• facebook
  • whatsapp
  • telegram

విజయనగర రాజులు

ధర్మసూత్రాలే రాజ్యపాలనా మార్గాలు!

సమర్థ పాలనతో, సైనికశక్తితో చరిత్రలో దక్షిణ భారతానికి ప్రముఖంగా రెండు రాజ వంశాలు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. ఆ పాలకులు వాస్తుశిల్పం, సాహిత్యం, కళలను ఆదరించి, ప్రోత్సహించారు.  అనేక దాడులను తిప్పికొట్టారు. వారే సాంస్కృతిక పునరుజ్జీవానికి విశేష కృషి  చేసిన విజయనగర రాజులు,  ఇస్లామిక్ విస్తరణలను అడ్డుకున్న రెడ్డి రాజులు. పరిశ్రమలను, రేవు పట్టణాలను అభివృద్ధి చేసి విశిష్ట వారసత్వాన్ని వదిలి వెళ్లిన వారి పాలనా విధానాలపై పోటీ పరీక్షార్థులు అవగాహన పెంచుకోవాలి. నాటి ప్రజల వృత్తులు, ప్రసిద్ధ రచయితలు, గ్రంథాల వివరాలను తెలుసుకోవాలి. 
 


1. డోమింగో ఫెయిజ్ ఏ దేశానికి చెందినవారు?

1) పర్షియా    2) మొరాకో   

3) పోర్చుగల్   4) ఇంగ్లండ్



2. బహమనీ సామ్రాజ్యానికి రాజధాని?

1) బీరర్    2) అమ్మద్ నగర్  

3)  గుల్బర్గా   4) కపిల



3.  మహమ్మద్ గవాన్ ఎవరి వద్ద ప్రధానిగా పనిచేశారు?

1) బహమనీలు   2) విజయనగర రాజులు  

3)  ఢిల్లీ సుల్తాన్లు  4) రెడ్డి రాజులు



4. విజయనగర రాజుల్లో అందరిలోకెల్లా గొప్పవాడు?

1) రెండో దేవరాయలు    2) నరసింహరాయ  

3)  శ్రీకృష్ణదేవరాయ   4) అళియ రామరాయ



5. రెడ్డి రాజ్యసామ్రాజ్య స్థాపకుడు?

1) అనపోతారెడ్డి      2) వేమారెడ్డి  

3)  ప్రోలయ వేమారెడ్డి      4) కొమరగిరి రెడ్డి



6.  వసుచరిత్ర అనే గ్రంథ రచయిత?

1) పింగళి సూరన    2) రామరాజభూషణ  

3)  ధూర్జటి      4) అల్లసాని పెద్దన



7. హరికథాసారం అనే గ్రంథం రచించింది?

1) అల్లసాని పెద్దన     2) ధూర్జటి  

3)  పింగళి సూరన       4) రామకృష్ణ



8. ప్రౌఢదేవరాయలుగా పేరొందిన విజయనగర రాజు?

1) ఒకటో దేవరాయ      2) హరిహరరాయ  

3)  గౌడ డిండిమా      4) రెండో దేవరాయ



9. సాళువ వంశస్థాపకుడు?

1) నరసింహరాయ    2) మల్లికార్జునరాయ  

3)  రామరాయ      4) కంపన



10. దివానీ యుద్ధకాలం నాటి విజయనగర రాజు?

1) అళియ రామరాయ    2) కృష్ణదేవరాయ   

3)  నరసింహరాయ      4) రెండో దేవరాయ



11. కిందివాటిలో కృష్ణదేవరాయ గ్రంథం కానిది?

1) మధురా విజయం   2) జాంబవతి పరిణయం  

3)  ఉషా పరిణయం     4) 2, 3



12. రాజమండ్రి వరకు రాజ్య విస్తరణ చేసినవారు?

1) ఒకటో దేవరాయ      2) రెండో దేవరాయ  

3)  బుక్కరాయ    4) హరిహరరాయ



13. రాయచూర్ అంతర్వేది కోసం విజయనగర రాజులు ఎవరితో యుద్ధం చేశారు?

1) బహమనీలు   2) కళింగులు  

3)  గజపతులు   4) పాండ్యులు



14. కిందివాటిలో భిన్నమైంది?

1) హరికథాసారం     2) ఆముక్తమాల్యద  

3)  ఉషా పరిణయం   4) జాంబవతి పరిణయం



15. పశ్చిమ తీరంలో విజయనగర రాజుల వర్తక స్థావరంలోని రేవు పట్టణం?

1) కొచ్చిన్    2) కన్నానూర్  

3)  కోచి    4) ట్యాంకోబార్



16. విజయనగరరాజుల కాలంలో లేని ప్రముఖ మహిళ?

1) ఆండాళ్   2) మొల్ల   3)  తిమ్మక్క   4) గంగాదేవి



17. మహానాటక సుధానిధి గ్రంథం రచించింది?

1) ఒకటో దేవరాయ    2) రెండో దేవరాయ  

3)  రామరాయ      4) మల్లికార్జునరాయ



18. కిందివాటిలో భిన్నమైనవారు?

1) దీక్షితార్   2) త్యాగరాజు  

3)  రామదాసు   4) శ్యామశాస్త్రి



19. ‘సంగీత సర్వస్వం’ గ్రంథం రచయిత?

1) హరిహర    2) బుక్కరాయ   

3)  విద్యారణ్యస్వామి    4) కంపన



20. విజయనగర రాజుల కాలానికి సంబంధించి భిన్నమైంది?

1) తెలుగు   2) కన్నడం  

3)  మలయాళం   4) తమిళం



21. విజయనగర రాజుల కాలంలో ప్రజల ప్రధాన వృత్తి?

1) వ్యవసాయం   2) వ్యాపారం  

3)  పరిశ్రమలు     4) కుండల తయారీ



22. విజయనగర సామ్రాజ్యానికి చివరి రాజధాని? 

1) హంపి   2) అనెగోంది  

3)  పెనుగొండ    4) చంద్రగిరి



23. విజయనగర సామ్రాజ్యంలో చివరి రాజు?

1) రెండో వేంకటపతిరాయ  

2) మూడో వేంకటపతిరాయ  

3)  మూడో రంగరాయలు     

4) శ్రీకృష్ణ దేవరాయలు



24. కిందివాటిలో భిన్నమైంది?    

1) హజర రామస్వామి     2) విఠలాలయం  

3)  ఏకాంబరేశ్వర ఆలయం  

4) బృహదీశ్వర ఆలయం



25. రెడ్డిరాజుల కాలం నాటి రాజ్య సరిహద్దు కానిది?

1) కటక్     2) అరేబియా సముద్రం  

3)  శ్రీశైలం      4) కంచి



26. రెడ్డి రాజుల కాలం నాటి రాజధాని కానిది?

1) అద్దంకి       2) రాజమండ్రి   

3)  కొండవీడు     4) కాకినాడ



27. ప్రబంధ పరమేశ్వరుడిగా పేరుపొందిన కవి?

1) నన్నయ  2) ఎర్రన  3)  తిక్కన   4) పోతన



28. రెడ్డిరాజు దేని ఆధారంగా రాజ్యపాలన చేశారు?

1) వేదాలు      2) ఉపనిషత్తులు   

3)  అరణ్యకాలు    4) ధర్మసూత్రాలు



29. రెడ్డిరాజ్యం పతనం కావడానికి కారణమైన రాజులు?

1) గజపతులు     2) రేచర్ల నాయకులు   

3)  పాలవంశస్థులు     4) 1, 2



30. కిందివారిలో భిన్నమైనవారిని గుర్తించండి.

1) కుమార కంపన      2) అచ్యుతరాయ  

3)  రెండో దేవరాయ     4) మొదటి బుక్కరాయ



31. కింది అంశాల్లో సరికానిది?

1) హంపి వద్ద ఉన్న శిథిలాలను 1805లో కల్నల్ కోలిన్ మెకంజీ బయటకు తీసుకొచ్చారు.

2) రెండో దేవరాయ కాలంలో అబ్దుల్ రజాక్ విజయనగరాన్ని దర్శించారు.

3)  నికోలో కాంటే పర్షియా దేశస్థుడు.

4) న్యూనిజ్ పోర్చుగీసు దేశానికి చెందిన యాత్రికుడు.



32. ప్రకటన (A): గోల్కొండ ముస్లిం రాజుల సామ్రాజ్యంలో రెడ్డి రాజులు సామంతులుగా స్థిరపడ్డారు.

కారణం (R): రేచర్ల ప్రభువులు నిరంతరం గజపతులతో యుద్ధాలు చేసేవారు.    

1) A, R లు సరైనవి. 

2) A సరైంది. కానీ, R సరికాదు.

3)  A సరికాదు, R సరైంది.

4) A, R లు రెండూ సరికావు. 



33. ప్రకటన (A): మూడో మహమ్మద్ షా పాలనలో బహమనీ రాజ్యం ఉన్నత స్థాయికి చేరింది.

కారణం (R): మూడో మహమ్మద్ షా విజయాలకు కారణం మహమ్మద్ గవాన్ ముఖ్యమంత్రి కావడం.    

1) A సరైంది, R సరికాదు.

2) A, R లు సరైనవి. 

3)  A, R లు సరికావు. 

4) A సరికాదు, R సరైంది.



34. కిందివాటిలో భిన్నమైంది?

1) ఉషా పరిణయం    2) జాంబవతి పరిణయం

3)  వసు చరిత్ర       4) ఆమూక్త మాల్యద



35. కిందివాటిని జతపరచండి.

1) అల్లసాని పెద్దన     ఎ) పారిజాత అపహరణం

2) నంది తిమ్మన      బి)  రాజశేఖర చరిత్ర

3)  మాదయగారి మల్లన  సి) మనుచరిత్ర

4) ధూర్జటి    డి)  శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం

1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి     2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ 

3)  1-సి, 2-ఎ, 3-బి, 4-డి     4) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ 



36. కిందివారిలో భిన్నమైనవారిని గుర్తించండి.

1) ముత్తుస్వామి దీక్షితార్     2) రన్నడు 

3)  త్యాగరాజు        4) శ్యామ శాస్త్రి



37. కింది వాక్యాల్లో సరైనవి?    

ఎ) విజయనగర రాజుల కాలంలో కర్నూలు, అనంతపురం వజ్రాల పరిశ్రమకు ప్రసిద్ధి.

బి) విజయనగర రాజుల కాలం నాటి వెండి నాణెం వరహా.

సి) విజయనగర రాజుల కాలంలో మలబార్ తీరంలో కన్ననూర్ ప్రధాన రేవు పట్టణం.

డి)  వీరికాలంలో ఓడల నిర్మాణ కళ అభివృద్ధి చెందింది.

1) ఎ, బి, సి, డి   2) ఎ, సి, డి  

3)  ఎ, బి, సి    4) ఎ, బి, డి



38. రెడ్డిరాజ్యానికి సరిహద్దు కానిది?            

1) ఉత్తరం - ఒడిశా - పూరి

2) దక్షిణం - తమిళనాడు - కాంచీపురం

3)  పశ్చిమం - ఆంధ్రప్రదేశ్ - శ్రీశైలం

4) తూర్పు - బంగాళాఖాతం



39. కిందివాటిలో సరికానిది?    

1) శ్రీకృష్ణదేవరాయలకు పోర్చుగీసు, అరబ్లతో స్నేహసంబంధాలు ఉండేవి. 

2) ఇతడు 1520లో రాయచూర్ నగరాన్ని ఆక్రమించాడు.

3) ఇతడి నినాదం ‘దేశభాషలందు తెలుగులెస్స’.

4) ఇతడు తన తల్లి పేరు మీద ‘నాగపట్నం’ నగరాన్ని నిర్మించాడు.



40. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన వంశాలను ఆరోహణ క్రమంలో అమర్చండి.

1) సంగమ, సాళువ, తుళువ, అరవీటి

2) అరవీటి, తుళువ, సాళువ, సంగమ

3) సాళువ, తుళువ, అరవీటి, సంగమ

4) సంగమ, తుళువ, అరవీటి, సాళువ



41. విజయనగర రాజధాని హంపి (ప్రస్తుత కర్ణాటక) వద్ద శిథిలాలు ఏ కాలంలో వెలుగులోకి వచ్చాయి? 

1) 1805   1804  3)  1806  4) 1810



42. విఠల స్వామి, హజర రామస్వామి అనే ఆలయాలను నిర్మించిన విజయనగర రాజు?

1) సాలువ నరసింహరాయలు 

2) శ్రీకృష్ణదేవరాయలు   

3)  అచ్యుత దేవరాయలు    

4) ఎవరూ కాదు



43. విజయనగర కాలంలో పండించిన పంటలో ఎన్నో వంతును భూమి శిస్తుగా నిర్ణయించేవారు?



44. కిందివాటిలో అష్టదిగ్గజ కవులకు సంబంధించి సరికానిది?

1) అల్లసాని పెద్దన - హరి కథాసారం   

2) అయ్యలరాజు రామభద్రుడు - సకలనీతి సారం

3)  పింగళి సూరన్న - రాజశేఖర చరిత్ర  

4) తెనాలి రామకృష్ణుడు - పాండురంగ మహాత్మ్యం



45. శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలంలో విజయ నగరాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు?

1) అబ్దుల్ రజాక్      

2) డువార్టే బార్బోసా  

3) న్యూనిజ్        

4) ఇబన్ బటూటా



46. కిందివారిలో కర్ణాటక కవిత్రయానికి సంబంధించని వారిని గుర్తించండి.

1) రన్నడు   2) దీక్షితార్  

3) శ్యామశాస్త్రి  4) త్యాగరాజ స్వామి


సమాధానాలు

1-3; 2-3; 3-1; 4-3; 53; 6-2; 7-1; 8-4; 9-1; 10-2; 11-1; 12-2; 13-1; 14-1; 15-2; 16-1; 17-2; 18-3; 19-3; 20-3; 21-1; 22-4; 23-3; 24-4; 25-2; 26-4; 27-2; 28-4; 29-4; 30-2; 31-3; 32-1; 33-2; 34-3; 35-3; 36-2; 37-2; 38-1; 39-4; 40-3; 41-1; 42-2; 43-2; 44-3; 45-2; 46-1.  


 


 

Posted Date : 01-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌