• facebook
  • whatsapp
  • telegram

అంతర్జాతీయ కూటములు

1. ఆఫ్రికన్‌ యూనియన్‌కు సంబంధించి కింది వాటిలో సరైంది?

ఎ) ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఆఫ్రికా యూనియన్‌ 1963లో ఏర్పడింది.

బి) దీని ఏర్పాటుకు కృషి చేసిన నాటి ఘనా దేశ అధ్యక్షుడు క్వామిన్వైమా.

సి) రువాండాలో జరిగిన జాతుల పోరాటాన్ని విజయవంతంగా నియంత్రించింది.

డి) 2002, జులై 9న దర్బన్‌లో జరిగిన సమావేశంలో ‘ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఆఫ్రికా యూనియన్‌’ (OAU) ‘ఆఫ్రికన్‌ యూనియన్‌ (AU) అవతరించింది.

1) ఎ, బి, సి    2) ఎ, బి, డి   3) ఎ, సి, డి   4) పైవన్నీ


2. ఆఫ్రికన్‌ యూనియన్‌కు తొలి ఛైర్మన్‌ ఎవరు?

1) థాబో ఎంబెకీ - దక్షిణాఫ్రికా     2) రుడాల్ఫ్‌ గనారియా - ఘనా

3) ఇమ్రాన్‌ జైనుద్దీన్‌ - కెన్యా   4) యూసర్‌ అరాఫత్‌ - పాలస్తీనా


3. ఏయూకు సంబంధించి కింది వాటిలో సరైంది?

ఎ) దీనిలో ప్రస్తుత సభ్యదేశాల సంఖ్య - 55

బి) దీని ప్రధాన కార్యాలయం - అడీస్‌ అబాబా

సి) దీనిలోని ప్రధాన విభాగం ‘శాంతిభద్రతల మండలి’

డి) శాంతిభద్రతల మండలిలోని 15 సభ్యదేశాలు రొటేషన్‌ పద్ధతిలో ప్రాతినిధ్యం వహిస్తాయి.

1) ఎ, సి     2) ఎ, బి    3) ఎ, బి, సి   4) పైవన్నీ


4. CHOGM అంటే ఏమిటి?

1) Common Wealth Heads of Government Meeting

2) Common Wealth Healing of Government Meeting

3) Common Wealth Headquarters of Grievence Membership

4) Common Wealth Higher Authorities of Government Meda

5. కింది వాటిలో కామన్వెల్త్‌ ఆఫ్‌ నేషన్స్‌కు సంబంధించి సరైంది?

ఎ) కామన్వెల్త్‌ అంటే పూర్వ బ్రిటిష్‌ వలస రాజ్యాల కూటమి

బి) ఇది 1931లో లండన్‌ కేంద్రంగా ప్రారంభమైంది

సి) దీనిలో భారత్, పాకిస్థాన్‌ 1947లో చేరాయి.

డి) శ్రీలంక 1948లో చేరింది.

1) ఎ, బి    2) బి, సి   3) ఎ, బి, డి     4) పైవన్నీ


6. కామన్వెల్త్‌ ఆఫ్‌ నేషన్స్‌కు సంబంధించి సరైంది?

ఎ) బ్రిటిష్‌ రాజు/రాణి అధిపతిగా వ్యవహరిస్తారు

బి) అధికారిక భాష ఇంగ్లిష్‌

సి) ప్రతి రెండేళ్లకొకసారి సమావేశాలు నిర్వహిస్తారు

డి) ఇందులోని సభ్యదేశాల సంఖ్య - 54

1) ఎ, బి    2) బి, సి    3) ఎ, బి, డి     4) పైవన్నీ


7. కామన్వెల్త్‌ ఆఫ్‌ నేషన్స్‌లో యూరప్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న దేశాలకు సంబంధించి సరికానిదేది?

1) నార్వే    2) సైప్రస్‌    3) మాల్టా   4) బ్రిటన్‌


8. కింది వాటిలో కామన్వెల్త్‌ ఆఫ్‌ నేషన్స్‌లో పలు ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న దేశాలకు సంబంధించి సరైంది?

ఎ) ఆఫ్రికా నుంచి 19 దేశాలు

బి) ఆసియా నుంచి ఎనిమిది దేశాలు

సి) కరేబియన్, అమెరికా నుంచి 13 దేశాలు

డి) పసిఫిక్‌ ప్రాంతం నుంచి 11 దేశాలు

1) ఎ, సి     2) బి, సి    3) బి, డి     4) పైవన్నీ


9. కామన్వెల్త్‌ ఆఫ్‌ నేషన్స్‌లో ఆసియా ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న దేశాలకు సంబంధించి సరికానిదేది?

1) భారత్, పాకిస్థాన్, బ్రూనై    2) బంగ్లాదేశ్, మలేసియా, శ్రీలంక

3) జపాన్, ఆఫ్గానిస్థాన్‌   4) సింగపూర్, మాల్దీవులు


10. ఒపెక్‌ (OPEC) అంటే ఏమిటి?

1) ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ది పెట్రోలియం ఎక్స్‌పెక్టింగ్‌ కంట్రీస్‌

2) ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ది పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్‌ కంట్రీస్‌

3) ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ది పెట్రోకెమికల్స్‌ ఎకాలజీ కంట్రీస్‌

4) ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ది పెట్రోలియం ఎకానమీ కంట్రీస్‌


11. కింది వాటిలో ఒపెక్‌కు సంబంధించి సరైంది?

ఎ) దీన్ని 1960, సెప్టెంబరులో స్థాపించారు.

బి) ప్రధాన కార్యాలయం వియన్నాలో ఉంది.

సి) ఇది 1961 నుంచి అమల్లోకి వచ్చింది.

డి) అధికారిక భాష - అరబిక్‌.

1) ఎ, బి, సి   2) బి, సి    3) ఎ, బి, డి      4) పైవన్నీ


12. ఒపెక్‌కు సంబంధించి కింది వాటిలో సరైంది?

ఎ) ప్రపంచ చమురు ఉత్పత్తిలో 1/3వ వంతు ఈ దేశాల నుంచే వస్తుంది.

బి) ప్రపంచంలోని మొత్తం చమురు నిల్వల్లో సుమారు 70% ఈ దేశాల్లోనే ఉంది.

సి) ఈ కూటమిలోని సభ్యదేశాల సంఖ్య - 13

డి) వీటిలో సోవియట్‌ యూనియన్‌ కీలకమైంది.

1) ఎ, సి, డి     2) ఎ, బి, సి   3) ఎ బి, డి  4) పైవన్నీ


13. 2019 జనవరి 1న ఒపెక్‌ కూటమి నుంచి ఏ దేశాన్ని తొలగించారు?

1) కువైట్‌     2) ఇరాన్‌   3) ఖతార్‌     4) లిబియా


14. APEC (ఎపెక్‌) అంటే ఏమిటి?

1) Asia Pacific Economic Co-operation

2) Asian Para Economic CoOperation

3) Asia Pacific Ecology Conference

4) Association of Pacific Economic Countries


15. కింది వాటిలో ఎపెక్‌కు సంబంధించి సరైంది?

ఎ) దీన్ని ఆస్ట్రేలియా ప్రధాని రాబర్ట్‌ హుక్‌ ప్రతిపాదించారు

బి) మొదటి సమావేశం 1989, నవంబరులో జరిగింది

సి) తొలి సమావేశం కాన్‌బెర్రా - ఆస్ట్రేలియాలో నిర్వహించారు.

డి) అధికారిక భాష - స్పానిష్‌

1) ఎ, బి, డి     2) ఎ, సి, డి    3) ఎ, బి, సి     4) పైవన్నీ


16. 1991లో జరిగిన ఎపెక్‌ సమావేశంలో చైనా, తైవాన్‌ల సభ్యత్వాన్ని ఆమోదించారు. అయితే ఆ సమావేశం ఎక్కడ జరిగింది?

1) సిడ్నీ - ఆస్ట్రేలియా    2)  సియోల్‌ - దక్షిణ కొరియా

3) ప్రిటోరియా - దక్షిణాఫ్రికా   4) జకార్తా - ఇండోనేసియా


17. కింది వాటిలో ఎపెక్‌కు సంబంధించి సరైంది?

ఎ) దీని ప్రధాన కార్యాలయం - సింగపూర్‌   బి) ఇందులో భారత్‌కు సభ్యత్వం ఉంది

సి) దీనిలోని సభ్యదేశాల సంఖ్య - 21   డి) అధికారిక భాష - ఇంగ్లిష్‌

1) ఎ, సి, డి     2) ఎ, బి, సి    3) ఎ, బి, డి     4) పైవన్నీ


సమాధానాలు

1-2 2-1 3-4 4-1 5-4 6-4 7-1 8-4   9-3  10-2  11-1  12-2 13-3 14-1 15-3 16-2 17-1.  


మరికొన్ని...


1. IOR - ARC అంటే ఏమిటి?

1) Indian Ocean Rim Associaiton for Regional Co-operation

2) Indian Ocean Rim Association for Regional Corporation

3) Indian Ocean Rim Associaiton for Rural Co-operation

4) Indian Ocean Relative Association for Rural Co-operation


2. కింది వాటిలో IOR - ARC కు సంబంధించి సరైంది?

ఎ) దీన్ని 1997లో ఏర్పాటు చేశారు    బి) ఇందులోని సభ్యదేశాల సంఖ్య - 19

సి) భారతదేశానికి సభ్యత్వం ఉంది

డి) దీని లక్ష్యం - హిందూ మహాసముద్ర ప్రాంతంలో వాణిజ్యపరమైన, సహజవనరుల వైజ్ఞానిక అభివృద్ధికి వ్యూహాలను రూపొందించడం

1) ఎ, బి, డి     2) ఎ, బి, సి   3) ఎ, సి, డి     4) పైవన్నీ


3. ఓఐసీ (O.I.C) అంటే ఏమిటి?

1) Organisation of International Conference

2) Organisation of The Islamic Conference

3) Organisation of the Industries Co-operation

4) Organisation of the Industries Conference


4. కింది వాటిలో ఓఐసీకి సంబంధించి సరైంది?

ఎ) 1971లో 24 ఇస్లాం దేశాలకు చెందిన దేశాధినేతలు మొరాకోలోని రాబట్‌లో సమావేశమయ్యారు

బి) 1971, మేలో ఇస్లామిక్‌ దేశాల సమాఖ్యను ్బవీ.ఖి.ద్శి అధికారికంగా సౌదీ అరేబియాలోని జెడ్డాలో స్థాపించారు.

సి) ఓఐసీ చార్టర్‌ను 1972లో ఆమోదించారు.

డి) దీని అధికార భాషలు - అరబిక్, ఇంగ్లిష్, ఫ్రెంచ్‌

1) ఎ, బి, సి     2) ఎ, సి, డి    3) ఎ, బి, డి     4) పైవన్నీ


5. ఓఐసీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

1) జెడ్డా    2) రాబట్‌   3) సైప్రస్‌     4) టెహ్రాన్‌


6. కింది వాటిలో ఓఐసీ లక్ష్యాన్ని గుర్తించండి.

1) సభ్యదేశాల మధ్య సంఘీభావాన్ని పెంపొందించడం

2) ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, వైజ్ఞానిక రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించడం

3) పౌరహక్కుల కోసం పోరాడుతున్న వారికి మద్దతునివ్వడం, జాతి వివక్షతను తొలగించడానికి ప్రయత్నించడం

4) పైవన్నీ


సమాధానాలు

1-1    2-4    3-2    4-4    5-1    6-4

Posted Date : 15-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌