• facebook
  • whatsapp
  • telegram

సాధారణ వడ్డీ

లెక్క మొత్తం అసలుపైనే!


  ఆర్జించిన ఆదాయం నుంచి కొంత పొదుపు చేయడం, పెట్టుబడులు పెట్టడం, అవసరమైనప్పుడు అప్పు తీసుకోవడం, ఆ తర్వాత కొంత కాలానికి తిరిగి చెల్లించడం ఇవన్నీ అందరి జీవితాల్లో సహజంగా జరిగేవే. కానీ ఈ అన్నింటిలో ఉమ్మడిగా ఉండేది వడ్డీ. అసలు మొత్తంపై నిర్దేశిత కాలానికి, ప్రకటించిన వడ్డీ రేటు ప్రకారం ఎంత వస్తుందో లెక్కగడితే తేలేదే సరళవడ్డీ లేదా సాధారణ వడ్డీ. ఇందులో ఎంత కాలానికైనా వడ్డీని అసలు మీద మాత్రమే గణించడం గమనించాల్సిన అంశం.  


* కొంత కాలానికి అప్పు తెచ్చుకున్న సొమ్మును ‘అసలు’ అంటారు. 


* అప్పు తెచ్చుకున్న వ్యక్తి తాను తీసుకున్న సొమ్మును వాడుకున్నందుకుగాను అప్పు ఇచ్చిన వ్యక్తికి కొంత నగదు (అసలు కాకుండా)ను చెల్లిస్తాడు. దాన్నే ‘వడ్డీ’ అంటారు.


* ఈ విభాగంలో మనం వడ్డీ లెక్క కట్టడానికి సంబంధించిన అంశాల గురించి తెలుసుకుందాం. 


వడ్డీ రెండు రకాలు... అవి 


    1) బారువడ్డీ (సాధారణ వడ్డీ)


    2) చక్రవడ్డీ


బారువడ్డీ: ఎంతకాలానికైనా వడ్డీని అసలు పైన లెక్కగడితే ఆ వడ్డీని బారువడ్డీ అంటారు.


అసలు = P,  వడ్డీ = I,  వడ్డీ శాతం = R,  కాలం = T అయితే


మొత్తం = అసలు + వడ్డీ


మాదిరి ప్రశ్నలు


1. ఎ) రూ.5200 పై 6% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాల కాలానికి అయ్యే బారువడ్డీ ఎంత?

1) రూ.600                2) రూ.510 

3) రూ.320               4) రూ.624


వివరణ: అసలు = రూ.5200


జ: 4


బి) రూ.1600 పై 2 సంవత్సరాల 3 నెలలకు అయ్యే వడ్డీ రూ.252 అయితే వడ్డీరేటు ఎంత?


వివరణ: అసలు = రూ.1600


జ: 2


సి) రూ.18,440 అసలు మీద సంవత్సరానికి 15% వడ్డీరేటు చొప్పున 4 సంవత్సరాలకు అయ్యే వడ్డీ ఎంత?

1) రూ.11,064         2) రూ.12,250 

3) రూ.11,500         4) రూ.12,985


వివరణ: అసలు (P) = 18,440


జ: 1 


2. రాఘవి 3 సంవత్సరాల కాలానికి రూ.30,000 స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసింది. వడ్డీరేటు 12% చొప్పున త్రైమాసికానికి తన ఖాతాలో జమ అయితే, 44 నెలల తర్వాత సాధారణ వడ్డీ చొప్పున ఎంత మొత్తం లభిస్తుంది?

1) రూ.39,300         2) రూ.43,100 

3) రూ.43,200         4) రూ.44,100


వివరణ: ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసిన మొత్తం = రూ.30,000



జ: 3


3. A సంవత్సరానికి 24% సాధారణ వడ్డీరేటుతో రూ.1600 రుణం తీసుకున్నాడు. b ఏడాదికి 20% సాధారణ వడ్డీరేటుతో రూ.1820 రుణం తీసుకున్నాడు. వారి రుణ మొత్తాలు ఎన్ని సంవత్సరాల్లో సమానమవుతాయి (T1 = T2)?


వివరణ: Case -I: 

జ: 4


4. ఒక నిర్దిష్ట మొత్తం సాధారణ వడ్డీ మీద 4 సంవత్సరాల్లో రూ.19,200, ఆరు సంవత్సరాల్లో రూ.22,800 అయితే వడ్డీరేటు ఎంత?

1) 12%      2) 15%      3) 16%      4) 25%


వివరణ: 6 సంవత్సరాల్లో అయ్యే మొత్తం = 22,800


జ: 2


5. సాధారణ వడ్డీ అసలులో ౌ వ వంతు, వడ్డీరేటు కాలానికి సమానం. అయితే వడ్డీరేటు ఎంత?

1) 2.5%     2) 7.5%     3) 5%      4) ఏదీకాదు


వివరణ: అసలు = x అనుకుంటే


జ: 3


6. ఏ వార్షిక చెల్లింపు మీద 5% వడ్డీరేటు చొప్పున 4 సంవత్సరాల్లో రూ.6450 రుణం తీరుతుంది?

1) రూ.1100         2) రూ.1500 

3) రూ.2500         4) రూ.2600


వివరణ: వార్షిక చెల్లింపు = x  అనుకుంటే


జ: 2


7.రూ.15000 లను రెండు భాగాలుగా విభజించి, మొదటి భాగంపై సాధారణ వడ్డీ మూడు సంవత్సరాలకు 10% వడ్డీరేటు, రెండో భాగంపై 7.5% వడ్డీరేటు చొప్పున 6 సంవత్సరాలకు సాధారణ వడ్డీకి సమానం అయితే అధిక వడ్డీ రేటుతో అప్పుగా ఇచ్చిన మొత్తాన్ని కనుక్కోండి.

1) రూ.9000           2) రూ.8500 

 3) రూ.6000         4) ఏదీకాదు


వివరణ: రూ.15000 రెండు భాగాలు చేస్తే


జ: 3


8. స్వామి సాధారణ వడ్డీపై రాజేష్, అరవింద్, దొరలకు 2 : 5 : 3 నిష్పత్తిలో రూ.10000 అప్పుగా ఇచ్చాడు. వడ్డీరేట్లు 10%, 15%, 12% చొప్పున ముగ్గురూ మొదటి సంవత్సరం చివర్లో వడ్డీ చెల్లించారు. అయితే స్వామి పొందిన మొత్తం వడ్డీని గణించండి.

1) రూ.1210           2) రూ.1310    

3) రూ.1420            4) రూ.1520


వివరణ: అసలు = 10,000

ఆ ముగ్గురికి ఇచ్చిన నిష్పత్తి 2 : 5 : 3


జ: 2


రచయిత: దొర కంచుమర్తి

Posted Date : 03-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌