• facebook
  • whatsapp
  • telegram

వడ్డీలు 

సరళ వడ్డీ (Simple Interest), చక్రవడ్డీ (Compound Interest) అని వడ్డీలు రెండు రకాలు. పరీక్షలో ఈ విభాగం నుంచి 5 రకాల ప్రశ్నలు అడిగే వీలుంది.
   1) వడ్డీని లెక్కించడం          2) కాలాన్ని లెక్కించడం                3) అసలును లెక్కించడం
   4) మొత్తాన్ని లెక్కించడం   5) వడ్డీల్లో తేడా పెరగడం లేదా తగ్గడం, రెండింటి మధ్య తేడా


2. ఒక వ్యక్తి రూ.725 లను 4% సరళ వడ్డీతో ఎంత కాలానికి అప్పుగా ఇస్తే వడ్డీ రూ.87 వస్తుంది?
జవాబు: 3 సం.

3. కొంత సొమ్మును 2  % సరళ వడ్డీతో 3  సంవత్సరాలకు అప్పుగా ఇస్తే రూ.143 వడ్డీ వస్తుంది. అయితే అసలు ఎంత?
జవాబు: రూ.1760


 

4. ఒక వ్యక్తి కొంత సొమ్మును 5% సరళ వడ్డీతో అప్పుగా ఇస్తే రెండేళ్ల తర్వాత మొత్తం రూ. 132 అయ్యింది. అయితే అసలు ఎంత?
జవాబు: రూ.120

5. ఒక వ్యక్తి కొంత సొమ్మును కొంత వడ్డీరేటుతో 2 సంవత్సరాలకు సరళ వడ్డీకి ఇచ్చాడు. కానీ వడ్డీరేటును 3% ఎక్కువ చేయడంతో రూ.300 ఎక్కువ వడ్డీ వచ్చింది. అయితే అతడు ఇచ్చిన అప్పు ఎంత?
జవాబు: రూ.5000


 

6. ఒక వ్యక్తి కొంత సొమ్మును సరళవడ్డీకి ఇస్తే 12 సంవత్సరాలకు రెట్టింపవుతుంది. అయితే వడ్డీ రేటు ఎంత?
జవాబు:   


 

7. కొంత సొమ్మును సరళ వడ్డీకి ఇస్తే 6 సంవత్సరాల్లో రెట్టింపవుతుంది. అదే సొమ్ము 4 రెట్లు అవడానికి ఎంత కాలం పడుతుంది?
జవాబు: 18 సం.


 

8. ఒక వ్యక్తి రూ. 4000లను 2 భాగాలుగా చేసి ఒక భాగాన్ని 3% వడ్డీ రేటుతో, మరో భాగాన్ని 5% వడ్డీరేటుతో ఏడాదికి అప్పుగా ఇస్తే మొత్తం వడ్డీ రూ. 144 వచ్చింది. అయితే 3% వడ్డీరేటుతో అతడు ఎంత మొత్తాన్ని అప్పుగా ఇచ్చాడు?
జవాబు: రూ.2800


 

9. ఒక వ్యక్తి రూ. 10,000లను ఏడాదికి 10% చక్రవడ్డీతో అప్పుగా ఇస్తే 3 సంవత్సరాల తర్వాత వచ్చే మొత్తం ఎంత?
జవాబు: రూ.13310

10. ఒక వ్యక్తి కొంత సొమ్మును చక్రవడ్డీకి ఇస్తే 4 సంవత్సరాలకు రెట్టింపు అవుతుంది. అయితే ఎంత కాలానికి 8 రెట్లు అవుతుంది?
జవాబు: 12 సం.


 

11. ఒక వ్యక్తి రెండేళ్ల కాలానికి కొంత సొమ్మును 4% చక్రవడ్డీ, బారువడ్డీరేటుతో అప్పుగా తీసుకున్నాడు. ఆ రెండు వడ్డీల మధ్య తేడా రూ. 1 అయితే తీసుకున్న అప్పు ఎంత?
జవాబు: రూ.625


 

12. కొంత సొమ్మును బారువడ్డీకి ఇస్తే 3 సంవత్సరాలకు రూ.815, 4 సంవత్సరాలకు రూ.854 అయ్యింది. అయితే అసలు ఎంత?
జవాబు: రూ. 698

 

13. ఒక వ్యక్తి రూ. 1750 ని బారువడ్డీకి 7 సంవత్సరాలకు అప్పుగా ఇచ్చాడు. అయితే వడ్డీరేటును 2% ఎక్కువ చేస్తే ఎంత ఎక్కువ మొత్తం వడ్డీగా వస్తుంది?
జవాబు: నిర్వచించలేం


14. రూ.4,800 లను అప్పుగా తీసుకుని సంవత్సరానికి 8  % వడ్డీరేటుతో 2 సంవత్సరాల 3 నెలలకు ఎంత వడ్డీని చెల్లించాలి?
 ఎ) రూ.796      బి) రూ.816      సి) రూ.918      డి) రూ.956
జవాబు: సి
సాధన: 
       



15. రూ.12,500 లను కొంత సరళ వడ్డీకి అప్పుగా తీసుకుంటే 4 సంవత్సరాల్లో మొత్తం రూ.15,500 అయ్యింది. అయితే వడ్డీరేటు ఎంత?
   ఎ) 3%           బి) 4%          సి) 5%          డి) 6%
జవాబు: డి
సాధన:
        

 

16. రూ.500 అప్పుగా తీసుకుంటే సంవత్సరానికి 5% వడ్డీ రేటుతో ఎంత కాలానికి రూ.50 వడ్డీ చెల్లించాలి?
  ఎ) 2 సం.         బి) 2 12 సం.        సి) 3 సం.        డి) 4 సం.
జవాబు: 
సాధన: 

17. కొంత సొమ్మును అప్పుగా తీసుకుంటే అది 15 సంవత్సరాల్లో 4 రెట్లు అయ్యింది. అయితే వడ్డీరేటు ఎంత?
    ఎ) 40%     బి) 30%     సి) 20%     డి) 10%
జవాబు: సి
సాధన: 
      
సంక్షిప్త పద్ధతి:


 

18. కొంత సొమ్మును అప్పుగా తీసుకుని సంవత్సరానికి 5% వడ్డీరేటుతో 2 సంవత్సరాలకు మొత్తం రూ.132 చెల్లిస్తే, తీసుకున్న అప్పు ఎంత?
    ఎ) రూ.112        బి) రూ.118.80        సి) రూ.120        డి) రూ.122
జవాబు: సి
సాధన: 
    
సంక్షిప్త పద్ధతి:

19. కొంత సొమ్మును అప్పుగా తీసుకుంటే 2 ఏళ్లలో రూ.720, 5 ఏళ్లలో రూ.1,020 అయ్యింది. అయితే తీసుకున్న అప్పు ఎంత?
    ఎ) రూ.520         బి) రూ.620        సి) రూ.720      డి) రూ.710
జవాబు: 
సాధన: 5 - 2 = 3 సంవత్సరాలకు వడ్డీ
          = 1020 - 720 = 300
          3 సంవత్సరాలకు ...... 300
          2 సంవత్సరాలకు ...... ?
           × 300 = 200
          అసలు = మొత్తం - వడ్డీ
          = 720 - 200 = 520

 

20. ఒక వ్యక్తి కొంత సొమ్మును 2 సంవత్సరాలకు అప్పుగా తీసుకున్నాడు. వడ్డీ రేటు 2% పెంచడం వల్ల రూ.72 ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వచ్చింది. అయితే తీసుకున్న అప్పు ఎంత?
   ఎ) రూ.1200         బి) రూ.1500         సి) రూ.1600     డి) రూ.1800
జవాబు: ఎ
సాధన: 72 అనేది పాత వడ్డీకి, కొత్త వడ్డీకి మధ్య తేడా.
         P = x, R = R%, T = 2; P = x, R = (R + 3), T = 2
        
సంక్షిప్త పద్ధతి:

21. ఒక వ్యక్తి కొంత సొమ్మును అప్పుగా తీసుకుంటే సంవత్సరానికి 5% వడ్డీ రేటుతో 4 సంవత్సరాలకు మొత్తం రూ.6450 అయ్యింది. దీన్ని వాయిదా పద్ధతిలో చెల్లించాలంటే సంవత్సరానికి ఎంత చెల్లించాలి?
  ఎ) రూ.1400          బి) రూ.1500          సి) రూ.1550        డి) రూ.1600
జవాబు: బి
సాధన: ఏడాదికి వాయిదా = x అనుకోండి.

22. రూ.1,500 లను రెండు భాగాలుగా చేసి, అందులో ఒక భాగాన్ని 6%, మరొక భాగాన్ని 5% వడ్డీరేటుతో ఒక సంవత్సరానికి అప్పుగా ఇస్తే ఇద్దరి వద్ద నుంచి రూ.85 వడ్డీ వచ్చింది. అయితే 5% వడ్డీరేటుతో అప్పుగా ఇచ్చింది ఎంత?
 ఎ) రూ.1000           బి) రూ.500          సి) రూ.750         డి) రూ.850
జవాబు: బి
సాధన: 5% వడ్డీతో తీసుకున్న అప్పు x అనుకోండి. అప్పుడు 6% వడ్డీతో తీసుకున్న అప్పు (1500 - x) అవుతుంది
   
   9000 - x = 8500
 x = 9000 - 8500 = 500

 

23. ఒక వ్యక్తి రెండు సమాన మొత్తాలను 10% వడ్డీ రేటుతో రెండు బ్యాంకుల్లో 4, 6 సంవత్సరాలకు డిపాజిట్ చేశాడు. రెండు బ్యాంకులు ఇచ్చే వడ్డీల మధ్య తేడా రూ.840 అయితే డిపాజిట్ చేసిన సొమ్ము ఎంత?
  ఎ) రూ.4,200    బి) రూ.5,000       సి) రూ.5,200       డి) రూ.6,000
జవాబు: ఎ
సాధన: డిపాజిట్ చేసిన సొమ్ము x అనుకోండి.
         
సంక్షిప్త పద్ధతి:


 

24. రూ.2,000 లను 5 సంవత్సరాలకు అప్పుగా ఇస్తే రూ.2,600 అయ్యింది. వడ్డీరేటును 3% పెంచితే ప్రస్తుతం ఎంత సొమ్ము వస్తుంది?
 ఎ) రూ.2,900     బి) రూ.3,200    సి) రూ.3,600     డి) ఏదీకాదు
జవాబు: ఎ
సాధన: ముందుగా వడ్డీరేటును లెక్కించాలి.
      
     మొత్తం = అసలు + వడ్డీ
                = 2000 + 900 = 2900

 

25. రూ.1,500 లను 3 సంవత్సరాలకు రెండు వేర్వేరు వడ్డీరేట్లతో అప్పుగా ఇస్తే, వడ్డీల మధ్య తేడా రూ.13.50. రెండు వడ్డీల మధ్య తేడా ఎంత శాతం?
   ఎ) 0.1%        బి) 0.2%        సి) 0.3%      డి) 0.4%
జవాబు: సి
సాధన: రెండు వడ్డీలు వరుసగా r1%, r2% అనుకోండి.
     

 

26. ఒక వ్యక్తి తీసుకున్న అప్పులో వడ్డీ   వ వంతు ఉంది. వడ్డీరేటు, కాలం సంఖ్యాపరంగా సమానం. అయితే కాలం ఎంత?
   ఎ) 5  సంవత్సరాలు               బి) 6 

 సంవత్సరాలు
   సి) 7 సంవత్సరాలు                   డి) 7  సంవత్సరాలు
జవాబు: డి
సాధన:
     

27. రూ.8,000 రెండేళ్లలో రూ.10,000 అయ్యింది. అదే వడ్డీరేటుతో ఎంత సొమ్మును 3 సంవత్సరాలకు అప్పుగా ఇస్తే రూ.6,875 అవుతుంది?
    ఎ) రూ.4,850        బి) రూ.5,000       సి) రూ.5,500       డి) రూ.5,275
జవాబు: బి
సాధన: 

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
 

1. ఒక తండ్రి కొంత మొత్తాన్ని 12% సరళవడ్డీతో తన 16 సంవత్సరాల కూతురి పేరుతో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశాడు. అతడి కూతురి వయసు 22 సంవత్సరాలు ఉన్నప్పుడు మొత్తం రూ.4,30,000 వచ్చినట్లయితే ఫిక్స్‌డ్ డిపాజిట్ చెసిన మొత్తం ఎంత?
జవాబు: రూ.2,50,000

 

2. బాలు సంవత్సరానికి 8% సాధారణ వడ్డీతో రూ.50,000 అప్పుగా తీసుకున్నాడు. 4 సంవత్సరాల తర్వాత అప్పు తీర్చడానికి అతను ఎంత డబ్బు చెల్లించాలి?
జవాబు: రూ.66,000

 

3. కొంత మొత్తాన్ని బారువడ్డీకి పెట్టుబడి పెట్టారు. పది సంవత్సరాల్లో ఆ మొత్తం మూడు రెట్లయితే వడ్డీరేటు ఎంత?
జవాబు: 20%

 

4. కొంత అసలుపై 12% సాలీనా వడ్డీరేటుతో 6 నెలలకు బారువడ్డీతో రూ.6,360 మొత్తంగా చెల్లించాల్సి వచ్చింది. అయితే వడ్డీకి తీసుకున్న అసలు ఎంత?
జవాబు: రూ.6,000

 

5. కొంత సొమ్ము 15 సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది. అదే సొమ్ము 8 రెట్లు కావాలంటే ఎంత కాలం పడుతుంది?
జవాబు: 45 సంవత్సరాలు            

Posted Date : 13-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌