• facebook
  • whatsapp
  • telegram

ధ్వని

రాళ్లను కరిగించే అతిధ్వనులు!


కంపించే వస్తువు నుంచి పుట్టి, తరంగాలుగా కదిలే భౌతికాంశమే ధ్వని. విభిన్న యానకాల్లో వివిధ వేగాలతో ప్రయాణించే ఈ యాంత్రిక తరంగాల జననం, గమనాలకు సంబంధించిన ప్రాథమిక వివరాలను, భౌతిక సూత్రాలను అభ్యర్థులు చదువుకోవాలి. పౌనఃపున్యాల వారీగా ధ్వనుల్లోని రకాలు, వాటిని కొలిచే ప్రమాణాలు, మనుషులతో పాటు పలు జీవులు వినగలిగే శబ్దాల పరిధి, శబ్ద కాలుష్యంతో తలెత్తే అనర్థాలు, ప్రతిధ్వని, పరశ్రవ్యాలు తదితరాలతో పాటు రక్షణ, వైద్య రంగాల్లో ధ్వనులను వినియోగిస్తున్న తీరుపై శాస్త్రీయ అవగాహనతో ఉండాలి.


1.    కిందివాటిలో ధ్వని తరంగాలకు సంబంధించి సరికానిది గుర్తించండి. 

1) పౌనఃపున్యం     2) తరంగదైర్ఘ్యం 

3) ఆవర్తనకాలం     4) సాంద్రత


2.     ప్రతి సెకనుకు ఒక యూనిట్‌ ప్రాంతంలో ప్రవహించే ధ్వని శక్తి మొత్తాన్ని ఏమంటారు?

1) పిచ్‌  2) తీవ్రత  3) నాణ్యత  4) వ్యాప్తి 


3.     కిందివాటిలో ధ్వని తరంగ లక్షణం కానిది?

1) హెర్ట్జ్‌     2) పౌనఃపున్యం 

3) తరంగదైర్ఘ్యం     4) తరంగ వేగం 


4.     ధ్వని ఉత్పత్తికి ప్రధానమైంది?

1) పరావర్తనం     2) వక్రీభవనం 

3) కంపనం     4) భ్రమణం


5.     సంపీడనం, విరళీకరణం అనేవి దేని ఆధారంగా ఏర్పడతాయి?

1) ధ్వని వక్రీభవనం     2) ఉష్ణోగ్రతలో తేడా 

3) గాలి పీడనం     4) ధ్వని వివర్తనం


6.     ధ్వని అనేది వినికిడి శక్తిని ఉత్పత్తి చేసే ఏ రూపం?

1) యాంత్రిక తరంగం     2) విద్యుదయస్కాంత తరంగం 

3) ప్రతిధ్వని    4) ప్రతినాదం


7.     ధ్వని తరంగాలు ఏ విధంగా ప్రయాణిస్తాయి?

1) విభిన్న యానకాల్లో ఒకే వేగంతో 2) విభిన్న యానకాల్లో విభిన్న వేగాలతో 

3) ఒకే యానకంలో వేర్వేరు వేగాలతో    4) యానకం లేకుండా 


8.     అతి తక్కువ ఆడియో సౌండ్‌ తీవ్రత ఎంత?

1) 0 డెసిబెల్‌     2) 10 డెసిబెల్‌ 

3) 20 డెసిబెల్‌     4) 100 డెసిబెల్‌


9.     మానవుడు చాలా ఎక్కువ శబ్దాన్ని సహించలేడు. మానవుడు వినగలిగే అత్యున్నత స్థాయి?

1) 90 డెసిబెల్‌     2) 80 డెసిబెల్‌ 

3) 120 డెసిబెల్‌     4) 140 డెసిబెల్‌


10. గాలిలో ధ్వని వేగం కంటే తక్కువ వేగంతో వస్తువులు ప్రయాణిస్తే వాటి వేగాన్ని ఏమంటారు? 

1) హైపర్‌ సోనిక్‌ వేగం 2) సూపర్‌ సోనిక్‌ వేగం 

3) సోనిక్‌ వేగం       4) సబ్‌సోనిక్‌ వేగం 


11. మానవుడి చెవి గుర్తించలేని పౌనఃపున్య ధ్వని?

1) 100 హెర్ట్జ్‌     2) 22,000 హెర్ట్జ్‌ 

3) 1,000 హెర్ట్జ్‌     4) 18,000 హెర్ట్జ్‌


12. ధ్వని తరంగం 340 మీ.సె. వేగంతో ప్రయాణిస్తుంది. దాని తరంగ దైర్ఘ్యం 2 సెం.మీ. అయితే ఆ తరంగ పౌనఃపున్యం ఎంత?

1) 170 హెర్ట్జ్‌     2) 1,700 హెర్ట్జ్‌ 

3) 17,000 హెర్ట్జ్‌     4) 680 హెర్ట్జ్‌


13. గబ్బిలాలు ప్రయాణించేటప్పుడు మార్గమధ్యంలో అడ్డంకులను గుర్తిôచడానికి అవి ఉత్పత్తి చేసే ధ్వనులు?    

1) పరశ్రవ్య ధ్వనులు     2) అతిధ్వనులు 

3) వక్రీభవన ధ్వనులు     4) అనునాద ధ్వనులు


14. లోహ పలకల్లో ఉన్న పగుళ్లను గుర్తించేందుకు ఉపయోగించే తరంగాలు?

1) పరశ్రవ్యాలు     2) కాంతి తరంగాలు 

3) రేడియో తరంగాలు     4) అతిధ్వనులు


15. మూత్రపిండాల్లో ఏర్పడిన రాళ్లను కరిగించడానికి ఉపయోగించే తరంగాలు?

1) అతిధ్వనులు     2) కాంతి తరంగాలు 

3) రేడియో తరంగాలు     4) పరారుణ కిరణాలు 


16. ధ్వని బహుళపరావర్తన ధర్మం ఆధారంగా పనిచేసే పరికరం ఏది? 

1) ఈసీజీ 2) ఈఈజీ 3) స్టెతస్కోప్‌  4) రాడార్‌ 


17. ధ్వని తరంగాలను విద్యుత్తు తరంగాలుగా మార్చే పరికరం ఏది?

1) రేడియో     2) హైడ్రోఫోన్‌ 

3) టెలిఫోన్‌     4) మైక్రోఫోన్‌ 


18. వాయువులో ఉష్ణోగ్రత పెరిగితే ధ్వనివేగంలో కలిగే మార్పు గుర్తించండి. 

1) తగ్గుతుంది      2) పెరుగుతుంది 

3) మారదు       4) పెరిగి తర్వాత తగ్గుతుంది


19. డాప్లర్‌ ఫలితం అనువర్తనాన్ని గుర్తించండి.

1) గర్భస్థ శిశువు కదలికలు తెలుసుకోవడం  2) రాడార్‌ పనిచేయడం

3) వాహనాల వేగాన్ని లెక్కించే స్పీడ్‌ గన్‌   4) పైవన్నీ


20. నీటిలో మునిగిపోయిన వస్తువును గుర్తించేందుకు ఉపయోగించే పరికరం?

1) పెరిస్కోప్‌     2) రాడార్‌ 

3) సోనార్‌     4) కెలిడియోస్కోప్‌


21. రెండు ధ్వనుల మధ్య తేడాను గుర్తించేందుకు వ్యక్తికి కావాల్సిన సమయం ఎంత?    


22. ప్రతి ధ్వనిని స్పష్టంగా వినాలంటే పరావర్తన తలం నుంచి పరిశీలకుడి మధ్య ఉండాల్సిన కనీస దూరం?

1) 18.5 మీ. 2) 16.5 మీ.  3) 15 మీ. 4) 20 మీ.


23. సైనికులు కవాతు నిర్వహించేటప్పుడు వంతెన రాగానే ఆపుతారు. దానికి కారణమేమిటి? 

1) ధ్వని వివర్తనం     2) ధ్వని వక్రీభవనం 

3) ధ్వని బహుళ పరావర్తనం             4) ధ్వని అనునాదం


24. పురుషులతో పోలిస్తే స్త్రీల కంఠస్వరం కీచుగా ఉండటానికి కారణం?

1) పౌనఃపున్యం ఎక్కువ     2) పౌనఃపున్యం తక్కువ 

3) పౌనఃపున్యం శూన్యం     4) తీవ్రత ఎక్కువగా ఉండటం 


25. ధ్వని బంధక గదులను నిర్మించడంలో ఉపయోగించే పదార్థం? 

1) థర్మాకోల్‌     2) స్వచ్ఛమైన ప్లాస్టిక్‌     

3) రబ్బరు     4) పైవన్నీ 


26. ధ్వని తరంగాలు కిందివాటిలో దేని ద్వారా ప్రయాణించవు?

1) ఘన పదార్థాలు     2) ద్రవ పదార్థాలు 

3) వాయు పదార్థాలు     4) శూన్యం


27. కిందివాటిలో ఏ రోజు ధ్వని వేగం ఎక్కువగా ఉంటుంది?

1) 0°C వద్ద పొడిరోజు 2) 30°C వద్ద పొడిరోజు 

3) 0°C వద్ద తడిరోజు  4) 30°C వద్ద తడిరోజు


28. కిందివాటిలో ధ్వని వేగానికి సంబంధించి సరికానిది గుర్తించండి.

1) ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది.

2) సాంద్రతకు విలోమానుపాతంలో ఉంటుంది.

3) తేమకు అనులోమానుపాతంలో ఉంటుంది. 

4) పీడనానికి విలోమానుపాతంలో ఉంటుంది. 


29. రెండు ఎత్తయిన భవనాల మధ్య లేదా రెండు పర్వతాల మధ్య దూరాన్ని గుర్తించడానికి ఉపయోగపడేది?

1) ప్రతిధ్వని     2) ప్రతినాదం 

3) అనునాదం     4) విస్పందనాలు 


30. కిందివాటిలో దేనిలో మాక్‌ నంబర్‌ను ఉపయోగిస్తారు?

1) ధ్వని 2) కాంతి 3) విద్యుత్తు 4) అయస్కాంతం


31. ధ్వనిని రికార్డు చేయడాన్ని ఏమంటారు?     

1) వీడియోగ్రఫి     2) ఆడియోగ్రఫి 

3) ఫొటోగ్రఫి     4) రేడియోగ్రఫి


32. మన దేశంలో ప్రతిధ్వని వినిపించే స్థలం?

1) తమిళనాడు     2) కర్ణాటక 

3) కేరళ     4) ఆంధ్రప్రదేశ్‌ 


33. యాంత్రిక తరంగాలు ప్రసరింపజేసే యానకాలు కలిగి ఉండేవి? 

1) స్థితిస్థాపకత              2) జడత్వం 

3) ధ్వనిశక్తిని ప్రసారం చేయడం    4) పైవన్నీ


34. కిందివాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి.

1) జలాంతర్గామిని బుష్నెల్‌ కనుక్కున్నాడు.

2) జలాంతర్గామి ధ్వని వక్రీభవనం ఆధారంగా పనిచేస్తుంది. 

3) దీని ఉనికిని సోనార్‌తో కనుక్కోవచ్చు.

4) మొదటి మానవసహిత జలాంతర్గామిని రాబర్ట్‌ పుల్టిన్‌ ఆవిష్కరించాడు.


35. కిందివాటిలో నిశ్శబ్ద మండలాల పరిధిలో లేనివి?

1) ఆసుపత్రులు     2) విద్యాలయాలు 

3) సినిమాహాళ్లు     4) న్యాయస్థానాలు 


36. కిందివాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి.

1) ఘన పదార్థాలను వేడి చేస్తే వాటిలో ధ్వనివేగం పెరుగుతుంది.

2) ఉష్ణోగ్రత పెరిగితే ఘన పదార్థాల్లో కణాల కంపనాలు పెరుగుతాయి.

3) హైడ్రోజన్‌ వాయువులో ధ్వనివేగం ఎక్కువ.

4) ఆర్ధ్రత పెరిగితే గాలిలో ధ్వనివేగం తగ్గుతుంది.


37. ఎగిరే వస్తువుల వేగాన్ని కొలిచే పరికరం?

1) మాకో మీటర్‌     2) సౌండ్‌ మీటర్‌ 

3) పాథో మీటర్‌     4) పల్వనో మీటర్‌


38. ధ్వని కాలుష్యం వల్ల కలిగే చెడు ప్రభావాలను గుర్తించండి.

1) వినికిడి జ్ఞానం కోల్పోవడం         2) అసహనం, అజీర్తి

3) రక్తపోటు, తలపోటు      4) పైవన్నీ


39. కిందివాటిలో తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి.

1) అతిధ్వనుల ఉత్పత్తిని ఫిజో విద్యుత్తు అంటారు. 

2) సోనార్‌ను నిక్సన్‌ కనుక్కున్నాడు.

3) రేడియోను వాట్సన్‌ వాట్‌ కనుక్కున్నాడు. 

4) జలాంతర్గామిని బుష్నెల్‌ కనుక్కున్నాడు.


40. యానకంలో ధ్వని ప్రయాణిస్తుందని మనం ఎప్పుడు అంటాం?     

1) యానకం ప్రయాణించేటప్పుడు 

2) యానకంలో కణాలు ప్రయాణిస్తున్నప్పుడు 

3) ధ్వని జనకం ప్రయాణిస్తున్నప్పుడు 

4) యానకం ద్వారా అలజడి ప్రయాణిస్తున్నప్పుడు


41. టీవీలో శబ్దం పెంచితే ఇందులో మారే అంశం గుర్తించండి.

1) కంపన పరిమితి     2) పౌనఃపున్యం 

3) తరంగదైర్ఘ్యం     4) వేగం


42. ధ్వని వల్ల మెదడు పొందే అనుభూతిని తెలియజేసే ధ్వని లక్షణం?

1) పిచ్‌   2) తీవ్రత  3) నాణ్యత  4) పైవన్నీ 


43. కిందివాటిలో ఏ యానకంలో ధ్వని వేగం అధికంగా ఉంటుంది? 

1) గాలి   2) పాదరసం   3) నీరు   4) దూది 


44. ధ్వనికి, దాని ప్రతిధ్వనికి కింది ఏ విషయంలో తేడా ఉంటుంది?

1) పౌనఃపున్యం     2) వేగం 

3) తరంగదైర్ఘ్యం     4) ధ్వని తీవ్రత


45. కిందివాటిలో ధ్వని తీవ్రతకు ప్రమాణం తెలపండి.

1) న్యూటన్‌ 2) పాస్కల్‌    3) హెర్ట్జ్‌ 4) డెసిబెల్‌


46. పిల్లనగ్రోవి, విజిల్, రేడియో లాంటి పరికరాలు పనిచేసే ధర్మం?

1) ప్రతిధ్వని     2) అనునాదం 

3) డాప్లర్‌ ప్రభావం     4) విస్పందనాలు


47. మానవుడి సాధారణ సంభాషణ శబ్ద తీవ్రత?

1) 80 డెసిబెల్‌     2) 30 డెసిబెల్‌ 

3) 50-60 డెసిబెల్‌         4) 120 డెసిబెల్‌


సమాధానాలు

1-4; 2-2; 3-1; 4-3; 5-2; 6-1; 7-2; 8-1; 9-2; 10-4; 11-2; 12-1; 13-2; 14-4; 15-1; 16-3; 17-4; 18-2; 19-4; 20-3; 21-1; 22-2; 23-4; 24-1; 25-4; 26-4; 27-4; 28-4; 29-1; 30-1; 31-2; 32-3; 33-4; 34-2; 35-3; 36-4; 37-1; 38-4; 39-3; 40-4; 41-1; 42-1; 43-2; 44-4; 45-4; 46-2; 47-3. 

Posted Date : 01-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌