• facebook
  • whatsapp
  • telegram

భూమి మీద అక్కడే అధిక శాతం జీవులు! 

జలావరణం

ఖగోళ వస్తువుల్లో మనిషికి తెలిసి జీవుల ఉనికి ఉన్నది ఒక్క భూగ్రహం మీద మాత్రమే. ఆ జీవుల పుట్టుక, మనుగడకు మూలమైన నీరు కూడా ఇక్కడే ఉంది. భూమిపై అతి ముఖ్యమైన ఆ నీటి విస్తరణ గురించి తెలియజేసేదే జలావరణం. ప్రధాన నీటివనరులైన మహాసముద్రాలు, పరిధి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సముద్ర మైదానాలు, అగాధదరులు, సముద్ర లవణీయత, ఉష్ణోగ్రత, ప్రవాహాలు, వాతావరణంపై వాటి ప్రభావాల గురించి పరీక్షార్థులు సమగ్రంగా చదువుకోవాలి. మంచినీరు ఎక్కడెక్కడ, ఏయే వనరుల రూపంలో లభిస్తోంC, అందులో వినియోగిస్తున్న పరిమాణం ఎంత వంటి ప్రాథమికాంశాలను 
గణాంకసహితంగా తెలుసుకోవాలి. 


1. భూగోళంపై ఉన్న మొత్తం నీటిలో ఎంత శాతం ఉప్పు నీరుగా మహాసముద్రాల్లో ఉంది?

1) 96.2169%     2) 97.2169% 

3) 98.2169%     4) 95.2169%


2. మహాసముద్ర భూతల స్వరూపంలో భాగంగా ఖండతీరపు అంచు సముద్ర విస్తీర్ణంలో ఎంత శాతం ఉంటుంది?

1) 6.7%  2) 8.7%  3) 7.6%  4) 8.9%


3. జావా అగాధం కింది ఏ మహాసముద్రంలో ఉంది?

1) పసిఫిక్‌ మహాసముద్రం       2) హిందూ మహాసముద్రం 

3) అట్లాంటిక్‌ మహాసముద్రం     4) అంటార్కిటిక్‌ మహాసముద్రం


4. ఉపరితలం నుంచి ఒకే లోతులో ఉన్న సముద్రపు నేలలను కలుపుతూ గీసే గీతలను ఏమంటారు?

1) లిథోఫైట్స్‌     2) కాంటూరు రేఖలు 

3) ఐసోబాత్స్‌     4) జీరోఫైట్స్‌


5. మెరియానా అగాధదరి లోతు ఎంత?

1) 10,022 మీ.       2) 10,475 మీ.   

3) 11,022 మీ.       4) 11,075 మీ.


6. ఖండతీరపు వాలు మహాసముద్ర విస్తీర్ణంలో ఎంత శాతం విస్తరించి ఉంటుంది?

1) 7.6%  2) 25%   3) 47%  4) 15%


7. మంచినీటిలో ఎంత శాతం అంటార్కిటికా, ఆర్కిటిక్, ఇతర పర్వతాల్లో శాశ్వతంగా మంచు రూపంలో ఉంది?

1) 69.56%        2) 59.56%    

3) 79.56%       4) 97.46%


8. కిందివాటిలో ఖండతీరపు అంచుకు సంబంధించి సరికానిదాన్ని గుర్తించండి.

1) ఈ ప్రాంతంలో మత్స్య సంపద ఎక్కువ.

2) ఈ ప్రాంతంలో ముడి చమురు, సహజవాయువులు దొరుకుతాయి.

3) ఈ ప్రాంతంలో ఓడరేవులు నిర్మించవచ్చు.

4) ఈ ప్రాంతంలో సముద్ర అగాధదరులు ఉంటాయి.


9. ప్రపంచంలోకెల్లా అత్యంత చదునుగా, నునువుగా ఉండే ప్రాంతం ఏది?

1) ఖండతీరపు అంచు    2) ఖండతీరపు వాలు

3) మహాసముద్ర అగాధాలు    4) మహాసముద్ర మైదానాలు


10. ప్యూటోరికో అగాధం ఏ మహాసముద్రంలో ఉంది?

1) పసిఫిక్‌        2) అట్లాంటిక్‌   

3) అంటార్కిటిక్‌       4) హిందూ


11. నదుల నీటిలో ఉప్పు శాతం ఎంత ఉంటుంది?

1) 3%   2) 4%   3) 2%    4) 1%


12. మొత్తం నీటిలో మంచి నీటి శాతం ఎంత?

1) 3.4231%       2) 2.7831%   

3) 4.7912%       4) 1.7284%


13. మంచినీటిలో ఎంత శాతం నీరు భూగర్భ జలాల రూపంలో ఉంది?

1) 40.1% 2) 30.1% 3) 29.1% 4) 44.1%


14. వాతావరణంలోని నీరు భూమి ఉపరితలానికి చేరడాన్ని ఏమంటారు?

1) ద్రవీభవనం           2) రవాణా

3) బాష్పీభవనం         4) అవపాతం


15. కిందివాటిలో భూమికి, సముద్రానికి మధ్య సరిహద్దు ప్రాంతం ఏది?

1) ఖండతీరపు వాలు        2) మహాసముద్ర మైదానం

3) ఖండతీరపు అంచు        4) మహాసముద్ర అగాధాలు


16. భూమి మీద అధిక శాతం జీవులు ఎక్కడ ఉన్నాయి?

1) అడవులు        2) మహాసముద్రాలు

3) కొండలు         4) ఏదీకాదు


17. భూపరివేష్టిత సముద్రాల వద్ద ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉంటాయి?

1) అతి తక్కువగా          2) ఎక్కువగా 

3) మధ్యస్థంగా            4) మార్పు ఉండదు


18. కిందివాటిలో తక్కువ లవణీయత ఉన్న జలభాగాలు?

1) వాండ సరస్సు         2) రెట్బా సరస్సు 

3) బాల్టిక్‌ సముద్రం       4) హడ్సన్‌ అఖాతం


19. సముద్రంలో ఒకే లవణీయత ఉన్న ప్రాంతాలను కలిపే రేఖలను ఏమంటారు?

1) ఐసోహలైన్స్‌        2) కాంటూరు లైన్స్‌ 

3) ఐసోబార్స్‌          4) లిథోఫైట్స్‌


20. బాల్టిక్‌ సముద్రంలో లవణీయత ఎంత శాతం ఉంటుంది?

1) 7%  2) 10%  3) 15%  4) 24%


21. కిందివాటిలో వేటిలో అధిక లవణీయత ఉంటుంది?

1) హడ్సన్‌ అఖాతం     2) బాల్టిక్‌ సముద్రం 

3) వాండ సరస్సు     4) డాన్‌జోన్‌ కొలను


22. సాధారణంగా మహాసముద్రాల నీటి లవణీయత ఎంత శాతం ఉంటుంది?

1) 40%  2) 45%  3) 30% 4) 35%


23. సముద్రపు నీటిలో పెద్ద మొత్తంలో కరిగిన ఖనిజాల్లో ఉప్పు ఒక్కటే ఎంత శాతం ఉంటుంది?

1) 90% 2) 85%  3) 77.8% 4) 97.93%


24. జావా అగాధం లోతు ఎంత?

1) 11,022 మీ.     2) 11,475 మీ. 

3) 7,450 మీ.     4) 10,722 మీ.


25. మహాసముద్ర మైదానాలు ఎంత లోతు వరకు విస్తరించి ఉంటాయి?

1) 200 మీ. నుంచి 3000 మీ.    2) 3000 మీ. నుంచి 6000 మీ.

3) 6000 మీ. కంటే ఎక్కువ లోతు    4) 4000 మీ. నుంచి 7000 మీ.


26. ఫలకల కదలికల అధ్యయనంలో కిందివాటిలో ఏవి కీలకపాత్ర పోషిస్తాయి?

1) ఖండతీరపు వాలు     2) ఖండతీరపు అంచు

3) మహాసముద్ర అగాధాలు   4) మహాసముద్ర మైదానాలు


27. నేవ్స్‌ అగాధం లోతు ఎంత?

1) 11,475 మీ.       2) 10,475 మీ.   

3) 9,475 మీ.       4) 7,450 మీ.


28. ఇప్పటివరకు దాదాపుగా ఎన్ని అగాధాలను అధ్యయనం చేశారు?

1) 77     2) 47     3) 57     4) 37


29. మహాసముద్ర మైదానాలు మొత్తం మహాసముద్ర భూతల స్వరూపంలో ఎంతశాతం విస్తరించి ఉన్నాయి?

1) 86.24% 2) 76.2% 3) 87.3% 4) 74.3%


30. కిందివాటిలో అమెరికా నుంచి యూరప్, ఆఫ్రికాలను వేరుచేస్తున్న మహాసముద్రం?

1) పసిఫిక్‌     2) అట్లాంటిక్‌ 

3) ఆర్కిటిక్‌         4) దక్షిణ మహాసముద్రం


31. కిందివాటిలో పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రాల కొనసాగింపుగా ఉన్న మహాసముద్రం?

1) హిందూ మహాసముద్రం       2) దక్షిణ మహాసముద్రం

3) ఆర్కిటిక్‌ మహాసముద్రం       4) అట్లాంటిక్‌ మహాసముద్రం


32. భూమి మొత్తం మీద ఉన్న మంచినీటిలో చెరువులు, ఆనకట్టలు, నదుల రూపంలో ఎంత శాతం ఉంది?

1) 0.45% 2) 0.74% 3) 0.34% 4) 0.65%


33. భూమిపై ఉండే మొత్తం నీటిలో నదులు ఎంత శాతం నీరు కలిగి ఉన్నాయి?

1) 0.01%     2) 0.001% 

3) 0.0001%     4) 0.00001%


34. కిందివాటిలో డాన్‌జోన్‌ కొలను ఎక్కడ ఉంది?

1) అంటార్కిటికా     2) ఆర్కిటిక్‌ 

3) అట్లాంటిక్‌     4) సెనెగల్‌


35. వాండ సరస్సు లవణీయత ఎంత?

1) 440%  2) 400%  3) 350% 4) 300%


36. కిందివాటిలో ఏ మహాసముద్రంలోని ఉష్ణోగ్రతల్లో తేడాల వల్ల ‘ఎల్‌నినో’, ‘లానినో’లు ఏర్పడతాయి?

1) అట్లాంటిక్‌     2) పసిఫిక్‌ 

3) ఆర్కిటిక్‌     4) అంటార్కిటిక్‌


37. కిందివాటిలో ఏవి మహాసముద్రపు ఉష్ణోగ్రతలను ప్రభావితం చేస్తాయి?

1)  అక్షాంశాలు    2) సముద్ర ప్రవాహాలు

3) భూవిస్తీర్ణంలో తేడాలు    4) పైవన్నీ


38. సముద్రపు లోతుల్లోకి వెళుతున్న కొద్దీ ఉష్ణోగ్రతలు ఏ విధంగా మారతాయి?

1) పెరుగుతాయి    2) తగ్గుతాయి

3) మార్పు ఉండదు       4) మధ్యస్థంగా ఉంటాయి


39. ఎర్రసముద్రంలో ఉష్ణోగ్రత అత్యధికంగా ఎంతగా నమోదైంది?

1) 48ºC      2) 28ºC    3) 38ºC     4) 35ºC


40. సాధారణంగా మహాసముద్రాల ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయి?

1) 2ºC నుంచి 30ºC ల మధ్య     2) 5ºC నుంచి 30ºC ల మధ్య 

3) - 2ºC నుంచి 29ºC ల మధ్య     4) 5ºC నుంచి 32ºC ల మధ్య


41. రెట్బా సరస్సు లవణీయత ఎంత ఉంటుంది?

1) 440%   2) 350%  3) 400%  4) 300%


42. భూమిపై మొత్తం జలభాగంలో వాతావరణంలోని నీటి శాతం ఎంత?

1) 0.01%     2) 0.001%         

3) 0.0001%         4) 0.00001%


43. కిందివాటిలో మహాసముద్ర ప్రవాహాలకు కారణాలు గుర్తించండి.

1) అపకేంద్ర బలం    2) పవనాల ప్రభావం

3) అవపాతం    4) పైవన్నీ


44. కిందివాటిలో ‘డ్రిఫ్ట్‌’ అంటే ఏమిటి?

1) వేగంగా ప్రవహించే సముద్ర ప్రవాహం 2) నిదానంగా ప్రవహించే సముద్ర ప్రవాహం

3) సముద్రాల్లో లవణీయత మార్పు   4) సముద్రాల లోతుల్లో వ్యత్యాసం


45. అతిపెద్ద ఖండతీరపు అంచు ఏ మహాసముద్రంలో ఉంది?

1) అట్లాంటిక్‌ మహాసముద్రం        2) పసిఫిక్‌ మహాసముద్రం

3) ఆర్కిటిక్‌ మహాసముద్రం        4) హిందూ మహాసముద్రం


46. మొత్తం జలభాగంలో సరస్సుల్లోని నీరు ఎంత శాతం ఉంటుంది?

1) 0.08%     2) 0.008%  

3) 0.001%     4) 0.01%


47. హడ్సన్‌ అఖాతం లవణీయత ఎంత ఉంటుంది?

1) 5% నుంచి 15%    2) 3% నుంచి 15%

3) 10% నుంచి 15%    4) 15% పైన


సమాధానాలు

1-2, 2-3, 3-2, 4-3, 5-3, 6-4, 7-1, 8-4, 9-4, 10-2, 11-3, 12-2, 13-2, 14-4, 15-3, 16-2, 17-2, 18-3, 19-1, 20-2, 21-4, 22-4, 23-3, 24-3, 25-2, 26-3, 27-2, 28-3, 29-2, 30-2, 31-2, 32-3, 33-3, 34-1, 35-3, 36-2, 37-4, 38-2, 39-3, 40-3, 41-3, 42-2, 43-4, 44-2, 45-3, 46-2, 47-2.

రచయిత: బండ్ల శ్రీధర్‌ 
 

Posted Date : 16-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌