• facebook
  • whatsapp
  • telegram

చక్రవడ్డీ 

1. ఒక రైతు రూ.800 లను 5 శాతం రేటుకు అప్పుతీసుకున్నాడు. అయితే, 2 సంవత్సరాల తర్వాత అసలుపై చెల్లించే చక్రవడ్డీని తెలపండి. 
జవాబు:  రూ.82
వివరణ:  చక్రవడ్డీ = మొత్తం - అసలు

                =  (882-800) రూ.
                =రూ.82    

 


2. రూ.10,000 లకు ఎంత శాతం రేటుతో 2 సంవత్సరాలకు రూ.1,236 చక్రవడ్డీ అవుతుంది?
జవాబు:  6
వివరణ:    సూత్రం = వడ్డీరేటు  
( మొత్తం = అసలు + వడ్డీ)
( = 10000 + 1236)
దత్తాంశం ఆధారంగా (  = 11236)
వడ్డీరేటు 

3. రూ.800 లకు 5 శాతం చక్రవడ్డీ చొప్పున మొత్తం రూ.882 ఎన్ని సంవత్సరాలకు అవుతుంది?
జవాబు: 2
వివరణ:  సూత్రం =

T = 2 సంవత్సరాలు


4. 3 సంవత్సరాలకు వరుసగా 10 శాతం, 20 శాతం, 25 శాతం రేటులతో రూ.2000 లకు చక్రవడ్డీ ప్రకారం ఎంత మొత్తం అవుతుంది?
జవాబు:  రూ.3300 
వివరణ:  దత్తాంశం ఆధారంగా
 
=>  రూ.3300


5.  రెండు వారాల నుంచి టమోటాల ధర వారానికి 10% వంతున పెరిగితే 20 కి.గ్రా. ధర రూ.121 అయ్యింది. అయితే, రెండు వారాల కిందట 1 కి.గ్రా. టమోటాల ధర ఎంత?
జవాబు:  రూ.5
వివరణ: దత్తాంశం ఆధారంగా

= రూ.100 
1 కి.గ్రా. టమోట ధర = = రూ.5

 


6. ఒకడు రూ.3880 లకు సైకిల్ కొని రూ.1000 లను చెల్లించాడు. మిగతా సొమ్మును 25 శాతం వార్షిక రేటుతో రెండు సులభ వాయిదాల్లో 2 సంవత్సరాలకు చెల్లిస్తానన్నాడు. అయితే, ఒక సులభ వాయిదా సొమ్ము ఎంత? 
జవాబు:  రూ.2000
వివరణ:  దత్తాంశం ఆధారంగా 
  సులభ వాయిదా సొమ్ము 'x' అనుకుంటే

 = రూ. (3880 - 1000)
= రూ.2,880 
 x = రూ.2,880 ×   x = రూ.2,000

 


7. మూడు సంవత్సరాల కిందట 960 గా ఉన్న ఒక సంఘంలోని సభ్యుల సంఖ్య 1875 కు చేరింది. ఎంత శాతం వార్షిక రేటుతో ఇది సాధ్యమైంది? 
జవాబు:   25
వివరణ:  దత్తాంశం ఆధారంగా 
వడ్డీరేటు =

= 25%

 


8. ఒక రైతు బ్యాంకు నుంచి కొంత సొమ్మును అప్పుగా తెచ్చాడు. దాన్ని సంవత్సరానికి రూ.121 చొప్పున రెండు సంవత్సరాల్లో తిరిగి చెల్లించాడు. బ్యాంకు చక్రవడ్డీ రేటు 10 శాతం అయితే, అతడు బ్యాంకు నుంచి అప్పు తీసుకున్న సొమ్ము ఎంత?
జవాబు:  రూ.210
వివరణ:   దత్తాంశం ఆధారంగా

= రూ. (110 + 100) = రూ.210

 


9. కొంత సొమ్ముపై 2 సంవత్సరాలకు చక్రవడ్డీ ప్రకారం అయ్యే మొత్తం రూ.121. అదే సొమ్ముపై అంతే కాలానికి బారువడ్డీ ప్రకారం అయ్యే మొత్తం రూ.120. అయితే 3 సంవత్సరాలకు అంతే సొమ్ముపై చక్రవడ్డీ, బారువడ్డీల మధ్య తేడా ఎంత?
జవాబు: రూ.3.10
వివరణ:  2 సంవత్సరాల్లో వడ్డీల్లో తేడా రూ.1 అయితే అసలు రూ.100. 
బారువడ్డీ =  = 10 
బారువడ్డీతో మొత్తం = (120 +10)రూ.= రూ.130 
చక్రవడ్డీతో మొత్తం = 
= 121 ×  = రూ.133.10 
తేడా = రూ.(133.10 - 130) = రూ.3.10

 


10. రూ.1250 లకు 2 సంవత్సరాల్లో ఎంత వార్షిక రేటుతో చక్రవడ్డీ, బారువడ్డీల మధ్య వ్యత్యాసం రూ.4.50 అవుతుంది?
జవాబు: 6%
వివరణ:  దత్తాంశం ఆధారంగా 
వడ్డీరేటు =

= 6%



11. ఎంత సొమ్ముపై 16 శాతం వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకు చక్రవడ్డీ, బారువడ్డీల మధ్య తేడా రూ.32 అవుతుంది?
జవాబు:  రూ.1250
వివరణ:  దత్తాంశం ఆధారంగా

 = రూ.1250

 


12. చక్రవడ్డీ ప్రకారం రూ.11,000 లకు 5 శాతం రేటుతో 2 సంవత్సరాలకు ఒకసారి తిరిగి లెక్కిస్తే, 4 సంవత్సరాలకు అయ్యే వడ్డీ ఎంత?
జవాబు:  రూ.2,310
వివరణ:  దత్తాంశం ఆధారంగా
అసలు = రూ.11,000.
వడ్డీరేటు = 5 × 2 = 10%. 
కాలం = = 2 

చక్రవడ్డీ  
 = రూ.2310

 


13. కొంత సొమ్ముకు 2 సంవత్సరాల్లో 4 శాతం రేటుతో అయ్యే సాధారణ వడ్డీ రూ.80. అయితే, అదే సొమ్ముపై అంతే కాలానికి ఆ రేటు ప్రకారం అయ్యే చక్రవడ్డీ ఎంత? 
జవాబు:   రూ.81.60
వివరణ: దత్తాంశం ఆధారంగా 

 అసలు = 

 = రూ.1,000

             = రూ.81.60



14. చక్రవడ్డీ ప్రకారం, 6 సంవత్సరాల్లో మొత్తం అసలుకు రెట్టింపైతే, ఎన్ని సంవత్సరాల్లో మొత్తం అసలుకు 4 రెట్లవుతుంది?
జవాబు:  12
వివరణ: దత్తాంశం ఆధారంగా

లెక్కప్రకారం 12 సంవత్సరాలకు 4 రెట్లవుతుంది
 


15. ఒక మొక్క 48 సెం.మీ. ఎత్తు పెరిగింది. దీని పెరుగుదల ప్రతి సంవత్సరం దాని ఎత్తు కంటే 1/4 వంతు పెరుగుతూ ఉంది. అయితే, 2 సంవత్సరాల తర్వాత ఆ మొక్క ఎంత ఎత్తు పెరుగుతుంది?
జవాబు:  75 సెం.మీ.
వివరణ: దత్తాంశం ఆధారంగా 
     వంతు అంటే   × 100 = 25%
 2 సంవత్సరాల తర్వాత మొక్క పెరిగిన మొత్తం 
పొడవు   
= 48 × 

 ×     = 75 సెం.మీ.

Posted Date : 13-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌