• facebook
  • whatsapp
  • telegram

భారతదేశంలో వ్యవసాయం

1. ఆహార ధాన్యాలుగా వేటిని పేర్కొంటారు?
జ. తృణధాన్యాలు, పప్పుదినుసులు
 

2. భారతదేశ స్థూల జాతీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా ఎలా ఉంది?
జ. క్రమంగా తగ్గుతోంది
 

3. వివిధ పరిపక్వ కాలాలున్న వివిధ పంటలను ఏకకాలంలో పండించే పద్ధతిని ఏమని పిలుస్తారు?
జ. మిశ్రమ పంటల విధానం
 

4. జనసాంద్రత తక్కువగా ఉండి, యంత్రాల ద్వారా పెద్ద వ్యవసాయ క్షేత్రాల్లో పంటలు పండించే విధానాన్ని ఏమని పిలుస్తారు?
జ. విస్తృత వ్యవసాయం
 

5. వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న  పంటల్లో ఖరీఫ్ పంట కానిదేది?
జ. గోధుమ
 

6. విస్తీర్ణంలో, ఉత్పత్తిలో వరిని అత్యధికంగా పండించే రాష్ట్రమేది?
జ. పశ్చిమ బెంగాల్
 

7. వరి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ స్థానం-
. రెండో స్థానం
 

8. భారతదేశంలో గోధుమలను అత్యధికంగా పండించే రాష్ట్రం?
జ. ఉత్తరప్రదేశ్
 

9. భారత్‌లో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ స్థానం-
జ. మూడో స్థానం
 

10. రబీ, ఖరీఫ్ రెండు కాలాల్లో పండించే పంటలేవి?
జ. 1) వరి 2) వేరుశెనగ 3) మొక్కజొన్న
 

11. జాతీయ పామ్ ఆయిల్ పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది?
జ. ఏలూరు
 

12. బార్లీ పంట ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రమేది?
జ. ఉత్తరప్రదేశ్
 

13. కేంద్ర వరి పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది?
జ. కటక్
 

14. పప్పుధాన్యాల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం-
జ. మధ్యప్రదేశ్
 

15. వేరుశెనగ ఉత్పత్తిలో మన దేశం ఎన్నో స్థానంలో ఉంది?
జ. 1
 

16. కళ్యాణ్, సోనా, జయరాజ్, మేఘదూత్ అనే అధిక దిగుబడి వంగడాలు ఏ పంటకు చెందినవి?
జ. గోధుమ
 

17. మొక్కలోని ఏ భాగంనుంచి పత్తి లభిస్తుంది?
జ. ఫలం
 

18. భారతదేశంలో చెరకును అత్యధికంగా పండించే రాష్ట్రం-
జ. ఉత్తరప్రదేశ్
 

19. దేశంలో తేయాకును అత్యధికంగా పండించే రాష్ట్రమేది?
జ. అసోం
 

20. సుగంధ ద్రవ్యాల ఉద్యానవనం అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు?
జ. కేరళ
 

21. సుగంధ ద్రవ్యాల రాజుగా ఏ పంటను పేర్కొంటారు?
జ. మిరియాలు
 

22. హరిత విప్లవం (Green Revolution) అనే పదాన్ని మొదట రూపొందించి పిలిచిన శాస్త్రవేత్త ఎవరు?
జ. విలియం గాండే
 

23. జాతీయ వేరుశెనగ పరిశోధన సంస్థను ఎక్కడ నెలకొల్పారు?
జ. జునాగఢ్
 

24. ఇటీవల భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని రెట్టింపు చేసేందుకు సతత హరిత విప్లవానికి పిలుపునిచ్చింది ఎవరు?
జ. ఎం.ఎస్. స్వామినాథన్
 

25. పింక్ విప్లవం అని ఏ ఉత్పత్తికి పేరు?
జ. రొయ్యలు
 

26. జాతీయ పాడి పరిశ్రమ పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది?
జ. కర్నాల్
 

27. పత్తి పంటకు అత్యంత శ్రేష్ఠమైన మృత్తిక ఏది?
జ. నల్లరేగడి నేలలు
 

28. వర్గీస్ కురియన్‌ను ఏ విప్లవానికి పితామహుడిగా పేర్కొంటారు?
జ. శ్వేత విప్లవం
 

29. ప్రపంచంలో పండ్ల ఉత్పత్తిలో భారత్ స్థానమేది?
జ. మొదటి స్థానం
 

30. రెయిన్‌బో విప్లవం దేనికి సంబంధించింది?
జ. పండ్లు, కూరగాయలు
 

31. ప్రపంచంలో పాలను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది?
జ. ఇండియా
 

32. పప్పు ధాన్యాలు ప్రధానంగా ఏ రకం పంట?
జ. రబీ
 

33. వేరుశెనగ ఏ కుటుంబానికి చెందింది?
జ. లెగ్యుమినేసి
 

34. ప్రపంచ పశుసంపదలో భారత్ ఏ స్థానంలో ఉంది?
జ. మొదటి స్థానం
 

35. శ్వేత విప్లవం అంటే ఏమిటి?
జ. పాల ఉత్పత్తి
 

36. కులు, సిమ్లా లోయలు ఏ పంటకు ప్రసిద్ధి?
జ. యాపిల్
 

37. మిశ్రమ వ్యవసాయం (Mixed Farming) అంటే ఏమిటి?
జ. ఒకే భూమిలో ఏకకాలంలో వ్యవసాయం, పశుపోషణ, కోళ్ల పెంపకం మొదలైన వాటిని కలిగిఉండటం
 

38.  పంటల మార్పిడి (Crop Rotation) కి సంబంధించిన పంటలేవి?
జ. 1) వేరుశెనగ 2) జనుము 3) చిక్కుడు
 

39. కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది?
జ. రాజమండ్రి
 

40. భారతదేశంలో సహకార రంగంలో పాల ఉత్పత్తి అభివృద్ధిలో దేశానికే మార్గదర్శకమైన సంస్థ ఎక్కడ ఉంది?
జ. ఆనంద్, గుజరాత్ 
 

41. భారతదేశంలో అత్యధికంగా పంటలు ఏ కాలానికి చెందినవి?
జ. ఖరీఫ్
 

42. ఫలరాజం (King of Fruits) అని దేన్నంటారు?
జ. మామిడి
 

43. ఒలేరి కల్చర్ (Oleri culture) దేనికి సంబంధించింది?
జ. కూరగాయల పెంపకం
 

44. భారతదేశ జాతీయ పుష్పం ఏది?
జ. కమలం
 

45. పోమోలజీ (Pomology) దేన్ని అధ్యయనం చేసే శాస్త్రం?
జ. పండ్ల తోటలు
 

46. ఆపరేషన్ ఫ్లడ్ దేనికి సంబంధించింది?
జ. పాల ఉత్పత్తి
 

47. పట్టు పురుగుల పెంపకానికి సంబంధించిన శాస్త్రమేది?
జ. సెరి కల్చర్
 

48. భారత కూరగాయల పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది?
జ. వారణాసి
 

49. టిక్కా వ్యాధి ఏ పంటకు చెందింది?
జ. వేరుశెనగ
 

50. భారతదేశంలో మొదట హరిత విప్లవం ద్వారా ప్రవేశపెట్టిన పంటలు ఏవి?
జ. గోధుమ, వరి
 

51. భారత్‌లో చేపల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రమేది?
జ. పశ్చిమ బెంగాల్
 

52. భారత్‌లో కోళ్ల పెంపకంలో (పౌల్ట్రీ) మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం-
జ. ఆంధ్రప్రదేశ్
 

53. పట్టు ఉత్పత్తిలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది?
జ. రెండో స్థానం
 

54. ఉన్ని ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రమేది?
జ. రాజస్థాన్
 

55. పేదవారి ఆవుగా దేన్ని పేర్కొంటారు?
జ. మేక

Posted Date : 13-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌