• facebook
  • whatsapp
  • telegram

దిశలు

1. P, Q, R, T అనే నాలుగు పట్టణాలు ఉన్నాయి. Q అనేది P కి నైరుతి దిశలో, R అనేది Q కి తూర్పు దిశలో, P కి ఆగ్నేయ దిశలో, T అనేది R కి ఉత్తర దిశలోనూ, అది కూడా P, Q ల వరుసలో ఉన్నాయి. అయితే T అనే పట్టణం P కి ఏ దిశలో ఉంది?
ఎ) ఆగ్నేయం          బి) ఉత్తరం            సి) ఈశాన్యం            డి) తూర్పు          ఇ) పైవేవీ కావు
జ: ఈశాన్యం  
వివరణ:

P కి T అనే పట్టణం ఈశాన్య దిశలో ఉంది

2. బాలు తన కారులో ఆఫీస్‌కు వెళ్లడానికి ఉత్తరానికి 15 కి.మీ. నడిపి, పడమరకు తిరిగి 10 కి.మీ., దక్షిణానికి తిరిగి 5 కి.మీ. డ్రైవ్ చేసి, అక్కడి నుంచి తూర్పుకి తిరిగి 8 కి.మీ. నడిపి, తన కుడికి తిరిగి 10 కి.మీ.లు ప్రయాణించి ఆఫీస్ చేరాడు. బాలు ప్రస్తుతం తన తొలి స్థానానికి ఏ దిశలో, ఎంత దూరంలో ఉన్నాడు?
ఎ) 2 కి.మీ. పడమర   బి) 5 కి.మీ. తూర్పు   సి) 3 కి.మీ. ఉత్తరం   డి) 6 కి.మీ. దక్షిణం    ఇ) పైవేవీ కావు
జ: 2 కి.మీ. పడమర   
వివరణ:


 

3. రాధ ఆగ్నేయానికి 10 కి.మీ. ప్రయాణించి, అక్కడి నుంచి తూర్పునకు తిరిగి 25 కి.మీ. ప్రయాణించి, అక్కడి నుంచి వాయవ్యదిశగా తిరిగి 10 కి.మీ. ప్రయాణించి, అక్కడి నుంచి పడమరకు తిరిగి 5 కి.మీ. ప్రయాణించి ఆగిపోయింది. ఆమెకు తన తొలి స్థానం ఏ దిశలో, ఎంత దూరంలో ఉంది?
ఎ) 20 కి.మీ. తూర్పు   బి) 20 కి.మీ. పడమర  సి) 25 కి.మీ. పడమర   డి) 10 కి.మీ. తూర్పు ఇ) పైవేవీ కావు
జ: 20 కి.మీ. పడమర 

వివరణ:

 

4. దిలీప్ ఉత్తరంగా 75 మీ. నడిచి, తన ఎడమకు తిరిగి 25 మీ. నడిచి మళ్లీ తన ఎడమకు తిరిగి 80 మీ. నడిచాడు. చివరగా అతడు తన కుడివైపునకు 72 1/2º తిరిగితే, ప్రస్తుతం అతను ఏ దిశలో ప్రయాణిస్తున్నాడు?
ఎ) ఈశాన్యం బి) నైరుతి             సి) దక్షిణం             డి) వాయవ్యం              ఇ) పడమర
జ: నైరుతి

వివరణ:


 

5. ఒక కూడలిలో ఉన్న దిక్కులు సూచించే స్తంభాన్ని వాహనం ఢీకొంది. దాంతో అది వాస్తవంగా చూపే తూర్పు దిక్కును ప్రస్తుతం 'దక్షిణం'గా చూపుతోంది. ఈ విషయం తెలియని ఒక వాహనదారుడు ప్రస్తుత దిక్కుల సూచిక ఆధారంగా పడమర వైపు వెళ్తున్నాడు. అయితే వాస్తవంగా అతడు ప్రయాణిస్తున్న దిక్కు ఏది?
ఎ) ఉత్తరం బి) దక్షిణం             సి) తూర్పు            డి) పడమర              ఇ) పైవేవీ కావు
జ: దక్షిణం

వివరణ:

 

6. గోపాల్ ఉత్తరం వైపు 3 మీ. నడిచి, పశ్చిమం వైపు తిరిగి 2 మీ. నడిచాడు. మళ్లీ ఉత్తరం వైపు తిరిగి 1 మీ. నడిచి, తూర్పునకు తిరిగి 5 మీ. నడిస్తే, అతడు బయలుదేరిన స్థానం నుంచి ఎంత దూరంలో, ఏ దిశలో ఉన్నాడు?
ఎ) 1 మీ., ఈశాన్యం   బి) 2 మీ., ఆగ్నేయం  సి) 5 మీ., ఈశాన్యం  డి) 3 మీ., ఆగ్నేయం  ఇ) 5 మీ., ఆగ్నేయం
జ: 5 మీ., ఈశాన్యం 
వివరణ:

7. ఒక వ్యక్తి దక్షిణ దిశగా ముఖం పెట్టి నిల్చున్నాడు. అతడు 135º అపసవ్య దిశలో, 180º సవ్యదిశలోనూ తిరిగితే ప్రస్తుతం ఏ దిక్కుకి అభిముఖంగా నిల్చున్నాడు?
ఎ) ఈశాన్యం       బి) వాయవ్యం          సి) ఆగ్నేయం             డి) నైరుతి                ఇ) తూర్పు
జ: నైరుతి
వివరణ:

దక్షిణానికి ముఖం పెట్టి ఉన్న వ్యక్తి 45º సవ్యదిశలో తిరిగితే నైరుతికి అభిముఖంగా ఉంటాడు.

 

8. రతన్ ఉత్తరం వైపు 10 కి.మీ. ప్రయాణించి, తన ఎడమ చేతి వైపు తిరిగి 4 కి.మీ. ప్రయాణం చేసి, కుడి వైపు తిరిగి 5 కి.మీ. ప్రయాణం చేశాడు. మళ్లీ తన కుడి వైపు తిరిగి 4 కి.మీ. ప్రయాణం చేసి ఆగిపోయాడు. ప్రస్తుతం రతన్ తన తొలి స్థానం నుంచి ఎంత దూరంలో, ఏ దిశలో ఉన్నాడు?
ఎ) 15 కి.మీ., తూర్పు బి) 10 కి.మీ., తూర్పు  సి) 15 కి.మీ., ఉత్తరం  డి) 10 కి.మీ., ఉత్తరం  ఇ) పైవేవీ కావు
జ: 15 కి.మీ., ఉత్తరం 

వివరణ:


 

9. ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు పేకాట ఆడుతున్నారు. వారు నలుగురు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణ దిశల్లో కూర్చున్నారు. ఏ అమ్మాయి కూడా తూర్పు ముఖంగా కూర్చోలేదు. ఎదురెదురుగా కూర్చున్నవారు ఒకే లింగానికి చెందినవారు కారు. ఒక అబ్బాయి దక్షిణానికి ముఖం పెట్టి కూర్చున్నాడు. అయితే అమ్మాయిలు ఏ దిశల్లో ముఖం పెట్టి ఉన్నారు?
ఎ) దక్షిణం, తూర్పు    బి) ఉత్తరం, తూర్పు  సి) తూర్పు, పడమర   డి) ఉత్తరం, దక్షిణం   ఇ) పైవేవీ కావు
జ: పైవేవీ కావు
వివరణ:

పడమర, ఉత్తరం దిశల్లో ముఖం పెట్టి ఉన్నారు.

10. 150 కి.మీ.ల దూరం ఉన్న రోడ్డుపై, రెండు చివర్ల నుంచి రెండు బస్సులు వ్యతిరేక దిశల్లో ప్రయాణం చేస్తున్నాయి. మొదటిది 25 కి.మీ. ప్రయాణించి, కుడికి తిరిగి, 15 కి.మీ. వెళ్తుంది. అక్కడి నుంచి ఎడమ వైపు తిరిగి 25 కి.మీ. ప్రయాణించి, తన ప్రధాన రోడ్డును చేరుకునే దిశలో తిరిగి చేరుకుంది. అదే సమయంలో 35 కి.మీ.ల దూరం ప్రయాణించిన మరో బస్సు చెడిపోయి ఆగిపోయింది. అయితే ఆ రెండు బస్సుల మధ్య ప్రస్తుతం దూరం ఎంత?
ఎ) 65 కి.మీ.         బి) 75 కి.మీ.        సి) 80 కి.మీ.       డి) 85 కి.మీ.            ఇ) పైవేవీ కావు
జ: 65 కి.మీ.  
వివరణ:


 

11. 2 : 30 నిమిషాలకు ఒక వాచీలో పెద్ద ముల్లు పడమరను సూచిస్తే, చిన్న ముల్లు ఏ దిశను సూచిస్తుంది?
ఎ) ఆగ్నేయం             బి) నైరుతి            సి) దక్షిణం           డి) వాయవ్యం               ఇ) ఈశాన్యం
జ: ఆగ్నేయం

వివరణ:

 

12. 3 : 45 నిమిషాలకు గడియారంలోని నిమిషాల ముల్లు పడమరను సూచిస్తే, గంటల ముల్లు ఏ దిశను సూచిస్తుంది?
ఎ) తూర్పు               బి) ఈశాన్యం             సి) ఆగ్నేయం            డి) వాయవ్యం               ఇ) పైవేవీ కావు
జ:  ఆగ్నేయం
వివరణ:

13. 7.00 గంటలకు ఒక గడియారంలో నిమిషాల ముల్లు పడమరను సూచిస్తే, గంటల ముల్లు ఏ దిశను సూచిస్తుంది?
ఎ) తూర్పు           బి) ఈశాన్యం         సి) దక్షిణం              డి) ఆగ్నేయం           ఇ) పైవేవీ కావు
జ: ఆగ్నేయం
వివరణ:


 

14. సూర్యోదయ సమయంలో ఒక వ్యక్తి తలకిందులుగా నిలబడి, దక్షిణ దిశగా ముఖం వచ్చేలా, యోగాసనాలు వేస్తున్నాడు. అయితే అతడి నీడ అతడికి ఏ దిశలో పడుతుంది?
ఎ) ఎడమచేతి వైపు            బి) కుడిచేతి వైపు        సి) ముందు        డి) వెనుక            ఇ) చెప్పలేం
జ: ఎడమచేతి వైపు
వివరణ:

సూర్యోదయ సమయంలో నీడ పడమర వైపు పడుతుంది. పడమర వైపు అతని ఎడమ చేయి వస్తుంది.

రచయిత: మచ్చర్ల రమేష్ 

Posted Date : 13-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌