• facebook
  • whatsapp
  • telegram

భారతదేశం - నగరీకరణ

* 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణం లేదా పట్టణ ప్రాంతం అంటే...
    1) మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ లేదా కంటోన్మెంట్ లేదా నోటిఫైడ్ ప్రదేశం.
    2) జనాభా రీత్యా కనీసం 5000 మంది ఉన్న ప్రదేశం.
    3) కనీసం 75% పురుషులు వ్యవసాయేతర రంగాల్లో పనిచేయడం.
    4) జనసాంద్రత కనీసం చ.కి.మీ.కి 400 ఉండటం.
    గమనిక: రామ్‌చంద్రన్ అభిప్రాయం ప్రకారం 50% లేదా అంత కంటే ఎక్కువ శాతం జనాభా వ్యవసాయేతర కార్యకలాపాల్లో ఉండే ప్రాంతం.
 

నగరీకరణ పరిణామ దశలు
* లూయిస్ మమ్‌ఫోర్డ్ ప్రకారం నగరీకరణలో కింది దశలు ఉంటాయి.
1. ఇయోపొలిస్: ఇది గ్రామస్థాయి ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ కార్యకలాపాలకు సంబంధించింది.
2. పొలిస్: ఇది పట్టణదశ. ఇక్కడ మార్కెట్ లావాదేవీలు జరుగుతాయి.
3. మెట్రోపొలిస్: ఇది ఒక పెద్ద నగరం. అధిక జనాభా, నానా జాతీయత, సంక్లిష్ట శ్రమ విభజన కలిగి ఉంటుంది.
4. టైరనోపొలిస్: జీవితం ఆడంబరాలతో నిండి, వృథా ఖర్చులు ఎక్కువై, నగరం ఆర్థిక స్థిరత్వాన్ని కోల్పోతుంది.
5. మెగాపొలిస్: ఇది నియంత్రణ లేకుండా పెరుగుతున్న నగరం, యంత్రీకరణకు ప్రాధాన్యం ఎక్కువ.
6. నెక్రోపొలిస్: దీన్ని ''మరణించిన వారి పట్టణం'' అంటారు. నగరం యుద్ధం, కరవు, వ్యాధులు లాంటి పరిస్థితిని ఎదుర్కోలేక ఉనికిని కోల్పోతుంది.

2013లో ఖండాలవారీ పట్టణ జనాభా:
   1. ఉత్తర అమెరికా - 81%

   2. దక్షిణ అమెరికా - 82%
   3. ఆసియా - 40%
   4. ఆఫ్రికా - 40%
 

SOWP నివేదిక - 2007
*
స్టేట్ ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్ రిపోర్టు - 2007 (SOWP), ఐక్యరాజ్యసమితి జనాభా నిధి అంచనాల ప్రకారం ప్రపంచ జనాభాలో 50 శాతం పట్టణాల్లో నివసిస్తోంది. ఇది 2030 నాటికి 60 శాతానికి పెరగనుంది.
* ఐక్యరాజ్యసమితి జనాభా నిధి ప్రకారం 2000 నాటికి ప్రపంచ పట్టణ జనాభా 2.96 మిలియన్లు కాగా, 2010 నాటికి 3.77 మిలియన్లకు పెరగనుంది.
* 2030 నాటికి పట్టణ జనాభా 5 బిలియన్లకు పెరగనుంది.
* 1980 దశకంలో 39 శాతం ఉన్న పట్టణ జనాభా 2000 నాటికి 48 శాతానికి పెరిగింది.
* ప్రస్తుతం ఆఫ్రికా, ఆసియా దేశాల్లో పట్టణీకరణ ప్రక్రియ వేగాన్ని పుంజుకుంది.
 

తెలంగాణ - పట్టణ జనాభా
*
2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో పట్టణ జనాభా 13.61 మిలియన్లు. వీరు మొత్తం జనాభాలో 38.67 శాతం.
* హైదరాబాద్ నూరు శాతం పట్టణ జిల్లా కానీ, హైదరాబాద్ నగరం జిల్లా సరిహద్దులను దాటి, పొరుగున ఉన్న రంగారెడ్డి జిల్లాలోకి కూడా వ్యాపించింది.
* హైదరాబాద్ తర్వాత ఎక్కువగా పట్టణీకరణ చెందిన జిల్లా రంగారెడ్డి.
 

భారత పట్టణీకరణ - భావనలు
(Urbanisation in India - Concepts)
* 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణాలను 6 రకాలుగా వర్గీకరించారు.
   టైర్ I -  ఒక లక్ష లేదా అంత కంటే ఎక్కువ జనాభా
   టైర్ II - 50,000 - 99,999
  టైర్ III - 20,000 - 49,999
  టైర్ IV - 10,000 - 19,999
  టైర్ V - 5,000 - 9,999
  టైర్ VI - 5000 కంటే తక్కువ జనాభా1. చట్టబద్ధ పట్టణాలు (Statutory Towns)
  * ఇవి మొదటి తరగతి పట్టణాలు.
 * ఇవి సంబంధిత రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతాల చట్టరీత్యా నోటిఫై అయి ఉంటాయి.
 * వీటి కిందికి మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు లాంటివి వస్తాయి.
        ఉదా: వడోదర మున్సిపల్ కార్పొరేషన్, సిమ్లా మున్సిపల్ కార్పొరేషన్.
 

2. జనాభా పట్టణం (Census Town)
   * ఇవి రెండో తరగతి పట్టణాలు.
   * వీటిని 2001 జనాభా లెక్కల ప్రకారం గుర్తించారు.
 

3. మెట్రోపాలిటన్ పట్టణాలు
   * వీటికి మరో పేరు మిలియన్ ప్లస్ సిటీస్.
   * జనాభా ఒక మిలియన్ (10 లక్షలు) లేదా అంత కంటే ఎక్కువ ఉన్న పట్టణాలు.
   * 2011 జనాభా లెక్కల ప్రకారం వీటి సంఖ్య 53.
   * 2001 జనాభా లెక్కల ప్రకారం వీటి సంఖ్య 35.
  * దేశంలో మొదటి మెట్రోపాలిటన్ పట్టణం కోల్‌కతా (1901).
   * దేశంలో రెండో మెట్రోపాలిటన్ పట్టణం ముంబయి (1911).
  * 1951 జనాభా లెక్కల ఆధారంగా హైదరాబాద్‌ను మెట్రోపాలిటన్ నగరంగా గుర్తించారు.

ఐరాస తాజా అధ్యయనం (2016)
*
2030 నాటికి ప్రపంచంలో పట్టణ జనాభా 60% ఉండబోతోంది.
*  ప్రపంచంలో ప్రస్తుత మెగా నగరాల సంఖ్య 31.
*  ప్రస్తుతం (2016) భారత్‌లో మెగా సిటీల సంఖ్య - 5 (దిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు)
* 2030 నాటికి ప్రపంచంలో మెగాసిటీల సంఖ్య 41కి చేరుతుందని అంచనా. ఇండియాలో 7 (హైదరాబాద్, అహ్మదాబాద్ అదనం).
 

4. మెగాసిటీస్
*
ఒక కోటి లేదా 10 మిలియన్ల కంటే ఎక్కువ జనాభా ఉన్న పట్టణం
* ప్రస్తుతం దేశంలోని మెగా సిటీల సంఖ్య 3.
అవి: 1) ముంబయి (18.4 మిలియన్లు) అతి పెద్ద మెగా సిటీ
       2) దిల్లీ (16.3 మిలియన్లు) రెండో మెగా సిటీ
       3) కోల్‌కతా (14.1 మిలియన్లు) మూడో మెగా సిటీ
* మెగా సిటీల జనాభా పెరుగుదల తగ్గుముఖం పడుతోంది.

5. అర్బన్ అగ్లోమరేషన్ లేదా పట్టణ సముదాయాలు (UA)
*
ఒక చట్టబద్ధ పట్టణంతో పాటు దాని చుట్టుపక్కల ఉండే రెండు లేదా ఎక్కువ పట్టణాలతో కలిపి విస్తరిస్తున్నదే UA.
ఉదా: గ్రేటర్ ముంబయి UA, దిల్లీ UA, చెన్నై UA.
* UA అనే భావనను మొదటిసారిగా 1971 జనాభా లెక్కల్లో ఉపయోగించారు.
 

6. అర్బన్ క్లస్టర్
కేంద్రస్థంగా మెట్రోపాలిటన్ నగరం లేకుండా ఏర్పడే పట్టణమే అర్బన్ క్లస్టర్.
ఉదా: ధన్‌బాద్ ఇది 8 టైర్ I పట్టణాలతో ఏర్పడింది.
 

7. అర్బన్ షాడో
*
పెద్ద పట్టణానికి 75 కి.మీ వ్యాసార్ధం వరకు ఎలాంటి పట్టణం లేకపోవడం.
ఉదా: హైదరాబాద్, నాగ్‌పుర్, జయపుర (జైపూర్)

Note: Statutory Towns 242 పెరగగా, Census towns 2532 పెరిగాయి.
 

8. UNO మెగా నగరం
*
కోటి జనాభా ఉన్న నగరాలు ఉదా: ముంబయి, దిల్లీ, కోల్‌కతా
* మొదటి జనాభా లెక్కల సేకరణలో (1872) పట్టణ జనాభా: 8.7%
* మొదటి జనాభా లెక్కల సేకరణలో (1872) పట్టణాల సంఖ్య: 16
* దేశంలో పట్టణ జనాభా 2 సందర్భాల్లో తగ్గింది (స్వాతంత్య్రం రాకముందు) అవి:
    1) 1911 జనాభా సేకరణకు ముందు దేశంలో ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు
    2) 1931 - 41, 1941 - 51 మధ్యకాలంలో రెండో ప్రపంచ యుద్ధం, దేశ విభజన సందర్భంలో
 

9. పట్టణ జనాభా పెరుగుదల - ధోరణులు
*
ఒక అంచనా ప్రకారం 2030 నాటికి పట్టణ జనాభా: ''59 కోట్లు'' (590 మిలియన్లు)
* పట్టణీకరణ అధికంగా జరుగుతున్న ప్రాంతాలు:
    1) మైదానాలు, పారిశ్రామిక, వాణిజ్య ప్రాంతాలు
    2) తీర ప్రాంతాలు
    3) వనరులు అధికంగా ఉన్న ప్రాంతాలు
* పట్టణీకరణ అల్పంగా జరుగుతున్న ప్రాంతాలు: కొండ, గిరిజన ప్రాంతాలు.
* దేశంలో అధిక పట్టణీకరణ జరుగుతున్న కేంద్రపాలిత ప్రాంతాలు: న్యూదిల్లీ (97.5%), చండీగఢ్
* దేశంలో అల్ప పట్టణీకరణ నమోదవుతున్న కేంద్రపాలిత ప్రాంతాలు: అండమాన్, నికోబార్‌దీవులు, దాద్రానగర్ హవేలీ
* మొత్తం పట్టణ జనాభాలో 42% మంది ముంబయి, దిల్లీ, కోల్‌కతాలోనే ఉన్నారు.
* అత్యధిక పట్టణ జనాభా శాతం నమోదైంది: 1981 (46.12%)
* ప్రపంచంలో వివిధ దేశాలతో పోలిస్తే భారత్‌లో పట్టణీకరణ తక్కువగా ఉంది.
* దేశంలో అధిక పట్టణ జనాభా ఉన్న రాష్ట్రాలు:
    1. మహారాష్ట్ర (13.5%)
    2. ఉత్తర్ ప్రదేశ్ (11.8%)
    3. తమిళనాడు (9.3%)
* దేశంలో అల్ప పట్టణ జనాభా ఉన్న రాష్ట్రాలు:
    1. సిక్కిం (0.1%)
    2. అరుణాచల్ ప్రదేశ్ (0.1%)
    3. మిజోరాం (0.1%)
* అధిక పట్టణ జనాభా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం: న్యూదిల్లీ
అల్ప పట్టణ జనాభా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం: లక్షద్వీప్.
* అధిక పట్టణ జనాభా శాతం ఉన్న రాష్ట్రాలు:
    1. గోవా (62.2%)
   2. మిజోరాం (52.1%)
   3. తమిళనాడు (48.4%)
    4. కేరళ (47.7%)
* అల్ప పట్టణ జనాభా శాతం నమోదైన రాష్ట్రాలు:
   1. హిమాచల్ ప్రదేశ్ (10%)
   2. బిహార్ (11.3%)
    3. అసోం (14.2%)
* అధిక పట్టణ జనాభా పెరుగుదల రేటు
    (2001 - 2011) నమోదైన రాష్ట్రాలు:
    1. సిక్కిం (153%) 2. కేరళ (93%)
*  దక్షిణాది రాష్ట్రాల్లో పట్టణ జనాభా:
   1. తమిళనాడు (48.4%)
   2. కేరళ (47.7%)
   3. కర్ణాటక (38.6%)
 

10. అక్షరాస్యత
*
2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణ అక్షరాస్యత: 84.88% (2001లో 79.92%)
      పురుష అక్షరాస్యత: 89.67%
       స్త్రీల అక్షరాస్యత: 79.92%
* పట్టణ అక్షరాస్యత ఎక్కువగా ఉండటం వల్ల మానవ వనరులు అభివృద్ధి చెందుతాయి.
* పట్టణంలో సామాజిక అవగాహన, రాజకీయ చైతన్యం ఎక్కువ.
 

11. అధిక పట్టణీకరణ (Over Urbanisation)
*
ఒక పట్టణం శక్తి, సామర్థ్యాల కంటే అధికంగా పట్టణీకరణ జరగడం.
ఉదా: న్యూదిల్లీ, హైదరాబాద్, ముంబయి, కోల్‌కతా
 

12. ఉప-పట్టణీకరణ (Sub- Urbanisation):

* ఒక పట్టణ పరిసర ప్రాంతాల్లోని వివిధ గ్రామాలు కూడా పట్టణీకరణలో భాగస్వాములు కావడం.
    ఉదా: దిల్లీ, హైదరాబాద్.

Posted Date : 13-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌