• facebook
  • whatsapp
  • telegram

ప్రవచనాలు - తీర్మానాలు

వివిధ పోటీ పరీక్షల్లో జనరల్ స్టడీస్ 'లాజికల్ రీజనింగ్' కింద 'ప్రవచనాలు - తీర్మానాలు' అనే అంశంపై ప్రశ్నలు ఇస్తుంటారు. ఈ అంశంలో భాగంగా కొన్ని ప్రవచనాలు (ప్రకటనలు) వాటి కింద తీర్మానాలు ఇస్తారు. ప్రతి ప్రకటనలో రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాల మధ్య నిర్ణీత సంబంధాన్ని పేర్కొంటారు.
* అభ్యర్థి మొదట ప్రవచనాలను అర్థం చేసుకుని, దానికి అనుగుణంగా తీర్మానాలను అనుసరించేలా వెన్ చిత్రాలను నిర్మించాలి. ఒకవేళ మొదటి తీర్మానం మాత్రమే అనుసరిస్తే సమాధానం (A) గా, రెండో తీర్మానాన్ని మాత్రమే అనుసరిస్తే సమాధానం (B) గా, రెండూ అనుసరిస్తే సమాధానం (C) గా రెండూ అనుసరించకపోతే సమాధానం (D) గా గుర్తించాలి. అయితే కొన్నిసార్లు ప్రశ్నపత్రంలో ఈ చాయిస్‌లను మార్చి ఇచ్చే అవకాశం ఉంది.

మాదిరి సమస్యలు

1. ప్రకటనలు: కొందరు ఆటగాళ్లు గాయకులు.

             అందరు గాయకులు పొడవైనవారు.
 

తీర్మానాలుI) కొందరు ఆటగాళ్లు పొడవైనవారు.
           II) అందరు ఆటగాళ్లు పొడవైనవారు.
  A) I మాత్రమే అనుసరిస్తుంది B) II మాత్రమే అనుసరిస్తుంది
  C) I, II అనుసరిస్తాయి         D) I, II అనుసరించవు.

వివరణ: ఇచ్చిన ప్రవచనాల ఆధారంగా వెన్ చిత్రాన్ని నిర్మించగా,

     పై చిత్రం ఆధారంగా I వ తీర్మానం కొందరు ఆటగాళ్లు పొడవైనవారు సరైన సమాధానం.
జవాబు: A

 

2. ప్రకటనలు: కొన్ని కుక్కలు పిల్లులు.
                       అన్ని పిల్లులు పందులు.

 

తీర్మానాలు: I) కొన్ని పిల్లులు కుక్కలు.
          II) కొన్ని కుక్కలు పందులు.
     A) I మాత్రమే అనుసరిస్తుంది      B) II మాత్రమే అనుసరిస్తుంది.
     C) I, II అనుసరిస్తాయి.              D) I, II అనుసరించవు.

 

వివరణ: ఇచ్చిన ప్రవచనాల ఆధారంగా వెన్ చిత్రాన్ని నిర్మించగా,

     పై చిత్రం ఆధారంగా, (I) కొన్ని పిల్లులు కుక్కలు, (II) కొన్ని కుక్కలు పందులు అవుతాయి.
     కాబట్టి తీర్మానాలు (I), (II) రెండూ సరైనవి.
జవాబు: C

3. ప్రకటనలు: అందరు విద్యార్థులు విహారయాత్రలను ఇష్టపడతారు.
                      కొందరు విద్యార్థులు ఉన్నత చదువులకు సిద్ధపడతారు.

 

తీర్మానాలు: I) ఉన్నత చదువుల కోసం సిద్ధపడే విద్యార్థుల్లో కొందరు విహారయాత్రలను ఇష్టపడతారు.
                 II) ఉన్నత చదువులకు సిద్ధపడని కొందరు విద్యార్థులు విహారయాత్రలను ఇష్టపడతారు.

 

వివరణ: ఇచ్చిన ప్రకటనలను చిత్రీకరించగా,

S - విద్యార్థులు
E - విహారయాత్రలను ఇష్టపడేవారు
HE - ఉన్నత చదువులకు సిద్ధపడేవారు.
పై చిత్రం ఆధారంగా, తీర్మానాలు I, II రెండూ సరైనవి.
జవాబు: C

4. ప్రకటనలు: కొన్ని తాళం చెవులు తాళాలు, కొన్ని తాళాలు సంఖ్యలు.
              అన్ని సంఖ్యలు అక్షరాలు, అన్ని అక్షరాలు పదాలు.

 

తీర్మానాలు: I) కొన్ని పదాలు సంఖ్యలు.
                  II) కొన్ని తాళాలు అక్షరాలు.

 

వివరణ: ఇచ్చిన ప్రకటనలను చిత్రీకరించగా,

పై చిత్రం ఆధారంగా, తీర్మానాలు (I), (II) సరైనవి.
జవాబు: C

 

5. ప్రకటనలు: ఏ గృహం అపార్ట్‌మెంట్ కాదు.
                      కొన్ని అపార్ట్‌మెంట్‌లు బంగ్లాలు.

 

తీర్మానాలు: I) ఏ ఇల్లూ బంగ్లా కాదు.
                 II) అన్ని బంగ్లాలు గృహాలు.

వివరణ: పై ప్రకటనలను చిత్రీకరించగా,

పై చిత్రం ఆధారంగా, తీర్మానాలు I, II రెండూ సరైనవి కావు.
జవాబు: D

6. ప్రకటనలు: అందరు రచయితలు లాయర్లు.

                     చదివేవారందరూ లాయర్లు.

తీర్మానాలు: I. కొంతమంది లాయర్లు చదివేవారు.
            II. కొంతమంది చదివేవారు రచయితలు.

 

వివరణ: ఇచ్చిన ప్రకటనలను చిత్రీకరించగా,

      పై చిత్రం ఆధారంగా ప్రకటన I మాత్రమే సరైంది.
జవాబు: A

రచయిత: జె.వి.ఎస్. రావు

Posted Date : 13-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌