• facebook
  • whatsapp
  • telegram

కాలం - దూరం

     (i) దూరం = కాలం × వేగం
     (ii) వేగం =      (iii) కాలం = 
* వేగం రెండు రకాలు. 1) కి.మీ/ గంట.
                      2) మీ./ సెకన్ 
* కి.మీ./గంటను మీ./సె.లోకి మార్చాలంటే   తో గుణించాలి.
* మీ./సెకన్లను కి.మీ./గంటలోకి మార్చాలంటే  తో గుణించాలి.

 

సగటు వేగం:  
(i) రెండు సమాన భాగాలకు

మాదిరి ప్రశ్నలు 

1. 90 కి.మీ./గంట వేగం మీ./సె.లో ఎంత?
    ఎ) 20 మీ./సె.        బి) 25 మీ./సె.       సి) 28 మీ./సె.        డి) 30 మీ./సె.
సాధన: 90 × 

 = 25 మీ./సె.
జవాబు: బి
 

2. ఒక వ్యక్తి 200 మీ. దూరాన్ని 24 సెకన్లలో పరిగెడితే అతడి వేగం కి.మీ./గంటలో ఎంత? 
   ఎ) 20 కి.మీ./గంట       బి) 24 కి.మీ./గంట      సి) 28 కి.మీ./గంట       డి) 30 కి.మీ./గంట
సాధన: వేగం =  = 30 కి.మీ./గంట
జవాబు: డి

 

3. ఒక వ్యక్తి 750 మీ. దూరాన్ని 2 ని.ల 30 సెకన్లలో చేరుకుంటే అతడి వేగం కి.మీ./గంటలో ఎంత?
     ఎ) 15 కి.మీ./గంట      బి) 18 కి.మీ./గంట     సి) 21 కి.మీ./గంట      డి) 24 కి.మీ./గంట
సాధన: కాలం నిమిషాల్లో ఉంటే సెకన్లలోకి మార్చాలి. 2 ని.ల 30 సె. అంటే 150 సెకన్లు

జవాబు: బి

4. ఒక వ్యక్తి గంటకు 5 కి.మీ. వేగంతో 15 నిమిషాల్లో ఒక బ్రిడ్జిని దాటితే బ్రిడ్జి పొడవు మీటర్లలో ఎంత?
     ఎ) 600          బి) 700          సి) 1000          డి) 1250
సాధన: దూరం = కాలం × వేగం
              = 15 × 60 × 5 ×  
              = 1250 మీటర్లు
జవాబు: డి

 

5. 25 మీ. భుజం ఉన్న చతురస్రాకార ప్రదేశం చుట్టూ ఒక బాలుడు 9 కి.మీ./గంట వేగంతో పరిగెత్తడానికి పట్టే కాలం ఎంత?
     ఎ) 25 సెకన్లు         బి) 26 సెకన్లు         సి) 27 సెకన్లు         డి) 40 సెకన్లు
సాధన: దూరం = 4 × 25 = 100 మీ.

జవాబు: డి

6. ఒక బాలుడు ఇంటి నుంచి బడికి 3 కి.మీ./గంట వేగంతో వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో ఇంటికి 2 కి.మీ./గంట వేగంతో వచ్చాడు. బడికి వెళ్లి రావడానికి అతనికి 5 గం. పడితే బడికి, ఇంటికి మధ్య దూరం ఎంత?
   ఎ) 5 కి.మీ.        బి) 5.5 కి.మీ.        సి) 6 కి.మీ.        డి) 6.5 కి.మీ.

 జవాబు: సి

 

7. ఒక బాలుడు ఇంటి నుంచి పాఠశాలకు గంటకు 20 కి.మీ. వేగంతో వెళ్తే 15 ని. ఆలస్యంగా చేరతాడు. కానీ గంటకు 30 కి.మీ. వేగంతో వెళ్తే 15 ని. ముందుగా చేరతాడు. అయితే ఇంటి నుంచి పాఠశాల ఎంత దూరంలో ఉంది?
     ఎ) 25 కి.మీ.        బి) 30 కి.మీ.        సి) 35 కి.మీ.        డి) 40 కి.మీ.

జవాబు: బి
 

8. ఒక వ్యవసాయదారుడు 61 కి.మీ. దూరం 9 గంటల్లో ప్రయాణించాడు. అందులో కొంత దూరాన్ని 4 కి.మీ./గం.వేగంతో కాలినడకన, మిగిలిన దూరాన్ని సైకిల్‌పై గంటకు 9 కి.మీ. వేగంతో ప్రయాణించాడు. అయితే కాలినడకన ఎంత దూరం ప్రయాణించాడు?
     ఎ) 14 కి.మీ.         బి) 15 కి.మీ.        సి) 16 కి.మీ.         డి) 17 కి.మీ.


జవాబు: సి

 

9. ఒక వ్యక్తి 10 గంటలు ప్రయాణించాడు. అందులో సగ భాగాన్ని గంటకు 21 కి.మీ. వేగంతో, మిగిలిన సగ భాగాన్ని గంటకు 24 కి.మీ. వేగంతో ప్రయాణిస్తే మొత్తం ప్రయాణించిన దూరం ఎంత?
     ఎ) 220 కి.మీ.        బి) 224 కి.మీ.        సి) 230 కి.మీ.        డి) 234 కి.మీ.

 

జవాబు: బి
 

10. ఒక బస్సు ఎక్కడా ఆగకుండా ప్రయాణిస్తే గంటకు 54 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది. అదే బస్సు స్టేషన్‌లలో ఆగుతూ ప్రయాణిస్తే గంటకు 45 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది. అయితే బస్సు స్టేషన్‌లలో ఎంత సమయం ఆగుతుంది?
    ఎ) 9 ని.         బి) 10 ని.        సి) 12 ని.        డి) 20 ని.
సాధన: స్టేషన్‌లలో ఆగడం వల్ల 9 కి.మీ. తక్కువ నడిచింది.
9 కి.మీ.లకు ప్రయాణ సమయం
  × 60 = 10 ని.
జవాబు: బి

 

11. ఒక దొంగ 2 : 30 PM కు ఒక కారును దొంగిలించి గంటకు 60 కి.మీ. వేగంతో ప్రయాణించాడు. 3.00 PM కి దొంగతనం గురించి తెలుసుకున్న పోలీస్ గంటకు 75 కి.మీ. వేగంతో ప్రయాణించాడు. దొంగ దొరికినప్పుడు సమయం? 
     ఎ) 4 : 30 PM         బి) 4 : 45 PM        సి) 5 PM        డి) 5 : 15 PM
సాధన: 2 : 30 PM కు x గం. తర్వాత దొంగ దొరికాడు అనుకుంటే x గం.లలో దొంగ వెళ్లిన దూరం

జవాబు: సి
 

12. A, B అనే రెండు పట్టణాల మధ్య దూరం 330 కి.మీ. ఒక వ్యక్తి 8 AM కు A నుంచి బయలుదేరి గంటకు 60 కి.మీ. వేగంతో B వైపు వెళ్లాడు. మరో వ్యక్తి 9 AM కు B నుంచి బయలుదేరి గంటకు 75 కి.మీ. వేగంతో A వైపు వెళ్లాడు. అయితే ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నప్పుడు సమయం ఎంత?
     ఎ) 10 AM         బి) 10 : 30 AM         సి) 11 AM         డి) 11 : 30 AM
సాధన: 8 AM కు x గం. తర్వాత వారు కలిశారు అనుకుంటే మొదటి వ్యక్తి x గం.లలో వెళ్లిన దూరం
+ రెండో వ్యక్తి (x - 1) గం.లలో వెళ్లిన దూరం = మొత్తం దూరం.
        60x + 75 (x - 1) = 330
        60x + 75x - 75 = 330
        135x = 330 + 75

 
∴  8 + 3 = 11 AM కు కలుస్తారు.                  

జవాబు: సి
 

13. రెండు బస్సుల్లో మొదటిది 300 కి.మీ. దూరాన్ని 7 1/2 గం.లలో, రెండో బస్సు 450 కి.మీ. దూరాన్ని 9 గంటల్లో ప్రయాణిస్తే వాటి వేగాల మధ్య నిష్పత్తి?
     ఎ) 2 : 3         బి) 3 : 4         సి) 4 : 5         డి) 8 : 9

జవాబు: సి

 

14. ఒక బాలుడు తన ఇంటి నుంచి పాఠశాలకు గంటకు 2 1/2 కి.మీ. వేగంతో ప్రయాణిస్తే పాఠశాలకు 6 నిమిషాలు ఆలస్యంగా వెళ్లాడు. మరుసటి రోజు తన వేగాన్ని గంటకు 1 కి.మీ. పెంచితే 6 నిమిషాలు ముందుగా చేరాడు. అయితే ఇంటి నుంచి పాఠశాల ఎంత దూరంలో ఉంది?
    ఎ) 1 కి.మీ.        బి) 1 1/2 కి.మీ.       సి) 1 3/4 కి.మీ.        డి) 2 కి.మీ.
జవాబు: సి

15. ఒక వ్యక్తి తన ఇంటి నుంచి ఆఫీస్‌కు గంటకు 25 కి.మీ. వేగంతో వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో గంటకు 4 కి.మీ. వేగంతో ప్రయాణిస్తే ఇంటికి చేరడానికి 5 గంటల 48 నిమిషాలు పట్టింది. అయితే ఇంటి నుంచి ఆఫీస్ ఎంత దూరంలో ఉంది?
       ఎ) 18 కి.మీ.        బి) 20 కి.మీ.       సి) 25 కి.మీ.        డి) 30 కి.మీ.
జవాబు: బి

 

16. A, B కంటే ఎక్కువ వేగంగా వెళ్లగలడు. వారిద్దరూ 24 కి.మీ. నడిచారు. వారి వేగాల మొత్తం 7 Kmph. వారికి పట్టిన కాలాల మొత్తం 14 గం. అయితే A వేగం?
     ఎ) 3 Kmph        బి) 4 Kmph       సి) 5 Kmph        డి) 7 Kmph
జవాబు: బి

 

17. ఒక వ్యక్తి కారులో 6 గంటలు ప్రయాణించాడు. అందులో సగం దూరాన్ని గంటకు 10 కి.మీ. వేగంతో, మిగిలిన సగం దూరాన్ని గంటకు 20 కి.మీ. వేగంతో ప్రయాణిస్తే మొత్తం ప్రయాణించిన దూరం ఎంత?
    ఎ) 90 కి.మీ.        బి) 80 కి.మీ.       సి) 60 కి.మీ.        డి) ఏదీకాదు
జవాబు: బి

మాదిరి సమస్యలు

1. ఒక రైలు వేగం 63 కి.మీ./ గం. అయితే దాని వేగం మీ./సె.లలో ఎంత?

1) 35                  2)                    3) 40                  4) 20 

సాధన:

సమాధానం: 2

2. ఒక కారు 5 సెకన్లలో 45 మీటర్ల దూరం ప్రయాణించింది. అయితే దాని వేగం ఎంత? (కి.మీ./గం.లలో) ప్రయాణించిన దూరం

1) 36                       2) 45                      3) 54                    4) 56

సాధన:

సమాధానం: 3

3. 100 మీ. పొడవున్న రైలు 40 కి.మీ./గం. వేగంతో ప్రయాణిస్తుంది. అయితే అది విద్యుత్‌ సం్తభాన్ని దాటడానికి పట్టే సమయం ఎంత? (సెకన్లలో)

1) 15                  2) 12                   3) 10                 4) 9

సాధన:

సమాధానం: 4

4. ఒక రైలు 90 కి.మీ./గం. వేగంతో ప్రయాణిస్తూ, విద్యుత్‌ స్తంభాన్ని 20 సెకన్లలో దాటింది. అయితే  ఆ రైలు పొడవు ఎంత? (మీటర్లలో) 

1) 500              2) 450            3) 400           4) 350

సాధన:

సమాధానం: 1

5. ఒక విద్యార్థి తన ఇంటి నుంచి పాఠశాలకు వెళ్లేటప్పుడు 3 కి.మీ./గం. వేగంతో, పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు 2 కి.మీ./గం. వేగంతో నడిచాడు. అతడి మొత్తం ప్రయాణకాలం 5 గంటలు అయితే విద్యార్థి ఇంటి నుంచి పాఠశాలకు ఉన్న దూరం ఎంత?

1) 6                 2) 5                   3) 4               4) 3

సాధన:

సమాధానం: 1

6. రోహిత్‌ విజయవాడ నుంచి విశాఖపట్నానికి, అదే సమయంలో గణేష్‌ విశాఖపట్నం నుంచి విజయవాడకు ఒకేసారి ప్రయాణించడం ప్రారంభించారు. వారిద్దరూ ఒకరినొకరు అతిక్రమించాక మిగిలిన దూరాన్ని వరుసగా     గం., 9 గం. ప్రయాణించారు. రోహిత్‌ వేగం 36 కి.మీ./గం. అయితే గణేష్‌ ప్రయాణ వేగం ఎంత? (కి.మీ./గం.లలో)

1) 24                    2) 28                   3) 45                  4) 42

సాధన: 

సమాధానం: 2

7. 120 మీ. పొడవున్న ఒక రైలు 90 కి.మీ./గం. వేగంతో ప్రయాణిస్తూ 230 మీ. పొడవున్న ప్లాట్‌ఫాంను దాటడానికి పట్టేకాలం ఎంత? (సెకన్లలో)

1) 12                 2) 13               3) 14             4) 15

సాధన:

సమాధానం: 3

8. ఒక కారు తన ప్రయాణంలో మొదటి 30 కి.మీ.ల దూరాన్ని 45 నిమిషాల్లో, మిగిలిన 25 కి.మీ.ల దూరాన్ని 35 నిమిషాల్లో ప్రయాణించింది. అయితే ఆ కారు సగటు ప్రయాణ వేగం ఎంత? (కి.మీ/గం.లలో) 

సాధన:

సమాధానం: 4

రచయిత

సీహెచ్‌. రాధాకృష్ణ

విషయ నిపుణులు ​​​​​​​

Posted Date : 05-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌