12-2; 13-3; 14-1; 15-3; 16-3; 17-2; 18-1; 19-1; 20-3; 21-2; 22-2; 23-3; 24-1; 25-1; 26-1; 27-1; 28-1; 29-1; 30-1; 31-3; 32-4; 33-2; 34-1; 35-3; 36-2.


రచయిత: గద్దె నరసింహా రావు

Posted Date : 22-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌