• facebook
  • whatsapp
  • telegram

భారతదేశం - నైసర్గిక స్వరూపాలు

1. దేశంలో విస్తరించి ఉన్న మొత్తం భూభాగంలో పీఠభూములు ఎంత శాతం భూభాగాన్ని ఆక్రమించాయి?
జ: 27.7%

 

2. దేశంలో ఎత్తైన పర్వత శిఖరం ఏ పర్వత ప్రాంతంలో విస్తరించి ఉంది?
జ: కారాకోరం పర్వత ప్రాంతాలు

 

3. హిమాలయాల ఉద్భవం ఏ కాలంలో ప్రారంభమైంది?
జ: టెర్షియరీ

 

4. హిమాలయాల్లోని ఏ ప్రాంతం వేసవి విడిది కేంద్రాలకు ప్రసిద్ధి చెందింది?
జ: హిమాచల్ పర్వతాలు

 

5. హిమాలయ పర్వత పాదాలు అని వేటిని పిలుస్తారు?
జ: శివాలిక్ హిమాలయాలు

 

6. చైనా దేశంతో వర్తక, వాణిజ్యాలను కొనసాగించడానికి వీలుగా ఉన్న నాధులా, జీలప్‌లా కనుమలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
జ: సిక్కిం

 

7. ప్రపంచ ప్రసిద్ధి చెందిన కశ్మీర్ లోయ ఏయే పర్వతాల మధ్య ఉంది?
జ: హిమాద్రి - పీర్‌పంజాల్"

 

8. పూర్వాంచల్ పర్వతాలను అరుణాచల్‌ప్రదేశ్‌లో ఏ పేరుతో పిలుస్తారు?
జ: అరకన్ యోమా కొండలు

 

9. అసోం హిమాలయాలు ఏయే నదుల మధ్య విస్తరించి ఉన్నాయి?
జ: తీస్తా - బ్రహ్మపుత్ర

 

10. హిమాలయ ప్రాంతాల్లో శృంగాకారపు అరణ్యాలు విస్తరించిన ఉన్న ప్రాంతం?
జ: హిమాచల్ ప్రాంతం

 

11. దేశంలో అత్యంత పురాతన పర్వతాలు?
జ: ఆరావళి పర్వతాలు

 

12. పూర్వాంచల్ పర్వతాల్లో ఎత్తైన పర్వత శిఖరం?
జ: సారామతి

 

13. ఆరావళి పర్వతాల్లో ఎత్తైన పర్వత శిఖరం?
జ: గురుశిఖర్

 

14. పండ్ల తోటలకి ప్రసిద్ధి చెందిన హిమాలయ పర్వత ప్రాంతం?
జ: హిమాచల్

 

15. బాహ్య హిమాలయాలు అని వేటిని పిలుస్తారు?
జ: శివాలిక్

Posted Date : 13-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌