• facebook
  • whatsapp
  • telegram

కాలం - పని

1. ఒక పనిని 76 మంది కూలీలు 33 రోజుల్లో పూర్తిచేస్తారు. పని ప్రారంభ సమయంలో కొంతమంది కూలీలు పనికి రాలేదు. మిగిలినవారు ఆ పనిని 44 రోజుల్లో పూర్తిచేశారు. అయితే పని చేయని కూలీలు ఎంతమంది?

1) 17     2) 18   3) 19    4) 20

సాధన: 76 మంది కూలీలు పనిచేసేందుకు పట్టిన రోజులు = 33

పనిచేయడానికి రాని కూలీల సంఖ్య = x అనుకోండి.

(76 − x) కూలీలు అదే పనిచేయడానికి పట్టే రోజులు = 44

76 × 33 = (76 − x) × 44

⇒ 57 = 76 − x 

⇒ x = 76 − 57 = 19 మంది

సమాధానం: 3

2. కొంతమంది కూలీలు ఒక పనిని 45 రోజుల్లో పూర్తి చేస్తారు. ఆరుగురు వ్యక్తుల్ని అదనంగా పనిలోకి తీసుకుని 9 రోజుల ముందే ఆ పనిని పూర్తి చేశారు. అయితే పని ప్రారంభంలో ఉన్న కూలీల సంఖ్య ఎంత?

1) 24      2) 28      3) 32     4) 48

సాధన: పని ప్రారంభంలో ఉన్న కూలీల సంఖ్య = x అనుకోండి.

x మంది కూలీలు పని పూర్తి చేయడానికి పట్టే రోజులు = 45

x + 6 మంది కూలీలు అదే పనిని పూర్తిచేయడానికి పట్టే రోజులు = 45 - 9 = 36

⇒ x × 45 = (x + 6) × 36

⇒ 5x = (x + 6) × 4 = 4x + 24

⇒ 5x − 4x = 24

⇒ x = 24 మంది

ప్రారంభంలో ఉన్న కూలీల సంఖ్య x = 24 మంది

సమాధానం: 1

3. A ఒక పనిని 4 రోజుల్లో పూర్తిచేస్తాడు. B అదేపనిని 6 రోజుల్లో పూర్తి చేస్తాడు. C, A కంటే 1 1/2 రెట్ల వేగంతో పనిచేస్తాడు. ముగ్గురూ కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తిచేస్తారు?

     

సమాధానం: 

4. రెండు పైపులు ఒక తొట్టెని 6 నిమిషాల్లో నింపుతాయి. వాటిలో ఒక పైపు విడిగా రెండోదాని కంటే 5 నిమిషాలు ఎక్కువ సమయాన్ని తీసుకుని నింపుతుంది. అయితే వేగంగా నింపే పైపు విడిగా ఆ తొట్టెను ఎన్ని నిమిషాల్లో నింపుతుంది?

1) 8 ని.     2) 10 ని.   3) 15 ని.     4) 12 ని.

సాధన: వేగంగా నింపే పైపు తొట్టెను విడిగా నింపడానికి పట్టే కాలం = x అనుకోండి. 

మరోపైపు తొట్టెను నింపడానికి పట్టే కాలం  = x + 5

రెండు పైపులు ఆ తొట్టెను నింపేందుకు పట్టే కాలం = 6 ని.

⇒ x 2 − 7x − 30 = 0

⇒ (x − 10)(x + 3) = 0

x = 10 ని.

సమాధానం: 2

5.  A, B పైపులు ఒక తొట్టెని వరుసగా 4 గంటలు, 5 గంటల్లో విడివిడిగా నింపుతాయి. తొట్టెకి ఉన్న C పైపు దాన్ని 6 గంటల్లో ఖాళీ చేస్తుంది. మూడింటినీ ఒకేసారి తెరిచి, 3 గంటల తర్వాత C ని మూసేస్తే, తొట్టె నిండటానికి ఎంత సమయం పడుతుంది?

6. ఒక పని చేయడానికి A అనే వ్యక్తి B కంటే మూడు రెట్ల సమయాన్ని, C కంటే రెట్టింపు సమయాన్ని తీసుకున్నాడు. ముగ్గురూ కలిసి ఆ పనిని 1 రోజులో పూర్తిచేశారు. అయితే A ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు?

1) 3    2) 4    3) 5    4) 6

సాధన: A, B లు ఒక పని విడివిడిగా చేయడానికి పట్టే రోజుల నిష్పత్తి = 3 : 1

             A, C లు అదే పని విడివిడిగా చేయడానికి పట్టే రోజుల నిష్పత్తి 2 : 1

            A, B, C లు అదే పని విడివిడిగా చేయడానికి పట్టే రోజుల నిష్పత్తి 6 : 2 : 3   A, B, C లు ఆ పని చేయడానికి పట్టే రోజులు = 1

 
⇒ x = 1
 

A ‘1’  రోజులో  చేసే పని = 1/6


A ఆ పని పూర్తి చేయడానికి పట్టే రోజులు 

= 6   

సమాధానం: 4

7. ఒక పనిని 12 మంది కూలీలు 8 రోజుల్లో పూర్తి చేస్తారు. పని ప్రారంభించిన 3 రోజుల తర్వాత ముగ్గురు కూలీలను పనిలోకి అదనంగా తీసుకున్నారు. అయితే మిగిలిన పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది?

1) 6    2) 5    3) 4    4) 3

సాధన: 12 × 8 = (12 × 3) + (15 × x)

              ⇒ 96 = 36 + 15x

               ⇒ 96 − 36 = 15x ⇒ 15x = 60

        

సమాధానం: 3

8. 12 మంది కూలీలు 12 రోజుల్లో ఒక పని పూర్తి చేస్తారు. పని ప్రారంభించిన 6 రోజుల తర్వాత ముగ్గురు కూలీలు పని నుంచి బయటకు వచ్చారు. అయితే మిగిలిన పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది?

1) 8   2) 6   3) 9   4) 12

సాధన: 12 × 12 = 12 × 6 + 9 × x

          ⇒ 144 = 72 + 9x

         ⇒ 144 − 72 = 9x ⇒ 9x = 72

సమాధానం: 1

9. (x − 1) మంది కూలీలు (x + 1) రోజుల్లో చేసిన పనికి, (x + 2) మంది కూలీలు  (x − 1)రోజుల్లో చేసిన పనికి మధ్యగల నిష్పత్తి 9 : 10. అయితే X = ... 

1) 6    2) 7    3) 8    4) 9

సాధన: (x − 1) (x + 1) : (x + 2) (x − 1) = 9 : 10

             ⇒ (x + 1) : (x + 2) = 9 : 10

             ⇒ 10(x + 1) = 9(x + 2)

             ⇒ 10x + 10 = 9x + 18

             ⇒ x = 18 − 10 = 8

సమాధానం: 3

10. కొంతమంది కూలీలు ఒక పనిని 100 రోజుల్లో పూర్తి చేస్తారు. వారిలో 10 మంది తగ్గితే, ఆ పనిని పూర్తిచేయడానికి 10 రోజులు ఎక్కువ సమయం పడుతుంది. అయితే పని ప్రారంభంలో ఉన్న కూలీలు ఎంతమంది?

1) 50   2) 60   3) 80  4) 110

సాధన: ప్రారంభంలో ఉన్న కూలీల సంఖ్య 

           = x అనుకోండి.

        లెక్కప్రకారం,x × 100 = (x − 10) (100 + 10)

          ⇒ x × 100 = (x − 10)110

         ⇒ 100x = 110x − 1100

          ⇒ 10x = 1100

         ⇒ x = 110 మంది

సమాధానం: 4

11. 30 మంది కూలీలు ఒక పని చేయడానికి పట్టిన రోజులు, 40 మంది కూలీలు అదే పని చేయడానికి పట్టిన రోజుల కంటే 6 రోజులు ఎక్కువ. అయితే అదే పనిని 60 మంది కూలీలు ఎన్ని రోజుల్లో పూర్తిచేస్తారు?

1) 12   2) 15   3) 16   4) 9

సాధన: 40 మంది కూలీలు పని చేయడానికి పట్టిన రోజులు = x అనుకుంటే, 

30 మంది కూలీలు అదే పని చేయడానికి పట్టిన రోజులు = x + 6 

   40 × x = 30(x + 6) ⇒ 40x = 30x + 180

   ⇒ 10x = 180 ⇒ x = 18 రోజులు

60 మంది కూలీలు ఆ పని చేయడానికి పట్టిన రోజులు = y అయితే

     40 × x = 60 × y

⇒ 40 × 18 = 60 × y

సమాధానం: 1

12. A,B కలిసి ఒక పనిని 12 రోజుల్లో; B, C కలిసి అదే పనిని 15 రోజుల్లో; C, A కలిసి అదే పనిని 20 రోజుల్లో పూర్తి చేస్తారు. అయితే A ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తిచేస్తాడు?

1) 24      2) 26   3) 28      4) 30

సాధన: (A + B) + (B + C) + (C + A) ఒక రోజులో చేసే పని

A ఒక్కడే ఆ పనిని పూర్తిచేయడానికి పట్టే రోజులు = 30

సమాధానం: 4


* A, B లు ఒక పనిని 8 రోజుల్లో; B, C లు కలిసి అదే పనిని 12 రోజుల్లో; A, B, C లు కలిసి దాన్నే 6 రోజుల్లో పూర్తిచేస్తారు. అయితే అదే పనిని A, C లు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తిచేస్తారు?

1) 10       2) 12     3) 16       4) 8

సాధన: (A + B) + (B + C) + (C + A) ఒక రోజులో చేసే పని 

= 2(A + B + C) ఒక రోజులో చేసే పని

⇒ (A + C) ఒక రోజులో చేసే పని 


A, C లు కలిసి ఆ పని చేయడానికి పట్టే రోజులు = 8

సమాధానం: 4

Posted Date : 15-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌