• facebook
  • whatsapp
  • telegram

వాతావరణం

కర్ణాటకలో వేసవి జల్లులు చెర్రీబ్లోసమ్స్‌!
 


వాయువులతో కూడిన పొరనే వాతావరణం అంటారు. అనేక ఖగోళ వస్తువులకు ఉండే ఆకర్షణ శక్తి వల్ల వాటి చుట్టూ ఉన్న వాతావరణ పొరలపై ఒత్తిడి ఉంటుంది. భూమిని ఆవరించి ఉన్న వాతావరణ పరిస్థితి, ఆవరణల స్వభావం, అందులోని వాయువుల పరిమాణం గురించి పరీక్షార్థులకు ప్రాథమిక అవగాహన ఉండాలి. భూగోళంపై వివిధ ప్రాంతాల్లో వీచే పవనాల స్వభావం, వాటి దిశలు, ప్రభావాలు, సముద్రాల వల్ల భూ ఉష్ణోగ్రతల్లో కలిగే మార్పులు, వర్షపాతాన్ని నిర్ణయించే వాతావరణ కారకాలు, రుతుపవన రూపాంతరాలు, దేశంలో పలు రకాల వర్షపాతాలకు కారణాలపై అవగాహన పెంచుకోవాలి. 



1.    సమరూప ఆవరణం భూమి ఉపరితలం నుంచి దాదాపు ఎన్ని కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది?

1) 90 కి.మీ.       2) 70 కి.మీ.   

3) 40 కి.మీ.       4) 30 కి.మీ.




2.     వాతావరణంలో అన్నింటి కంటే కింద ఉండే పొరను ఏ ఆవరణమని పిలుస్తారు?

1) స్ట్రాటో  2) ట్రోపో   3) మీసో  4) ఎక్సో 



 

3.     వాతావరణంలో అన్నింటి కంటే చివర ఉండే పై పొరను ఏమంటారు?

1) మీసో   2) థర్మో   3) ఎక్సో   4) ట్రోపో 



 

4.     ట్రోపో ఆవరణం ధ్రువాల వద్ద ఎన్ని కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది?

1) 8 కి.మీ.       2) 13 కి.మీ.   

3) 18 కి.మీ.      4) 40 కి.మీ.




5.     కింది ఆవరణాల్లో మిశ్రమ ఆవరణాన్ని గుర్తించండి.

1) థర్మో  2) మీసో  3) ట్రోపో   4) స్ట్రాటో 



 

6.     మీసో ఆవరణం దాదాపుగా ఎన్ని కి.మీ.ల వరకు విస్తరించి ఉంటుంది?

1) 40 కి.మీ.       2) 50 కి.మీ.   

3) 70 కి.మీ.      4) 80 కి.మీ.




7.     కింది వాక్యాల్లో సరికానిదాన్ని గుర్తించండి.

1) సముద్రం కంటే భూభాగం త్వరగా వేడెక్కుతుంది.

2) సముద్రానికి దూరంగా ఉండే భూమి త్వరగా వేడెక్కుతుంది.

3) సముద్రానికి దగ్గరగా ఉండే భూమి త్వరగా వేడెక్కుతుంది.

4) నీరు వేడెక్కడానికి ఎక్కువ సమయం పడుతుంది.




8.     కిందివాటిలో ‘కొరియాలిస్‌ ప్రభావానికి’ సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి.

1) ‘ఉత్తరార్ధ గోళంలోని పవనాలు’ కుడి వైపునకు వీస్తాయి.

2) దక్షిణార్ధ గోళంలోని పవనాలు ఎడమ వైపునకు వీస్తాయి.

3) ఉత్తరార్ధ గోళంలోని పవనాలు ఎడమ వైపునకు వీస్తాయి.

4) కొరియాలిస్‌ ప్రభావం భూభ్రమణం వల్ల సంభవిస్తుంది.




9. ‘మౌసమ్‌’ అనేది ఏ భాషా పదం?

1) గ్రీకు  2) అరబిక్‌   3) లాటిన్‌   4) ఫ్రెంచ్‌




10. ఉత్తర అమెరికాలోని అమెరికా - కెనడా ప్రాంతాల్లోని రాకీ పర్వతాల కింద వీచే స్థానిక పవనాలను ఏమంటారు?

1) మిస్ట్రాల్‌     2) ప్యూనా 

3) పాంపెరో       4) చినూక్‌


 

11. కిందివాటిలో శీతల స్థానిక పవనాలకు సంబంధించనిది-    

1) పాంపెరో       2) ప్యూనా   

3) చినూక్‌       4) మిస్ట్రాల్‌




12. యూరప్‌లో వీచే ఉష్ణ స్థానిక పవనాలను ఏమంటారు?

1) ఫోన్‌  2) ప్యూనా  3) పాంపెరో  4) చినూక్‌




13. ఆండీస్‌ ప్రాంతాల్లో వీచే స్థానిక శీతల పవనాలను ఏమని పిలుస్తారు?

1) ఫోన్‌  2) పాంపెరో 3) ప్యూనా 4) మిస్ట్రాల్‌




14. చినూక్‌ అనే పదానికి అర్థం?

1) వేడి నీరు       2) చల్లటి నీరు   

3) మంచును తినేది       4) శీతల పవనం




15. స్థానిక ఉష్ణ పవనాలను అరేబియా ఎడారిలో ఏమని పిలుస్తారు?

1) యోమా       2) సైమూన్‌   

3) నార్వెస్టర్‌       4) చినూక్‌


 


16. దక్షిణ అమెరికాలోని పంపాల ప్రాంతంలోని శీతల ధ్రువ పవనాలను ఏమంటారు?    

1) ప్యూనా      2) మిస్ట్రాల్‌  

3) పాంపెరో      4) సైమూన్‌




17. కిందివాటిలో మిస్ట్రాల్‌ పవనాలకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి.

1) ఈ పవనాలు ఆల్ఫ్స్‌ పర్వతాల నుంచి వీస్తాయి.

2) ఇవి ఫ్రాన్స్‌ మీదుగా మధ్యదరా సముద్రం వైపునకు వీస్తాయి.

3) ఇవి ఇటలీలోని రోమ్‌ లోయ మీదుగా వీస్తాయి.

4) ఇవి స్థానిక ఉష్ణ పవనాలు.



 

18. జపాన్‌లోని స్థానిక ఉష్ణ పవనాలను ఏమంటారు?

1) సైమూన్‌   2) యోమా   3) నార్వెస్టర్‌   4) లూ




19. గ్రీకు భాషలో ఓరెస్‌ అంటే ఏమిటి?

1) గాలులు       2) పర్వతం   

3) లోయ     4) మైదానాలు




20. భారతదేశంలో అధికంగా సంభవించే వర్షపాతం ఏమిటి?

1) పర్వతీయ వర్షపాతం      2) సంవహన వర్షపాతం

3) చక్రీయ వర్షపాతం       4) ఏదీకాదు




21. ‘సైక్లోన్‌’ ఏ భాషా పదం?

1) అరబిక్‌  2) గ్రీకు  3) ఫ్రెంచ్‌  4) లాటిన్‌




22. బహురూప ఆవరణం దాదాపుగా ఎన్ని కిలోమీటర్ల పైభాగాన విస్తరించి ఉంటుంది?

1) 70 కి.మీ. పైన       2) 40 కి.మీ. పైన  

3) 80 కి.మీ. పైన       4) 90 కి.మీ. పైన




23. ట్రోపో ఆవరణం భూమధ్య రేఖ వద్ద ఎన్ని కిలోమీటర్లు విస్తరించి ఉంటుంది?

1) 8 కి.మీ.       2) 10 కి.మీ.   

3) 15 కి.మీ.       4) 18 కి.మీ.



 

24. థర్మో ఆవరణానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి.    

1) ఈ ఆవరణంలో ఎత్తుకు వెళ్లే కొద్ది ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతాయి.

2) దీన్నే అయనో ఆవరణం అని కూడా అంటారు.

3) ఇది దాదాపుగా 80 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది.

4) ఈ ఆవరణం భూమి ఉపరితలం నుంచి నాలుగో ప్రధాన ఆవరణంగా విస్తరించి ఉంది.


 


25. కింది ఏ ఆవరణంలో 75% వాతావరణం కేంద్రీకృతమై ఉంటుంది?

1) మీసో ఆవరణం      2) థర్మో ఆవరణం  

3) స్ట్రాటో ఆవరణం       4) ట్రోపో ఆవరణం




26. కిందివాటిలో ఏ ఆవరణాన్ని ఘర్షణ ఆవరణం అంటారు?

1) స్ట్రాటో ఆవరణం       2) ట్రోపో ఆవరణం  

3) థర్మో ఆవరణం       4) మీసో ఆవరణం




27. కింది ఏ ఆవరణంలోకి ఖగోళ వస్తువులు ప్రవేశించగానే కాలిపోతాయి?

1) థర్మో ఆవరణం       2) ఎక్సో ఆవరణం  

3) మీసో ఆవరణం       4) స్ట్రాటో ఆవరణం




28. కిందివాటిలో సమరూప ఆవరణంలో లేని ఆవరణాన్ని గుర్తించండి.

1) ట్రోపో  2) స్ట్రాటో  3) మీసో   4) థర్మో 




29. కింది ఏ ఆవరణంలో నిశాచర మేఘాలు (నోక్టలూసెంట్‌ మేఘాలు) ఏర్పడతాయి?

1) స్ట్రాటో  2) థర్మో   3) మీసో   4) ఎక్సో 




30. కిందివాటిలో ఓజోన్‌ ఏ ఆవరణంలో ఉంటుంది? 

1) ట్రోపో      2) థర్మో    

3) స్ట్రాటో       4) ఎక్సో




31. ఉష్ణ స్థానిక పవనాలను న్యూజిలాండ్‌లో ఏమని పిలుస్తారు?

1) యోమా      2) సైమూన్‌  

 3) చినూక్‌       4) నార్వెస్టర్‌




32. వాతావరణంలోని నీటి ఆవిరిని దేనితో కొలుస్తారు?

1) ఆర్ధ్రతా మాపకం       2) ఉష్ణ మాపకం  

3) బారో మీటర్‌       4) ఏదీకాదు




33. కిందివాటిలో రసాయన ఆవరణం అని దేన్ని పిలుస్తారు?

1) థర్మో ఆవరణం       2) మీసో ఆవరణం  

3) స్ట్రాటో ఆవరణం       4) ట్రోపో ఆవరణం




34. మీసో ఆవరణాన్ని ఏమని పిలుస్తారు?

1) మిశ్రమ ఆవరణం         2) ఓజోన్‌ ఆవరణం  

 3) బాహ్య ట్రోపో ఆవరణం      4) అయనో ఆవరణం




35. ఈజిప్టులో వీచే స్థానిక ఉష్ణ పవనాలను ఏమంటారు?

1) ఖామ్‌సిన్‌ 2) చినూక్‌  3) ఫోన్‌ 4) సైమూన్‌




36. స్పెయిన్‌లో వీచే స్థానిక శీతల పవనాలను ఏమని పిలుస్తారు?

1) పాంపెరో 2) ప్యూనా 3) మిస్ట్రల్‌ 4) లెవాంటీర్‌



 

37. వాతావరణంలో ఆక్సిజన్‌ శాతం ఎంత?

1) 78%  2) 21%   3) 74%  4) 38%




38. కిందివాటిలో నైరుతి రుతుపవనాలుగా రూపాంతరం చెందేవి ఏవి?    

1) ఈశాన్య వ్యాపార పవనాలు 

2) ఆగ్నేయ వ్యాపార పవనాలు

3) పశ్చిమ వ్యాపార పవనాలు   

4) ఏవీకావు


 


39. కిందివాటిలో ఉష్ణ స్థానిక పవనాన్ని గుర్తించండి.

1) మిస్ట్రాల్‌     2) ప్యూనా 

 3) పాంపెరో     4) శాంతఅనా




40. ట్రోపో ఆవరణం సగటు ఎంత ఎత్తు మేరకు విస్తరించి ఉంటుంది?

1) 13 కి.మీ.     2) 18 కి.మీ. 

3) 8 కి.మీ.     4) 40 కి.మీ.



 

41. వాతావరణంలో కార్బన్‌ డై ఆక్సైడ్‌ శాతం ఎంత?

1) 0.09%  2) 0.3%  3) 20%  4) 15%




42. అట్మోస్, స్పైరా అనేవి ఏ భాషా పదాలు?

1) ఫ్రెంచ్‌  2) లాటిన్‌  3) గ్రీకు  4) అరబిక్‌




43. ప్రపంచ ఓజోన్‌ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు.

1) సెప్టెంబరు 16        2) అక్టోబరు 16   

3) సెప్టెంబరు 26         4) అక్టోబరు 26




44. వాతావరణంలో ఆర్గాన్‌ ఎంత శాతం ఉంటుంది?

1) 0.03%    2) 21%   3) 0.01%    4) 0.93%




45. Climate అనేది 'CLIMA' అనే పదం నుంచి వచ్చింది. ఇది ఏ భాషా పదం?

1) గ్రీకు  2) అరబిక్‌   3) ఫ్రెంచ్‌   4) లాటిన్‌




46. సంవహన వర్షపాతం వేసవి చివర్లో సంభవిస్తుంది. స్థానికంగా ఈ జల్లులను కర్ణాటకలో ఏమంటారు?

1) నార్వెస్టర్స్‌     2) కాల బైశాఖీలు 

3) ఏరువాక     4) చెర్రీబ్లోసమ్స్‌




47. ప్రపంచంలో అధికంగా సంభవించే వర్షపాతం ఏమిటి?

1) సంవహన 2) చక్రవాత 3) పర్వతీయ 4) ఏవీకావు




48. ఈశాన్య రుతుపవన కాలంలో అధికంగా సంభవించే వర్షపాతం ఏమిటి?

1) సంవహన      2) చక్రవాత     

3) పర్వతీయ        4)  ఏవీకావు




49. ఫిలిప్పైన్స్‌లో సంభవించే చక్రవాతాలను ఏమంటారు?

1) బాగువో     2) విల్లీవిల్లీ 

3) టోర్నడోలు     4) హరికేన్స్‌




50. కింది ఏ మేఘాలను ‘మేఘాల రాజు’ అంటారు?

1) క్యుములోనింబస్‌ మేఘాలు 

2) సిర్రస్‌ మేఘాలు

3) అల్టోస్ట్రేటస్‌     

4) సిర్రోస్ట్రేటస్‌




51. వాతావరణంలో అధికంగా నైట్రోజన్‌ ఎంత శాతం ఉంది?

1) 78%  2) 21%   3) 74%  4) 28%




సమాధానాలు


1-1; 2-2; 3-3; 4-1; 5-3; 6-4; 7-3; 8-3; 9-2; 10-4; 11-3; 12-1; 13-3; 14-3; 15-2; 16-3; 17-4; 18-2; 19-2; 20-1; 21-2; 22-4; 23-4; 24-3; 25-4; 26-2; 27-3; 28-4; 29-3; 30-3; 31-4; 32-1; 33-2; 34-3; 35-1; 36-4; 37-2; 38-2; 39-4; 40-1; 41-2; 42-3; 43-1; 44-4; 45-1; 46-4; 47-3; 48-2; 49-1; 50-1; 51-1.  

 

 



ర‌చ‌యిత‌: బండ్ల శ్రీధ‌ర్‌

Posted Date : 06-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.