• facebook
  • whatsapp
  • telegram

భారత్ - అభివృద్ధి చెందుతున్న దేశం

నమూనా ప్రశ్నలు

1. 2012 లెక్కల ప్రకారం భారత తలసరి జీఎన్‌పీ (డాలర్లలో) ఎంత?
జ: 1,530

 

2. ఎన్ఎస్ఎస్ఓ 68 వ రౌండ్ ప్రకారం భారతదేశంలో పేదరికం (2011 - 12) శాతం?
జ: 21.9

 

3. 2012 - 13 లెక్కల ప్రకారం జీడీపీలో వ్యవసాయ రంగం వాటా ఎంత?
జ: 13.9%

 

4. 2009 - 10 ప్రకారం వ్యవసాయ ఆధారిత శ్రామికులు ఎంత శాతం?
జ: 53%

 

5. 2014 గణాంకాల ప్రకారం భారత మానవ అభివృద్ధి సూచిక విలువ ఎంత?
జ: 0.586

 

6. 2014 ప్రకారం మానవాభివృద్ధి సూచికలో భారతదేశ ర్యాంకు ఎంత?
జ: 135

 

7. భారత్ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని తెలిపే అంశం ఏది? 
1) వ్యవసాయ ప్రాధాన్యం       2) అల్ప మూలధన సంచయనం  
3) సాంకేతిక వెనుకబాటు       4) పైవన్నీ

జ: పైవన్నీ

8. 2013 - 14 జీడీపీలో పారిశ్రామిక రంగ వాటా అంచనా ఎంత?
జ: 26.2%

 

9. 2013 - 14 లో జీడీపీలో సేవారంగం వాటా అంచనా?
జ: 59.9%

 

10. సేవారంగంలో పనిచేసే శ్రామికుల శాతం ఎంత?
జ: 25.3%

 

11. 2012 లో భారత గ్రామీణ పేదరికం ఎంత శాతం?
జ: 25.7%

 

12. 2012 లో భారత పట్టణ పేదరికం ఎంత శాతం?
జ: 13.7%

 

13. దేశంలో సీడీఎస్ ప్రకారం మొత్తం నిరుద్యోగిత (NSSO - 68 వ రౌండ్) ఎంత శాతం?
జ: 5.6%

 

14. భారత జనాభా వృద్ధి రేటు ఎంత?
జ: 17.6%

 

15. బ్రిటిష్ పాలనకు పూర్వం దేశం స్థితి ఏమిటి? 
1) సహజవనరుల సమృద్ధత    2) వస్తు మార్పిడి పద్ధతి  3) రాజరిక వ్యవస్థ   4) పైవన్నీ

జ: పైవన్నీ
 

16. 'సంపద దోపిడీ'ని వివరించింది ఎవరు?
జ:  దాదాబాయ్ నౌరోజీ

 

17. దాదాబాయ్ నౌరోజి రచించిన గ్రంథం ఏది?
జ: పావర్టీ అండ్ అన్- బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా

 

18. దాదాబాయ్ నౌరోజీ అభిప్రాయం ప్రకారం 'సంపద దోపిడి' ఏ రూపంలో జరిగింది?
జ: హోమ్ ఛార్జీలు

Posted Date : 13-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌