• facebook
  • whatsapp
  • telegram

పని - వేతనం

సామర్థ్యానికి సంపాదన అనులోమం!
 


ఆదాయం కావాలంటే పని చేయాలి. పని చేయాలంటే వేతనం ఉండాలి. వేతనం ఇవ్వాలంటే వ్యక్తికి తగిన సామర్థ్యం అవసరం. ఒకరు ఒక రోజులో చేయగలిగిన పని, ఇంకొకరికి రెండు రోజులు పట్టవచ్చు. అప్పుడు అందే వేతనం అనులోమానుపాతంలో ఉంటుంది. ఎంత పని చేస్తే ఎంత ఆదాయం వస్తుందనే విషయంపై స్పష్టత వస్తుంది. అన్ని రకాల ఆర్థిక ప్రణాళికలకు వీలు కుదురుతుంది. నిత్య జీవితానికి అవసరమైన ఈ పరిజ్ఞానాన్ని అభ్యర్థిలో అంచనా వేయడానికి అరిథ్‌మెటిక్‌లోని ‘పని-వేతనం’ అధ్యాయం నుంచి ప్రశ్నలు అడుగుతారు.  


*  వేతనాలు చేసిన పనికి నేరుగా అనులోమానుపాతంలో ఉంటాయి. దీని అర్థం ఎక్కువ పనికి ఎక్కువ డబ్బు, తక్కువ పనికి తక్కువ డబ్బు అందుతాయి.


* వేతనాలు వ్యక్తి తీసుకున్న సమయానికి పరోక్షంగా, అనులోమానుపాతంలో ఉంటాయి.


మాదిరి ప్రశ్నలు


1.     శివాత్మిక ఒక పనిని 6 రోజుల్లో చేయగలదు. శివాత్మజ్‌ అదే పనిని 5 రోజుల్లో చేయగలడు. ఈ పనికి వేతనం రూ.660 అయితే, ఇద్దరూ కలిసి ఆ పనిని చేస్తే అందులో శివాత్మిక వేతనం వాటా ఎంత? 

1)  రూ.300     2) రూ.550     3) రూ.360     4) ఏదీకాదు

వివరణ: శివాత్మిక ఒక రోజులో చేసే పని = 1/6

               శివాత్మజ్‌ ఒక రోజులో చేసే పని = 1/5



శివాత్మిక = 5x, శివాత్మజ్‌ = 6x 

వారి వేతనాల మొత్తం = రూ.660 

11x= 660 

x = 60 

 శివాత్మిక వాటా5x = 5 × 60 = రూ.300

సంక్షిప్తంగా

రోజుల నిష్పత్తి = 6 : 5

వేతనాల నిష్పత్తి = 5 : 6 

వేతన మొత్తం = రూ.660 

11 .......... 660

5 .......... ?



జ: 1
                                      

2.     X, Y, Z లు ఒక పనిని చేయడానికి రూ.1320 వేతనంగా తీసుకుంటారుX, Y కలిసి ఆ పనిని 8/11 భాగం పూర్తి చేశారు. మిగతా పనిని  Z అనే వ్యక్తి పూర్తిచేశాడు. అయితే Z పొందిన వేతనం ఎంత? 

1) రూ.301      2) రూ.305      3) రూ.360     4) రూ.960

 8 : 3 (రోజుల నిష్పత్తి)

3 : 8 (వేతనాల నిష్పత్తి)

 వేతనాల మొత్తం = రూ.1320 

3x + 8x = రూ.1320 

11x = 1320 

x = 120 

 Z వాటా =8x = 8 × 120 = రూ.960

జ: 4

3.   P, Q, R లు ఒక పనిని 36 రోజుల్లో పూర్తి చేసి రూ.5400 సంపాదిస్తారు. అదే పనిని  P, R లు 20 రోజుల్లో పూర్తి చేసి రూ.1880;Q, Rలు 40 రోజుల్లో పూర్తి చేసి రూ.3040 అందుకుంటారు. అయితే R  ఒక రోజులో తీసుకునే మొత్తాన్ని కనుక్కోండి.  

1)  రూ.50        2) రూ.20      3) రూ.25       4) రూ.30 

వివరణ:  P, Q, R లు ఒక్కరోజులో అందుకున్న మొత్తం 


 P + Q + R = 150 ........ (1)


ఇదే విధంగా P, R లు ఒక్కరోజులో అందుకున్న మొత్తం 

1, 3 సమీకరణాల నుంచి 

P + Q + R= 150          

P + 76 = 150       

P = 150 − 76

P = 74

1, 2 సమీరణాల నుంచి 

P + Q + R = 150

Q + 94 = 150

Q = 150 − 94

Q = 56

P, Q విలువలను 1వ సమీకరణంలో ప్రతిక్షేపించగా 

P + Q + R = 150

74 + 56 + R = 150

130 + R = 150

R = 20

R ఒక రోజులో అందుకున్న మొత్తం రూ.20.

జ: 2 

4.     5 మంది పురుషులు రోజుకు 4 గంటల చొప్పున పనిచేసి, 20 రోజుల్లో 300 మీటర్ల రహదారిని నిర్మించి రూ.3000 సంపాదించారు. మరోవైపు 8 మంది పురుషులు, 16 రోజుల పాటు రోజుకు 10 గంటల చొప్పున పనిచేసి రూ.6000 జీతం తీసుకున్నారు. అయితే వారు నిర్మించిన రహదారి పొడవు ఎంత? 

1) 333 మీటర్లు         2)  280 మీటర్లు     3) 481 మీటర్లు       4) 480 మీటర్లు 

వివరణ: రహదారి పొడవు = x అనుకుంటే 

= 480 మీటర్లు 

జ: 4

5.     ఒక కార్మికుడికి వారానికి 35 గంటలకు రూ.56 చెల్లిస్తారు. 40 గంటల వరకు అతడికి సాధారణ రేటుతో, ఓవర్‌ టైంలో సాధారణం కంటే 1.5 రెట్లు చెల్లిస్తారు. అయితే రూ.88 పొందాలంటే ఆ కార్మికుడు ఎన్ని గంటలు పనిచేయాలి? 

1) 50 గంటలు         2) 60 గంటలు  3) 63 గంటలు       4) 49.5 గంటలు 

వివరణ: ఆ కార్మికుడు పనిచేసిన మొత్తం పని గంటలు = x


x = 50 రూ.

జ: 1

6.     రాజేష్‌ ఒక పనిని 12 రోజుల్లో చేయగలడు. రాజేష్, అరవింద్‌లు కలిసి పనిని పూర్తిచేస్తే వారు వరుసగా రూ.54, రూ.81 సంపాదిస్తారు. అయితే వారిద్దరూ ఆ పనిని పూర్తి చేయడానికి ఎన్నిరోజులు పడుతుంది? 

1)  4 రో.    2) 4.5 రో.   3) 9.6 రో.    4) 5 రో. 

వివరణ: రాజేష్, అరవింద్‌లు పొందే వేతనాల నిష్పత్తి 54 : 81, 2 : 3 

రోజుల నిష్పత్తి 3 : 2 

రాజేష్‌ ఆ పనిని 12 రోజుల్లో పూర్తి చేస్తాడు 

∴ 3x = 12 

x = 4

అరవింద్‌ ఆ పని చేయగల రోజుల సంఖ్య 2x = 2 (4) = 8 

]

జ: 3

 


7.   A, Bఅనే ఇద్దరు వ్యక్తులు ఒక పనిని రూ.1600కి ఒప్పందం చేసుకున్నారు. అయితే A ఆ పనిని 6 రోజుల్లో,  B   అదే పనిని 8 రోజుల్లో చేయగలరు.C  అనే వ్యక్తి సహాయం తీసుకుని 3 రోజుల్లోనే పూర్తిచేస్తే, 'C' వాటా ఎంత? 

1) రూ.200        2)  రూ.150    3) రూ.490        4) రూ.530 

వివరణ:  A ఒక రోజులో చేసే పని = 1/6

               B ఒక రోజులో చేసే పని = 1/8  ఒకవేళ  'C 'ఆ పనినిx రోజుల్లో చేయగలిగితే

              C ఒక రోజులో చేసే పని = 1/x

     ఈ ముగ్గురూ కలిసి ఆ పనిని 3 రోజుల్లో పూర్తి చేయగలరు.


x = 24

A : B : C 

6 : 8 : 24 (రోజుల నిష్పత్తి) 4 : 3 : 1 (వేతన నిష్పత్తి) 

(రోజుల నిష్పత్తికి విలోమమే వేతన నిష్పత్తి) 

4x + 3x + x = 1600

8x = 1600

వేతనం x  = 200 

జ: 1

          
 

1) రూ.57.50        2) రూ.47.50    3) రూ.67.50         4) 40 

జ: 1

 


9.    ఒక వ్యక్తి ప్రతి పని దినానికి రూ.12 వేతనం చెల్లించాలనే షరతుతో 50 రోజుల ఉద్యోగం కోసం నియమితుడయ్యాడు. అయితే అతడు గైర్హాజరైన రోజు రూ.6 జరిమానా విధిస్తారు. పని పూర్తయిన తరువాత అతడు రూ.420 తీసుకుంటే.. ఆ వ్యక్తి ఎన్నిరోజులు గైర్హాజరైనాడు? 

1) 15    2) 5    3) 10    4) 20 

వివరణ: గైర్హాజరైన రోజుల సంఖ్య = x 

అతడు పనిచేసిన రోజుల సంఖ్య = 50 − x 

గైరు హాజరైనందుకు రూ 6x తగ్గిస్తారు 

పనిచేసినందుకు వచ్చిన మొత్తం  12 (50 − x) 

12 (50 − x) − 6x = 420

 600 − 12x − 6x = 420 

600 − 18x = 420 

18x = 600 − 420  

18x = 180 

 x = 10

గైర్హాజరైన రోజుల సంఖ్య = 10   

జ: 3

రచయిత: కంచుమర్తి దొర

Posted Date : 05-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌