• facebook
  • whatsapp
  • telegram

అతిధ్వనులనూ వింటాయి.. అడవి తాబేళ్లు! 

ధ్వని

తరంగాలుగా చలించే భౌతికాంశమే ధ్వని. కంపించే ప్రతి వస్తువు శబ్దాన్ని సృష్టిస్తుంది. దాని ప్రసారానికి గాలి, నీరు, లోహం లాంటి ఏదైనా యానకం అవసరం. భౌతికశాస్త్రంలో అతిముఖ్యమైన ధ్వని స్వభావం, అందులో రకాలు, పౌనఃపున్యాలు, కొలిచే ప్రమాణాలు, వాటి ఆధారంగా పనిచేసే పరికరాలు, ఉత్తమ ధ్వని వాహకాలు, వేగం, తీవ్రతను నిర్ణయించే కారకాల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. మానవులు, ఇతర జంతువులు వినగలిగే శబ్దాల సామర్థ్యంలో తేడాలు, సంబంధిత పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు, వారి ఆవిష్కరణలతో పాటు నిజజీవిత అనువర్తనాలపై శాస్త్రీయ అవగాహన కలిగి ఉండాలి.


1.    కిందివాటిలో విద్యుదయస్కాంత తరంగాలు కానివి?

1) X - కిరణాలు       2) గామా కిరణాలు     

3) అతినీలలోహిత కిరణాలు  4) తిర్యక్‌ తరంగాలు


2.     చంద్రుడి మీద వ్యోమగామి, తోటి వ్యోమగామి మాటలు వినలేకపోవడానికి కారణం?

1) అధిక పౌనఃపున్యం     2) యానకం లేకపోవడం 

3) తక్కువ ఉష్ణోగ్రతలు      4) పెద్ద గుంటలు ఉండటం


3.     కిందివాటిలో ఏ యానకంలో ధ్వని వేగం ఎక్కువ?

1) గాలి  2) పాదరసం  3) నీరు  4) ప్లాస్టిక్‌


4.     కిందివాటిలో పరశ్రవ్య ధ్వనిని గుర్తించండి.

1) 18 Hz  2) 180 Hz  3) 25 Hz   4) 39 Hz


5.     సైనికులు కవాతు చేస్తున్నప్పుడు వంతెన రాగానే ఆపుతారు. దీనికి ప్రధాన కారణం?

1) ధ్వని పరావర్తనం     2) ధ్వని వివర్తనం 

3) అనునాదం     4) ధ్వని వక్రీభవనం


6.    కిందివాటిలో అతిధ్వనుల ఉపయోగం కానిది?

1) పాల నుంచి కొవ్వును వేరుచేయడం.     2) పాత్రల్లోని పగుళ్లను గుర్తించడం.

3) దృఢమైన లోహాలకు రంధ్రాలు చేయడం.  4) పైవన్నీ


7.     ధ్వనిని స్పష్టంగా వినాలంటే పరావర్తన తలం నుంచి పరిశీలకుడి మధ్య ఉండాల్సిన కనీస దూరం?

1) 26 మీ. 2) 17 మీ. 3) 19 మీ. 4) 20 మీ.


8.     గబ్బిలాలు చీకటిలో దేనికీ తగలకుండా సులభంగా ఎగరడానికి కారణమైన ధ్వనులు?

1) పరశ్రవ్య ధ్వనులు     2) శ్రవ్య ధ్వనులు 

3) ప్రతినాద ధ్వనులు     4) అతిధ్వనులు


9.     ధ్వని పిచ్‌ కిందివాటిలో దేనిపై ఆధారపడుతుంది?

1) ధ్వని పౌనఃపున్యం     2) కంపన పరిమితి 

3) తరంగ దైర్ఘ్యం     4) తరంగ వేగం


10. సినిమాహాళ్ల గోడలు, పైకప్పులు రంపపు పొట్టుతో కప్పడానికి కారణం?

1) హాలుకు సౌందర్యం కోసం 2) ప్రతిధ్వని నివారణ 

3) అనునాద నివారణ      4) పౌనఃపున్య నివారణ


11. కిందివాటిలో ధ్వని తరంగాలు దేని ద్వారా ప్రయాణించవు?

1) ఘన పదార్థాలు     2) ద్రవ పదార్థాలు 

3) వాయు పదార్థాలు     4) శూన్యం


12. భూకంపాలు సంభవించినప్పుడు, అగ్నిపర్వతాలు పేలినప్పుడు ఉత్పత్తి అయ్యే తరంగాలు?

1) శ్రావ్య ధ్వనులు       2) పరశ్రావ్య ధ్వనులు   

3) అతిధ్వనులు       4) అనునాద ధ్వనులు


13. గాలిలో ప్రవేశించే ధ్వని తరంగాలు కింది ధర్మాల్లో దేన్ని ప్రదర్శించవు?

1) ధ్రువణం       2) అధ్యారోపణం   

3) వ్యతికరణం       4) వివర్తనం


14. ఆరోగ్యవంతమైన మానవులు వినగలిగే పానఃపున్య ధ్వని?

1) 10 Hz - 20 Hz         2) 20 Hz - 200 Hz   

3) 20 Hz - 20,000 Hz      4) 20 Hz - 2000 Hz


15. ధ్వని పిచ్‌ను ఆరోహణ క్రమంలో గుర్తించండి.

1) పిల్లవాడు < సింహం < పురుషుడు < స్త్రీ

2) సింహం < స్త్రీ < పురుషుడు < పిల్లవాడు

3) పురుషుడు < స్త్రీ < పిల్లవాడు < సింహం

4) సింహం < పురుషుడు < స్త్రీ < పిల్లవాడు


16. కిందివాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి.

1) ధ్వని యొక్క కీచు స్వరాన్ని పిచ్‌ అంటారు

2) ధ్వని యొక్క పిచ్‌ పానఃపున్యంపై ఆధారపడుతుంది

3) మానవుడి చెవికి హాని కలగకుండా వినగలిగే శబ్ద తీవ్రత - 120 dB

4) పానఃపున్యం S.I. ప్రమాణం - హెర్ట్జ్‌


17. కిందివాటిలో సరైన సమాధానాన్ని ఎంచుకోండి.

1) విశ్వవిఖ్యాత షెహనాయ్‌ వాయిద్యకారుడు - ఉస్తాద్‌ భిస్మిల్లాఖాన్‌

2) వెంట్రిలాక్విస్ట్‌ - గోమఠం శ్రీనివాస్‌

3) గొప్ప నేపథ్య గాయకుడు - ఘంటసాల వెంకటేశ్వరరావు

4) పైవన్నీ


18. మానవుడి చెవులు స్పష్టంగా వినగలిగే శబ్ద తీవ్రత?

1) 20 - 30 dB       2) 50 - 60 dB   

3) 15 - 20 dB       4) 90 - 110 dB


19. మానవుడి చెవిలోనికి ప్రవేశించిన ధ్వని తరంగాలు మొదట దేన్ని తాకి కంపింపజేస్తాయి?

1) మ్యాలియస్‌ 2) ఇంకస్‌ 3) కర్ణభేరి 4) ఒవెల్‌ విండో


20. కిందివాటిలో అతిధ్వనిని వినగలిగే జీవి?

1) తిమింగలం       2) ఖడ్గ మృగం   

3) పాము       4) అడవి తాబేలు


21. గాలిలో ధ్వని వేగం 20°C వద్ద గుర్తించండి.

1) 331 m/s       2) 344 m/s   

3) 380 m/s       4) 422 m/s


22. గాలిలో ధ్వని అణువులు ముందుకు, వెనుకకు కదలడం ద్వారా ప్రయాణించి చెవిని చేరి గ్రహణ సంవేదనను కలిగిస్తాయని తెలిపినవారు?

1) న్యూటన్‌       2) గెలీలియో   

3) పైథాగరస్‌       4) బేకన్‌


23. ధ్వని తీవ్రత కిందివాటిలో దేనిపై ఆధారపడుతుంది?

1) కంపన పరిమితి       2) తరంగ దైర్ఘ్యం   

3) తరంగ వేగం       4) పానఃపున్యం


24. తరంగంలో కణం అత్యధిక స్థానభ్రంశం?

1) పానఃపున్యం       2) కంపన పరిమితి   

3) తరంగ దైర్ఘ్యం       4) ఆవర్తన కాలం


25. కిందివాటిలో ధ్వని వేగాన్ని ప్రభావితం చేయని అంశాన్ని గుర్తించండి.

1) ఉష్ణోగ్రత       2) ఆర్ద్రత   

3) సాంద్రత       4) పీడనం


26. ధ్వని వేగం దేనిలో అధికంగా ఉంటుందో గుర్తించండి.

1) హీలియం     2) హైడ్రోజన్‌ 

3) నైట్రోజన్‌     4) ఆక్సిజన్‌


27. ధ్వనివేగం అత్యధికంగా ఏ కాలంలో ఉంటుంది?

1) వేసవి కాలం     2) శీతాకాలం 

3) వర్షాకాలం     4) చలికాలం


28. కిందివాటిలో సరైన సమాధానాన్ని ఎంచుకోండి.

ఎ) వాతావరణ ఉష్ణోగ్రత 1°C పెరిగితే ధ్వని వేగం గాలిలో 0.61 m/s పెరుగుతుంది.

బి) వాయువు సాంద్రత పెరిగితే ధ్వని వేగం తగ్గుతుంది.

1) ఎ సత్యం, బి అసత్యం 2) ఎ అసత్యం, బి సత్యం

3) ఎ, బి అసత్యాలు     4) ఎ, బి సత్యాలు


29. పిడుగు పడే సమయంలో మెరుపు కనిపించిన తర్వాత ఉరుము వినపడుతుంది. దీనికి కారణం ధ్వని వేగం కాంతి వేగం కంటే..?

1) తక్కువ  2) ఎక్కువ  3) సమానం  4) సగం


30. పురుషుల కంటే స్త్రీల కంఠస్వరం కీచుగా ఉండటానికి కారణం?

1) పౌనఃపున్యం ఎక్కువ     2) పౌనఃపున్యం తక్కువ 

3) పౌనఃపున్యం చాలా తక్కువ     4) పౌనఃపున్యం శూన్యం


31. తడి గాలితో పోలిస్తే పొడి గాలిలో ధ్వని వేగం?

1) ఎక్కువ 2) తక్కువ 3) సమానం 4) శూన్యం


32. ధ్వని తీవ్రత ప్రమాణాలు?

1) ల్యూమెన్‌ 2) హెర్ట్స్‌ 3) డెసిబెల్‌ 4) న్యూటన్‌


33. చిన్నపిల్లలు వినగలిగే పౌనఃపున్య ధ్వనుల అవధి?

1) 20 KHz        2) 10 KHz    

3) 15 KHz        4) 30 KHz


34. నీటిలో మునిగిన వస్తువుల దూరాలను గుర్తించడానికి ఉపయోగించే సోనార్‌ అనే పరికరంలో ఉపయోగపడే ధ్వని ధర్మం?

1) ధ్వని బహుళ పరావర్తనం     2) ధ్వని వ్యతికరణం 

3) ధ్వని పరావర్తనం     4) ధ్వని అనువాదం


35. కిందివాటిలో బహుళ పరావర్తన ధ్వని ఆధారంగా పనిచేసే పరికరం?

1) క్లారినేట్‌     2) షెహనాయ్‌ 

3) స్టెతస్కోపు     4) పైవన్నీ


36. కిందివాటిలో వాయు వాయిద్యం కానిది?

1) హార్మోనియం     2) ఫ్లూట్‌ 

3) ట్రంపెట్‌     4) బుల్‌బుల్‌


37. కిందివాటిలో తీగ వాయిద్యం కానిదానిని గుర్తించండి.

1) వీణ  2) మంజీరా  3) గిటారు  4) ఏక్తార


38. అసలు ధ్వనికి, ప్రతిధ్వనికి మధ్య ఉండాల్సిన కనీస కాలవ్యవధి?


39. దూరంగా ఎక్కడో జరిగిన బాంబు పేలుళ్ల వల్ల ఇంటి కిటికీ అద్దాలు పగిలిపోవడం అనేది?

1) ధ్వని పరావర్తనం       2) ప్రతిధ్వని   

3) ప్రతినాదం       4) అనునాదం


40. నక్షత్రాల నుంచి వచ్చే కాంతిలో రెడ్‌ షిప్ట్, బ్లూ షిప్ట్‌ అనే దృగ్విషయాలను గుర్తించే ధ్వని ధర్మం?

1) అనునాదం       2) డాప్లర్‌ ప్రభావం   

3) ప్రతినాదం       4) ధ్వని వ్యతికరణం


41. ద్రవాలు, వాయువుల్లో జరిగే కాంతి పరిక్షేపణాన్ని వివరించి నోబెల్‌ పురస్కారం పొందిన శాస్త్రవేత్త?

1) సి.వి.రామన్‌       2) సుబ్రమణ్య చంద్రశేఖర్‌   

3) టాలమీ          4) కోపర్నికస్‌


42. సాపేక్ష, క్వాంటం సిద్ధాంతంలోని అంశాల ఆధారంగా నక్షత్రాల పరిమాణాలను విశ్లేషించి నోబెల్‌ పురస్కారం పొందిన శాస్త్రవేత్త?

1) న్యూటన్‌          2) సుబ్రమణ్య చంద్రశేఖర్‌   

3) సి.వి.రామన్‌        4) కోపర్నికస్‌


43. ఒక గిగాహెర్ట్జ్‌ ఎన్ని హెర్ట్జ్‌లకు సమానం?

1) 103    2) 106     3) 109   4) 1012


44. గాలిలో ధ్వని వేగం ఆధారంగా విమానాలు, క్షిపణుల వేగాన్ని కొలిచే ప్రమాణం?

1) ఫుట్‌ క్యాండిల్‌       2) మాక్‌ సంఖ్య   

3) నాటికల్‌ మైల్‌       4) డెసిబెల్‌


45. ఒక సెకను కాలంలో మానవుడి చెవి వినగలిగే గరిష్ఠ విస్పందనాల సంఖ్య?

1) 20     2) 30     3) 15     4) 10


46. 15 dB వరకు అనవసరమైన ధ్వనులను నివారించడానికి ఉపయోగించే పద్ధతి?

1) డాల్బిA   2) డాల్బిB   3) డాల్బిC   4) డాల్బిS


47. ఎంత తీవ్రత ఉండే ధ్వనులు నిరంతరం చెవికి తాకడం వల్ల పర్మినెంట్‌ థ్రెషోల్డ్‌ షిఫ్ట్‌ కలుగుతుంది?

1) 90 dB         2) 80 dB     

3) 60 dB         4) 100 dB


48. భారతదేశ సంగీత స్వరాల నుంచి ‘రి’ అనే అక్షర పానఃపున్యం గుర్తించండి.

1) 256 Hz       2) 288 Hz   

3) 384 Hz       4) 512 Hz


49. న్యూటన్‌ తొలిసారి ధ్వని వేగానికి సైద్ధాంతికంగా ప్రతిపాదించిన సమీకరణం?


50. నీటిలో మోటారు బోటు ప్రయాణించేటప్పుడు ఏర్పడే తరంగాలు?

1) తిర్యక్‌ తరంగాలు       2) అనుదైర్ఘ్య తరంగాలు   

3) తిర్యక్, అనుదైర్ఘ్య తరంగాలు      4) మైక్రో తరంగాలు


సమాధానాలు

1-4; 2-2; 3-4; 4-1; 5-3; 6-4; 7-2; 8-4; 9-1; 10-2; 11-4; 12-2; 13-1; 14-3; 15-4; 16-3; 17-4; 18-2; 19-3; 20-4; 21-2; 22-3; 23-1; 24-2; 25-4; 26-2; 27-1; 28-4; 29-1; 30-1; 31-2; 32-3; 33-4; 34-3; 35-4; 36-4; 37-2; 38-3; 39-4; 40-2; 41-1; 42-2; 43-3; 44-2; 45-4; 46-3; 47-4; 48-2; 49-1; 50-3.


రచయిత: రాజు చంటిపాలెం 

Posted Date : 12-12-2023

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు