• facebook
  • whatsapp
  • telegram

పారిశ్రామిక ప్రగతి - సమస్యలు - నూతన పోకడలు

1. అనాదిగా అంతర్జాతీయ డిమాండ్‌ ఉన్న భారత వస్తువులు ఏవి?

1) మస్లిన్‌     2) క్యాలికో వస్త్రాలు   3) 1, 2   4) దారం


2. భారత్‌ ఎంచుకున్న ఆర్థిక వ్యవస్థ.....

1) ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ        2) మిశ్రమ ఆర్థిక వ్యవస్థ   3) పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ     4) ప్రాచీన ఆర్థిక వ్యవస్థ


3. 1956 పారిశ్రామిక విధానంలో ఏ రంగానికి పెద్దపీట వేశారు?

1)  ప్రైవేట్‌ రంగం     2)  ప్రభుత్వ రంగం   3) వ్యవసాయ రంగం    4) తయారీ రంగం


4. హిందుస్థాన్‌ మెషిన్‌ టూల్స్‌ ఏ ప్రణాళికా కాలంలో ఏర్పాటైంది?

1) మొదటి ప్రణాళిక    2) రెండో ప్రణాళిక     3) మూడో ప్రణాళిక    4) నాలుగో ప్రణాళిక


5. చిత్తరంజన్‌ రైలు ఇంజిన్‌ కర్మాగారాన్ని ఏ ప్రణాళికా కాలంలో ఏర్పాటు చేశారు?

1) మొదటి ప్రణాళిక (1951 - 56)    2) రెండో ప్రణాళిక  (1956 - 61)

3) మూడో ప్రణాళిక (1961 - 66)      4) ఏదీకాదు


6. సింద్రి ఎరువుల కర్మాగారాన్ని ప్రవేశపెట్టిన ప్రణాళిక ఏది?

1) రెండో ప్రణాళిక    2) మొదటి ప్రణాళిక

3) మూడో ప్రణాళిక   4) నాలుగో ప్రణాళిక


7. మొదటి ప్రణాళికా కాలంలో టెలిఫోన్‌ రంగంలో నెలకొల్పిన పరిశ్రమ ఏది?

1) ఇండియా టెలిఫోన్‌ ఇండస్ట్రీస్‌     2) బీహెచ్‌ఇఎల్‌

3) హెచ్‌ఎంటీ     4) విశాఖ షిప్‌యార్డ్‌


8. రెండో ప్రణాళికా కాలంలో ఉక్కు  కర్మాగారాలు ఎక్కడ ఏర్పాటు చేశారు?

1) భిలాయ్‌ (ఛత్తీస్‌గఢ్‌)      2) రూర్కెలా (ఒడిశా)

3) దుర్గాపూర్‌ (పశ్చిమ్‌ బంగా)     4) పైవన్నీ 


9. దుర్గాపూర్‌ ఉక్కు కర్మాగార నిర్మాణానికి సహకరించిన దేశం ఏది?

1) రష్యా   2) జపాన్‌    3) చైనా    4) బ్రిటన్‌


10. భిలాయ్‌ ఉక్కు కర్మాగార నిర్మాణానికి ఏ దేశం సహకరించింది?

1) చైనా   2) జపాన్‌   3) జర్మనీ     4) రష్యా


11. రూర్కెలా ఉక్కు కర్మాగార నిర్మాణం ఏ దేశ సహకారంతో పూర్తి చేశారు? 

1) జర్మనీ   2) బ్రిటన్‌    3) చైనా    4) జపాన్‌


12. పారిశ్రామిక పునాది విస్తరించిన ప్రణాళిక ఏది?

1) మొదటి ప్రణాళిక     2) రెండో ప్రణాళిక

3) మూడో ప్రణాళిక     4) నాలుగో ప్రణాళిక


13. అణుశక్తి పరిశ్రమ ఏ ప్రణాళికా కాలంలో ప్రారంభమైంది?

1) మొదటి ప్రణాళిక    2) రెండో ప్రణాళిక

3) మూడో ప్రణాళిక   4) నాలుగో ప్రణాళిక


14. రెండు, మూడో ప్రణాళికల్లో విస్తరించిన పరిశ్రమలు ఏవి?

1) మౌలిక పరిశ్రమలు     2) మూలధన సాంద్ర పరిశ్రమలు

3) 1, 2       4) అతి చిన్న పరిశ్రమలు


15. బొకారో ఉక్కు కర్మాగారాన్ని ఏ ప్రణాళికా కాలంలో నెలకొల్పారు?

1) మొదటి ప్రణాళిక    2) రెండో ప్రణాళిక    3) మూడో ప్రణాళిక    4) నాలుగో ప్రణాళిక


16. బొకారో ఉక్కు కర్మాగారాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు?

1) ఝార్ఖండ్‌   2) బిహార్‌    3) పశ్చిమ్‌ బంగా   4) ఉత్తర్‌ ప్రదేశ్‌


17. బొకారో ఉక్కు కర్మాగారాన్ని ఏ దేశ సహకారంతో నిర్మించారు?

1) బ్రిటన్‌     2) రష్యా    3) జపాన్‌     4) జర్మనీ


18. ప్రస్తుత పారిశ్రామిక ఉత్పత్తి సూచీ ఆధార సంవత్సరం ఏది?

1) 2004 -05     2) 1999 - 2000    3) 2011 - 12    4) 1993 - 94


19. భారత్‌లో ఇనుము, ఉక్కు ఉత్పత్తి చేసిన తొలి భారీ కర్మాగారం ఏది?

1) టాటా ఐరన్‌ అండ్‌ స్టీల్‌ కంపెనీ (TISCO) జంషెడ్‌పూర్‌

2) స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా

3) భిలాయ్‌ ఉక్కు కర్మాగారం

4) దుర్గాపూర్‌ ఉక్కు కర్మాగారం


20. పంచదార పరిశ్రమ అభివృద్ధికి సూచనల కోసం నియమించిన కమిటీ ఏది?

1) బి.బి.మహాజన్‌ కమిటీ  2) రంగరాజన్‌ కమిటీ  3) నరసింహం కమిటీ    4) వాంఛూ కమిటీ


21. ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేసిన మొదటి ఇనుము - ఉక్కు కర్మాగారం ఏది?

1) విశ్వేశ్వరయ్య ఇనుము - ఉక్కు కర్మాగారం (కర్ణాటకలోని భద్రావతి వద్ద)

2) బొకారో ఉక్కు కర్మాగారం (ఝార్ఖండ్‌)

3) టిస్కో(TISCO)    

4) ఏదీకాదు


22. స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ను (SAIL) ఎప్పుడు ఏర్పాటు చేశారు?

1) జనవరి 24, 1973     2) ఫిబ్రవరి 24, 1973

3) మార్చి 24, 1973     4) ఏప్రిల్‌ 24, 1973


23. ప్రభుత్వ రంగంలోని అతి పెద్ద ఇనుము - ఉక్కు కర్మాగారం....

1) దుర్గాపూర్‌ ఉక్కు కర్మాగారం     2) రూర్కెలా ఉక్కు కర్మాగారం

3) బొకారో ఉక్కు కర్మాగారం    4)  భిలాయ్‌ ఉక్కు కర్మాగారం


24. దేశంలో ఉక్కు పరిశ్రమ అభివృద్ధికి బాధ్యత వహించే సంస్థ ఏది?

1) స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా    2) గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా

3) పరిశ్రమల శాఖ       4) ఏదీకాదు


25. ప్రైవేట్‌ రంగంలో అతి పెద్ద ఇనుము - ఉక్కు కర్మాగారం ఏది?

1) టాటా ఇనుము - ఉక్కు కర్మాగారం2) బొకారో ఉక్కు కర్మాగారం

3) స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా    4) గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా


26. దేశంలో వ్యవసాయం తరువాత ఎక్కువగా ఉపాధిని సృష్టించే రెండో పరిశ్రమ ఏది? (2021 - 22 సర్వే ప్రకారం)

1) వస్త్ర పరిశ్రమ   2) తయారీ రంగం    3) ఇనుము   4) ఉక్కు


27. దేశంలో జనపనార మిల్లులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది?

1) ఉత్తర్‌ ప్రదేశ్‌    2) పశ్చిమ్‌ బంగా    3) కర్ణాటక     4) మహారాష్ట్ర


28. దేశంలో మొదటి దుస్తుల పార్కు ఎక్కడ ఏర్పాటు చేశారు?

1) తిరుపుర్‌ (తమిళనాడు)    2) పుణె (మహారాష్ట్ర)

3) నాగ్‌పుర్‌ (మహారాష్ట్ర)     4) ఏదీకాదు


29. దేశంలో మొదటి జనపనార పారిశ్రామిక కర్మాగారాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు?

1) కోల్‌కతా   2) పుణె    3) ముంబయి    4) చెన్నై


సమాధానాలు

1-3  2-2  3-2  4-1  5-1  6-2  7-1  8-4  9-4  10-4  11-1  12-2  13-2  14-3  15-3  16-1  17-2  18-3  19-1  20-1  21-1  22-1  23-3  24-1  25-1  26-1  27-2  28-1  29-1.


మరికొన్ని..


1. ముడి జనుము ఉత్పత్తిలో భారత్‌ ఏ స్థానంలో ఉంది?

1) మొదటి   2) రెండు   3) మూడు  4) నాలుగు


2. భారతీయ జనుము విధానం ఎప్పుడు ప్రారంభమైంది?

1)  2002     2)  2003    3) 2004     4) 2005


3. మనదేశంలో కాగితం పరిశ్రమను ఏర్పాటు చేసిన ప్రదేశం ఏది?

1) సీరమ్‌పూర్‌ (పశ్చిమ్‌ బంగా)     2) చెన్నై (తమిళనాడు)

3) పుణె (మహారాష్ట్ర)    4) మైసూర్‌ (కర్ణాటక)


4. పరిశ్రమల రంగంలోని ఉపరంగాలు ఏవి?

1) గనుల తవ్వకం, క్వారీయింగ్‌     2) తయారీ

3) విద్యుత్, సహజ వాయువు, నీటి సరఫరా, నిర్మాణం     4) పైవన్నీ


5. భారతదేశ ఎగుమతుల్లో అధిక వాటా గల పరిశ్రమ ఏది?

1) వస్త్ర పరిశ్రమ (17%)        2) జనపనార పరిశ్రమ(18%)

3) పంచదార పరిశ్రమ (19%)    4) కాగితం పరిశ్రమ (20%)


6. అత్యధికంగా బొగ్గు ఉత్పత్తి చేసే దేశాల్లో భారతదేశ స్థానం ఎంత?

1) రెండు     2) మూడు     3) నాలుగు     4) అయిదు 


7. ప్రపంచంలో రెడీమేడ్‌ వస్త్రాల ఎగుమతిలో భారత వస్త్ర పరిశ్రమ స్థానం....

1) మొదటి     2) రెండు   3) మూడు     4) నాలుగు


8. ప్రపంచ వస్త్ర మార్కెట్లో పోటీ ఇచ్చే దేశాలు ఏవి?

1) బంగ్లాదేశ్‌   2) వియత్నాం   3) ఇథియోపియా    4)పైవన్నీ


9. జాతీయ వస్త్త్ర్ర విధానాన్ని ఎప్పుడు రూపొందించారు?

1)  2000    2) 2001    3)  2002    4) 2003


10. ప్రపంచంలో స్పాంజ్‌ ఐరన్‌ ఉత్పత్తిలో భారత్‌ స్థానం...

1)  మొదటి    2) రెండు    3) మూడు   4) నాలుగు


11. జాతీయ ఉక్కు విధానం ఎప్పుడు అమల్లోకి వచ్చింది?

1) 2002   2) 2003     3) 2004    4) 2005


12. దేశంలోని సంఘటిత రంగంలో అతిపెద్ద పరిశ్రమ ఏది?

1) వస్త్ర పరిశ్రమ     2) పత్తి పరిశ్రమ    3)  కాగితం పరిశ్రమ    4) సిమెంట్‌ పరిశ్రమ


13. అంతర్జాతీయ వ్యాపారంలో జనపనార పరిశ్రమ ప్రాధాన్యత ఏమిటి?

1) ఎగుమతి   2) విదేశీ ద్రవ్యం ఆర్జన    3) 1, 2    4) ఉత్పత్తి తగ్గుదల


సమాధానాలు

1-1  2-4  3-1  4-4  5-1  6-4  7-2  8-4  9-1  10-1    11-4     12-1    13-3.


* నేషనల్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటులో ఉద్దేశం ఏమిటి?

1) జనపనార పరిశ్రమ ఆధునికీకరణ    2) కాగితం పరిశ్రమ ఆధునికీకరణ

3) పంచదార పరిశ్రమ ఆధునికీకరణ    4) ఏదీకాదు

జవాబు: 1


* జనపనార పరిశ్రమ ప్రధాన సమస్య......

1) ఆధునికీకరణకు నిధుల కొరత    2) రోడ్డు కొరత   3) గిట్టుబాటు ధర    4)మార్కెట్‌ విస్తరణ 

జవాబు: 1


* జనపనార (Jute) ప్యాకింగ్‌ మెటీరియల్‌ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది?

1) 1995    2) 1996    3) 1987    4) 1998

జవాబు: 3


* మేకిన్‌ ఇండియా ఎప్పుడు ప్రారంభమైంది?

1) 2016    2) 2017    3) 2014    4) 2015

జవాబు: 3

Posted Date : 07-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌