• facebook
  • whatsapp
  • telegram

మొగ‌ల్ సామ్రాజ్యం

మాదిరి ప్ర‌శ్న‌లు

1. బాబర్ తన స్వీయ చరిత్ర 'బాబరునామా'ను ఏ భాషలో రచించాడు?
జ: తుర్కి

 

2. దిల్లీని తిరిగి ఆక్రమించి, రెండోసారి పట్టాభిషేకం జరుపుకున్న హుమయూన్ ఎంతకాలం పరిపాలించాడు?
జ: ఆరు నెలలు

 

3. అక్బర్ జిజియా పన్నును ఎప్పుడు నిషేధించాడు?
జ: 1564

 

4. బాల్య వివాహాలను, సతీసహగమనాన్ని నియంత్రించడానికి ప్రయత్నించిన మొగల్ చక్రవర్తి ఎవరు?
జ: అక్బర్

 

5. మేవాడ్ రాజ్యం మొగలుల వశం కావడానికి ప్రధాన కారకుడు ఎవరు?
జ: ఖుర్రం

 

6. అక్బర్ రెవెన్యూ మంత్రి ఎవరు?
జ: రాజా తోడర్‌మల్

7. జహంగీర్‌పై ఖుస్రూ తిరుగుబాటుకు మద్దతు ఇచ్చిన సిక్కు గురువు ఎవరు?
జ: అర్జున్‌సింగ్

 

8. మేవాడ్ రాజు మొగలులతో ఏ సంవత్సరంలో సంధి చేసుకున్నాడు?
జ: 1615

 

9. మొగలులు ఎవరి కాలంలో కాందహార్‌ను కోల్పోయారు?
జ: జహంగీర్

 

10. నూర్జహాన్ అసలు పేరు?
జ: మెహరున్నీసా

 

11. జహంగీర్ ఆస్థానానికి తొలిసారిగా రాయబారులను పంపించిన ఇంగ్లండ్ రాజు ఎవరు?
జ: మొదటి జేమ్స్

 

12. ఎవరి కృషి ఫలితంగా ఆంగ్లేయులు సూరత్, ఆగ్రా, అహ్మదాబాద్‌లలో వర్తక స్థావరాలను స్థాపించారు?
జ: సర్ థామస్ రో

13. మొదటి బహదూర్‌షాపై తిరుగుబాటు చేసిన సిక్కుల గురువు ఎవరు?
జ: బందాబహదూర్

14. కిందివారిలో ఛత్రసాల్ ఎవరి నాయకుడు?
ఎ) జాట్‌లు బి) రాజపుత్రులు సి) బుందేలులు డి) సిక్కులు
జ: సి(బుందేలులు)

15. మొదటి బహదూర్‌షా అసలు పేరు?
జ: మువజ్జం

16. జహందర్ షా ఎవరి మద్దతుతో మొగలు చక్రవర్తి అయ్యాడు?
జ: జుల్ఫికర్ ఖాన్

17. ఏ మొగల్ చక్రవర్తిని సయ్యద్ సోదరులు హతమార్చారు?
జ: ఫరూక్‌సియార్

18. సయ్యద్ సోదరులను ఏ మొగల్ చక్రవర్తి కాలంలో చంపేశారు?
జ: మహమ్మద్ షా

19. 'రంగీలా'గా పేరు పొందిన మొగల్ చక్రవర్తి ఎవరు?
జ: మహమ్మద్ షా

20. ఏ ప్రాంతంలో నిజాం ఉల్ ముల్క్ స్వతంత్య్ర రాజ్యాన్ని స్థాపించాడు?
జ: హైదరాబాద్

21. కింది వారిలో 'ఇరాన్ నెపోలియన్‌'గా పేరుగాంచింది ఎవరు?
ఎ) అహమ్మద్ షా అబ్దాలీ బి) మొదటి డేరియస్ సి) నాదిర్షా డి) ఇతిమద్ ఉద్దౌలా
జ: సి(నాదిర్షా)

22. నాదిర్షాకు, మొగల్ సైన్యానికి మధ్య 1739 ఫిబ్రవరిలో యుద్ధం ఎక్కడ జరిగింది?
జ: కర్నాల్

23. అహమ్మద్‌షా అబ్దాలీ ఏ తెగకు చెందినవాడు?
జ: అబ్దాలి

24. రెండో అలంఘీర్ అసలు పేరు?
జ: అజీజుద్దీన్

25. మూడో పానిపట్ యుద్ధం ఎప్పుడు జరిగింది?
జ: 1761

26. బ్రిటిషర్లు ఢిల్లీని ఎప్పుడు ఆక్రమించారు?
జ: 1803

27. చివరి మొగల్ చక్రవర్తి ఎవరు?
జ: రెండో బహదూర్‌షా

28. రామమోహన్‌రాయ్‌కు 'రాజా' అనే బిరుదు ఇచ్చిన మొగలు చక్రవర్తి ఎవరు?
జ: రెండో అక్బర్

మొగలుల సాహితీసేవ అభ్యాస ప్రశ్నలు

1. భారతదేశ చరిత్రకు సంబంధించి అబ్దుల్‌ హమీద్‌ లాహోరీ ఎవరు?

ఎ) అక్బర్‌ కాలంలో ఒక ప్రధాన సైన్యాధికారి
బి) షాజహాన్‌ పాలనాకాలపు అధికారిక చరిత్రకారుడు.
సి) ఔరంగజేబ్‌ కాలపు కులీనుడు, అతడి సన్నిహితుడు
డి) మహమ్మద్‌ షా పాలనా కాలపు రచయిత, కవి

 
3. దక్కన్‌ సుల్తానుల చరిత్ర తెలుసుకునేందుకు ప్రధాన ఆధారం ఏది?

ఎ) తబకత్‌ఎనాసిరి           బి) ఫుతూహ్‌ఉస్‌సలాతిన్‌ 
సి) తారిఖ్‌ఎఫెరిష్తా           డి) కితాబ్‌ఉల్‌రెహ్లా


4. అక్బర్‌ కాలంలో రామాయణాన్ని పర్షియన్‌ భాషలోకి అనువదించింది ఎవరు?

ఎ) అబుల్‌ ఫజల్‌       బి) అబ్దుల్‌ ఖాదర్‌ బదాయూనీ 
సి) బీర్బల్‌                డి) పైజీ సర్హింది


5. హిందూ ఇస్లాం మతాల సారంగా పేర్కొనే ‘మజ్మాఉల్‌బహ్రెయిన్‌’ రచయిత ఎవరు?

ఎ) దారాషికో                 బి) సులేమాన్‌ షికో     
సి) అబుల్‌ ఫజల్‌         డి) అమీర్‌ ఖుస్రూ 


6. ‘తారిఖ్‌ఎముబారక్‌ షాహీ’ ఎవరి కాలపు రచన?

ఎ) ఖిల్జీలు     బి) తుగ్లక్‌లు     సి) లోడీలు     డి) సయ్యద్‌లు


7. ‘తబకత్‌ఎనాసిరి’ రచయిత ఎవరు?

ఎ) మిన్హాజుస్‌ సిరాజ్‌         బి) నాసిరుద్దీన్‌ మహమ్మద్‌ 
సి) జియావుద్దీన్‌ బరౌనీ          డి) అబ్బాస్‌ ఖాన్‌ షేర్వానీ


8. కిందివాటిలో మహమ్మద్‌ హషీం ఖాఫీఖాన్‌ రచన?

ఎ) ముంతఖాబ్‌ఉత్‌తవారిఖ్‌     బి) ముంతఖాబ్‌ఉల్‌లుబాబ్‌ 
సి) ఖులాసత్‌ఉత్‌తవారిఖ్‌         డి) షాజహాన్‌ నామా


సమాధానాలు: 1-బి;  2-ఎ;  3-సి;  4-బి;  5-ఎ;  6-డి;  7-ఎ;  8-బి.

Posted Date : 13-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌