• facebook
  • whatsapp
  • telegram

ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యల భాజనీయతా సూత్రాలు

ప్రధాన సంఖ్య: ఒకటి, అదే సంఖ్య మాత్రమే కారణాంకాలుగా ఉన్న సంఖ్యను ప్రధాన సంఖ్య అంటారు.
 

100లోపు ఉన్న ప్రధాన సంఖ్యలు: 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, 97.
      100 వ‌ర‌కు ఉన్న ప్రధాన సంఖ్యల సంఖ్య = 25
      100 - 200 మధ్య ఉన్న మొత్తం ప్రధాన సంఖ్యలు = 21
      200 - 300 మధ్య ఉన్న మొత్తం ప్రధాన సంఖ్యలు = 16
      300 - 400 మధ్య ఉన్న మొత్తం ప్రధాన సంఖ్యలు = 16
      400 - 500 మధ్య ఉన్న మొత్తం ప్రధాన సంఖ్యలు = 17

*  500 లోపున్న ప్రధాన సంఖ్యల సంఖ్య = 95
 

కవల ప్రధాన సంఖ్యలు: రెండు ప్రధాన సంఖ్యల భేదం 2 అయితే ఆ ప్రధాన సంఖ్యలను కవల ప్రధాన సంఖ్యలు అంటారు.
ఉదా: (3, 5), (5, 7), (11, 13), (17, 19), (29, 31), (41, 43), (59, 61), (71, 73).
పరస్పర (సాపేక్ష) ప్రధాన సంఖ్యలు: రెండు సంఖ్యలకు సామాన్య కారణాంకం ఒకటి మాత్రమే అయితే ఆ సంఖ్యలను పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారు.
ఉదా: (3, 7), (4, 11), (4, 9)

 

ఫెర్మా ప్రకారం: n =1, 2, 3, 4 అయిన‌ప్పుడు  + 1 రూపంలోని సంఖ్యలు ప్రధాన సంఖ్యలే అని ఊహించాడు.
 

సంయుక్త సంఖ్యలు: రెండు కారణాంకాల కంటే ఎక్కువ కారణాంకాలున్న సంఖ్యలను సంయుక్త సంఖ్యలు అంటారు.
100 వరకు ఉన్న సంయుక్త సంఖ్యల సంఖ్య = 73
100 వరకు ఉన్న సంయుక్త సంఖ్యల సంఖ్య = 74

 

భాజనీయతా సూత్రాలు

2 భాజనీయతా సూత్రం
     ఒక సంఖ్య ఒకట్ల స్థానంలో 2, 4, 6, 8 లేదా 0 ఉంటే ఆ సంఖ్యను 2 నిశ్శేషంగా భాగిస్తుంది.
ఉదా: 45796, 59318

 

3 భాజనీయతా సూత్రం
     ఒక సంఖ్యలోని అంకెల మొత్తాన్ని 3తో నిశ్శేషంగా భాగించగలిగితే, ఆ సంఖ్యను 3 నిశ్శేషంగా భాగిస్తుంది.
                                             (లేదా)
     ఒక సంఖ్య అంకమూలం 3 లేదా 6 లేదా 9 అయితే ఆ సంఖ్యను 3 నిశ్శేషంగా భాగిస్తుంది.
ఉదా: i) 736215 సంఖ్యలోని అంకెల మొత్తం = 7 + 3 + 6 + 2 + 1 + 5 = 24
     24 ని 3 నిశ్శేషంగా భాగిస్తుంది. కాబట్టి 736215 ని 3 నిశ్శేషంగా భాగిస్తుంది.
ii) 645453
645453 అంకమూలం
= 6 + 4 + 5 + 4 + 5 + 3 = 27
= 2 + 7 = 9
     అంకమూలం 9 కాబట్టి 645453 ను 3 నిశ్శేషంగా భాగిస్తుంది.

 

4 భాజనీయతా సూత్రం
     ఒక సంఖ్యలోని చివరి రెండంకెల సంఖ్యను 4 తో నిశ్శేషంగా భాగించగలిగితే, ఆ సంఖ్యను 4 నిశ్శేషంగా భాగిస్తుంది.
ఉదా: 758724 లో చివరి రెండంకెల సంఖ్య 24 కాబట్టి 758724 ను 4 నిశ్శేషంగా భాగిస్తుంది. (24 ని 4 నిశ్శేషంగా భాగిస్తుంది కాబట్టి).

 

5 భాజనీయతా సూత్రం
     ఒక సంఖ్య ఒకట్ల స్థానంలో 0 లేదా 5 ఉన్నట్లయితే ఆ సంఖ్యను 5 నిశ్శేషంగా భాగిస్తుంది.
ఉదా: 97325, 728640

 

8 భాజనీయతా సూత్రం
     ఒక సంఖ్యలోని చివరి మూడు స్థానాలతో ఏర్పడిన సంఖ్యను 8 తో నిశ్శేషంగా భాగించగలిగితే, ఆ సంఖ్యను 8 నిశ్శేషంగా భాగిస్తుంది.
ఉదా: 947656 లోని చివరి మూడు స్థానాలతో ఏర్పడిన సంఖ్య 656. 656 ను 8 నిశ్శేషంగా భాగిస్తుంది. కాబట్టి 947656 ను 8 నిశ్శేషంగా భాగిస్తుంది.

 

9 భాజనీయతా సూత్రం
     ఒక సంఖ్యలోని అంకెల మొత్తాన్ని 9 నిశ్శేషంగా భాగించగలిగితే, ఆ సంఖ్యను 9 నిశ్శేషంగా భాగిస్తుంది.
                              (లేదా)
     ఒక సంఖ్య అంకమూలం 9 మాత్రమే అయితే ఆ సంఖ్యను 9 నిశ్శేషంగా భాగిస్తుంది.
ఉదా: i) 246357 లోని అంకెల మొత్తం = 2 + 4 + 6 + 3 + 5 + 7 = 27
     27 ని 9 నిశ్శేషంగా భాగిస్తుంది. కాబట్టి 246357 ను 9 నిశ్శేషంగా భాగిస్తుంది.
ii) 4688127 అంకమూలం
= 4 + 6 + 8 + 8 + 1 + 2 + 7 = 36
= 3 + 6 = 9
     అంకమూలం 9 కాబట్టి 4688127 ను 9 నిశ్శేషంగా భాగిస్తుంది.

 

11 భాజనీయతా సూత్రం
      సంఖ్యలో బేసి స్థానాల్లోని అంకెల మొత్తం స‌రి స్థానాల్లోని అంకెల మొత్తానికి స‌మాన‌మైన లేదా వాటి భేదాన్ని 11 తో నిశ్శేషంగా భాగించ‌గ‌లిగితే, ఆ సంఖ్యను 11 నిశ్శేషంగా భాగిస్తుంది.
ఉదా: 59463822
బేసి స్థానాల్లోని అంకెల మొత్తం = 2 + 8 + 6 + 9 = 25.
సరి స్థానాల్లోని అంకెల మొత్తం = 2 + 3 = 4 + 5 = 14.
      తేడా = 25 - 14 = 11 కాబట్టి 59463822 ను 11 నిశ్శేషంగా భాగిస్తుంది.

 

గుర్తుంచుకోవాల్సిన అంశాలు:
 

* ఒక సంఖ్యను 6 తో నిశ్శేషంగా భాగించాలంటే, ఆ సంఖ్య 2, 3 తో నిశ్శేషంగా భాగించగలగాలి.
* ఒక సంఖ్యను 12 తో నిశ్శేషంగా భాగించాలంటే, ఆ సంఖ్య 3, 4 తో నిశ్శేషంగా భాగించగలగాలి.
* ఒక సంఖ్యను 24 తో నిశ్శేషంగా భాగించాలంటే, ఆ సంఖ్య 3, 8 తో నిశ్శేషంగా భాగించగలగాలి.
* ఒక సంఖ్యను 36 తో నిశ్శేషంగా భాగించాలంటే, ఆ సంఖ్య 4, 9 తో నిశ్శేషంగా భాగించగలగాలి.
* ఒక సంఖ్యను 45 తో నిశ్శేషంగా భాగించాలంటే, ఆ సంఖ్య 5, 9 తో నిశ్శేషంగా భాగించగలగాలి.
* ఒక సంఖ్య 72 తో నిశ్శేషంగా భాగించాలంటే, ఆ సంఖ్య 8, 9 తో నిశ్శేషంగా భాగించగలగాలి.

Posted Date : 13-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌