• facebook
  • whatsapp
  • telegram

ద్రవ్యం - భావనలు

1. ద్రవ్య ఆవిర్భావానికి పూర్వం ఆర్థిక వ్యవహారాలు అమల్లో ఉన్న పద్ధతి -
జ: వస్తు మార్పిడి పద్ధతి

 

2. 'ఏదైతే ద్రవ్యంగా పనిచేస్తుందో అదే ద్రవ్యం' అని అన్నదెవరు?
జ: వాకర్

 

3. కిందివాటిలో చట్టబద్ధ ద్రవ్యాన్ని జారీ చేసేది?
     1) కేంద్ర బ్యాంకు        2) వాణిజ్య బ్యాంకు        3) విదేశీ బ్యాంకు        4) ఏదీకాదు
జ: 1 (కేంద్ర బ్యాంకు)

 

4. కిందివాటిలో ఐచ్ఛిక ద్రవ్యం ఏది?
     1) బాండ్లు         2) సెక్యూరిటీలు         3) చెక్కులు         4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)

 

5. కిందివాటిలో అధిక ద్రవ్యత్వం ఉన్నదేది?
     1) బంగారం         2) వెండి        3) షేర్లు         4) 1000 రూపాయల నగదు
జ: 4 (పైవన్నీ)

 

6. బ్యాంకులు సృష్టించే ద్రవ్యం -
జ: పరపతి ద్రవ్యం

 

7. కిందివాటిలో ఆర్థిక వ్యవహారాల అమలుకు సాధనమయ్యే ద్రవ్యం విధి?
     1) వినిమయ మాధ్యమం                                   2) విలువల కొలమానం
     3) విలువల నిధి                                               4) విలువల బదిలీ
జ: 1) వినిమయ మాధ్యమం

 

8. ద్రవ్య విధులను చలన, నిశ్చల విధులుగా ఎవరు వర్గీకరించారు?
జ: పాల్ ఐంజంగ్

 

9. M1లో లేని అంశాలు 
     1) కరెన్సీ                                                             2) డిమాండ్ డిపాజిట్లు
     3) ఆర్బీఐ వద్ద ఇతర డిపాజిట్లు                              4) పోస్టాఫీసు డిపాజిట్లు
జ: 4) పోస్టాఫీసు డిపాజిట్లు

 

10. కిందివాటిలో అధిక ద్రవ్యత్వం ఉన్నది-
     1) M1         2) M2         3) M3         4) M4
జ: 1 (M1)

 

11. నారోమనీ (సంకుచిత ద్రవ్యం) దేనికి చెందింది?
జ: M1

 

12. కిందివాటిలో దేన్ని 'విశాలద్రవ్య కొలమానం'గా పిలుస్తారు?
     1) M1         2) M2         3) M3         4) M4
జ: 3 (M3)

 

13. కిందివాటిలో అతి తక్కువ ద్రవ్యత్వం ఉన్నదేది?
     1) M1         2) M2         3) M4         4) M3
జ: 3 (M4)

 

14. కిందివాటిలో బ్రాడ్‌మనీ అని దేనికి పేరు?
     1) M1         2) M2         3) M4         4) M3
జ: 3 (M4)

 

15. అధిక శక్తి ఉండే ద్రవ్యాన్ని జారీ చేసేది?
జ: ఆర్‌బీఐ

Posted Date : 13-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌