• facebook
  • whatsapp
  • telegram

భారతదేశం - నీటి పారుదల

1. కిందివాటిలో ఏ రాష్ట్ర వ్యవసాయం అధిక శాతం బావులపైనే ఆధారపడి ఉంది?
ఎ) మధ్యప్రదేశ్       బి) బిహార్      సి) గుజరాత్   డి) పశ్చిమ్ బంగ
జ: సి (గుజరాత్)
 

2. భారతదేశంలో అతి పొడవైన కాలువ ఏది?
జ: ఇందిరా గాంధీ కాలువ
 

3. నీటి ఉపయోగిత వంద శాతం ఉన్న నీటిపారుదల పద్ధతి ఏది?
జ: బిందు సేద్యం
 

4. చెరువుల ద్వారా నీటి పారుదలను అత్యధికంగా ఏ రాష్ట్రంలో చూడొచ్చు?
జ: తమిళనాడు
 

5. దామోదర్ వ్యాలీ ప్రాజెక్టు (DVC) ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
జ: 1948

ఇండియన్‌ జాగ్రఫీ

మాదిరి ప్రశ్నలు

1. కింది అంశాలను పరిశీలించండి.

ఎ) దక్షిణ భారతదేశంలో మొదటిది, దేశంలో రెండో కిసాన్‌ రైలును కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ అనంతపురం - న్యూదిల్లీ మధ్య వీడియో లింక్‌ ద్వారా ప్రారంభించారు. 

బి) 2020 జూన్‌లో ‘దూద్‌ దురంతో స్పెషల్‌’  రైలు రేణిగుంట ఏపీ నుంచి న్యూదిల్లీ మధ్య ప్రారంభమైంది.

1) ఎ సరైంది         2) బి సరైంది 

3) ఎ, బి సరైనవి         4) ఎ, బి సరికావు


2. దేశంలో నౌకా ఆధారిత అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన కార్యక్రమం?

1) మల్లెమాల         2) సాగర్‌మాల    3) భారత్‌మాల         4) జలమాల


3. కింది వాటిలో అతిపెద్ద షిప్‌యార్డ్‌ ఏది?

1) హిందుస్థాన్‌ - విశాఖ     2) మజగావ్‌డాక్‌ - ముంబయి 

3) పారాదీప్‌ - ఒడిశా     4) గార్డెన్‌రీచ్‌ - కలకత్తా


4. కింది వాటిలో 100 శాతం సోలార్‌ ఆధారిత విమానాశ్రయం ఏది?

1) కొచ్చి - కేరళ         2) న్యూదిల్లీ   3) అహ్మదాబాద్‌ - గుజరాత్    4) పోర్ట్‌బ్లెయిర్‌ - అండమాన్‌


5. ‘ఉడాన్‌’ పథకం దేనికి సంబంధించింది?

1) రైల్వే సంస్థలు         2) నౌకా సంస్థలు  3) విమానయాన సంస్థ     4) పోస్టల్‌ సంస్థలు


6. కింది వాటిలో మెట్రోరైలు సౌకర్యం లేని నగరం?

1 హైదరాబాద్‌     2) భువనేశ్వర్‌    3) జైపూర్‌    4) కొచ్చి


7. కింది వాటిలో ఏ రవాణాకు ‘స్టాండర్డ్‌ గేజ్‌ రైల్వేట్రాకు’ను ఉపయోగిస్తారు?

1) టాయ్‌ట్రైన్స్‌           2) మెట్రోట్రైన్స్‌ 

3) అర్బన్‌ ట్రైన్స్‌            4) సబ్‌మెర్సిబుల్‌ ట్రైన్స్‌


8. దేశంలో అత్యధికంగా విస్తరించి ఉన్న రోడ్డు మార్గాలు?

1) జాతీయ మార్గాలు          2) రాష్ట్ర రహదారి మార్గాలు 

3) గ్రామీణ రహదారి మార్గాలు   4) సరిహద్దు రహదారి మార్గాలు


9. ఒక అంతర్జాతీయ విమానం ముంబయి - కలకత్తా మధ్య ప్రయాణిస్తున్నప్పుడు కింది ఏ నగర ఎయిర్‌పోర్ట్‌ల మీదుగా వెళ్తుంది?

1) పుణె, నాగ్‌పుర్‌            2) ఔరంగాబాద్, రాయ్‌పూర్‌ 

3) నాగ్‌పుర్, జబల్‌పుర్   4) హైదరాబాద్, భువనేశ్వర్‌


10. దేశంలో తొలి గ్రీన్‌ఫీÆల్డ్‌ (హరితక్షేత్ర) అంతర్జాతీయ విమానాశ్రయం?

1) రాజీవ్‌గాంధీ - హైదరాబాద్‌ 

2) దేవనహళ్లి - బెంగళూరు 

3) భోగాపురం - విశాఖ 

4) ఛత్రపతి శివాజీ - ముంబయి


11. కింది అంశాలను జతపర్చండి.

i. నేషనల్‌ హైవే అథారిటీ   ఆఫ్‌ ఇండియా                    a)1986

ii. ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ   ఆఫ్‌ ఇండియా                        b) 1988

iii. ఇన్‌లాండ్‌  వాటర్‌వే అథారిటీ  ఆఫ్‌ ఇండియా          c) 1995

iv. ప్రత్యేక ఆర్మీ పోస్టల్‌ సర్వీస్‌     జోన్‌ ప్రారంభం          d)2014


        i    ii    iii      iv

1)    a     b    c     d
2)   d     c     b     a
3)    d    c     a     b

4)     c    b     d     a


12. 2007 లో ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ లిమిటెడ్, ఎయిర్‌ ఇండియా లిమిటెడ్‌ను విలీనం చేసి ‘ఏవియేషన్‌ కంపెనీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌’గా ఏర్పాటు చేశారు. దీనికి చిహ్నంగా ఏ మస్కట్‌ను రూపొందించారు?

1) స్వాంప్‌ డీర్‌           2) సీ బర్డ్    3) ఎగిరే హంస       4) బోల్‌ ది గార్డ్‌


13. కింది వాటిలో సరైంది?

ఎ) నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషియన్‌ టెక్నాలజి - చెన్నై

బి) సెంటర్‌ ఫర్‌ అంటార్కిటికా ఓషియన్‌ రిసెర్చ్‌ - పనాజి

సి) నేషనల్‌ ఇన్‌లాండ్‌ నావిగేషన్‌ ఇన్‌స్టిట్యూట్‌ - పాట్నా

డి) ఇన్‌లాండ్‌ వాటర్‌వే అథారిటీ - నోయిడా

1) ఎ, బి            2) బి, సి, డి 

3) ఎ, సి, డి         4) ఎ, బి, సి, డి


14. కింది వాటిలో ఏది యుద్ధనౌకలు, జలాంతర్గాములను తయారు చేస్తుంది?

1) మజగావ్‌డాక్‌         2) హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌     3) కొచ్చి షిప్‌యార్డ్‌    4) గోవా షిప్‌యార్డ్‌


15. భారత ప్రభుత్వం  2010 జనవరిలో ఏ ఓడరేవును మేజర్‌ పోర్ట్‌ (భారీ తరహా ఓడరేవు)గా ప్రకటించింది?

1) కృష్ణపట్నం         2) గంగవరం    3) పోర్ట్‌బ్లెయిర్‌           4) పారాదీప్‌


16. కింది వాటిని జతపర్చండి.

    జాబితా-1            జాబితా - 2

i. వీల్‌ అండ్‌ యాక్సిల్స్‌ ప్లాంట్‌      a)చిత్తరంజన్‌  

ii. ఇంటిగ్రల్‌రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరి           b) వారణాసి   

iii. డీజిల్‌ లోకోమోటీవ్స్‌                  c) పెరంబదూర్‌  

iv. ఎలక్ట్రిక్‌ లోకోమోటీవ్స్‌                d) ఎలహంక  


      i     ii   iii    iv                       i      ii     iii    iv

1)   a   b   c    d               2)    d      c     b     a

3)   c    b   a     d              4)     d    c     a     b


17. భారతదేశంలో పర్యాటక స్థలాల సందర్శన కోసం ఏర్పాటు చేసిన రైలు?

1) శ్రామిక్‌ రైలు         2) టూరిజం రైలు   3) మహారాజ ఎక్స్‌ప్రెస్‌     4) ప్యాలెస్‌ ఆన్‌ వీల్స్‌


18. కింద పేర్కొన్న ఏ రాష్ట్రంలో కొంకణ్‌ రైల్వే మార్గం భాగస్వామ్యం కాలేదు?

1) మహారాష్ట్ర           2) కర్ణాటక        3) తమిళనాడు          4) కేరళ


19. ప్రతిపాదన (A): కేంద్ర రైల్వేశాఖ దక్షిణకోస్తా -  విశాఖపట్టణంను 18 వ రైల్వే జోన్‌గా ప్రకటించింది.

కారణం(R): 18వ రైల్వే జోన్‌లో మూడు డివిజన్లు- గుంతకల్లు, గుంటూరు, విజయవాడలను నిర్ధారించింది.

1)  A, R సత్యం కానీ A కి R సరైన వివరణ కాదు. 
2)  A సత్యం, R అసత్యం.

3)  R సత్యం, A అసత్యం.

4) A, R సత్యం,  A కు R‌ సరైన వివరణ.


20. దేశంలో అత్యంత పొడవైన బ్రిడ్జిని (9.15 కి.మీ.)  సాదియా - డొలా మధ్యలో నిర్మించారు. దీని పేరు ఏమిటి?

1) బోగిబిల్‌             2) భూపేన్‌ హజారికా     3) వెంబనాడ్‌            4) గ్రాండ్‌ ట్రంక్‌


21. వర్తక్, పుష్పక్, చేతక్‌ ప్రాజెక్టులను ఏరకమైన రోడ్డు మార్గాల అభివృద్ధికి చేపట్టారు?

1) నేషనల్‌ హైవేస్‌       2) ఎక్స్‌ప్రెస్‌ హైవేస్‌ 

3) బోర్డర్‌ రోడ్‌వేస్‌           4) ఇన్‌లాండ్‌ రోడ్‌వేస్‌


22. నేషన్‌లో హైవే డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం ్బవిబీదీశ్శి కింద చేపట్టిన ‘స్వర్ణ చతుర్భుజి’ ప్రాజెక్ట్‌లో అత్యంత పొడవైన, చిన్న మార్గాలను గుర్తించండి.

a) దిల్లీ - కలకత్తా         b) కలకత్తా - చెన్నై   c) చెన్నై - ముంబయి     d) ముంబయి - దిల్లీ

1) b, c       2) a, b     3) c, d    4) a, c
 

23. భారత్‌లో పోస్టల్‌ ఇండెక్స్‌ నంబర్‌ ్బశిఖివ్శి కోడ్‌ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు?

1) 1970     2) 1972   3) 1975   4) 1985


24. కింది వాటిలో అయిదో పోస్టల్‌ జోన్‌ పరిధిలో భాగం కాని రాష్ట్రం?

1) మహారాష్ట్ర         2) తెలంగాణ      3) ఆంధ్రప్రదేశ్‌         4) కర్ణాటక


25. భారతదేశంలో అతిపెద్ద వ్యాపార పోస్టల్‌జోన్‌?

1) 7వ జోన్‌         2) 9వ జోన్     3) 6వ జోన్‌        4) 7వ జోన్‌


26. ఉత్తర - దక్షిణ, తూర్పు - పశ్చిమ కారిడార్‌ రోడ్డు మార్గాలు ఏ ప్రాంతం వద్ద ఖండించుకుంటాయి?

1) నాగ్‌పుర్‌   2) ఝాన్సీ   3) ఆగ్రా   4) పుణె


27. కింది వాటిలో సరైంది?

ఎ) భారతదేశంలో అత్యంత పొడవైన జాతీయ రహదారి-విబీ44. ఇది కన్యాకుమారి నుంచి శ్రీనగర్‌ మధ్య ఉంది. దీని పొడవు 3,745 కి.మీ.

బి) భారత్‌లో అత్యల్ప పొడవైన జాతీయ రహదారి విబీ966్బత్శీ. ఇది కొచ్చి (కేరళ)లో ఉంది. దీని పొడవు 8 కి.మీ.

సి) ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత పొడవైన జాతీయ రహదారి విబీ16. ఇది చిత్తూరు - శ్రీకాకుళం మధ్య ఉంది. దీని పొడవు 1,024 కి.మీ.

1) ఎ మాత్రమే         2) సి మాత్రమే 

3) ఎ, బి                4) పైవన్నీ


28. భారతదేశంలో సరకు రవాణా ఎక్కువగా కలిగి, చవకైన మార్గాలు ఏవి?

1) రోడ్డు మార్గాలు         2) రైలు మార్గాలు    3) వాయు మార్గాలు     4) జలమార్గాలు


29. కింది వాటిని జతపరచండి.


     జాబితా-1            జాబితా- 2

i) తూర్పుకోస్తా రైల్వే                   a) న్యూదిల్లీ

ii) ఈశాన్య ఫ్రాంటియర్‌ రైల్వే      b)హాజీపూర్‌

iii) తూర్పు మధ్య రైల్వే               c)గువాహటి

iv) ఉత్తర రైల్వే                           d)భువనేశ్వర్‌


         i      ii    iii     iv

1)     a     b    c      d
2)    d      c     b     a

3     d      a     b      c  ‘


30. అంతర్జాతీయంగా మొబైల్, ఇంటర్నెట్‌ వినియోగంలో భారతదేశం ఏ స్థానంలో ఉంది?

1) రెండో స్థానం         2) మొదటి స్థానం   3) మూడో స్థానం         4) అయిదో స్థానం


సమాధానాలు

1-3   2-2   3-1   4-1   5-3   6-2   7-2   8-3   9-2 10-1   11-3   12-3   13-4   14-1   15-3   16-2  17-4   18-3   19-4   20-2   21-3   22-1     23-2   

24-1   25-1   26-2   27-4   28-4   29-2     30-1


 

Posted Date : 13-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌