• facebook
  • whatsapp
  • telegram

గుణకారంలో సులభ మార్గాలు

1. సంఖ్యలను గుణించేటప్పుడు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ “0” లు చివర్లో ఉన్నప్పుడు:

Step1: చివర ఎన్ని సున్నాలు ఉంటాయో వాటిని వదిలి ఆ సంఖ్యలను గుణించాలి. 

Step2: గుణకారం చేశాక వచ్చిన ఫలితం చివర్లో మొదట వదిలిన ‘‘0’’ లను ఉంచాలి. 

ఉదా: I.  476 ´ 200 = ?

సాధన: రెండో సంఖ్య చివరిలో రెండు సున్నాలు ఉన్నాయి.

వాటిని వదిలి గుణకారం చేయాలి.

476 X 2 = 952 

ఫలితం చివర రెండు “0” లను ఉంచాలి. 

476 X 200 = 95200

II. 83 X 4000 = ?

సాధన: Step1: 83 ´ 4 = 332 

             Step2: 83  ´ 4000 = 332000

2. ఒక సంఖ్యను 5 తో గుణించేటప్పుడు:  

Step1:ఒక సంఖ్యను 5 తో గుణించాలంటే, ముందు దాన్ని 2 తో భాగించాలి. 

Step2: Step 1 ద్వారా వచ్చిన ఫలితాన్ని 10 తో గుణించాలి.

ఉదా: I. 146 X 5 = ?

సాధన:  Step1: 146/2 = 332

 Step2: 73.5 × 10 = 735

3. ఒక సంఖ్యను 25 తో గుణించాల్సి వచ్చినప్పుడు:

Step1: ఒక సంఖ్యను 25తో గుణించేటప్పుడు, ఆ సంఖ్యను 4 తో భాగించాలి. 

Step2: Step 1 ఫలితాన్ని 100తో గుణించాలి. 

ఉదా: I. 36 X 25 = ?

Step 1: 36 / 4 = 9  

Step 2: 9 × 100 = 900

4.  ఒక సంఖ్యను 125 తో గుణించాల్సి వచ్చినప్పుడు:

Step1: ఏదైనా ఒక సంఖ్యను 125 తో గుణించాల్సి వచ్చినప్పుడు, ఆ సంఖ్యను 8 తో భాగించాలి.

Step2: Step1 ఫలితాన్ని 1000 తో గుణించాలి.

ఉదా: I.  216 × 125 = ?

Step1: 216 / 8 = 27

Step2: 27 × 1000 = 27000

II. 218 × 125 = ?

​​​​​​​

5. ఒక సంఖ్యను 9 తో గుణించాల్సి వచ్చినప్పుడు

Step 1:  ఒక సంఖ్యను 9 తో గుణించాల్సి వచ్చినప్పుడు, ఆ సంఖ్యకు చివరన ‘0’ను చేర్చాలి.

Step 2: Step1 ఫలితం నుంచి అసలు సంఖ్యను తీసేస్తే, కావాల్సిన ఫలితం వస్తుంది.

ఉదా: I. 37 X 9 = ?

Step1: ఇచ్చిన సంఖ్య 37, దాని పక్కన ఒక ్ఞ0్ఠ చేరిస్తే, 370

Step 2: 370  37 = 333

II. 513 × 9 = ?

5130 - 513 = 4617

6. ఒక సంఖ్యను 99 తో గుణించాల్సి వచ్చినప్పుడు:

Step1: ఏదైనా ఒక సంఖ్యను 99 తో గుణించాల్సి వచ్చినప్పుడు, ఆ సంఖ్య పక్కన రెండు సున్నాలు ఉంచాలి.

Step 2: Step1 లో వచ్చిన సంఖ్య నుంచి అసలు సంఖ్యను తీసేస్తే, కావాల్సిన ఫలితం వస్తుంది.

ఉదా: I. 48 X 99 = ? 

Step1:గుణకారంలో ఇచ్చిన సంఖ్య 48, దాని పక్కన రెండు ‘0’లు చేర్చాక వచ్చిన సంఖ్య 4800.

Step 2:  4800 X 48 = 4752

48 X99 = 4752

II. 9543 X 99 = ? 

Step1: 954300

Step 2:  954300 - 9543 = 944757

9543 X 99 = 944757

7. ఒక సంఖ్యను 999 తో గుణించాల్సి వచ్చినప్పుడు:

Step1: ఏదైనా సంఖ్యను 999 తో గుణించాల్సి వచ్చినప్పుడు ఆ సంఖ్య పక్కన మూడు ‘0’లు ఉంచాలి.

Step 2: Step1 లో వచ్చిన సంఖ్య నుంచి అసలు సంఖ్యను తీసేస్తే కావాల్సిన ఫలితం వస్తుంది.

ఉదా: I. 846X999 = ? 

Step1: ఇచ్చిన సంఖ్య 846, దాని పక్కన మూడు ‘0’లు ఉంచగా ఆ సంఖ్య 846000

Step 2:  846000 - 846 = 845154

846 X 999 = 845154

II. 7328 X 999 = ? 

7328000 - 7328 = 7320672

8. ఒక సంఖ్యను 11 తో గుణించాల్సి వచ్చినప్పుడు:

ఉదా: I. 43 X 11 = ? 

సాధన: Step1:  3 (ఒకట్ల స్థానంలోని అంకె)

            Step 2: 4 + 3 = 7 (పదుల స్థానం, ఒకట్ల స్థానంలోని అంకెల మొత్తం)

           Step3: 4 (పదుల స్థానంలోని అంకె)

          43 X 11 = 473

   II. 524 X 11 = ? 

సాధన: Step1: 4 (ఒకట్ల స్థానంలోని అంకె) 

             Step 2: 2 + 4 = 6 (పదుల స్థానం, ఒకట్ల స్థానంలోని అంకెల మొత్తం)

             Step 3: 5 + 2 = 7 (వందల స్థానం, పదుల స్థానంలోని అంకెల మొత్తం)

           Step 4: 5 (వందల స్థానంలోని అంకెల మొత్తం)

           524 X 11 = 5764

III. 67 X 11 = ? 

సాధన: Step1: 7 (ఒకట్ల స్థానంలోని అంకె)

Step2 : 6 + 7 = 13 (పదుల స్థానం, ఒకట్ల స్థానంలోని అంకెల మొత్తం. ఈ విలువలో ఒకట్ల స్థానం మినహా మిగిలిన సంఖ్య (1)ని తర్వాతి (Step లో కలుపుతారు)

Step 3:  6 +1 = 7

67 X 11 = 737

IV. 97284 X 11 = ?

Step1: 4

Step2: 8 + 4 = 12

Step 3: 2 + 8 + 1 = 11

Step 4: 7+ 2+ 1 = 10

Step5: 9 + 7 + 1 = 17

Step 6: 9 + 1 = 10

97284 X 11 = 1070124


అభ్యాస ప్రశ్నలు

1. 458 × 300 = ........ 

1) 137400     2) 148400    3)127400     4) 31700 

జ: 137400 

2. 4862 × 5 = ........ 

1) 32410   2) 43310    3) 23420    4) 24310

జ: 24310

3. 864 × 25 = ........ 

1) 21400   2) 21600     3) 21800    4) 21900 

జ: 21600

4. 336 × 125 = ........ 

1) 62000    2) 52000    3) 42000    4) 72000

జ: 42000 

5. 86 × 9 = ........ 

1) 784     2) 764     3) 774     4) 794

 జ: 774

6. 283 × 99 = ........ 

1) 28017    2) 26016    3) 29017    4) 27047

జ: 28017

7. 974 × 999 = ........ 

1) 972026    2) 973026     3) 974026     4) 971026

జ: 973026

8. 2435 × 11 = ........ 

1) 26735      2) 26435     3) 26785     4) 24355

జ: 26785

9. 9752 × 5 = ........ 

1) 48660     2) 46760   3) 49760    4) 48760 

జ: 48760 

10.కిందివాటిలో సరికానిది ఏది?

1) 27 × 99 = 2673       2) 82 × 99 = 8118     3) 58 × 99 = 5742     4) 64 × 99 = 6347

జ: 64 × 99 = 6347

Posted Date : 27-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌