• facebook
  • whatsapp
  • telegram

అభివృద్ధి పథకాలు

1. సమాజ అభివృద్ధి పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?

జ: 1952
 

2. క్రెడిట్ ఆథరైజేషన్ స్కీం (CAS - 1965)ను ప్రారంభించిన సంస్థ?

జ: ఆర్‌బీఐ
 

3. గుణాత్మక పరపతి నియంత్రణకు ఆర్‌బీఐ చేపట్టిన పథకం ఏది?

జ: CAS
 

4. సమగ్ర వ్యవసాయ జిల్లాల పథకాన్ని (IADP) ఎప్పుడు ప్రారంభించారు?

జ: 1960 - 61
 

5. సమీకృత వ్యవసాయ ప్రాంతాల పథకం (IAAP) దేనికోసం ఉద్దేశించింది?

జ: పంటల అభివృద్ధి
 

6. నూతన వంగడాల ద్వారా ఆహార ధాన్యాల ఉత్పత్తి పెంచాలనే లక్ష్యంతో ప్రారంభించింది?

జ: HYVP
 

7. హై ఈల్డింగ్ వెరైటీ ప్రోగ్రామ్ (HYVP) ను ఎప్పుడు ప్రారంభించారు?

జ: 1966-67
 

8. ఏ పంట ఉత్పత్తిని పెంచే ఉద్దేశంతో హరిత విప్లవాన్ని ప్రారంభించారు?

1) ఆహార ధాన్యాలు      2) వరి   3) గోధుమ  4) పైవన్నీ

జ: 4 (పైవన్నీ)
 

9. ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం?

జ: మహారాష్ట్ర
 

10. ఉపాధి హామీ పథకం (EGS) ఏ సంవత్సరంలో ప్రారంభమైంది?

జ: 1972-73
 

11. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (DRDA) ప్రధాన ఉద్దేశం?

జ: గ్రామీణాభివృద్ధికి విత్త సహాయం
 

12. ట్రైసమ్ (TRYSEM) ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు?

జ: 1979
 

13. సమీకృత గ్రామీణ అభివృద్ధి పథకం (IRDP) ఎవరి అభివృద్ధికి దోహదం చేస్తుంది?

జ: గ్రామీణ పేదలు
 

14. డ్వాక్రా పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు?

జ: 1982
 

15. గ్రామీణ శిశు, మహిళల అభివృద్ధికి దోహదం చేసే పథకం ఏది?

జ: డ్వాక్రా
 

16. నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ ప్రోగ్రామ్‌ను ఎప్పుడు ప్రారంభించారు?

జ: 1980
 

17. అక్షరాస్యులైన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం ద్రవ్య, సాంకేతిక సహాయం అందించే పథకం ఏది?

జ: సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ టు ద ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్డ్ యూత్
 

18. మహిళా సమృద్ధి యోజన పథక ఉద్దేశం ఏమిటి?

జ: గ్రామీణ స్త్రీల పొదుపు - ప్రోత్సాహం
 

19. మహిళా సమృద్ధి యోజనను ఏ సంవత్సరంలో ప్రారంభించారు?

జ: 1993
 

20. 'నెహ్రూ రోజ్‌గార్ యోజన'ను ఎప్పుడు ప్రారంభించారు?

జ: 1989
 

21. గ్రామాల్లో భూమిలేని వారికి ఉపాధి కల్పించే పథకం ఏది?

జ: RLEGP
 

22. నేషనల్ ఫండ్ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్‌ను ఏర్పాటు చేసిన సంవత్సరం?

జ: 1985
 

23. భారత్ నిర్మాణ్ పథకం ప్రారంభించిన సంవత్సరం?

జ: 2005
 

24. నగర, పట్టణ ఉపాధి కల్పనకు ఉద్దేశించిన పథకం?

జ: NRY


25. సంపూర్ణ గ్రామీణ రోజ్‌గార్ యోజన (SGRY) ఎప్పుడు ప్రారంభించారు?

జ: 2001
 

26. ఎంప్లాయిమెంట్ ఎస్యూరెన్స్ స్కీం (EAS) ఎన్ని రోజుల ఉపాధి అందించేది?

: 100
 

27. ప్రధానమంత్రి రోజ్‌గార్ యోజన (PMRY) ఎవరికి ఉపాధి అందిస్తుంది?

జ: విద్యావంతులు
 

28. పీఎంఆర్‌వై పథకాన్ని ప్రారంభించిన ప్రధాని ఎవరు?

జ: పి.వి. నరసింహారావు
 

29. MPLADS పథకం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది?

జ: 1993
 

30. ఆక్సిలరేటెడ్ రూరల్ వాటర్ సప్లయ్ పథకం దేనికి ఉద్దేశించింది?

జ: గ్రామీణ తాగునీరు
 

31. భూగర్భ జలాల అభివృద్ధికి కృషి చేయడం ఏ పథకం ఉద్దేశం?

జ: DPAP
 

32. 'క్రాష్ స్కీం ఫర్ రూరల్ ఎంప్లాయిమెంట్‌'ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు?

జ: 1973
 

33. ఇరవై సూత్రాల పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?

జ: 1975
 

34. ఉపాంత రైతులు, వ్యవసాయ శ్రామికులకు సాంకేతిక, విత్త సహాయం అందించే పథకం ఏది?

జ: MFALA
 

35. MFALA ను ఎప్పుడు ప్రారంభించారు?

జ: 1973

36. ఆయకట్టు ప్రాంత అభివృద్ధి పథకం (CADP) ఎప్పుడు ప్రారంభమైంది?

జ: 1975
 

37. 20 సూత్రాల పథకాన్ని ప్రారంభించిన ప్రధాని ఎవరు?

జ: ఇందిరాగాంధీ
 

38. బ్యాంకులను జాతీయం చేసిన ప్రధాని ఎవరు?

జ: ఇందిరాగాంధీ
 

39. 14 బ్యాంకులను జాతీయం చేసిన సంవత్సరం?

జ: 1969
 

40. ఏ సంవత్సరంలో 6 బ్యాంకులను జాతీయం చేశారు?

జ: 1980
 

41. ఏ ప్రణాళికలో సమాజ అభివృద్ధి పథకాన్ని ప్రారంభించారు?

జ: 1 వ
 

42. ఏ ప్రణాళికలో 20 సూత్రాల పథకాన్ని ప్రారంభించారు?

జ: 5 వ
 

43. ఎనిమిదో ప్రణాళికలో ప్రారంభించిన పథకం ఏది?

జ: PMRY
 

44. బాల కార్మికుల నిర్మూలన పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?

జ: 1994
 

45. ఏ సంవత్సరంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభించారు?

జ: 1991
 

46. నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రాం ఎవరి కోసం ఉద్దేశించింది?

జ: దారిద్య్ర రేఖకు దిగువనున్న ప్రజలు
 

47. కస్తూర్బా గాంధీ ఎడ్యుకేషన్ స్కీం ఎవరికి వర్తిస్తుంది?

: స్త్రీలు
 

48. 'కస్తూర్బా గాంధీ ఎడ్యుకేషన్ స్కీం'ను ఏ సంవత్సరంలోప్రారంభించారు?

జ: 1997
 

49. జాతీయ సామాజిక భద్రత పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?

జ: 1995
 

50. రాజరాజేశ్వరి మహిళా కళ్యాణ్ యోజన ప్రధాన ఉద్దేశం?

జ: బీమా ద్వారా స్త్రీలకు రక్షణ
 

51. 'రాజరాజేశ్వరి మహిళా కళ్యాణ్ యోజన'ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు?

జ: 1998
 

52. 'అన్నపూర్ణ యోజన'ను ఎప్పుడు ప్రారంభించారు?

జ: 1999
 

53. అన్నపూర్ణ యోజన పథకం కింద 10 కేజీల బియ్యం ఎవరికి ఇస్తారు?

జ: పింఛను రాని వృద్ధులు
 

54. 'స్వర్ణజయంతి ఆవాస్ యోజన'ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు?

జ: 1999
 

55. 'జవహర్ గ్రామ్ సమృద్ధి యోజన' లక్ష్యం?

జ: గ్రామీణ అవస్థాపన పెంపు
 

56. ఏ ప్రణాళికలో JGSY ను ప్రారంభించారు?

: 9 వ
 

57. స్వర్ణజయంతి గ్రామ్ స్వరోజ్‌గార్ యోజన (SJGSY) ప్రధాన లక్ష్యం ఏమిటి?

: గ్రామీణ పేదరికం, నిరుద్యోగ నిర్మూలన
 

58. SJGSY ని ఎప్పుడు ప్రారంభించారు?

జ: 1999
 

59. గ్రామీణ ప్రాథమిక సౌకర్యాల కల్పనకు ఉద్దేశించిన పథకం ఏది?

జ: ప్రధాన మంత్రి గ్రామోదయ్ యోజన (PMGY)
 

60. PMGY ని ఎప్పుడు ప్రారంభించారు?

జ: 2000
 

61. 'అంత్యోదయ అన్నయోజన' పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?

జ: 2000

62. ఆశ్రయ్ బీమా యోజన (ABY) దేనికి సంబంధించింది?

జ: ఉపాధి కోల్పోయిన వారికి నష్టపరిహారం అందించడం
 

63. సోషల్ సెక్యూరిటీ పైలట్ స్కీం దేనికి సంబంధించింది?

జ: అసంఘటిత రంగ శ్రామికుల సంక్షేమం
 

64. 'వందేమాతరం' పథకాన్ని ఎవరి కోసం ప్రారంభించారు?

జ: గర్భిణుల సంరక్షణ      

Posted Date : 10-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌