• facebook
  • whatsapp
  • telegram

ప్రపంచ భూగోళశాస్త్రం

అట్లాంటిక్‌లో అల్లకల్లోలం.. భూమధ్యరేఖపై ప్రశాంతం! 

 భూమి, దానిపై ఉన్న వనరులు, జీవులు, ప్రాంతాలకు సంబంధించిన అనంత విజ్ఞానమే భూగోళ శాస్త్రం. విభిన్న నైసర్గిక స్వరూప స్వభావాలతో భూగోళం వైవిధ్యభరితంగా ఉంటుంది. ప్రపంచ పటంలో దేశాల ఉనికి, ప్రాంతీయ వాతావరణ పరిస్థితులు, నేలల స్వభావం, నదులు, మైదానాలు, పర్వతాలు, అడవులు, సముద్రాలు, జలసంధులు వంటి ప్రధాన భౌతికాంశాలతో పాటు దేశాలవారీ ప్రత్యేకతలు, వింతలు, విశేషాలపై పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవన స్థితిగతులు, దేశంలోని నదీ వ్యవస్థ, రుతుపవన ఆధారిత వాతావరణం, ప్రాంతాలవారీ సంస్కృతులు, అభివృద్ధి పరిణామాలు, జనాభా విస్తరణ తీరుతెన్నులు అన్నింటినీ సమగ్రంగా తెలుసుకోవాలి.


మాదిరి ప్రశ్నలు


1.    ప్రపంచంలో అతిపెద్ద అంతర్భూభాగ నది ఏది?

1) ఘగ్గర్‌  2) ఓల్గా  3) యెనిసే  4) కొలరాడో


2.     ‘ఉర్సా మేజర్, ఉర్సా మైనర్‌’ అనేవి?

1) గ్రహశకలాలు    2) ఉల్కలు 

3) నక్షత్ర మండలాలు    4) పాలపుంత 


3.   ‘ల్యాండ్‌ ఆఫ్‌ సన్‌ సెట్‌’ అని ఏ దేశాన్ని పిలుస్తారు?

1) ఫిన్లాండ్‌  2) నార్వే  3) కెనడా  4) అమెరికా


4.    భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవల కేంద్రం (INCOIS) ఎక్కడ ఉంది?

1) ఢిల్లీ     2) ముంబయి

3) చెన్నై     4) హైదరాబాద్‌


5.     గ్రాబెన్‌ అంటే ఏమిటి?

1) కిందికి ముడుచుకున్న ప్రాంతం   

2) పైకి ముడుచుకున్న ప్రాంతం

3) పైకి భ్రంశమైన ప్రాంతం

4) కిందికి భ్రంశమైన ప్రాంతం


6.     టెర్రా రోజా అంటే?

1) ఇదొక చెట్టు    2) నల్లరేగడి నేల

3) ఎరుపు రంగు మైదానం    4) గుట్ట


7.    భూగోళం సగటు ఉష్ణోగ్రత ఎంత?

1) 10°C 2) 15°C 3) 31°C    4) 48°C


8.     కింది వరుసలను జతపరచండి.

1) శాంతా అనా ఎ) అర్జెంటీనా
2) చినూక్‌ బి) ఆల్ఫ్స్‌
3) ఫాన్‌ సి) రాకీన్‌
4) జాండా  డి) కాలిఫోర్నియా

1) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ        2) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి

3) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ              4) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ


9. ఆర్ధ్రతను కొలవడానికి ఉపయోగించే పరికరం?

1) భారమితి    2) థర్మామీటర్‌ 

3) హైగ్రోమీటర్‌    4) హైడ్రోమీటర్‌


10. కల్లోల సముద్రమని దేన్ని పిలుస్తారు?

1) అట్లాంటిక్‌         2) పసిఫిక్‌

3) అరేబియా         4) హిందూ


11. ఇటీవల భూకంప చర్యలు పెరిగిన కారణంగా ఏ దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు?

1) ఉక్రెయిన్‌             2) ఐస్‌లాండ్‌ 

3) న్యూజిలాండ్‌           4) మయన్మార్‌


12. 2010లో విస్ఫోటం చెందడంతో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిన ఐజాఫ్జల్లాజోకుల్‌ అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది?

1) ఐస్‌లాండ్‌            2) నైజీరియా

3) న్యూజిలాండ్‌         4) ఆస్ట్రేలియా


13. ‘ఈ - ప్రైమ్‌ లేయర్‌ను’ వెల్లడించిన శాస్త్రవేత్తలు ఏ యూనివర్సిటీకి చెందినవారు?

1) కాలిఫోర్నియా యూనివర్సిటీ    2) అరిజోనా స్టేట్‌ యూనివర్సిటీ

3) హార్వర్డ్‌ యూనివర్సిటీ  4) మసాచుసెట్స్‌ యూనివర్సిటీ


14. ‘సర్వే ఆఫ్‌ ఇండియా’ను ఎప్పుడు స్థాపించారు?

1) 1768  2) 1766  3) 1767  4) 1769


15. భూమి పరిణామానికి సంబంధించి కింది ప్రకటనల్లో సరైంది?

1. వాతావరణంలో ప్రధానంగా హైడ్రోజన్, హీలియం వాయువులు ఉన్నాయి.

2. డీగ్యాసింగ్‌ ప్రక్రియ నీటిఆవిరి, నైట్రోజన్, కార్బన్‌ డయాక్సైడ్‌ను జోడించడానికి వాతావరణం అనుమతించింది.

3. భూమిపై జీవం అభివృద్ధి చెందిన తర్వాత మాత్రమే కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆక్సిజన్‌ వాతావరణంలోకి చేరింది.

1) 1, 2   2) 2, 3   3) 1, 3  4) 1, 2, 3


16. కిందివాటిలో ఏ జలసంధి అంతర్జాతీయ దిన రేఖకు దగ్గరగా ఉంది?

1) మలక్కా జలసంధి    2) బేరింగ్‌ జలసంధి

3) ఫ్లోరిడా జలసంధి    4) జిబ్రాల్టర్‌ జలసంధి


17. ‘ఆపరేషన్‌ ఒలీవియా’ అనేది కిందివాటిలో దేనికి సంబంధించింది?

1) బెంగాల్‌ టైగర్‌ సంరక్షణ           2) నీలగిరి తహర్‌ సంరక్షణ

3) ఆలివ్‌ రిడ్లీ తాబేళ్ల సంరక్షణ         4) ఆసియా ఏనుగుల సంరక్షణ


18. గత 122 సంవత్సరాల్లో అత్యంత వేడి నెలగా నిలిచిన మాసం?

1) డిసెంబరు, 2022    2) డిసెంబరు, 2023

3) డిసెంబరు, 2021    4) డిసెంబరు, 2020


19. చెర్చెర పండగ ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు?

1) గుజరాత్‌ 2) ఒడిశా 3) ఝార్ఖండ్‌ 4) ఛత్తీస్‌గఢ్‌


20. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?

1) ఫిబ్రవరి 2      2) ఫిబ్రవరి 3 

3) ఫిబ్రవరి 4      4) ఫిబ్రవరి 5


21. ‘బ్లాక్‌ ఫారెస్ట్‌’ పర్వతం ఎక్కడ ఉంది?

1) ఫ్రాన్స్‌  2) జర్మనీ  3) ఉక్రెయిన్‌  4) రష్యా


22. ప్రపంచంలో అతిపొడవైన పర్వత శ్రేణి?

1) హిమాలయాలు    2) రాకీ పర్వతాలు 

3) ఆండీస్‌ పర్వతాలు    4) ఆల్ఫ్స్‌ పర్వతాలు


23. ‘డోల్‌ డ్రమ్స్‌’ అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు?

1) ధ్రువ అధిక పీడన ప్రాంతం

2) భూమధ్యరేఖ అల్పపీడన ప్రాంతం

3) ఉప అయనరేఖా అధిక పీడన ప్రాంతం 

4) ఉపధ్రువ అధిక పీడన మేఖల


24. ‘ప్రశాంత మండలం’ అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు?

1) భూమధ్యరేఖా అల్పపీడన మేఖల

2) ఉప అయనరేఖా అధిక పీడన మేఖల     3) ఉప ధ్రువ అల్పపీడన మేఖల 

4) ధ్రువ అధిక పీడన మేఖల


25. భారతదేశంలో భౌగోళికంగా ‘కరవు’ ఏ ప్రాంతాల్లో సంభవిస్తుంది?

1) తూర్పు, ఆగ్నేయ ప్రాంతం 

2) పశ్చిమ, దక్షిణ భారత్‌ 

3) ఉత్తర ప్రాంతం

4) గంగ, సింధు, బ్రహ్మపుత్ర మైదానాలు


26. కిందివాటిని జతపరచండి. ఇనుము ఉక్కు కర్మాగారం విదేశీ సహకారం

1) రూర్కెలా ఎ) జర్మనీ
2) భిలాయి బి) యు.కె.
3) బొకారో సి) రష్యా
4) దుర్గాపుర్‌ డి) యూఎస్‌ఏ 

1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి  2) 1-ఎ, 2-సి, 3-డి, 4-బి          

3) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ   4) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి


27. భారతదేశ వర్షపాత రకం?

1) పర్వతీయ 2) సంవహన 3) చక్రవాత 4) పైవన్నీ


28. కిందివాటిలో తప్పుగా ఉన్న జత-

1) అరుణ గ్రహం - కుజుడు

2) శీతలమైన గ్రహం - నెప్ట్యూన్‌

3) వలయాలున్న గ్రహం - శని

4) అత్యధిక సాంద్రత ఉన్న గ్రహం - బృహస్పతి


29. భూపటలంలో అధికంగా ఉన్న మూలకం?

1) ఆక్సిజన్‌      2) సిలికాన్‌  

3) అల్యూమినియం     4) ఇనుము


30. కిందివాటిలో సరైనవాటిని గుర్తించండి.

పరికల్పనలు పరికల్పన కర్త
1) ద్వినక్షత్ర పరికల్పన ఎ) జార్జ్‌ లైమిట్రీ
2) బిగ్‌బ్యాంగ్‌ సిద్ధాంతం బి) లిటిన్‌టన్‌
3) నిహారిక పరికల్పన సిద్ధాంతం సి) టిసి బాంబర్లీన్‌
4) గ్రహాల పరికల్పన సిద్ధాంతం డి) లాప్లాస్‌

1) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి   2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి          

3) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి   4) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి


31. ప్రపంచంలో మొదటిసారిగా జనాభా లెక్కల సేకరణ చేపట్టిన దేశం?

1) స్వీడన్‌      2) ఇంగ్లాండ్‌   

3) న్యూజిలాండ్‌      4) చైనా


33. కింద తెలిపిన ఏ కాలాన్ని ‘భారతదేశ జనాభా లెక్కల సేకరణ’లో జనాభా విస్ఫోటంగా పేర్కొంటారు.

1) 1901-1921       2) 1921-1951  

3) 1951-1981       4) 1981-2001


33. భారతదేశంలో రాజ్యాంగం గుర్తించిన మొత్తం భాషల సంఖ్య?

1) 20     2) 21     3) 22     4) 23


34. 2011 జనాభా లెక్కల ప్రకారం ‘భారతదేశ జనసాంద్రత’?

1) 325    2) 267    3) 382    4) 176


35.. కిందివాటిలో ‘భారతదేశ జనాభా వృద్ధి చరిత్ర’లో ఒక గొప్ప విభాజక సంవత్సరంగా దేన్ని పరిగణిస్తారు?

1) 1911  2) 1921   3) 1931   4) 1951


36. భారతదేశంలో 2011 సెన్సస్‌ ప్రకారం జనాభా సానుకూలత ఎంత శాతం? 

1) 61.4%  2) 60.4% 3) 58.4% 4) 64.8%


37. 2021 జనగణన వాయిదా పడటం ఎన్నోసారి?

1) మొదటి  2) రెండో  3) మూడో  4) నాలుగో


38. 2011 నాటికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ(వరుసగా)ల్లో శిశు మరణాల రేటు?

1) 39, 35  2) 35, 39  3) 39, 39 4) 35, 35


39. జనాభా లెక్కలపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?

1) డెమోగ్రఫీ      2) బయోగ్రఫీ   

3) బిబ్లియోగ్రఫీ      4) ఫిలోగ్రఫీ


40. ప్రపంచంలో ‘ఆధునిక జనాభా లెక్కల సేకరణ’ ఇంగ్లాండులో ఎప్పుడు ప్రవేశపెట్టారు?

1) 1872   2) 1873   3) 1874   4) 1875


41. కిందివాటిలో అధిక జనాభా ఉన్న రాష్ట్రాల వరుసక్రమం?

1) ఉత్తర్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్‌

2) సిక్కిం, మిజోరాం, అరుణాచల్‌ ప్రదేశ్, గోవా

3) ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, పశ్చిమ బెంగాల్‌

4) ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, బిహార్‌


42. 1921 జనాభా లెక్కల ప్రకారం ‘జనాభా వృద్ధి రేటు’ ఎంత నమోదైంది?

1)  -0.31%  2) 0.31%  3) 0.18%  4) - 0.18%


43. 2011 సెన్సస్‌ ప్రకారం దేశంలో స్త్రీ, పురుష సగటు నిష్పత్తి ఎంత?
 


44. 2011 సెన్సస్‌ ప్రకారం భారతదేశ అక్షరాస్యత శాతం?

1) 74.04%       2) 74.05%  

3) 74.00%        4) 73.00%


45. వరుసక్రమంలో అల్ప జనాభా ఉన్న రాష్ట్రాలు?

1) మిజోరం, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్, గోవా, నాగాలాండ్‌

2) సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్, మిజోరం, గోవా, నాగాలాండ్‌

3) సిక్కిం, మిజోరం, అరుణాచల్‌ ప్రదేశ్, గోవా, నాగాలాండ్‌

4) సిక్కిం, గోవా, నాగాలాండ్, మిజోరం, అరుణాచల్‌ ప్రదేశ్‌



సమాధానాలు


1-2; 2-3; 3-4; 4-4; 5-4; 6-3; 7-2; 8-1; 9-3; 10-1; 11-2; 12-1; 13-2; 14-3; 15-1; 16-2; 17-3; 18-1; 19-4; 20-1; 21-2; 22-3; 23-2; 24-1; 25-3; 26-2; 27-1; 28-4; 29-1; 30-4; 31-1; 32-3; 33-3; 34-3; 35-2; 36-4; 37-1; 38-1; 39-1; 40-1; 41-3; 42-1; 43-1; 44-1; 45-3. 

Posted Date : 10-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌