• facebook
  • whatsapp
  • telegram

సమస్త మానవాళికీ జీవనాధారం!

దారాలు - ప్లాస్టిక్స్‌

దారం లేనిదే మనకు క్షణం గడవదు. ఉదయం లేవగానే ఉపయోగించే టూత్‌బ్రష్‌ మొదలు, ధరించే దుస్తులు సహా పలు రకాలుగా నూలు వినియోగంలో ఉంటుంది. నిత్యజీవితంలో అతి ముఖ్యమైన భాగంగా మారిపోయిన ఆ దారం తయారయ్యే విధానం,  మొక్కలు, జంతువుల నుంచి లభించే సహజ దారాలు, పెట్రో రసాయనాలతో  ఉత్పత్తి చేసే కృత్రిమ దారాలు, పాలిమర్‌ రూపమైన ప్లాస్టిక్‌ గురించి అభ్యర్థులు తెలుసుకోవాలి. దారాలకు ఉండే విభిన్న ప్రయోజనాలు, వాటిని అందించే జంతువులు, మొక్కలు, పంటలతో పాటు భౌగోళికంగా అవి ఎక్కడెక్కడ లభ్యమవుతాయనే అంశాలపై అవగాహన ఉండాలి.


1.    పాలిమర్‌ అనే పదం పాలి, మెర్‌ అనే ఏ భాషా పదాల నుంచి వచ్చింది?

1) లాటిన్‌  2) గ్రీకు 3) అరబిక్‌ 4) ఇటాలియన్‌


2.     కిందివాటిలో మొక్కల నుంచి లభించే దారం కానిది?

1) కిత్తనార  2) నూలు  3) ఉన్ని  4) జనుము


3.     కిందివాటిలో బంగారు దారంగా పేరుగాంచింది?

1) ఉన్ని  2) నూలు  3) పట్టు   4) జనుము    


4.    కిందివాటిలో సిరిసిన్, ఫైబ్రోయిన్‌ అనే ప్రొటీన్‌లు కలిగిన దారం?

1) పట్టు   2) ఉన్ని   3) నూలు  4) కిత్తనార


5.     దూది నుంచి గింజలను తొలగించడాన్ని ఏమంటారు?

1) కార్డింగ్‌ 2) జిన్నింగ్‌ 3) డైయింగ్‌ 4) సార్టింగ్‌


6.     మెరినో జాతి గొర్రె ఒక సంవత్సరంలో ఎంత ఉన్ని ఇస్తుంది? 

1) 10 - 15 కి.గ్రా.         2) 5 - 10 కి.గ్రా.

3) 5 - 18 కి.గ్రా.            4) 15 - 20 కి.గ్రా.


7.     దుస్తులకు రంగులు అద్దడాన్ని ఏ విధంగా పిలుస్తారు?

1) కార్డింగ్‌  2) డైయింగ్‌     3) సార్టింగ్‌ 4) బ్లీచింగ్‌


8.     జనుము దారాన్ని మొక్కల ఏ భాగం నుంచి తయారుచేస్తారు?

1) ఆకులు  2) వేర్లు  3) కాండం  4) కాయలు


9.     సెల్యులోజ్‌ అని పిలిచే కార్బోహైడ్రేట్‌ దేని నుంచి లభిస్తుంది?

1) పత్తి   2) ఉన్ని   3) పట్టు   4) కొబ్బరి


10. గోనె సంచులు, తివాచీల తయారీకి ఉపయోగించే దారం?

1) పత్తి  2) ఉన్ని  3) జనుము  4) గోగునార


11. పత్తి దారాల నుంచి వస్త్రం పొందడానికి సంబంధించి సరైన క్రమం?

1) దువ్వడం - వడకడం - దారం - నేయడం

2) దువ్వడం - దారం - వడకడం - నేయడం

3) దారం - దువ్వడం - నేయడం - వడకడం

4) వడకడం - నేయడం - దారం - దువ్వడం


12. భారతదేశంలో జనపనార అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం?

1) ఒడిశా      2) ఆంధ్రప్రదేశ్‌ 

3) ఉత్తర్‌ప్రదేశ్‌     4) పశ్చిమ బెంగాల్‌


13. కొబ్బరి పీచు ఉత్పత్తులకు సంబంధించి సరైనవి?

1) కొబ్బరి పీచు     2) కొబ్బరి పొట్టు 

3) కొబ్బరి తాడు      4) పైవన్నీ


14. పుట్టగొడుగులను పెంచడానికి దేన్ని ఆధార పదార్థంగా ఉపయోగిస్తారు?

1) జనుమునార      2) గోగునార  

3) అరటినార     4) కొబ్బరి పీచు


15. బ్రష్, డోర్‌మ్యాట్లు, పరుపులు, సంచుల తయారీకి ఉపయోగించే నారను గుర్తించండి.

1) నీలం రంగు కొబ్బరి పీచు     2) ఎరుపు రంగు కొబ్బరి పీచు   

3) గోధుమ రంగు కొబ్బరి పీచు     4) నలుపు రంగు కొబ్బరి పీచు 


16. నూలు వడకడానికి ఉపయోగించే సాధనం?

1) సూది   2) కత్తెర   3) తకిలి   4) కత్తి 


17. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్ని తయారీకి ప్రధాన వనరు?

1) గొర్రెలు 2) మేకలు 3) ఒంటెలు 4) కుందేలు 


18. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో పాలు, మాంసం, ఉన్ని కోసం ఏ జాతి గొర్రెలను పెంచుతున్నారు?

1) ఇరాని జాతి గొర్రె      2) కశ్మీర్‌ జాతి గొర్రె  

3) అంగోరా జాతి గొర్రె     4) డెక్కనీ జాతి గొర్రె


19. ఏ మేక నుంచి లభించే ఉన్నిని మొహయిర్‌ అంటారు?

1) కెష్మియర్‌ మేక       2) అంగోరా మేక 

3) డెక్కనీ మేక         4) పుంగనూరు మేక 


20. ఏ మేక నుంచి అత్యంత ఖరీదైన ఉన్ని లభిస్తుంది?

1) అంగోరా మేక      2) కెష్మియర్‌ మేక  

3) ఇరాని మేక       4) డెక్కనీ మేక


21. ఏ జంతువుల నుంచి లభించే ఉన్ని గరుకుగా ఉండి, ఉన్నికి ఉండాల్సిన ఇతర అన్ని లక్షణాలను కలిగి ఉంటుంది?    

1) గొర్రెలు         2) మేకలు 

3) జడల బర్రెలు         4) ఒంటెలు


22. ఏ జంతువు రాల్చిన వెంట్రుకల నుంచి కోట్లు, బ్లేజర్లు తయారుచేస్తారు?

1) జడల బర్రె      2) ఒంటె  

3) లామా     4) ఆల్వకా 


23. లద్దాఖ్, టిబెట్‌లో కనిపించే పొడవైన వెంట్రుకలున్న జంతువు?

1) జడల బర్రె 2) ఒంటె    3) లామా 4) ఆల్వకా    


24. తెలుపు రంగులో ఉండే మెత్తని ఉన్ని ఇచ్చే జంతువు?

1) లామా      2) ఆల్వకా 

3) కుందేలు      4) మేక


25. దక్షిణ అమెరికాలో ఉన్ని కోసం పెంచే పొడవైన వెంట్రుకలున్న జంతువులు?

1) ఒంటె 2) లామా 3) ఆల్వకా 4) ఒంటె, లామా


26. వర్ల అనే గ్రామం నాణ్యమైన ఉన్ని కంబళ్లకు ప్రసిద్ధి గాంచింది. వర్ల అనే గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది?

1) తెలంగాణ      2) ఆంధ్రప్రదేశ్‌ 

3) కర్ణాటక      4) తమిళనాడు


27. ఊలు దారంలో ఉండే ప్రొటీన్‌ను గుర్తించండి.

1) సిరిసిన్‌     2) ఫైబ్రనోయిన్‌ 

3) సెల్యులోజ్‌     4) కెరాటిన్‌


28. కిందివాటిలో అధమ ఉష్ణవాహకం గల దారం?

1) పట్టు  2) ఉన్ని   3) నూలు  4) రేయాన్‌


29. కలంకారీ ఒక రకమైన చేతి ముద్రిత నూలు వస్త్ర పరిశ్రమ. ఈ కలంకారీ పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన పట్టణం?

1) సిరిసిల్ల 2) గద్వాల్‌ 3) మచిలీపట్నం 4) ధర్మవరం


30. తివాచీల పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన పట్టణం?

1) సిరిసిల్ల 2) గద్వాల్‌ 3) ధర్మవరం 4) మచిలీపట్నం


31. భారతదేశంలో గ్రామీణ పరిశ్రమల్లో కొబ్బరి పీచు పరిశ్రమ ఒకటి. దీనిలో మహిళా కార్మికుల శాతం దాదాపు?

1) 50%  2) 30%  3) 80%  4) 20%


32. ఒక దారాన్ని మండించినప్పుడు జుట్టుకాలిన వాసన వస్తే అది ఏ దారం? 

1) నూలు  2) ఉన్ని   3) నైలాన్‌  4) ఆక్రలిన్‌


33. ప్రపంచంలో మొదటిసారిగా తయారుచేసిన కృత్రిమ దారం?

1) నైలాన్‌ 2) రేయాన్‌ 3) ఆక్రలిన్‌  4) పాలిస్టర్‌


34. కిందివాటిలో కృత్రిమ పట్టుగా పిలిచే దారం?

1) ఆక్రలిన్‌      2) రేయాన్‌  

3) నైలాన్‌     4) పాలిస్టర్‌


35. చిన్నపిల్లల డైపర్స్‌లో ఉపయోగించే దారం?

1) రేయాన్‌ 2) నైలాన్‌ 3) ఆక్రలిన్‌ 4) పాలిస్టర్‌


36. నకిలీ ఉన్నిగా పిలిచే కృత్రిమ దారాన్ని గుర్తించండి.

1) పాలిస్టర్‌  2) రేయాన్‌    3) ఆక్రలిన్‌ 4) నైలాన్‌


37. టెర్లిన్‌ అంటే? 

1) ప్రసిద్ధి పొందిన నైలాన్‌         2) ప్రసిద్ధి పొందిన ఆక్రలిన్‌

3) ప్రసిద్ధి పొందిన రేయాన్‌         4) ప్రసిద్ధి పొందిన పాలిస్టర్‌


38. పారాచ్యూట్‌ల తయారీకి, పర్వతాలు ఎక్కడానికి ఉపయోగించే తాళ్లు?

1) నైలాన్‌ 2) రేయాన్‌ 3) ఆక్రలిన్‌ 4) పాలిస్టర్‌


39. పాలిస్టర్, ఉన్నితో ఏర్పడే మిశ్రమ దారం?

1) పాలికాట్‌      2) పాలి సిల్క్‌  

3) పాలి ఊల్‌     4) పాలి నైలాన్‌


40. మొదటిసారిగా ప్లాస్టిక్‌ను తయారుచేసిన శాస్త్రవేత్త?

1) బేక్‌లాండ్‌      2) స్టాడింగర్‌  

3) రుడాల్ఫ్‌ హెర్ట్జ్‌      4) అలెగ్జాండర్‌ పార్క్స్‌


41. కిందివాటిలో థర్మోప్లాస్టిక్‌ను గుర్తించండి.

1) కుక్కర్‌ పిడి      2) కంప్యూటర్‌ క్యాబిన్స్‌  

3) పీవీసీ      4) మెలమిన్‌


42. కిందివాటిలో థర్మోసెట్టింగ్‌ ప్లాస్టిక్‌కు ఉదాహరణ?

1) పీవీసీ      2) పాలిథిన్‌ కవర్‌ 

3) వాటర్‌ ప్యాకెట్‌ కవర్స్‌  4) బేకలైట్‌ 


1) PET    2) HDPE   3) LDPE    4) PVC


44. వాటర్‌బాటిల్స్, కూల్‌డ్రింక్‌ బాటిల్స్‌పైన త్రిభుజాకార సింబల్‌లో ఉండే నంబర్‌ను గుర్తించండి.

45. ఏ దారాన్ని మండిస్తే కాగితం కాలిన వాసన వస్తుంది?

1) నూలు  2) ఉన్ని  3) ఆక్రలిన్‌  4) పట్టు


46. అల్లిక దారాలు, క్రీడా దుస్తుల తయారీకి ఉపయోగించే దారం?

1) నైలాన్‌     2) రేయాన్‌ 

3) పాలిస్టర్‌     4) ఆక్రలిన్‌


47. టూత్‌బ్రష్, చేపలు పట్టే వలల్లో ఉపయోగించే కృత్రిమ దారం?

1) నైలాన్‌     2) రేయాన్‌ 

3) పాలిస్టర్‌     4) ఆక్రలిన్‌


48. ప్రపంచంలో ప్రస్తుతం అత్యధికంగా దుస్తుల తయారీలో ఉపయోగించే దారం?

1) నైలాన్‌      2) పాలిస్టర్‌ 

3) ఆక్రలిన్‌     4) రేయాన్‌


49. ఎముకలు విరిగినప్పుడు, గాయాలు తగిలినప్పుడు కట్లు కట్టడానికి ఉపయోగించే దారం?

1) నైలాన్‌     2) పాలిస్టర్‌ 

3) రేయాన్‌      4) ఆక్రలిన్‌


50. కిందివాలో జీవవిచ్ఛిన్నం చెందని పదార్థం? 

1) కూరగాయల తొక్కలు     2) కాటన్‌ దుస్తులు 

3) నారలు     4) ప్లాస్టిక్‌ 


సమాధానాలు


1-2; 2-3; 3-4; 4-1; 5-2; 6-3; 7-2; 8-3; 9-1; 10-3; 11-1; 12-4; 13-4; 14-4; 15-3; 16-3; 17-1; 18-4; 19-2; 20-2; 21-4; 22-2; 23-1; 24-3; 25-4; 26-2; 27-4; 28-2; 29-3; 30-4; 31-3; 32-2; 33-1; 34-2; 35-1; 36-3; 37-4; 38-1; 39-3; 40-4; 41-3; 42-4; 43-2; 44-3; 45-1; 46-4; 47-1; 48-2; 49-3; 50-4.

 

రచయిత: చంటి రాజుపాలెం 

Posted Date : 30-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌