• facebook
  • whatsapp
  • telegram

రక్త సంబంధాలు  

          ఈ విభాగం నుంచి అడిగే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు విద్యార్థికి నిత్యజీవితంలో సంబంధాల గురించి తెలిసి ఉండాలి. ఈ సంబంధాలు తరచూ వినేవే అయినా కొన్నింటిని ఇక్కడ పొందుపరుస్తున్నాం.
          రక్త సంబంధాల విషయంలో ఇంగ్లిష్‌కు, తెలుగుకు వివరణల్లో కొంచెం తేడా ఉంటుంది. కాబట్టి విద్యార్థులు తమ సొంత (ఇంగ్లిష్ లేదా తెలుగు) మాధ్యమాల్లోనే ప్రశ్నలను సాధించడం సులభం.
           ఉదాహరణకు ఇంగ్లిష్‌లో Brother-in-law అనే సంబంధానికి తెలుగులో బావ లేదా మరిది అని అర్థం. అంటే ఇద్దరు వ్యక్తుల్లో ఎవరినైనా ఇది సూచిస్తుంది.
          ఈ సంబంధాలను తెలుగు, ఇంగ్లిష్‌లలో వివరించినా, ప్రశ్నలు మాత్రం తెలుగులోనే ఉన్నాయి. కాబట్టి, ఆంగ్ల మాధ్యమం విద్యార్థులు ప్రశ్నలను ఇంగ్లిష్‌లోకి మార్చి జవాబులు సాధించే ప్రయత్నం చేయకూడదు.


* తండ్రి లేదా తల్లికి కుమారుడు - సోదరుడు
Father's or Mother's Son - Brother
* తండ్రి లేదా తల్లికి కుమార్తె - సోదరి
Father's or Mother's Daughter - Sister
* తండ్రి లేదా తల్లికి తండ్రి - తాత
Father's or Mother's Father -Grand Father
* తండ్రి లేదా తల్లికి తల్లి - నాయనమ్మ లేదా అమ్మమ్మ
Father's or Mother's mother - Grand Mother
* తండ్రి లేదా తల్లికి సోదరుడు - పినతండ్రి/ చిన్నాన్న లేదా మేనమామ
Father's or Mother's Brother - Uncle
* తండ్రి లేదా తల్లికి సోదరి - పినతల్లి/ చిన్నమ్మ లేదా మేనత్త
Father's or Mother's Sister - Aunt
* అన్న లేదా తమ్ముడి భార్య - వదిన లేదా మరదలు
Brother's Wife - Sister-in-law
* అక్క లేదా చెల్లెలి భర్త - బావ
Sister's husband - Brother-in-law
* భర్త లేదా భార్య తండ్రి - మామ
Husband's or Wife's Father - Uncle
* భర్త లేదా భార్య తల్లి - అత్త
Husband's or Wife's Mother - Aunty
* అన్న లేదా అక్క కొడుకు - మేనల్లుడు
Brother's or Sister's Son - Nephew
* అన్న లేదా అక్క కూతురు - మేనకోడలు
Brother's or Sister's Daughter - Niece
* కుమారుడి భార్య - కోడలు
Son's Wife - Daughter-in-law
* కుమార్తె భర్త - అల్లుడు
Daughter's husband - Son-in-law
* తాతకు ఏకైక కుమారుడు - నాన్న
Grand Father's only Son - Father
* తాతకు ఏకైక కుమార్తె - అమ్మ
Grand Father's only Daughter - Mother
* తండ్రి లేదా తల్లికి ఏకైక కుమారుడు - అతడే
Father's or Mother's only son - Himself
* తండ్రి లేదా తల్లికి ఏకైక కుమార్తె - ఆమే
Father's or Mother's only Daughter - Herself

1. ఒక వ్యక్తి ఒక స్త్రీతో 'నీ తల్లి యొక్క భర్త సోదరి నాకు అత్త' అన్నాడు. అయితే ఆ స్త్రీ ఆ వ్యక్తికి ఏమవుతుంది?
జవాబు: సోదరి
ఈ ప్రశ్నలో ఇచ్చిన సమాచారాన్ని విశ్లేషిస్తే..
నీ తల్లి యొక్క భర్త - నీ తండ్రి
నీ తండ్రి యొక్క సోదరి - నీ అత్త
కాబట్టి, ఆ స్త్రీ అత్త అతడికి కూడా అత్త అవుతుంది.
అంటే, ఆ స్త్రీ అతడికి సోదరి అవుతుంది.
 

2. ఒక మహిళను చూపుతూ కౌశిక్ ఇలా అన్నాడు. 'ఆమె నా తల్లి భర్త యొక్క తల్లికి కుమార్తె'. అయితే ఆ మహిళ కౌశిక్‌కు ఏమవుతుంది?
జవాబు: మేనత్త
ఈ ప్రశ్నలోని సంబంధాలు..
'నా తల్లి భర్త' అంటే కౌశిక్ తండ్రి,
తండ్రి యొక్క తల్లి అంటే కౌశిక్ నాయనమ్మ
నాయనమ్మ కుమార్తె అంటే కౌశిక్‌కు మేనత్త అవుతుంది.
 

3. A, B లు సోదరులు. C, D లు సోదరీమణులు. A కుమారుడు D కి సోదరుడు. అయితే C కి B ఏమవుతాడు?
జవాబు: పినతండ్రి లేదా చిన్నాన్న
ఈ ప్రశ్నలో B, A యొక్క సోదరుడు, A కుమారుడు, D కి సోదరుడు అంటే D, A యొక్క కూతురు, C, D లు సోదరీమణులు. కాబట్టి C కూడా A కూతురు కాబట్టి C, B యొక్క సోదరుడి కుమార్తె. కాబట్టి, B, C కి పినతండ్రి లేదా చిన్నాన్న అవుతాడు.
 

4. A, B, C, D, E, F లు ఒక కుటుంబంలోని సభ్యులు. B C కి కొడుకు. కానీ, C B కి తల్లికాదు. A, C లు భార్యాభర్తలు. C సోదరుడు E. D అనే ఆమె A కి కూతురు. B సోదరుడు F.
* B C కి కొడుకు. కానీ C B కి తల్లికాదు అంటే తండ్రి అని అర్థం. B, C లు మగవారు.
* A, C లు భార్యాభర్తలు అంటే C భర్త అయితే A భార్య అవుతుంది. ఎందుకంటే పై వాక్యాన్ని బట్టి A కుమారుడు B అవుతాడు.
* C సోదరుడు E అంటే మగవాడు, A కి మరిది అవుతాడు.
* B కి చిన్నాన్న అవుతాడు.
* D అనే ఆమె A కి కూతురు అంటే C కి కూడా కుమార్తె అవుతుంది.
* D B కి సోదరి అవుతుంది. E కి సోదరుడి కూతురు అవుతుంది.
* B సోదరుడు F అంటే A, C ల కుమారుడు.
పై వివరణలు పటం రూపంలో.
మగవారికి (+) అని, ఆడవారికి (-) అని అనుకుంటే..
 

                                               

i) కుటుంబంలో ఎంతమంది మగ (male) వ్యక్తులు ఉన్నారు?
జవాబు: 4
పటంలో (+) గుర్తులో ఉన్నది మగవారు కాబట్టి ఇందులో నలుగురు ఉన్నారు. వారు B, C, E, F లు
 

ii) B కి తల్లి ఎవరు?
జవాబు: A
ప్రశ్నలో ఇచ్చిన సమాచారం ప్రకారం B C కుమారుడు, A, C లు భార్యభర్తలు. అంటే A లేదా C B కి తల్లి అవుతారు. C B తల్లి కాదు అంటే తండ్రి అని అర్థం. అప్పుడు A తల్లి అవుతుంది.
 

iii) A కి ఎంతమంది పిల్లలు?
జవాబు: 3
ఈ ప్రశ్నలో A, C లు భార్యాభర్తలు. B, F లు సోదరులు. D అనే ఆమె A కి కూతురు. B కూడా A కి కుమారుడు అంటే F కూడా కుమారుడు. కాబట్టి, A కి ముగ్గురు పిల్లలు వారు D, B, F లు.
 

iv) E కి భార్య ఎవరు?
జవాబు: None
ఈ ప్రశ్నలో C సోదరుడు E. కానీ, ఇందులో ఇద్దరు ఆడవారు (A, D) ఉన్నారు. D, A కి కూతురు. A, C లు భార్యా భర్తలు. అంటే మొత్తం ఒక్క జంట మాత్రమే ఉంది. కాబట్టి, E కి భార్య లేదు.
 

v) కిందివారిలో ఆడవారు ఎవరు?
జవాబు: AD
ఈ ప్రశ్నలో ఆడవారు A (తల్లి), D (కూతురు). మొత్తం ఇద్దరు.
ఇటువంటి ప్రశ్నలను ఇచ్చినపుడు ముందుగా వాటిమధ్య సంబంధాన్ని గుర్తుపెట్టుకుంటే సమాధానాలను తేలిగ్గా తెలుసుకోవచ్చు.
 

5. ఒక పరిభాషలో P × Q అంటే P కి భార్య Q అనీ, P - Q అంటే Q కు చెల్లి P అనీ, P ÷ Q అంటే P, Q లు అన్నదమ్ములని అర్థం. అయితే, A - B ÷ D లో A కి D ఏమవుతాడు?
జవాబు: సోదరుడు
ఈ ప్రశ్నలో A - B అంటే B కి చెల్లి A అవుతుంది. ఇక్కడ B మగ లేదా ఆడ అంటే జండర్ తెలియదు. తర్వాత B ÷ D అంటే B, D లు అన్నదమ్ములు అవుతారు. ఇక్కడ A కి D ఏమవుతాడన్నప్పుడు 'B' తో సంబంధం లేదు.
కాబట్టి A కి D సోదరుడు అవుతాడని తెలుసుకోవచ్చు.
 

6. రవి సోదరుడు దీపక్. అతుల్ సోదరి రేఖ. రేఖ కుమారుడు రవి. అయితే రేఖకు దీపక్ ఏమవుతాడు?
జవాబు: కుమారుడు
ఈ ప్రశ్నలో ఇచ్చిన సమాచారం ప్రకారం
* రవి సోదరుడు దీపక్.. అంటే, ఇద్దరూ మగవారు
* అతుల్ సోదరి రేఖ అంటే రేఖ ఆడ అవుతుంది.
* రేఖ కుమారుడు రవి. అంటే దీపక్ కూడా రేఖ కుమారుడే అవుతాడు. ఎందుకంటే దీపక్, రవి అన్నదమ్ములు.

                                  
                                 

7. ఒక పార్టీలో ఒక అమ్మమ్మ, తండ్రి, తల్లి నలుగురు కొడుకులు, వారి భార్యలు, ఒక్కొక్క కొడుక్కి ఒక్కొక్క కొడుకు, ఇద్దరిద్దరు కుమార్తెలు చొప్పున ఉన్నారు. కుటుంబంలోని ఆడవారి సంఖ్య ఎంత?
జవాబు: 14
ప్రశ్నలో ఇచ్చిన సమాచారం ప్రకారం కుటుంబంలోని ఆడవారి సంఖ్య: ఒక అమ్మమ్మ + తల్లి + (నలుగురు కొడుకుల భార్యలు) + ఒక్కొక్కరికి ఇద్దరిద్దరు కుమార్తెలు ∴  1 + 1 + 4 + 8 = 14

8. అమిత్ రాహుల్ కుమారుడు. రాహుల్‌కు సోదరి అయిన సారికకు సోనీ అనే కొడుకు, రీటా అనే కూతురు ఉన్నారు. రాజా, సోనీకి మేనమామ అయితే అమిత్‌కు సోనీ ఏమవుతాడు?
జవాబు: కజిన్
ఈ ప్రశ్నలో ఇచ్చిన ప్రకారం
                  

                 
9. శ్రీకాంత్ ఒక స్త్రీని చూపిస్తూ ''ఆమె ఒక స్త్రీకి కూతురు ఆ స్త్రీ నా తల్లి భర్తకు తల్లి" అన్నాడు. అయితే శ్రీకాంత్‌కు ఆమె ఏమవుతుంది?
జవాబు: మేనత్త
ఈ ప్రశ్నలో ఇచ్చిన సంబంధాలను కింది విధంగా విశ్లేషించవచ్చు.
తల్లికి భర్త - తండ్రి
తండ్రికి తల్లి - నాయనమ్మ
నాయనమ్మకు కూతురు - తండ్రికి సోదరి
తండ్రికి సోదరి - మేనత్త
∴ శ్రీకాంత్‌కి ఆ స్త్రీ మేనత్త అవుతుంది.
 

10. ఒక వ్యక్తి ఒక స్త్రీని చూపిస్తూ ''ఆమె ఏకైక సోదరుడి కొడుకు నా భార్యకు సోదరుడు" అన్నాడు. అయితే ఆ స్త్రీ ఆ వ్యక్తికి ఏమవుతుంది?
జవాబు: మామకు సోదరి
ఈ ప్రశ్నలో ఇచ్చిన సమాచారం ప్రకారం
భార్యకు సోదరుడు - బావమరిది
స్త్రీ సోదరుడి కుమారుడు ఆ వ్యక్తికి బావమరిది
కాబట్టి, స్త్రీ సోదరుడు ఆ వ్యక్తి మామ
∴ ఆ స్త్రీ ఆ వ్యక్తి మామకు సోదరి

1. ఒక స్త్రీ ఒక వ్యక్తిని పరిచయం చేస్తూ ''ఇతడు నా తల్లి తల్లికి ఏకైక కుమారుడు అన్నది. అయితే ఆ స్త్రీ ఆ వ్యక్తికి ఏమవుతుంది?
జవాబు: మేనకోడలు
 

2. సురేష్ ఒక ఫొటోలోని వ్యక్తిని చూపుతూ ''ఈమె మా తమ్ముడి సోదరి తల్లికి ఏకైక కుమార్తె" అన్నాడు. అయితే ఆ ఫొటోలోని స్త్రీ సురేష్‌కి ఏమవుతుంది?
జవాబు: సోదరి
 

3. A, B, C, D, E, F లు కుటుంబ సభ్యులు. వారిలో రెండు జంటలు వివాహితులు. A, F లకు C తల్లి, D కి E తండ్రి. B కి A మనవడు. కుటుంబంలో ముగ్గురు స్త్రీలు.
i) కిందివాటిలో వివాహిత జంట ఏది?
జవాబు: EB
ii) E భార్య ఎవరు?
జవాబు: B
iii) A కి F ఏమవుతుంది?
జవాబు: చెల్లి
 

4. ఒక పరిభాషలో P+Q అంటే P సోదరి Q అని, P-Q అంటే P సోదరుడు Q అని, P×Q అంటే P భర్త Q అని అర్థం. అయితే A+B-C లో A అనే వ్యక్తి C కి ఏమవుతాడు?
జవాబు: సోదరుడు
 

5. లక్ష్మి, మీనాలు రోహన్‌కు భార్యలు. షాలిని మీనాకు పెంపుడుకూతురు. షాలినికి లక్ష్మి ఏమవుతుంది?
జవాబు: తల్లి
 

6. B కి సోదరి A. B తల్లి C. C తండ్రి D. D తల్లి E. అయితే, D కి A ఎవరు?
జవాబు: మనుమరాలు
 

7. B సోదరుడు A. A తండ్రి C. E సోదరుడు D. B కూతురు E. అయితే D మామ ఎవరు?
జవాబు: A

Posted Date : 13-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌