• facebook
  • whatsapp
  • telegram

seating arrangement


సూచనలు (ప్ర. 1 - 5): ఇచ్చిన సమాచారం ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.


A,B,C,D,E,F,G,H, అనే ఎనిమిది మంది వ్యక్తులు ఒక దీర్ఘచతురస్రాకార టేబుల్‌ చుట్టూ కూర్చున్నారు. వారిలో నలుగురు టేబుల్‌ నాలుగు మూలల్లో, మిగిలినవారు రెండు వైపులా మధ్యలో పక్కపక్కన ఉన్నారు. మూలన కూర్చున్న వారు టేబుల్‌ బయటివైపునకు అభిముఖంగా, మధ్యలో కూర్చున్న వారు టేబుల్‌ కేంద్రానికి అభిముఖంగా ఉన్నారు. మధ్యలో కూర్చున్నవారు సరిగ్గా ఒకరికొకరు ఎదురెదురుగా ఉన్నారు.


Fటేబుల్‌కు ఒకవైపు మధ్యలో కూర్చున్నాడు.F,Eమధ్య ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. F,Cమధ్య ఒక వ్యక్తి మాత్రమే కూర్చున్నాడు. Cకి సమీపంలో E లేడు. Hకి ఎడమవైపు రెండో స్థానంలో లేదా కుడివైపు రెండో స్థానంలో A కూర్చున్నాడు. A,Cమధ్య ఒక వ్యక్తి కూర్చున్నాడు. B,Gఒకరికొకరు ఎదురుగా ఉన్నారు. Bకి ఎడమవైపు రెండో స్థానంలో Dకూర్చున్నాడు. G,Fపక్కపక్కన లేరు.


1. కింది నాలుగు ఆప్షన్స్‌లో మూడు ఒక నిర్దిష్ట మార్గంలో ఒకేలా ఉంటూ, ఒక సమూహాన్ని ఏర్పరుస్తాయి. వాటిలో ఆ సమూహానికి చెందనిది ఏది?

1) G     2) B       3) E       4) H

2. కిందివారిలో దీకి కుడివైపు మూడో స్థానంలో కూర్చుంది ఎవరు?

1) C        2)G          3) H          4) ఎవరూ కాదు

3. G కి సంబంధించి నీ స్థానం ఏమిటి?

1)కుడివైపు నుంచి రెండో స్థానం

2)ఎడమవైపు నుంచి మూడో స్థానం

3)కుడివైపు నుంచి మూడో స్థానం

4)ఏదీకాదు

4. దీ నుంచి కుడివైపు లెక్కించినప్పుడు దీ, నీ మధ్య ఎంతమంది వ్యక్తులు ఉన్నారు?

1) 1       2) 4       3) 2       4) 0

5. కిందివారిలో దికి అభిముఖంగా కూర్చుంది ఎవరు?

1) E      2) G     3) B       4) H

సాధన: 

సమాధానాలు: 1-4   2-3   3-3   4-4   5-4

సూచనలు (ప్ర. 6 - 10): ఇచ్చిన సమాచారం ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

1, 5, 20, 50, 100, 200, 500, 2000 రూపాయల విలువైన ఎనిమిది నోట్లను వృత్తాకారంలో అమర్చారు. అవన్నీ ఒకే క్రమంలో ఉండాల్సిన అవసరం లేదు, అవి వృత్తంలో కేంద్రాభిముఖంగా ఉన్నాయి.

రూ.200 నోటుకు కుడివైపు రెండో స్థానంలో రూ.50 నోటు ఉంది. బేసి విలువ కలిగిన నోటు రూ.200, రూ.50 కి వెంటనే పక్కన ఉండదు. రూ.1 నోటు తప్ప రూ.100 నోటుకు వెంటనే ఎడమవైపు, వెంటనే కుడివైపున రూ.100 కంటే తక్కువ విలువ ఉన్న నోటు ఉంటుంది. రూ.5 నోటుకు ఎడమవైపు రెండో స్థానంలో రూ.100 నోటు ఉంది. రూ.100 నోటుకు ఎడమవైపు రెండో స్థానంలో రూ.2000 నోటు ఉంది.

6. రూ.50 నోటుకు వెంటనే ఎడమవైపు ఉన్న నోటు ఏది?

1)రూ.500      2) రూ.5     3)రూ.2000     4)రూ.100

7. రూ.2000 నోటుకు కుడివైపు మూడో స్థానంలో ఉన్న నోటు?

1) రూ.100     2) రూ.2000   3) రూ.200      4) రూ.20

8. రూ.50 నోటుకు వెంటనే ఎడమవైపు ఉన్నదాన్ని, రూ.500 నోటుకు వెంటనే కుడివైపు ఉన్న నోటును కూడితే వచ్చే మొత్తం?

1) 700       2)2200    3) 550       4)2100

9. రూ.5 నోటుకు కుడివైపు మూడో స్థానంలో ఉండే నోటు ఏది?

1)రూ.2000     2)రూ.200    3)రూ.20      4)రూ.100

10. రూ.1 నోటు నుంచి గడియారపు సవ్యదిశలో లెక్కించినప్పుడు రూ.1, రూ.100 మధ్య ఉండే నోట్లు ఏవి?

1)రూ.50, రూ.100    2)రూ.200, రూ.2000   3)రూ.5, రూ.20    4) ఏదీకాదు

సాధన:

సమాధానాలు:    6-3   7-4   8-2   9-2   10-3


సూచనలు (ప్ర. 14 - 16): ఇచ్చిన సమాచారం ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ఏడుగురు వ్యక్తులు - A,B,C,D,E,F,G,H స్టేజీపై దక్షిణంవైపు నిలబడి పాటలు పాడుతున్నారు. వారు కింది విధంగా ఉన్నారు.

C కి కుడివైపు D ఉంటే, G పక్కన F ఉంది. F కి ఎడమ వైపు B ఉంది.C,B మధ్యలో ఒక గాయని ఉంది. A,D మధ్యలో ఒక గాయని ఉంది. ఆ వరుసలో ఎడమవైపు అత్యంత చివర్లో E ఉంది.

14. B,C మధ్యలో ఎవరు ఉన్నారు?

1) D           2 ) C       3) E           4) B

15. ఏడుగురిలో మధ్యలో ఉంది ఎవరు?

1) B       2) C       3 ) A      4) D 

16. ప్రేక్షకుల నుంచి చూస్తే వారిలో కుడివైపు అత్యంత చివర ఉంది ఎవరు?

1) C         2) E       3) G        4) D



సమాధానాలు: 14-1   15-4    16-3


17. ఆరుగురు వ్యక్తులు వృత్తాకారంలో కేంద్రం చుట్టూ నిలబడి ఉన్నారు. ప్రవీణ్‌కి ఎడమ వైపు అనిల్‌ ఉన్నాడు. చందు, నరేంద్ర, ప్రకాశ్‌ మధ్య సుధాకర్‌ నిలబడ్డాడు. అనిల్, చందు మధ్యలో హరి ఉన్నాడు. నరేంద్రకు ఎడమ వైపు ఉంది ఎవరు?


1)ప్రవీణ్‌     2)అనిల్‌    3)సుధాకర్‌     4)హరి


సమాధానం: 1

18. A,B,C,D,E,F,G,H అనే ఆరుగురు వ్యక్తులు వృత్తం కేంద్ర స్థానానికి అభిముఖంగా కూర్చున్నారు. B, E మధ్య A ఉన్నాడు. D,F  మధ్య C ఉన్నాడు. D కి కుడివైపు వెంటనే E ఉన్నాడు. అయితే E,C మధ్య ఉంది ఎవరు?


1) B      2) C    3) D    4) ఎవరూ కాదు

సాధన:

           


సమాధానం: 3

సూచనలు (ప్ర. 19 - 20): ఇచ్చిన సమాచారం ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

A,B,C,D,E,F,Gఅనే ఏడుగురు వ్యక్తులు తూర్పునకు అభిముఖంగా నిలబడ్డారు. D కి కుడివైపు C ఉంది. B ఆ వరుసలో ఒక చివర్లో ఉన్నాడు, అతడి పక్కన E ఉన్నాడు. E,F మధ్యలో G ఉన్నాడు. D దక్షిణంవైపు చివర నుంచి మూడో స్థానంలో ఉన్నాడు.

19. ని కి కుడివైపు ఎవరు ఉన్నారు?

1) A       2) G       3) B       4) C

20. రెండు చివర్లలో ఉంది ఎవరు?

1) D,C   2) B,A   3) E,F   4) B,E

సాధన:

సమాధానాలు: 19-2   20-2

సూచనలు (ప్ర. 11 - 13): ఇచ్చిన సమాచారం ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

10 కంటే ఎక్కువ మంది వ్యక్తులు ఒక వృత్తాకారంలో కేంద్రానికి అభిముఖంగా కూర్చున్నారు. B అనే వ్యక్తి C కి ఎడమవైపు 3వ స్థానంలో ఉన్నాడు. D, B మధ్య ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు. A అనే వ్యక్తి E కి వెంటనే కుడివైపు కూర్చున్నాడు. C, E మధ్య ఒక వ్యక్తి కూర్చున్నాడు. D, A  మధ్య ఇద్దరి కంటే తక్కువ మంది కూర్చున్నారు. A అనే వ్యక్తి B కి కుడివైపు 2వ స్థానంలో కూర్చున్నాడు.

11. A కి సంబంధించి ది స్థానం ఏమిటి?

1) ఎడమ నుంచి మూడో స్థానం  2) కుడి నుంచి అయిదో స్థానం    3) ఎడమ నుంచి నాలుగో స్థానం    4) కుడి నుంచి మూడో స్థానం

12. వృత్తాకార అమరికలో మొత్తం ఎంతమంది వ్యక్తులు కూర్చున్నారు?

1)13     2)12     3)11     4) 14

13. B,A మధ్యలో గడియారపు అపసవ్య దిశలో కూర్చున్న వ్యక్తులు ఎంతమంది?

1) 6       2) 7       3) 3       4) 5

సాధన:


సమాధానాలు: 11-3   12-3   13-1

Posted Date : 22-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌