• facebook
  • whatsapp
  • telegram

దిశాజ్ఞాన పరీక్ష

వివిధ పోటీపరీక్షల్లో రీజనింగ్‌లో దిశాజ్ఞాన పరీక్ష (దిశలు) అంశం నుంచి ప్రశ్నలు వస్తుంటాయి. ఇవి సాధారణంగా అభ్యర్థి పరిశీలనా శక్తిని, దిశా నిర్ధారణ జ్ఞానాన్ని, వేగాన్ని అంచనా వేయడానికి ఉద్దేశించినవి. లంబ కోణ త్రిభుజం ఏర్పడినప్పుడు ఉపయోగించాల్సిన సూత్రం

 

దిక్కులు: దిక్కులు (లేదా) దిశలు 4. అవి: ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర.

మూలాలు: ఇవి 4. అవి: ఆగ్నేయం, నైరుతి, వాయవ్యం, ఈశాన్యం.

పోటీ పరీక్షల్లో ఈ అధ్యాయం నుంచి రెండు రకాల ప్రశ్నలు అడుగుతారు.

1. రెండు ప్రదేశాల మధ్య దూరం కనుక్కోవడం.

2. దిశలు కనుక్కోవడం

మాదిరి ప్రశ్నలు

1. హరి పడమర వైపు వెళ్తున్నాడు. అతడు 450 కోణంలో సవ్య దిశలో, తర్వాత అదే దిశలో 1800 కోణంలో ప్రయాణించాడు. మళ్లీ 2700 కోణంలో అపసవ్య దిశలో తిరిగాడు. అయితే ప్రస్తుతం హరి ఏ దిశలో ప్రయాణిస్తున్నాడు?

1) దక్షిణం     2) వాయవ్యం       3) పడమర      4) నైరుతి

          హరి ప్రథమంగా QA దిశలో ప్రయాణించాడు. సవ్యదిశలో 450 తిరిగినప్పుడు అతడు దిశలో వెళ్తున్నాడు. 180సవ్యదిశలో తిరిగినప్పుడు OB దిశలో ఉన్నాడు. చివరగా, అపసవ్య దిశలో 270ప్రయాణించినప్పుడు OD దిశలో వెళ్లాడు. అది ‘నైరుతి.’

సమాధానం: 4

 

2. చందు 7 కి.మీ. ఉత్తరంగా వెళ్లి, అక్కడి నుంచి ఎడమ వైపు తిరిగి మరో 4 కి.మీ. వెళ్లాడు. మళ్లీ 2 కి.మీ. దక్షిణ దిశగా ప్రయాణించాడు. అయితే చందు బయలుదేరిన స్థానం నుంచి ఏ దిశలో ఉన్నాడు? అతడు ప్రయాణించిన మొత్తం దూరం ఎంత?

1) ఆగ్నేయం, 12 కి.మీ.            2) వాయవ్యం, 14 కి.మీ.

3) ఆగ్నేయం, 13 కి.మీ.        4) వాయవ్యం, 13 కి.మీ.



పటం నుంచి, 7+ 4+ 2 = 13 కి.మీ. 

చందు ప్రయాణించిన మొత్తం దూరం = 13 కి.మీ., అతడు ప్రస్తుతం ‘వాయవ్య’ దిశలో ఉన్నాడు.

సమాధానం: 4
 



 

3. పవన్‌ తూర్పు వైపు 4 కి.మీ. నడిచాడు. అక్కడి నుంచి ఎడమకు 3 కి.మీ. వెళ్లాడు. అయితే బయలుదేరిన స్థానం నుంచి పవన్‌ ఎంత దూరంలో ఉన్నాడు?

1) 6 కి.మీ.   2) 8 కి.మీ.         3) 5 కి.మీ.        4) 4 కి.మీ.





 

4. లోహిత్‌ ఉత్తర దిశగా 10 కి.మీ. నడిచి, అక్కడి నుంచి 6 కి.మీ. దక్షిణంగా ప్రయాణించాడు. తర్వాత తూర్పు దిశగా 3 కి.మీ. నడిచాడు. ప్రారంభ స్థానం నుంచి అతడు ఏ దిశలో, ఎంత దూరంలో ఉన్నాడు?

1)తూర్పు, 8 కి.మీ.           2) నైరుతి, 5 కి.మీ.          3) ఈశాన్యం, 5 కి.మీ.            4)ఏదీకాదు






5. లాస్య ఒక దిశలో 6 కి.మీ. నడిచి, ఎడమవైపు తిరిగి మరో 8 కి.మీ. ప్రయాణించింది. అయితే ప్రస్తుతం ఆమె ఉన్న స్థానానికి, మొదట బయలుదేరిన స్థానానికి ఉన్న దూరం ఎంత?

1)14 కి.మీ.      2) 10 కి.మీ.           3) 15 కి.మీ.      4) 5 కి.మీ.

సాధన: ఒకవేళ ఆ అమ్మాయి తూర్పు దిక్కుకు ప్రయాణించింది అనుకుంటే, 




 

6. AB ఒక సరళరేఖ. ఒక పురుగు తి నుంచి బయలుదేరి ఊర్ధ్వ ముఖంగా 4 సెం.మీ. పైకి కదిలి, మళ్లీ కుడివైపు క్షితిజ సమాంతరంగా 3 సెం.మీ. ప్రయాణించింది. తర్వాత అది ఊర్ధ్వ ముఖంగా 2 సెం.మీ. పైకి వెళ్లి, కుడివైపు క్షితిజ సమాంతరంగా 2 సెం.మీ. కదిలి చివరగా అధోముఖంగా కిందికి నడిచి  B ని చేరింది. అయితే అది ప్రయాణించినప్పుడు ఏర్పడే పట వైశాల్యం ఎంత? (చదరపు సెం.మీ.లలో)

1) 24     2) 26       3) 39              4) 144

మొత్తం పటవైశాల్యం = AB X BC= 5 X 6 = 30 చ.సెం.మీ. 

కావాల్సిన వైశాల్యం = 30 -(3 X 2)   = 30  6 = 24 చ.సెం.మీ.

సమాధానం: 1



 

7. అమిత్‌ ఉత్తర దిశగా 40 మీ. వెళ్లి, అక్కడి నుంచి ఎడమవైపు తిరిగి 20 మీ. నడిచాడు. తర్వాత ఎడమవైపు తిరిగి 40 మీ. ప్రయాణించాడు. అయితే బయలుదేరిన బిందువు నుంచి అమిత్‌ ఎంత దూరంలో, ఏ దిశలో ఉన్నాడు?

1) 100 మీ., దక్షిణం        2) 20 మీ., ఉత్తరం            3) 20 మీ., తూర్పు            4) 20 మీ., పడమర


8. కిరణ్‌ తూర్పు దిశగా 20 మీ. నడిచి, కుడివైపు తిరిగి 30 మీ.  ప్రయాణించాడు. తర్వాత ఎడమవైపు తిరిగి 20 మీ. నడిచాడు. అయితే అతడు బయలుదేరిన బిందువు నుంచి ప్రస్తుతం ఏ దిశలో ఉన్నాడు?

1) నైరుతి       2) ఈశాన్యం           3) ఆగ్నేయం      4) తూర్పు



 

9. A,B, C,D,E,F,G,H అదే క్రమంలో ఒక వృత్తాకార బల్ల చుట్టూ సమాన దూరాల్లో ఉన్నారు. వారి స్థానాలు సవ్యదిశలో ఉన్నాయి. G ఉత్తర దిశగా కూర్చుంటే, D ఏ స్థానంలో ఉన్నాడు?

1) నైరుతి       2) ఆగ్నేయం           3) పడమర      4) తూర్పు


 

Posted Date : 22-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌