• facebook
  • whatsapp
  • telegram

కుట్టుమిషన్‌తో కుడితే కంపన చలనం!

యాంత్రిక శాస్త్రం
 


 

మనిషి నడవడం, కారు కదలడం, చెట్టు పైనుంచి పండు పడటం, రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లడం ఇవన్నీ ఒకదానికొకటి సంబంధం లేనట్లు కనిపించినా, కాస్త ఆలోచిస్తే అన్నింటిలోనూ బలం, చలనం, శక్తి  ఉన్నాయని అర్థమవుతుంది. ఆ మూడు విశిష్ట భావనల గురించి  భౌతిక శాస్త్రంలో భాగమైన యాంత్రిక శాస్త్రం వివరిస్తుంది. అందులోని ప్రాథమిక సూత్రాలు, గమన నియమాలు, చలనానికి గురైన వస్తువులు పరిసరాలపై చూపే ప్రభావం, విభిన్న బలాల గురించి పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. రకరకాల యంత్రాలు పనిచేసే నియమాలు, వాహనాల ఆకారం, కూర్పులో ఇమిడి ఉన్న కారణాలు, ఘర్షణ ఉపయోగాలతో పాటు సంబంధిత ప్రమాణాలు, విలువలను తెలుసుకోవాలి.


1. కిందివాటిలో స్పర్శీయ బలం కానిది గుర్తించండి.

1) ఘర్షణ బలం      2) అభిలంబ బలం 

3) తన్యత బలం      4) గురుత్వాకర్షణ బలం


2.     ఆవేశపరిచిన బెలూన్‌ కాగితపు ముక్కలను ఆకర్షించడానికి కారణమైన బలం?

1) అయస్కాంత బలం        2) గురుత్వాకర్షణ బలం  

3) స్థిరవిద్యుదాకర్షణ బలం      4) ఘర్షణ బలం


3.    తలం గరుకుదనం పెరిగితే ఘర్షణలో కలిగే మార్పు?

1) తగ్గుతుంది      2) పెరుగుతుంది  

3) మార్పు ఉండదు      4) సగం అవుతుంది


4. పీడనానికి S.I. ప్రమాణం?

1) న్యూటన్‌  2) డైన్‌  3) జౌల్‌  4) పాస్కల్‌


5. గుడ్డు మెత్తటి పరుపుపై పగలదు. గచ్చునేలపై కొంత ఎత్తు నుంచి వదిలితే పగులుతుంది కారణం?

1) కాలం తగ్గి, బలం పెరుగుతుంది  2) కాలం పెరిగి, బలం తగ్గుతుంది 

3) కాలం, బలం తగ్గుతాయి       4) కాలం, బలం పెరుగుతాయి


6. వాహనాల వెనుక భాగంలో అధిక సంఖ్యలో టైర్లను ఏర్పాటు చేయడానికి కారణమేంటి?

1) వైశాల్యం తగ్గించి, పీడనం పెంచడం      2) వైశాల్యం పెంచి, పీడనం తగ్గించడం 

3) వైశాల్యం, పీడనం రెండూ తగ్గించడం  4) వైశాల్యం, పీడనం రెండూ పెంచడం


7. కిందివాటిలో ‘డ్రాగ్‌’ అని ఏ ఘర్షణను పిలుస్తారు?

1) ప్రవాహి ఘర్షణ      2) స్థైతిక ఘర్షణ  

3) దొర్లుడు ఘర్షణ      4) జారుడు ఘర్షణ


8. ఘర్షణ బలం ఆధారపడని అంశాన్ని ఎంచుకోండి.

1) గరుకుదనం       2) అభిలంబ బలం  

3) స్పర్శాతల వైశాల్యం     4) భారం


9. లాంగ్‌ జంప్‌ చేసే వ్యక్తి కొంత దూరం నుంచి పరిగెత్తుకొచ్చి దూకుతాడు. కారణమేంటి?

1) గమన జడత్వం పొందడం          2) విరామ జడత్వం పొందడం  

3) దిశా జడత్వం పొందడం      4) స్థైతిక జడత్వం పొందడం


10. న్యూటన్‌ మూడో గమన నియమం ఆధారంగా పనిచేసే వాటిలో సరైంది?

1) విమానం      2) రైలు  

3) గాలిపటం      4) రాకెట్‌ చలనం


11. ఘర్షణ లేని ప్రపంచాన్ని ఊహించిన శాస్త్రవేత్త?

1) న్యూటన్‌     2) గెలీలియో  

3) అరిస్టాటిల్‌      4) రాబర్ట్‌ బాయిల్‌


12. కిందివాటిలో క్షేత్రీయ బలం కానిది?

1) గురుత్వాకర్షణ బలం   2) అభిలంబ బలం  

3) స్థిర విద్యుదాకర్షణ బలం 4) అయస్కాంత బలం


13. చెక్కకు రంధ్రాలు చేసే బర్మా చలనం కిందివాటిలో ఏ చలనం కలిగి ఉంటుంది?

1) భ్రమణ చలనం      2) డోలన చలనం  

3) క్రమ చలనం      4) హరాత్మక చలనం


14. కుట్టుమిషన్‌లో సూది చేసే చలనం గుర్తించండి.

1) భ్రమణ      2) కంపన  

3) స్థానాంతర      4) క్రమరహిత 


15. రాకెట్‌ చలనం కిందివాటిలో ఏ చలనాన్ని కలిగి ఉంటుంది?

1) సమచలనం      2) సరేఖీయ చలనం  

3) వక్రరేఖీయ చలనం      4) కంపన చలనం


16. 1 డైన్‌ ఎన్ని న్యూటన్‌లకు సమానం?

1) 10-7   2) 10-5    3) 107     4) 105


17. బలానికి S.I. ప్రమాణాన్ని గుర్తించండి.

1) kg. m/s2      2) kg. cm/s2 

3) gm.m/s2     4) gm.cm/s2


18. కిందివాటిలో సరైన ఫలిత బలాన్ని గుర్తించండి.


19. ఒక వస్తువుపై బలాన్ని ప్రయోగిస్తే, దాని స్థానభ్రంశం ప్రయోగించిన బలానికి వ్యతిరేక దిశలో ఉంటే జరిగిన పని?

1) W = F .S   2) W = F . S cosθ

3) W = −F .S   4) W = F . S sinθ


20. ఆవిరి యంత్రం (స్టీమ్‌ ఇంజిన్‌)లో ఏ శక్తి ఏ శక్తిగా మారుతుంది?

1) యాంత్రిక - ఉష్ణ      2) ఉష్ణ - యాంత్రిక  

3) విద్యుత్‌ - ఉష్ణ      4) ఉష్ణ - విద్యుత్‌


21. ఒక వస్తువు స్థానభ్రంశం, దూరం సమానంగా ఉండాలంటే అది ప్రయాణించే మార్గం?    

1) సరళరేఖ మార్గం       2) వక్రమార్గం

3) పరావలయ మార్గం      4) వృత్తాకార మార్గం


22. స్టేషన్‌ నుంచి బయలుదేరిన వాహనానికి ఉండే త్వరణం?

1) రుణ త్వరణం      2) ధన త్వరణం  

3) శూన్య త్వరణం      4) సమ త్వరణం


23. చెట్టు నుంచి రాలిన పండు నేరుగా భూమిని చేరితే అది కలిగి ఉండే త్వరణం?

1) ధన త్వరణం      2) రుణ త్వరణం  

3) శూన్య త్వరణం      4) సమ త్వరణం


24. ఒక వాహనం 30 km/h వేగంతో బయలుదేరి 10 సెకన్లలో 70 km/h వేగాన్ని పొందింది. అయితే దాని త్వరణం ఎంత?

1) 5 m/s2 2) 10 m/s2 3) 6 m/s2 4) 4 m/s2


25. విశ్వగురుత్వాకర్షణ స్థిరాంకం విలువను గుర్తించండి.

1) 6.6 × 10−10 Nm2 kg−2

2) 6.67 × 10−6 Nm2 kg−2

3) 6.67 × 10−11 Nm2 kg−2

4) 5.6 × 10−11 Nm2 kg−2


26.  విల్లు నుంచి వదిలిన బాణం ఏ నియమాన్ని పాటిస్తుంది?

1) న్యూటన్‌ నియమం    2) పాస్కల్‌ సూత్రం

3) బెర్నౌలీ సూత్రం        4) చార్లెస్‌ నియమం


27. భూమి నుంచి కొంత ఎత్తులో ఎగురుతున్న గాలిపటానికి ఉండే శక్తి?

1) గతి శక్తి          2) స్థితి శక్తి

3) యాంత్రిక శక్తి          4) గురుత్వాకర్షణ శక్తి


28. వేగంగా ప్రయాణించే వాహనాలు హఠాత్తుగా బ్రేకులు వేసినప్పుడు అవి కలిగి ఉండే త్వరణం?    

1) ధనత్వరణం       2) రుణత్వరణం

3) సమత్వరణం     4) శూన్యత్వరణం


29. ఒక వస్తువును 10 m/s వేగంతో నిట్టనిలువుగా పైకి విసిరితే, అది తిరిగి భూమిని చేరుకోవడానికి పట్టేకాలం ఎంత?

1) 1 సె.  2) 10 సె.  3) 2 సె.  4) 4 సె.1) 3 సెం.మీ.      2) 4 సెం.మీ.   

3) 7 సెం.మీ.       4) 5 సెం.మీ.


31. జడత్వం దేనిపై ఆధారపడుతుంది?

1) పీడనం           2) స్థానభ్రంశం

3) సాంద్రత        4) ద్రవ్యరాశి


32. కిందివాటిలో సదిశ కానిది గుర్తించండి.

1) స్థానభ్రంశం 2) వేగం 3) త్వరణం 4) పీడనం


33. చలించే రోడ్డు రోలర్‌కు ఉండే శక్తి?

1) గతి శక్తి             2) స్థితి శక్తి

3) యాంత్రిక శక్తి          4) స్థిర విద్యుత్‌ శక్తి


34. సిలిండర్‌లోని వాయువుకు ఉండే శక్తి?

1) గతి శక్తి              2) స్థితి శక్తి

3) యాంత్రిక శక్తి         4) గురుత్వాకర్షణ శక్తి


35. 2 కిలోల ద్రవ్యరాశి ఉన్న ఒక దిమ్మెను 2 మీ. ఎత్తుకు ఎత్తినప్పుడు అది పొందిన స్థితి శక్తి ఎంత?

1) 39.2 జౌల్స్‌       2) 56.2 జౌల్స్‌

3) 19.6 జౌల్స్‌        4) 29.4 జౌల్స్‌


36. విద్యుత్‌ మోటార్‌లో శక్తి మార్పు ఏ విధంగా జరుగుతుంది?

1) యాంత్రిక శక్తి - విద్యుత్‌ శక్తి   2) విద్యుత్‌ శక్తి - యాంత్రిక శక్తి

3) యాంత్రిక శక్తి - ఉష్ణ శక్తి   4) విద్యుత్‌ శక్తి - యాంత్రిక శక్తి


37. హైడ్రాలిక్‌ బ్రేకులు, హైడ్రాలిక్‌ జాకీలు ఏ నియమం ఆధారంగా పనిచేస్తాయి?

1) బాయిల్‌ నియమం     2) చార్లెస్‌ నియమం

3) పాస్కల్‌ నియమం      4) ఆర్కిమెడిస్‌ నియమం


38. ఆభరణాల స్వచ్ఛతను తెలపడానికి ఉపయోగించే నియమం?

1) బెర్నౌలీ నియమం       2) పాస్కల్‌ నియమం

3) ఆర్కిమెడిస్‌ నియమం     4) బాయిల్‌ నియమం


39. విమానాలు ఏ నియమం ఆధారంగా ప్రయాణిస్తాయి?

1) బెర్నౌలీ సూత్రం       2) పాస్కల్‌ నియమం

3) ఆర్కిమెడిస్‌ నియమం    4) బాయిల్‌ నియమం


40. సైకిల్‌ తొక్కే వ్యక్తితో సహా సైకిల్‌ ద్రవ్యరాశి 100 కిలోలు అయితే సైకిల్‌ 3 కి.మీ./గం. వేగంతో కదలడానికి చేసిన పని ఎంత?

1) 350 జౌల్స్‌       2) 250 జౌల్స్‌    

3) 450 జౌల్స్‌        4) 150 జౌల్స్‌


41. ఒక వస్తువుకు గురుత్వ కేంద్రం ఎక్కడ ఉంటుంది?

1) వెలుపల       2) లోపల   

3) వస్తు ఉపరితలం       4) వెలుపల/ లోపల


42. సముద్ర మట్టం వద్ద సాధారణ వాతావరణ పీడనం?

1) 760 సెం.మీ.        2) 700 మి.మీ.   

3) 76 సెం.మీ.       4) 76 మి.మీ.


43. విమానంలో ప్రయాణించే వ్యక్తుల జేబులో ఇంకుపెన్ను నుంచి ఇంకు బయటకు రావడానికి కారణం?

1) ఎత్తుకు వెళ్లే కొద్దీ వాతావరణ పీడనం తగ్గడం

2) ఎత్తుకు వెళ్లే కొద్దీ వాతావరణ పీడనం పెరగడం

3) ఎత్తుకు వెళ్లే కొద్దీ వాతావరణ పీడనం స్థిరంగా ఉండటం

4) ఎత్తుకు వెళ్లే కొద్దీ వాతావరణ పీడనం శూన్యమవడం


44. బారోమీటర్‌లో పాదరస స్తంభం ఎత్తు హఠాత్తుగా తగ్గడం దేన్ని సూచిస్తుంది?

1) వర్షం రాక       2) తుపాను రాక   

3) మంచు కురవడం       4) వరదలు రావడం


45. మంచినీటి కంటే ఉప్పు నీటిలో ఈదడం తేలిక కారణం?

1) ఉప్పునీటి సాంద్రత ఎక్కువ       2) ఉప్పునీటి సాంద్రత తక్కువ

3) ఉప్పునీటి సాంద్రత శూన్యం      4) ఉప్పునీటి సాంద్రత చాలా తక్కువ


46. చిన్న గుండు పిన్ను నీటిలో మునుగుతుంది, కానీ పెద్ద పెద్ద పడవలు నీటిలో మునగవు కారణమేంటి?

1) వైశాల్యం తగ్గించి సాంద్రత పెంచడం  2) వైశాల్యం పెంచి సాంద్రత తగ్గించడం

3) వైశాల్యం, సాంద్రత రెండూ తగ్గించడం   4) వైశాల్యం, సాంద్రత రెండూ పెంచడం


47. పాలలోని స్వచ్ఛతను కొలవడానికి ఉపయోగించే పరికరం?

1) హైడ్రోమీటర్‌       2) హైగ్రోమీటర్‌   

3) లాక్టోమీటర్‌       4) అనిమోమీటర్‌


48. నీటి సాపేక్ష సాంద్రత విలువ ఎంత?

1) 13.6       2) 7.2       3) 0       4) 1


49. క్యారం బోర్డు ఆటలో కాయిన్స్‌ సరిగ్గా కదలనప్పుడు పౌడర్‌ను ఉపయోగిస్తారు. ఎందుకు?

1) ఘర్షణ పెంచడానికి    2) ఘర్షణ తగ్గించడానికి

3) ఘర్షణలో మార్పు లేదు 4) ఘర్షణ స్థిరంగా ఉంచడానికిసమాధానాలు


1-4; 2-3; 3-2; 4-1; 5-1; 6-2; 7-1; 8-3; 9-1; 10-4; 11-2; 12-2; 13-1; 14-2; 15-2; 16-2; 17-1; 18-3; 19-3; 20-2; 21-1; 22-2; 23-1; 24-4; 25-3; 26-1; 27-3; 28-2; 29-3; 30-4; 31-4; 32-4; 33-1; 34-2; 35-1; 36-4; 37-3; 38-3; 39-1; 40-3; 41-4; 42-3; 43-1; 44-2; 45-1; 46-2; 47-3;  48-4; 49-2.


రచయిత: చంటి రాజుపాలెం

Posted Date : 19-12-2023

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు