• facebook
  • whatsapp
  • telegram

రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణాల జత

ax + by + c = 0 రూపంలో(a, b, c, ∈ R, a ≠ 0, b ≠ 0)  గల సమీకరణాన్ని రెండు చరరాశులు x, y లలో రేఖీయ సమీకరణం అంటారు.

* ఒకే రకమైన రెండు చరరాశులు ఉన్న రెండు రేఖీయ సమీకరణాలను రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణాల జత అంటారు.

రేఖీయ సమీకరణాల జతకు సాధారణ రూపం 

a1 x + b1 y + c1 = 0 (a12 + b12 ≠ 0)

a2x + b2y + c2 = 0 (a2 2 + b22 ≠ 0)

(a1 , b1 , c1 , a2 , b2 , c2 ∈ R)

మాదిరి సమస్యలు

1. కింది వాటిలో 2x + 3y + 1 = 0, 4x + 5y + 3 = 0  సమీకరణాలను సూచించేదేది?

1) ఖండన రేఖలు     2) సమాంతర రేఖలు    3) ఏకీభవించే రేఖలు     4) ఏదీకాదు

సాధన:  a1 = 2, b1 = 3, c1 = 1, 

              a2 = 4, b2 = 5, c2 = 3

దత్త సమీకరణాలు ఖండన రేఖలు    

సమాధానం: 1


2. 4x + 6y = 15, 2x + 3y = 8 సమీకరణాల జత కింది వాటిలో దేన్ని సూచిస్తుంది?

1) ఖండన రేఖలు     2) సమాంతర రేఖలు     3) పరస్పరాధారిత రేఖలు        4) ఏకీభవించే రేఖలు

సాధన: ఇచ్చిన సమీకరణాలు

4x + 6y = 15 ⇒ 4x + 6y − 15 = 0 

2x + 3y = 8 ⇒ 2x + 3y − 8 = 0 

a1 = 4, b1 = 6, c1 = −15, 

a2 = 2, b2 = 3, c2 = − 8

దత్త సమీకరణాలు సమాంతర రేఖలు


సమాధానం: 2


3. 3x + ky − 5 = 0, 2x − 3y + 6 = 0  సమీకరణాలు సమాంతర రేఖలు. అయితే k విలువ ఎంత?

సాధన: దత్త సమీకరణాలు 

3x + ky − 5 = 0 1

2x − 3y + 6 = 0 2

a1 = 3, b1 = k, c1 = −5, 

a2 = 2, b2 = −3, c2 = 6

సమీ.1, 2 లు సమాంతర రేఖలు,  

   


సమాధానం: 4


4. 2x − ky + 5 = 0, 3x + 2y − 7 = 0 అనే సమకాలిక ఏకఘాత సమీకరణాలకు ఏకైక సాధన ఉంటే, అప్పుడు......

సాధన: దత్త సమీకరణాలు 

2x − ky + 5 = 0 1

 3x + 2y − 7 = 0 2

 a1 = 2, b1 = −k, c1 = 5,

 a2 = 3, b2 = 2, c2 = −7 

a1 x + b1 y + c1 = 0, a2 x + b2 y + c2 = 0

లకు ఏకైక సాధన ఉంటే,

సమాధానం: 4

5. 2x − 3y + 4 = 0, 3x − 2y − 4 = 0 అనే సమకాలిక ఏకఘాత సమీకరణాలకు.......

1) సాధన ఉండదు    2) ఏకైక సాధన ఉంటుంది

3) సాధనల సంఖ్య పరిమితంగా ఉంటుంది    4) అనంతమైన సాధనలు ఉంటాయి

సాధన: ఇచ్చిన సమీకరణాలు     

2x − 3y + 4 = 0

3x − 2y − 4 = 0

a1 = 2, b1 = −3, c1 = 4,

 a2 = 3, b2 = −2, c2 = − 4

సమీ.లు 1, 2లకు ఏకైక సాధన ఉంటుంది.

సమాధానం: 2

6. 2x + 3y = 13, 5x − 4y = −2అనే సమీకరణాల సాధన?

సాధన: దత్త సమీకరణాలు 

2x + 3y = 13   1

 5x − 4y = −2 2

సమీ.1 నుంచి 2x + 3y = 13

3y = 13 − 2x

సమీ.2 నుంచి 5x − 4y = −2

− 4y= −2 − 5x

 4y = 2 + 5x

4 (13 − 2x) = 3 (5x + 2) 

 

52 − 8x = 15x + 6

52 − 6 = 15x + 8x 

⇒ 46 = 23x

x = 2 ను సమీ.1లో ప్రతిక్షేపించగా..

సమాధానం: 1

1)11        2) 13     3) 15       4) 17

2a + 3b = 2 1

4a − 9b = −1 2

సమీ. 1 × 2 ⇒ (2a + 3b = 2) × 2

4a + 6b = 4  3

సమీ. 3 −  సమీ. 2

4a + 6b − (4a − 9b) = 4 − (−1)

4a + 6b − 4a + 9b = 5 

⇒15b = 5

b= 1/3 ని సమీ.1లో ప్రతిక్షేపించగా..

2a + 3b = 2

 

2a + 1 = 2 ⇒ 2a = 1

 
x = 4, y = 9  అయీతే
 x + y = 4 + 9 = 13
 
సమాధానం: 2
* సాయి బ్యాంకు నుంచి రూ.4000 తీసుకోవాలనుకున్నాడు. అతడు క్యాషియర్‌ను రూ.50, రూ.100 నోట్లు మాత్రమే ఇవ్వాలని కోరాడు. మొత్తం అతనికి 50 నోట్లు వచ్చాయి. అయితే అందులో రూ.100 నోట్లు ఎన్ని?

1) 25     2) 35     3) 20     4) 30

సాధన: రూ.100 నోట్ల సంఖ్య = x


రూ.50 నోట్ల సంఖ్య = y అనుకోండి


లెక్క ప్రకారం..x + y = 50 1  

100x + 50y = 40002


సమీ.1 నుంచి.... x + y = 50 

y = 50 − x
            

సమీ.2 నుంచి... 100x + 50y = 4000

y = 80 − 2x 

⇒ 50 − x = 80 − 2x

 2x − x = 80 − 50 ⇒ x = 30

రూ.100 నోట్ల సంఖ్య (x) = 30

సమాధానం: 4

అభ్యాస సమస్యలు


1. x + y = 2, 3x + 3y = 6 సమీకరణాలకు సంబంధించి కింది వాటిలో సరైంది?

1) సాధన లేదు     2) ఏకైక సాధన ఉంటుంది

3) రెండు సాధనలు ఉంటాయి   4) అనంత సాధనలు ఉంటాయి

జ: అనంత సాధనలు ఉంటాయి


2. 2x + 3y = 7, (a − 1)x + (a + 1)y = 3a − 1 సమీకరణాలకు అనంతమైన సాధనలు ఉంటే, ్చ విలువ ఎంత?

1) 2    2) 3    3) 4    4) 5

జ: 4) 5


3. 4x + py + 8 = 0, 2x + 2y + 2 = 0సమీకరణాలకు ఏకైన సాధన ఉంటే కింది వాటిలో ఏది సత్యం?

1) p ≠ 4      2) p = 4      3) p = 1     4) p ≠ 1

జ: p ≠ 4


4. 3x + 4y + 7 = 0, 9x + 12y + k = 0 సమీకరణాలు ఏకీభవించే రేఖలను సూచిస్తే k  విలువ ఎంత?

1) 14    2) 21     3) 28    4) 15

జ: 21

Posted Date : 06-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌