• facebook
  • whatsapp
  • telegram

గదిలో వేడిగాలిని వెళ్లగొట్టే సంవహనం!

ఉష్ణం

వేడి ప్రాంతం నుంచి చల్లటి ప్రాంతానికి   ప్రసరించే శక్తి స్వరూపమే ఉష్ణం. దాని తీవ్రతే ఉష్ణోగ్రత. ఉష్ణాన్ని కొలిచే ప్రమాణాలు, పరికరాలు, ఉష్ణప్రసార నియమాలు తదితర అంశాలపై ప్రాథమిక పరిజ్ఞానం అభ్యర్థులకు ఉండాలి. వేడి చేస్తే సంకోచించే, వ్యాకోచించే పదార్థాలు, ఉష్ణ బంధకాలు, ఉత్తమ వాహకాల గురించి తెలుసుకోవడంతోపాటు నిత్యజీవితంలో వాటి అనువర్తనాలను గమనించాలి.


1.    ఉష్ణాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?

1) అకౌస్టిక్స్‌     2) ఆప్టిక్స్‌ 

3) కెలోరిమెట్రి     4) క్రయోమెట్రి


2.     ఉష్ణోగ్రతకు SI ప్రమాణం?

1) కెల్విన్‌  2) జౌల్‌  3) కెలోరి  4) సెంటిగ్రేడ్‌


3.     ఒక వస్తువు నుంచి వెలువడిన ఉష్ణరాశిని కొలిచే పరికరం?

1) థర్మామీటర్‌     2) కెలోరి మీటర్‌ 

3) బాంబ్‌ కెలోరిమీటర్‌     4) క్రయో మీటర్‌ 


4.     సెల్సియస్‌లో ఉన్న విలువను కెల్విన్‌ మానంలోకి మార్చే సూత్రం?

1) K = C + 273 2) C = 273 − K

3) C = K − 273 4) C = K + 273


5.     థర్మామీటర్‌ను మొదటిసారిగా కనుక్కున్న శాస్త్రవేత్త?

1) న్యూటన్‌ 2) ఐన్‌స్టీన్‌ 3) హైగెన్స్‌ 4) గెలీలియో 


6.     ఆరోగ్యవంతుడైన మానవుడి శరీర ఉష్ణోగత్ర?

1) 37°C  2) 98.4°C  3) 84°C  4) 69°C


7.     ఏ ఉష్ణోగ్రత వద్ద పదార్థం ప్లాస్మా స్థితిలో ఉంటుంది? 

1) 2000°K     2) 4000°

3) 6000°K     4) 3000°K


8.     నీటిఆవిరి ఉష్ణోగ్రతను కొలిచే పరికరం?

1) పైరోమీటర్‌              2) అయస్కాంత థర్మామీటర్‌ 

3) ఆల్కహాల్‌ థర్మామీటర్‌     4) బెక్‌మన్‌ ఉష్ణమాపకం


9.     ఒక రోజులో నమోదయ్యే కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతలను కొలవడానికి ఉపయోగించే పరికరం?

1) పాదరస ఉష్ణమాపకం     2) క్రయో మీటర్‌ 

3) సిక్స్‌ ఉష్ణమాపకం         4) ఆల్కహాల్‌ ఉష్ణమాపకం


10. సముద్రగర్భంలో ఉన్న ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే పరికరం? 

1) బాతిస్కోపు     2) అయస్కాంత థర్మామీటర్‌ 

3) క్రయో మీటర్‌   4) పాదరస ఉష్ణమాపకం 


11. క్లినికల్‌ థర్మామీటర్‌లో ఉండే ఫారన్‌హీట్‌ రీడింగ్స్‌?

1) 35°F, 45°F     2) 95°F, 110°

3) 32°F, 212°F     4) 0°F, 100°F


12. పాదరసం వల్ల కలిగే వ్యాధిని గుర్తించండి.

1) ఫాసీజా     2) స్ట్రాబిస్‌మస్‌ 

3) మినిమాటా     4) క్యాటరాక్ట్‌


13. పాదరసాన్ని ఉష్ణమాపక పదార్థంగా ఉపయోగించడానికి కారణాలు?

1) ఉత్తమ ఉష్ణవాహకం     2) ఏకరీతి వ్యాకోచం ఉండటం 

3) గాజుకు అంటుకోదు     4) పైవన్నీ


14. వేడిపాలలో స్పూన్‌ ఉంచినప్పుడు రెండో వైపు వెచ్చగా అనిపించే ఉష్ణప్రసార పద్ధతి?

1) ఉష్ణమానం     2) ఉష్ణ సంవహనం 

3) ఉష్ణ వికిరణం     4) ఉష్ణ దక్షత


15. గదిలోని వేడిగాలి చిమ్నీల ద్వారా బయటకు వెళ్లే ఉష్ణప్రసార పద్ధతి?  

1) ఉష్ణ వహనం     2) ఉష్ణ సంవహనం 

3) ఉష్ణ వికిరణం     4) ఉష్ణ దక్షత 


16. సూర్యకిరణాల వల్ల నేరుగా భూమి వేడెక్కడం?

1) ఉష్ణ దక్షత     2) ఉష్ణ సంవహనం 

3) ఉష్ణ వికిరణం     4) ఉష్ణ వహనం 


17. చలిమంట పక్కన నిల్చొని ఉన్న వ్యక్తి శరీరం వేడెక్కడం?

1) ఉష్ణ వహనం     2) ఉష్ణ సంవహనం 

3) ఉష్ణ దక్షత     4) ఉష్ణ వికిరణం


18. కొవిడ్‌-19 మహమ్మారి కాలంలో శరీర ఉష్ణోగ్రతలను కొలవడానికి అధికంగా ఉపయోగించిన పరికరం?

1) డిజిటల్‌ థర్మామీటర్‌    2) క్లినికల్‌ థర్మామీటర్‌

3) థర్మిష్టర్‌ థర్మామీటర్‌    4) థర్మల్‌ స్కానర్‌ 


19. ఉష్ణవికిరణ తీవ్రతను కొలిచే పరికరం? 

1) బోలో మీటర్‌     2) పైరో మీటర్‌ 

3) బాతో మీటర్‌     3) క్రయో మీటర్‌ 


20. °C, °F లు ఏ ఉష్ణోగ్రత వద్ద సమతాస్థితిలో ఉంటాయి?    

1) 40   2) -40   3) -35   4) 42


21. కిందివాటిలో ఉత్తమ ఉష్ణవాహకాన్ని గుర్తించండి.

1) కాపర్‌  2) ఐరన్‌  3) సిల్వర్‌  4) ప్లాటినం


22. కిందివాటిలో ఉష్ణబంధకాన్ని గుర్తించండి.

1) అల్యూమినియం     2) వజ్రం 

3) పాదరసం     4) గ్రాఫైట్‌ 


23. వేడిచేస్తే సంకోచించే పదార్థాలను గుర్తించండి.

1) వెండి     2) రాగి 

3) అల్యూమినియం     4) గాజు


24. వేడి చేస్తే సంకోచ, వ్యాకోచాలు లేని పదార్థం?

1) ఫ్యూజ్‌వైర్‌     2) దుక్క ఇనుము 

3) ఇన్వర్ట్‌ స్టీల్‌     4) గ్రాఫైట్‌


25. టెలిఫోన్, విద్యుత్‌ స్తంభాల మధ్య తీగలు వదులుగా ఉంచటానికి కారణం?

1) శీతాకాలంలో సంకోచానికి అనుగుణంగా

2) వేసవికాలంలో వ్యాకోచానికి అనుగుణంగా

3) శీతాకాలంలో వ్యాకోచానికి అనుగుణంగా

4) వేసవికాలంలో సంకోచానికి అనుగుణంగా


26. రైలు పట్టాల మధ్య, కాంక్రీటు రోడ్డు మధ్యలో ఖాళీలను వదలడానికి కారణం?

1) వేసవి కాలంలో సంకోచానికి అనుగుణంగా

2) శీతాకాలంలో వ్యాకోచానికి అనుగుణంగా 

3) వేసవికాలంలో వ్యాకోచానికి అనుగుణంగా

4) శీతాకాలంలో సంకోచానికి అనుగుణంగా


27. స్కేలు, శృతిదండం, గడియార లోలకం వంటి పరికరాల తయారీకి ఉపయోగించే పదార్థం?

1) స్టీల్‌     2) అల్యూమినియం 

3) టంగ్‌స్టన్‌     4) ఇన్వర్ట్‌ స్టీల్‌


28. నీటి అసంగత వ్యాకోచానికి కారణమైన ఉష్ణోగ్రత?

1) 0°C  2) 12°C  3) 4°C  4) 7°C


29. నీటి విశిష్టోష్ణం విలువ ఎంత? (Cal/gm.°C) 

1) 1     2) 7     3) 0     4) 5 


30. కిందివాటిలో అత్యధిక విశిష్టోష్ణం ఉన్న ఘనపదార్థం? 

1) సీసం     2) తగరం 

3) అల్యూమినియం     4) రాగి


31. కిందివాటిలో అత్యల్ప విశిష్టోష్ణం ఉన్న పదార్థం?

1) సీసం 2) ఐరన్‌ 3) అల్యూమినియం 4) తగరం 


32. మంచు ద్రవీభవన గుప్తోష్ణం విలువ ఎంత? (Cal/gm)

1) 70     2) 50     3) 80    4) 540 


33. పాదరసం బాష్పీభవన గుప్తోష్ణం విలువ (Cal/gm)

1) 80     2) 70    3) 540    4) 620


34. పొడిమంచు లేదా డ్రైఐస్‌ అంటే?

1) ఘన కార్బన్‌ డై ఆక్సైడ్‌         2) వాయు కార్బన్‌ డై ఆక్సైడ్‌

3) ద్రవ కార్బన్‌ డై ఆక్సైడ్‌         4) పైవన్నీ


35. ప్రెజర్‌ కుక్కర్‌లో నీరు మరిగే ఉష్ణోగ్రత?

1) 100°C 2) 120°C 3) 95°C 4) 110°


36. స్కేటింగ్‌ ఆట (మంచుపై జారడం) ఏ సూత్రం ఆధారంగా జరుగుతుంది? 

1) పీడనం పెంచితే ద్రవీభవన స్థానం తగ్గడం.

2) పీడనం పెంచితే ద్రవీభవన స్థానం పెరగడం. 

3) పీడనం పెంచితే బాష్పీభవన స్థానం తగ్గడం.

4) పీడనం పెంచితే బాష్పీభవన స్థానం పెరగడం. 


37. థర్మోఫ్లాస్క్‌ను కనుక్కున్న శాస్త్రవేత్త?

1) జేమ్స్‌ డెవర్‌     2) రిట్టర్‌ 

3) రాంట్‌జన్‌     4) సి.వి.రామన్‌


38. గాలి వీచే సమయంలో తడి వస్త్రాలు ఆరడం?

1) సాంద్రీకరణం     2) బాష్పీభవనం 

3) ద్రవీభవనం     4) ఘనీభవనం


39. వేసవిలో షవర్‌ కింద స్నానం చేసినప్పుడు శరీరం వెచ్చగా అనిపించడం? 

1) ద్రవీభవనం     2) ఘనీభవనం 

3) సాంద్రీకరణం     4) బాష్పీభవనం


40. శీతాకాలంలో నూనె, నెయ్యి గడ్డకట్టడం?

1) ఘనీభవనం     2) విళీనం     

3) బాష్పీభవనం     4) సాంద్రీకరణం


41. నీరు మరిగే ఉష్ణోగ్రత?

1) 0°C 2) 100°C 3) 373°C 4) 273°C


42. జౌల్‌ థామ్సన్‌ ప్రభావం ఆధారంగా పనిచేసే పరికరాలు?

1) ఎయిర్‌ కండిషనర్స్‌     2) మిక్సర్‌ గ్రైండర్‌

3) రిఫ్రిజిరేటర్స్‌    4) ఎయిర్‌కూలర్స్‌


43. కృష్ణవస్తువు వికిరణ రేటు, దాని పరమ ఉష్ణోగ్రత నాలుగో ఘాతానికి అనులోమానుపాతంలో ఉండే నియమం?

1) న్యూటన్‌ శీతలీకరణ నియమం     2) స్టీఫెన్‌ నియమం

3) జౌల్‌ థామ్సన్‌ నియమం     4) చార్లెస్‌ నియమం


44. తుషారం, పొగమంచు ఏ ప్రక్రియ ఆధారంగా ఏర్పడతాయి?

1) బాష్పీభవనం     2) సాంద్రీకరణం 

3) ఘనీభవనం     4) ద్రవీభవనం 


45. కిందివాటిలో హిమీకరణ మిశ్రమం అంటే?

1) మంచు + ఉప్పు     2) మంచు + నూనె

3) మంచు + ఇసుక    4) మంచు + కర్పూరం 


46. థర్మోఫ్లాస్క్‌లో ఉష్ణవికిరణం జరగకుండా లోపలి భాగాన పూతపూసే లోహం?

1) అల్యూమినియం 2) తగరం 3) వెండి 4) రాగి


47. ఆవు పాల కెలోరిఫిక్‌ విలువ (KCal/100 gm)

1) 656    2) 116    3) 118   4) 67 


48. పాదరసం బాష్పీభవన ఉష్ణోగ్రత?

1) 257°C     2) 357°

3) 373°C     4) 100°C


1) 2 : 1 : 2     2) 1 : 3 : 2 

3) 2 : 3 : 1     4) 1 : 2 : 3


50. అమెరికా, జపాన్‌ దేశాలు ఏ థర్మామీటర్లను నిషేధించాయి?

1) ఆల్కహాల్‌ థర్మామీటర్‌    2) పాదరస థర్మామీటర్‌

3) డిజిటల్‌ థర్మామీటర్‌     4) అయస్కాంత థర్మామీటర్‌ 


సమాధానాలు

1-3; 2-1; 3-2; 4-4; 5-4; 6-1; 7-3; 8-4; 9-3; 10-1; 11-2; 12-3; 13-4; 14-1; 15-2; 16-3; 17-4; 18-4; 19-1; 20-2; 21-3; 22-2; 23-4; 24-3; 25-1; 26-3; 27-4; 28-3; 29-1; 30-3; 31-1; 32-3; 33-2; 34-1; 35-2; 36-1; 37-1; 38-2; 39-3; 40-1; 41-2; 42-3; 43-2; 44-2; 45-1; 46-3; 47-4; 48-2; 49-4; 50-2. 

 

ర‌చ‌యిత‌: చంటి రాజుపాలెం

Posted Date : 30-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌