• facebook
  • whatsapp
  • telegram

డిస్కౌంట్‌

అందరికీ లాభం తెచ్చే అమ్మకాల వ్యూహం!


   సగం ధరకే చీరలు, మొబైల్‌పై ముఫ్పైశాతం రాయితీ, పండగ ప్రత్యేకం డిస్కౌంట్‌ సేల్స్‌ అంటూ రకరకాల ప్రకటనలు తరచూ కనిపిస్తుంటాయి. అమ్మకాలు పెంచుకోడానికి, కొనుగోలుదారులను ఆకర్షించడానికి వివిధ సంస్థల వాళ్లు, వ్యాపారులు ఇలాంటి ప్రయోగాలు చేస్తుంటారు. అవన్నీ అటు విక్రేతకు, ఇటు వినియోగదారుడికి లాభం చేకూర్చే విక్రయ వ్యూహాలు. నిత్యజీవితంలో అందరూ చేసే అంకగణిత లెక్కలు. అభ్యర్థుల్లోని విశ్లేషణాత్మక సామర్థ్యాన్ని పరిశీలించే లక్ష్యంతో పోటీ పరీక్షల్లో వాటిపై ప్రశ్నలు అడుగుతుంటారు. 


  డిస్కౌంట్‌ (తగ్గింపు ధర): డిస్కౌంట్‌ అనేది వినియోగదారుల లావాదేవీల్లో గుర్తించే ఉత్పత్తుల్లో ఒక రకమైన ధర. ఇక్కడ అమ్మకందారులు అమ్మకాలను పెంచడానికి వివిధ ఉత్పత్తులపై రాయితీల శాతాన్ని ప్రతిపాదిస్తారు. కొనుగోలుదారుకు విక్రేత అందించే ఆ రాయితీని డిస్కౌంట్‌ అంటారు. విక్రయ ధరను పరిగణనలోకి తీసుకునేటప్పుడు డిస్కౌంట్‌ను ఎల్లప్పుడూ ప్రకటన ధర (Marked Price)పై లెక్కిస్తారు. 


డిస్కౌంట్‌ = ప్రకటన ధర  అమ్మకపు ధర 


 

వరుస తగ్గింపులు 9Successibe Diaounts): ఒకదాని తర్వాత ఒకటి లేదా రెండు లేదా అంతకంటే ఎక్కువ డిస్కౌంట్లను వరుస తగ్గింపులు అంటారు. వాటిని డిస్కౌంట్‌లు అని పిలుస్తారు.


ఉదా: ఒక వస్తువుపై 15%, 12% రెండు వరుస తగ్గింపులకు సమానమైన ఒకే డిస్కౌంట్‌ను కనుక్కోండి.


వివరణ: వస్తువు ధర రూ.1000 అనుకుంటే 



మాదిరి ప్రశ్నలు

1. ఒక వస్తువు ప్రకటిత వెల రూ.400, అమ్మిన వెల రూ.360 అయితే తగ్గింపు ధర శాతం ఎంత?

వివరణ: ప్రకటిత వెల = రూ.400


జ: 3

2. దుకాణదారుడు ఒక వస్తువు కొన్నవెల మీద 20% ఎక్కువగా ప్రకటించి 5% డిస్కౌంట్‌ ప్రకటించాడు. అయితే అతడు పొందిన లాభశాతం ఎంత?

1) 15%   2) 18%   3) 14%   4) 16%

వివరణ: వస్తువు కొన్నవెల మీద 20% ఎక్కువగా ప్రకటిస్తే అప్పుడు ఆ ప్రకటన ధర 120% అవుతుంది.

జ: 3


3. ఒక వ్యక్తి రూ.21 కు ఒక వస్తువును 30% డిస్కౌంట్‌తో కొన్నాడు. అయితే ఆ వస్తువు ప్రకటన ధర ఎంత?

1) రూ.30      2) రూ.6.30      3) రూ.14.70   4) రూ.70

వివరణ: 30% డిస్కౌంట్‌తో వస్తువును కొన్నాడు అంటే దాన్ని 70% కి కొంటాడు. అప్పుడు ఆ వస్తువు ప్రకటన ధర 100% అవుతుంది.

జ: 1


4. ఒక వస్తువు ప్రకటన ధర రూ.1050. కొనుగోలుదారుడు దానికోసం రెండు వరుస తగ్గింపులతో రూ.798 చెల్లించాడు. మొదటి తగ్గింపు రేటు 20% అయితే రెండో తగ్గింపు రేటు ఎంత?

1) 5%     2) 8%     3) 6%     4) 10%

వివరణ: మొదటి తగ్గింపు ధర = 1050 - 20%

జ: 1


5. ఒక పుస్తకం ప్రకటన ధరపై 30% తర్వాత 20%; 40% ఆ తర్వాత 25% తగ్గింపుల మధ్య వ్యత్యాసం రూ.33. అయితే ఆ పుస్తకం ప్రకటన ధర ఎంత?

1) రూ.400       2) రూ.150        3) రూ.200     4) రూ.300

వివరణ: ప్రకటన ధర x అనుకుంటే 

జ: 4


6. ఒక వస్తువు ప్రకటన వెల తి, తీ దుకాణాల్లో ఒకేలా ఉంది. కానీ తి దుకాణం యజమాని ఆ వస్తువు మీద రెండు వరుస తగ్గింపులు 2%, 8% ఇచ్చాడు. తీ దుకాణం యజమాని అదే వస్తువు మీద రెండు వరుస తగ్గింపులు 3%, 7% ఇచ్చాడు. అయితే ఆ కొనుగోలుదారుడు ఏ దుకాణం నుంచి ఆ వస్తువును కొనుగోలు చేస్తాడు?

1) A దుకాణం        2) B దుకాణం  

3) ఏదో ఒక దుకాణం       4) సమాచారం సరిపోదు

వివరణ: a దుకాణం వద్ద వరుస తగ్గింపు విలువ =

B దుకాణం వద్ద వరుస తగ్గింపు విలువ =

A. దుకాణం వద్ద తగ్గింపు విలువ ఎక్కువ కాబట్టి ఆ కొనుగోలుదారుడు A దుకాణాన్ని మాత్రమే ఎంపిక చేసుకుంటాడు. 

జ: 1


గమనిక: రెండు సందర్భాల్లోనూ డిస్కౌంట్‌ రేట్ల మొత్తం ఒకేలా ఉంది. అయితే కొనుగోలుదారుడు డిస్కౌంట్‌ రేట్లు ఎక్కువగా ఉన్న షాపు నుంచి మాత్రమే కొనుగోలు చేస్తాడు.


7. దుకాణదారుడు ఒక వస్తువు కొన్న ధర మీద 20% ఎక్కువగా ప్రకటించి 10% డిస్కౌంట్‌ ఇచ్చాడు. అయితే అతడు పొందిన లాభశాతం ఎంత?

1) 5%       2) 6%        3) 8%       4) 10%

వివరణ: వస్తువు కొన్నధర = రూ.100 అనుకుంటే

ప్రకటన వెల = 20% ్ఘ 100% = 120%

జ: 3


8. రూ.2000 విలువ కలిగిన ఒక వస్తువుపై 30% డిస్కౌంట్‌కు; 15%, 15% రెండు వరుస డిస్కౌంట్‌లకు మధ్య తేడా ఎంత?

1) రూ.0   2) రూ.10   3) రూ.45   4) రూ.150

వివరణ: రూ.2000 విలువ కలిగిన వస్తువుకు 30% డిస్కౌంట్‌ = 2000  x = రూ.600

మొదటి డిస్కౌంట్‌ = 2000 x 15% = రూ.300

మొదటి డిస్కౌంట్‌ తర్వాత = 2000 - 300 = రూ.1700

రెండో డిస్కౌంట్‌ = 1700 x 15% = రూ.255

డిస్కౌంట్‌ల మధ్య భేదం = 600  (300 + 255) = రూ.45

జ: 3


9. ఒక వస్తువు ప్రకటన ధరపై 40% డిస్కౌంట్‌ను ప్రకటించిన తర్వాత 20% లాభం పొందడానికి ఆ వస్తువు ధరను ఎంత శాతం పెంచాలి?

వివరణ: డిస్కౌంట్‌ = 40%

జ: 4


రచయిత: దొర కంచుమర్తి
 

Posted Date : 26-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌