• facebook
  • whatsapp
  • telegram

కాలం - పని - 2

 సమయం సగమైతే సామర్థ్యం రెట్టింపు! 
 


 

మరో రెండు నెలల్లో పరీక్షలు. అన్ని సబ్జెక్టులు చదవాలి, రివిజన్‌ చేయాలి. కొన్ని కష్టంగా ఉంటాయి, మరికొన్ని తేలికే. కానీ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి? ఆఫీసులో ఒక కొత్త ప్రాజెక్టు ఇచ్చారు. ఎవరికి ఏ పని ఇస్తే అనుకున్న టైమ్‌లో ప్రాజెక్టు పూర్తి చేయవచ్చు? ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థుల పరిష్కార సామర్థ్యాన్ని అంచనా వేయడం కోసం అరిథ్‌మెటిక్‌లో ‘కాలం-పని’ అధ్యాయం నుంచి ప్రశ్నలు అడుగుతుంటారు. సామర్థ్యం రెట్టింపైతే సమయం సగానికి పడిపోతుంది. సామర్థ్యం తగ్గితే, సమయం ఎక్కువవుతుంది. ఈ తర్కం ఆధారంగా పనికి, దాన్ని చేయడానికి పట్టే కాలానికి మధ్య సంబంధాన్ని సరిగా అర్థం చేసుకుంటే పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించుకోవడమే కాదు, నిత్య జీవితంలోనూ రకరకాల సమస్యలను సులభంగా అధిగమించవచ్చు. 


*  A ఒక పనిని n రోజుల్లో చేయగలడు. అయితే A ఒక రోజులో చేసే పని =1/n

* ఒక రోజులో 1/n  వ వంతు చేస్తే మొత్తం పనిని n  రోజుల్లో పూర్తిచేయగలడు.

* A పని సామర్థ్యం B పని సామర్థ్యానికి 3 రెట్లు. 

A, B ల పని సామర్థ్యం మధ్య నిష్పత్తి = 3 : 1

A, B లు పని చేయడానికి పట్టే రోజుల మధ్య నిష్పత్తి = 1 : 3


M  = మనుషులు/యంత్రాలు, T= కాలం,  D = రోజులు, W = పని


మాదిరి ప్రశ్నలు


1.    వెంకట్‌ ఒక పనిని 16 రోజుల్లో చేయగలడు. విష్ణు అదే పనిని 8 రోజుల్లో చేయగలడు. ఇద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు?


వివరణ: వెంకట్‌ ఒక రోజులో చేసే పని = 1/16

విష్ణు ఒక రోజులో చేసే పని = 1/8

ఇద్దరూ కలిసి ఒక రోజులో చేసే పని = 1/16 + 1/8

16, 8 ల కసాగు 16 అవుతుంది. 


జ: 2


2.  A ఒక పనిని 18 రోజుల్లో చేయగలడు. B అదే పనిని A చేసిన సగం రోజుల్లో చేయగలడు. ఇద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు?


  

వివరణ: A ఒక రోజులో చేసే పని = 1/18

B సగం రోజులు అంటే 9 రోజుల్లో చేస్తాడు. 

B ఒక రోజులో చేసే పని = 1/9

A + B లు ఒక రోజులో చేసే పని = 1/18 + 1/9

18, 9 ల కసాగు 18 అవుతుంది.

 

జ: 1

3.    ఒక పనిని A, B, C లు వరుసగా 5, 10, 30 రోజుల్లో చేయగలరు. ముగ్గురూ కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు?

1) 30    2) 10    3) 5    4) 3

వివరణ: A ఒక రోజులో చేసే పని = 1/5

B ఒక రోజులో చేసే పని = 1/10

C ఒక రోజులో చేసే పని = 1/30

ముగ్గురూ కలిసి ఒక రోజులో చేసే పని = 1/5+ 1/10+1/30

5, 10, 30 ల కసాగు 30 అవుతుంది.


                        1       1        1


జ: 4


4.    ఒక పనిని A, B లు కలిసి 8 రోజుల్లో చేయగలరు. A ఒక్కడే ఆ పనిని 24 రోజుల్లో చేయగలడు. అయితే అదే పనిని B ఒక్కడే ఎన్ని రోజుల్లో చేయగలడు?

  1) 8    2) 24   3) 12   4)  16

వివరణ: A, B లు ఒక రోజులో చేసే పని = 1/8

               A  ఒక్కడే ఒక రోజులో చేసే పని = 1/24

            8, 24 ల కసాగు 24 అవుతుంది.

            దత్తాంశం ప్రకారం B ఒక్కడే అంటే

జ: 3


5.    ఒక పనిని A, B లు కలిసి 12 రోజుల్లో చేయగలరు.Aఒక్కడే ఆ పనిని 20 రోజుల్లో చేయగలడు. B రోజులో సగం దినం మాత్రమే పని చేస్తే ఇద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు?

1) 110 రోజులు       2) 11 రోజులు    3) 15 రోజులు      4) 20 రోజులు

వివరణ: A, B లు ఒక రోజులో చేసే పని = 1/12

              A ఒక రోజు చేసే పని = 1/20

B ఒక్కడే అంటేB = (A + B)−A= 1/12-1/20

12, 20 ల కసాగు 60 అవుతుంది

 

B మొత్తం పనిని 30 రోజుల్లో చేయగలడు. రోజులో సగం దినం పని చేస్తే అంటే అప్పుడు మొత్తం పని 60 రోజులు అవుతుంది. 

ఇద్దరూ కలిసి పని చేస్తే = 1/20+1/60

20, 60 ల కసాగు 60 అవుతుంది.

B రోజులో సగం దినం మాత్రమే పని చేస్తే A, B కలిసి ఆ పనిని 15 రోజుల్లో పూర్తి చేస్తారు.

జ: 3


6.    ఒక పనిని A, B లు వరుసగా 15, 10 రోజుల్లో చేయగలరు. B పని ప్రారంభించిన తర్వాత 8 రోజులు చేసి వదిలేస్తే మిగిలిన ఆ పనిని A ఒక్కడే ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? 

 1) 2 రోజులు           2) 3 రోజులు    3)  5 రోజులు        4) 10 రోజులు 

 

జ: 2


 

7.    ఒక పనిని A, B లు వరుసగా 25, 20 రోజుల్లో చేయగలరు. ఇద్దరూ కలిసి 5 రోజులు చేసిన తర్వాత A పనిని వదిలివెళ్లాడు. మిగిలిన పనిని B ఒక్కడే ఎన్ని రోజుల్లో చేయగలడు? 

  1) 9      2) 10     3) 11    4) 12 

వివరణ  A ఒక రోజులో చేసే పని 1/25

               B ఒక రోజులో చేసే పని =1/25

A, B లు ఒక రోజులో చేసే పని =1/25 + 1/25

20, 25 ల కసాగు 100 అవుతుంది. 

దత్తాంశం ప్రకారం 

 

జ: 3


 

8.    ఒక పనిని A, B లు కలిసి చేసిన దానికంటే A ఒక్కడే 16 రోజులు ఎక్కువ సమయం తీసుకుని చేస్తాడు. అదే పనిని చేయడానికి B .. 4 రోజులు ఎక్కువ సమయం తీసుకుంటాడు. అయితే ఇద్దరూ కలిసి ఎన్ని రోజుల్లో చేయగలరు? 

1) 4     2) 8      3) 12     4) 16

వివరణ: A, B లు కలిసి చేసే మొత్తం పని x అనుకుందాం.  

అప్పుడు దత్తాంశం ప్రకారం

A ఒక్కడే చేసే పని =(x + 16) రోజులు

B ఒక్కడే చేసే పని = (x + 4) రోజులు అవుతుంది.

ఇప్పుడు (A + B) = A + B  ప్రతిక్షేపించగా 

 


ప్రాక్టీస్‌ బిట్లు


1.     ఒక పనిని A, B లు వరుసగా 20, 30 రోజుల్లో చేయగలరు. అయితే ఇద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు?    

 1) 6   2) 9   3) 12   4) 15


2.     ఒక పనిని A, B లు వరుసగా 18, 15 రోజుల్లో చేయగలరు. ఇద్దరూ కలిసి 3 రోజులు చేసిన తర్వాత Ÿ A పనిని వదిలి వెళ్లాడు. మిగిలిన పనిని B ఒక్కడే ఎన్ని రోజుల్లో చేయగలడు?

 

3.     ఒక పనినిA, B, C  లు వరుసగా 4, 5, 10 రోజుల్లో చేయగలరు. అయితే ముగ్గురూ కలిసి ఎన్ని రోజుల్లో పూర్తిచేస్తారు? 


   

4.     ఒక పనిని A, B లు కలిసి 9 రోజుల్లో చేయగలరు. అదే పనిని A ఒక్కడే 12 రోజుల్లో చేయగలడు. అయితే B ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడు? 

    1) 36     2) 26      3) 16      4) 46


5.     ఒక పనిని A ఒక్కడే  A, B లు కలిపి చేసినదాని కంటే 8 గంటలు ఎక్కువ సమయం తీసుకుని చేస్తాడు. B ఒక్కడే 4 1/2 గంటల ఎక్కువ సమయంలో చేస్తాడు. అయితే ఇద్దరూ ఆ పనిని ఎంత సమయంలో పూర్తి చేస్తారు?     

1) 4 గంటలు 2) 5 గంటలు  3) 6 గంటలు 4) 7 గంటలు

సమాధానాలు: 1-3; 2-3; 3-2; 4-1; 5-3. 

రచయిత: బిజ్జుల విష్ణువర్ధన్‌ రెడ్డి

Posted Date : 28-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌