• facebook
  • whatsapp
  • telegram

పట్టికా రూపం

సమాచార విశ్లేషణ సూటిగా.. సులభంగా!

పరీక్షల్లో మార్కుల పరంగా, సబ్జెక్టుల వారీగా మొదటి పది మంది మెరిట్‌ విద్యార్థులను తెలుసుకోవాలంటే కాస్త శ్రమ చేయాల్సిందే. సేల్స్‌ టీమ్‌కి ప్రమోషన్‌ ఇవ్వాలంటే వారి పనితీరును అంచనా వేసేందుకు నెలల వారీగా అమ్మకాల వివరాలన్నీ పరిశీలించడం కొద్దిగా కష్టంతో కూడుకున వ్యవహారమే. కానీ పెద్ద ఎత్తున డేటా ఉన్నప్పుడు అవసరమైన సమాచారాన్ని, అనుకున్న విధంగా సూటిగా, సులభంగా విశ్లేషించుకోవాలంటే పట్టిక రూపంలో రాసుకోవాలి. ఆ విధమైన పట్టికల నుంచి సమాచారాన్ని సంగ్రహించడం, లెక్కించడం, అర్థవంతమైన ముగింపు ఇవ్వగలగడం లాంటి సామర్థ్యాలను అభ్యర్థుల్లో గుర్తించేందుకే పోటీ పరీక్షల్లో ఈ ప్రశ్నలు అడుగుతుంటారు. 


దత్తాంశ విశ్లేషణ(Data interpretation)లో భాగంగా పట్టికా రూపం(Table form)నుంచి పోటీ పరీక్షల్లో ప్రశ్నలు వస్తాయి. వీటిని చేయాలంటే నిష్పత్తులు, సగటు, శాతాలు లాంటి ప్రాథమిక అంకగణిత భావాలపై పట్టు పెంచుకోవాలి. 

I.   కింది పట్టికలో ఆరుగురు విద్యార్థులకు 5 సబ్జెక్టుల్లో వచ్చిన మార్కుల వివరాలు ఉన్నాయి.


  


1.  గీత మొత్తం మార్కులు ఎన్ని?

1) 380      2) 480     3) 389     4) 450

సాధన: 87+ 88+ 70+69+75 = 389

జ: 389


2. సైన్సు పరీక్షలో అందరికి వచ్చిన మొత్తం మార్కులు ఎన్ని?

1) 389      2) 480   3) 487     4) 387

సాధన: సైన్సు = 81+ 69+ 90+ 80+ 87+ 80

                         = 487

జ: 487


3.   రాజుకు హిందీ, మ్యాథ్స్‌లో వచ్చిన మొత్తం మార్కులకు, ఆదిత్యకు తెలుగు, హిందీ పరీక్షల్లో వచ్చిన మొత్తం మార్కులకు నిష్పత్తి ఎంత? 

1) 170 : 143      2) 35 : 34      3) 34 : 35          4) 30 : 37

సాధన: రాజు (హిందీ+ మ్యాథ్స్శ్‌ = 85+ 90 = 175

             ఆదిత్య (తెలుగు+హింద్శీ = 82+ 88 = 170

                  175 : 170

                    35 : 34

జ: 35 : 34  

II.  కింది పట్టికలో వివిధ ఆటల పోటీల్లో పాల్గొన్న వ్యక్తుల వివరాలు ఇచ్చారు.


 

4.   బాక్సింగ్‌ విభాగంలో పోటీపడిన వారిలో బరువు 55 కేజీల కంటే తక్కువ కలిగిన పురుషుల సంఖ్యకు, 55 కేజీల కంటే ఎక్కువ బరువు ఉన్న పురుషుల సంఖ్యకు మధ్య నిష్పత్తి ఎంత?

1) 4 : 7    2) 3 : 8    3) 5 : 3    4) 8 : 3

సాధన: 16+ 24 : 22+ 30+ 18

                 40 : 70

                   4 : 7

జ:  4 : 7


5.  46 - 55 కేజీల విభాగంలో పై నాలుగు ఆటల్లో పాల్గొన్న పురుషుల సంఖ్యకు, స్త్రీల సంఖ్యకు మధ్య భేదం ఎంత?

1) 20    2) 16    3) 25    4) 24 

సాధన: పురుషులు = 24+ 19+ 18+14 = 75

             స్త్రీలు = 17+ 16+ 8+ 10 = 51

             భేదం = 75 - 51 = 24

జ:  24 


6.  అన్ని విభాగాల్లో కలిపి తైక్వాండో ఆటలో పోటీపడిన స్త్రీలు ఎంతమంది?

1) 50    2)  72   3) 70    4) 64

సాధన: 20+ 10+ 20+ 10+12 = 72

జ: 72


III. కింది పట్టికలో 2010 నుంచి 2015 వరకు తి, తీ, ది, దీ, ని, నీ అనే 6 నగరాల జనాభాను ఇచ్చారు. 

7.  2012లో C నగర జనాభాకు, 2012లో అన్ని నగరాల మొత్తం జనాభాకు నిష్పత్తి ఎంత?

1) 191 : 2000        2) 91 : 943      3) 193 : 1735      4) 200 : 1999

 2012లో C నగర జనాభా = 91

2012లో అన్ని నగరాల జనాభా = 142+ 240+ 91+180+ 130+ 160 = 943

                                                   = 91 : 943

జ:  91 : 943 


8.  2012లో C నగర జనాభా, 2015లో A నగర జనాభా మొత్తం ఎంత? (లక్షల్లో)

1)151      2) 251     3) 351    4) 245

సాధన: 2012లో C = 91

             2015లో A = 160

        91+ 160 = 251 లక్షలు

జ: 251  


9.    2010లో D జనాభా, 2013లో B జనాభాలో ఎంత శాతం? 

1) 60%    2) 50%    3) 16 2/3 %    4) 70%

రచయిత: గోలి ప్రశాంత్‌ రెడ్డి  

Posted Date : 22-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌